NASA Astronaut
-
సునీత విలియమ్స్ కోసం 26న క్రూ–9 ప్రయోగం.. అయినా 5 నెలలు పడుతుందా!
కేప్ కెనవెరల్ (అమెరికా): హమ్మయ్యా... సునీతా విలియమ్స్ త్వరలోనే భూమిని చేరుకోనున్నారు. భూమికి సుమారు 300 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన ఈ భారతీయ సంతతి అమెరికన్ వ్యోమగామిని తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇంకో రెండు రోజుల్లోనే (సెప్టెంబరు 26వ తేదీ) దీనికి సంబంధించిన ప్రయోగం ఉంటుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తెలిపింది. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ - రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను కేప్ కెనవెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి గురువారం ప్రయోగించనున్నామని నాసా ప్రకటించింది. అన్నీ సవ్యంగా సాగితే సునీత, బుచ్ విల్మోర్లతోపాటు అమెరికా, రష్యాకు చెందిన మరో ఇద్దరు వ్యోమగాములు వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి భూమ్మీదకు తిరిగి వచ్చే అవకాశం ఉంది.బోయింగ్ స్టార్‌లైనర్ -12 ద్వారా ఈ ఏడాది జూన్‌లో సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే వారి తిరుగు ప్రయాణం మాత్రం అనుకున్న విధంగా ముందుకు సాగలేదు. స్టార్‌లైనర్‌లోని 24 థ్రస్టర్లలో ఐదు పనిచేయకుండా పోయాయి. అలాగే ప్రొపల్షన్ వ్యవస్థలో హీలియం లీక్ అయినట్లు స్పష్టమైంది. ఐఎస్ఎస్ నుంచే ఈ సమస్యలను పరిష్కరించేందుకు సునీత, విల్మోర్లు, గ్రౌండ్‌స్టేషన్ నుంచి నాసా అన్ని రకాల ప్రయత్నాలు చేశాయి. అయినప్పటికీ ఈ స్టార్‌లైనర్ సురక్షితంగా భూ వాతావరణంలోకి ప్రవేశించలేదని, ల్యాండింగ్‌ను నియంత్రించడమూ కష్టమని తేలిన నేపథ్యంలో ఖాళీగానే వెనక్కు రప్పించాలని నాసా నిర్ణయించింది. దీంతో సునీత, విల్మోర్లు నాలుగు నెలలపాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. కొసమెరుపు ఏమిటంటే.. ఈ నెల 26 నాటి ప్రయోగం కూడా కచ్చితంగా జరుగుతుందని చెప్పలేము. ఫ్లారిడాకు సమీపంలోని మెక్సికో జలసంధి వద్ద ఏర్పడ్డ ‘నైన్’ తుపాను ప్రయోగ కేంద్రం కేప్ కెనవెరాల్ వైపు దూసుకు వస్తూంది ఫలితంగా అనానుకూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రయోగం వాయిదా పడే సూచనలు ఉన్నాయి.భూమికి సురక్షితంగా చేరుకున్న ముగ్గురు మాస్కో: ఇద్దరు రష్యన్, ఒక అమెరికన్ వ్యోమగాములతో కూడిన సోయుజ్ క్యాప్సూల్ ఐఎస్ఎస్ నుంచి కజకిస్తాన్‌కు చేరుకుంది. ఐఎస్ఎస్ నుంచి సోమవారం విడివడిన క్యాప్సూల్ మూడున్నర గంటల తరువాత కజకిస్తాన్‌లోని పచ్చిక మైదానంలో దిగింది. సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు వీలుగా క్యాప్సూల్‌లోని రెండు థ్రస్టర్లను కొద్దిసేపు మండించారు. ఆఖరు దశలో 7.2 మీటర్ల పారాచూట్ విచ్చుకుని క్యాప్సూల్ సురక్షితంగా గంటకు 16 మైళ్ల వేగంతో కిందికి వచ్చింది.చదవండి: ట్రంప్ నోట ఓటమి మాట.. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతే..అనంతరం అందులోని వ్యోమగాములను బయటకు తీసుకువచ్చి, వైద్య పరీక్షలు జరిపారు. ఈ వ్యోమగాములు ఒలెగ్ కొనొనెంకో, నికొలాయ్ చుబ్లు 374 రోజులపాటు ఐఎస్ఎస్లో గడిపారు. ఇది ప్రపంచ రికార్డని అధికారులు తెలిపారు. వీరితోపాటే వచ్చిన అమెరికన్ వ్యోమగామి ట్రేసీ డైసన్ ఆరు నెలలపాటు ఐఎస్ఎస్లో ఉన్నారు. కాగా, ఐఎస్ఎస్లో సునీతా, విల్మోర్ సహా ఇంకా 8 మంది వ్యోమగాములున్నారు. -
మళ్లీ వాయిదా పడిన బోయింగ్ రోదసీ యాత్ర
కేప్ కనావెరల్: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర మరోసారి ఆగింది. బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో రోదసీలోకి వ్యోమగాములు వెళ్లేందుకు ఉద్దేశించిన ప్రయోగం శనివారం చివరినిమిషంలో వాయిదాపడింది. అమెరికాలోని కేప్ కనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్న అట్లాస్ 5 రాకెట్ కౌంట్‌డౌన్‌ను ఇంకా మూడు నిమిషాల 50 సెకన్లు ఉందనగా కంప్యూటర్ ఆపేసింది. ప్రయోగం ఆపేయడానికి కారణాలు ఇంకా వెల్లడికాలేదు. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు వెళ్లాల్సి ఉంది. ఆదివారంలోగా మరోసారి ప్రయోగానికి ప్రయతి్నస్తామని యునైటెడ్ లాంచ్ అలయన్స్ ఇంజనీర్ డిలియన్ రైస్ చెప్పారు. ప్రయోగం ఆగిపోవడంతో క్యాప్సూల్‌లోని సునీత, విల్మోర్లను టెక్నీíÙయన్లు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. -
చంద్రుడిపై మహిళా వ్యోమగామి
చంద్రుడిపై మహిళా వ్యోమగామి -
‘సంతోషం.. తను నన్ను గుర్తుపట్టింది’
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో సుదీర్ఘకాలం గడిపి రికార్డు సృష్టించిన మహిళా వ్యోమగామి క్రిస్టీనో కోచ్‌కు తన కుటుంబ సభ్యుల నుంచి ఆత్మీయ స్వాగతం లభించింది. అమెరికాకు చెందిన ఆమె గతేడాది మార్చి 14న ఐఎస్ఎస్కు వెళ్లగా గత గురువారం భూమి మీద ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టెక్సాస్‌లోని తన ఇంటికి చేరుకున్న క్రిస్టీనో తాజాగా ఓ వీడియో షేర్ చేశారు. ‘‘ఎవరు ఎక్కువగా ఎగ్జైట్ అయ్యారో తెలియదు. అయితే ఒక విషయం ఏడాది తర్వాత కూడా తను నన్ను గుర్తుపట్టింది. సంతోషం’’ అంటూ పెంపుడు కుక్క గురించి ఆమె పోస్ట్ చేసిన వీడియో ఇప్పటికే రెండున్నర మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది. కాగా.. క్రిస్టీనో తన భర్తతో పాటు ఇంట్లో అడుగుపెట్టగానే.. ఎదురొచ్చిన కుక్క.. కాళ్లు చాస్తూ, అరుస్తూ ఆమెను హత్తుకోవడం ఈ వీడియోలో చూడవచ్చు. ఇక ఈ వీడియోపై నాసా కూడా తనదైన శైలిలో స్పందించింది. వాలెంటైన్స్ డేను పురస్కరించుకుని లవ్ సింబల్‌తో ఆస్ట్రోనాట్ విష్ చేస్తున్న జిఫ్ ఇమేజ్ను పోస్ట్ చేసింది. కాగా అమెరికాలోని మిషిగన్‌లో జన్మించిన క్రిస్టీనో గత ఏడాది డిసెంబరు 28న సుదీర్ఘకాలం అంతరిక్షంలో గడిపిన మహిళ వ్యోమగామిగా పెగ్గి విట్సన్ పేరుతో ఉన్న రికార్డును బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. దాదాపు 328 రోజులపాటు క్రిస్టీనో అంతరిక్షంలో గడిపారు. Not sure who was more excited. Glad she remembers me after a year! pic.twitter.com/sScVXHMHJn — Christina H Koch (@Astro_Christina)February 13, 2020 -
ఈ భార్యాభర్తల పంచాయితీ చరిత్రలో నిలిచిపోతుంది..!
వాషింగ్టన్ : ఇంట్లో మొదలైన పంచాయితీ వీధిలోకి.. అక్కడి నుంచి రచ్చబండపైకి చేరడం చూశాం. కానీ, అమెరికాలోని ఓ జంట పంచాయితీ మాత్రం అంతరిక్షం వరకు వెళ్లింది. నాసా (అమెరికా అంతరిక్ష సంస్థ)లో పనిచేసే ఆస్ట్రోనాట్ అన్నె మెక్లెయిన్ తన భార్య సమ్మర్ వోర్డెన్తో విభేదాలు రావడంతో విడిగా ఉంటోంది. ఇద్దరూ స్త్రీలైనా వీరు భార్యాభర్తలుగా కొనసాగడం గమనార్హం. నాసా స్పేస్ మిషన్‌లో భాగంగా మెక్లెయిన్ ఆరు నెలలపాటు అంతరిక్షంలో గడిపింది. ఆ సమయంలో తన భార్య బ్యాంకు లావాదేవీలను అక్రమంగా తెలుసుకుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నప్పుడు తన కంప్యూటర్లోకి మెక్లెయిన్ చొరబడి ఆర్థిక లావాదేవీలు తెలుసుకుందని ఆమె భార్య సమ్మర్ వోర్డెన్ ఆరోపించారు. ఈ మేరకు ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) లో ఆమె ఫిర్యాదు చేశారు. అయితే, ఎఫ్‌టీసీ తన ఫిర్యాదుపై స్పందించడం లేదని ఆమె వాపోయారు. ఇక వోర్డెన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నాసా అధికారులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. అయితే, ఇద్దరూ కలిసున్నప్పుడు చేసిన లావాదేవీలను తెలుసుకునేందుకే మెక్లెయిన్ అలా చేసిందని ఆమె తరపు న్యాయవాది చెప్తున్నాడు. మొత్తంమీద భూమి నుంచి ఆకాశానికి తాకిన ఈ పంచాయితీ మొట్టమొదటిదిగా నిలిచిపోనుంది. నేరం నిరూపణ అయితే మెక్లెయిన్పై క్రిమినల్ కేసు నమోదయ్యే అవకాశం ఉంది. -
అంతరిక్ష కేంద్రం నుంచి క్షేమంగా భూమికి..
జెజ్కాజ్‌గన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ముగ్గురు వ్యోమగాములు భూమికి క్షేమంగా చేరుకున్నారు. నాసా వ్యోమగామి అన్నే మెక్‌క్లయిన్, రష్యన్ వ్యోమగామి ఒలెగ్ కొనోనెన్కో, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ వ్యోమగామి సెయింట్ జాక్వస్‌లు కజఖ్ సిటీ సమీపంలో మంగళవారం పారాచూట్ సాయంతో సురక్షితంగా భూమిపై అడుగుపెట్టారు. రష్యన్ అంతరిక్ష కార్యక్రమంలో భాగంగా సోయుజ్ రాకెట్లో ఈ ముగ్గురు అంతరిక్ష కేంద్రానికి డిసెంబర్ 3న వెళ్లారు. అంతకుముందు అక్టోబర్‌లో రష్యా, అమెరికాకు చెందిన వ్యోమగాములు అలెస్కీ, నిక్ హాగ్లను తీసుకెళ్లేందుకు సోయుజ్ రాకెట్ బయలుదేరింది. అయితే ప్రయోగించిన నిమిషాల్లోనే కొన్ని సమస్యల కారణంగా వారిద్దరు అత్యవసరంగా భూమిపై ల్యాండయ్యారు. ఇక ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడిపిన మొదటి కెనడా వ్యోమగామిగా సెయింట్ జాక్వస్ రికార్డు సృష్టించారు. -
అంతరిక్షంలోనూ అదే పిచ్చి!
న్యూయార్క్ : కళ్లముందు గిర్రున తిరిగే స్పిన్నర్‌ను కాసేపు చూస్తే మానసిక ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం కలుగుతుందని చెప్పే వాళ్లు ఉన్నారు. స్పిన్నర్‌ను గిర్రున తిప్పి తదేకంగా దాన్నే చూస్తుంటే ఏకాగ్రత పెరుగుతుందని అనే వాళ్లు ఉన్నారు. ఏదేమైనా ఈ స్పిన్నర్‌ను తిప్పుతూ ఆడేవాళ్లు పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న స్పిన్నర్లలో ‘ఫిడ్గెట్’ కంపెనీవి ప్రమాణికంగా ఉన్నాయి. రోదసిలోని అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో పనిచేస్తున్న వ్యోమగాములు కూడా తమ అలసటు తీర్చుకోవాలనుకున్నారో లేక కాస్త టైంపాస్ చేద్దామనుకున్నారో లేక నిజంగా ఈ స్పిన్నర్లు గురుత్వాకర్షణ శక్తిలేని చోట ఎలా పనిచేస్తాయో పరీక్షించాలనుకున్నారో.....నాసా లోగో కలిగిన ఓ స్పిన్నర్‌ను తెప్పించుకొని పరీక్షించారు. దాన్నంతా ఓ వీడియా తీసి భూమికి పంపించారు. భూమి మీద ఒక్కసాని స్పిన్నర్‌ను తిప్పితే కొన్ని నిమిషాలపాటు అతి తిరుగుతుంది. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదుగనుక స్పిన్నర్‌ను తిప్పితే అది కొన్ని నిమిషాలు కాకుండా కొన్ని గంటలపాటే తిరగాలి. ఆ వీడియోలో అలా తిరుగున్నట్టే కనిపించింది. ఎంత సేపటికి అది ఆగిపోతుందో వ్యోమగాములే చెప్పలేకపోయారు. వ్యోమగామి రాండీ కోమ్ర్రేడ్ బ్రెస్నిక్ స్పెన్నర్ను తిప్పి తాన్ని పట్టుకోవడం వల్ల ఆ స్పిన్నర్‌తోపాటు తాను కూడా శూన్యంలో అలా గిరిగిరా తిరుగుతూ కనిపించారు. స్పిన్నర్ డైరెక్షన్ మారుస్తూ తాను ఆ డైరెక్షన్లో తిరిగారు. ఈ స్పిన్నర్ తిప్పడం వ్యోమగాములకు అలవాటైందో, లేదో తెలియదుగానీ భూమిమీద మాత్రం చిన్నా, పెద్ద తేడా లేకుండా దీన్ని పిచ్చిగా తిప్పుతున్నారు. -
ఆర్నెల్ల తర్వాత అంతరిక్షం నుంచి..
కజకిస్తాన్ః సుమారు ఆర్నెల్ల కాలం తర్వాత అంతరిక్షం నుంచి ముగ్గురు వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. 48 మంది సాహస యాత్రికులకు సారధ్యం వహించిన కమాండర్, నాసా ఆస్ట్రోనాట్ జెఫ్ విలియమ్స్ సహా ఆయన క్రూమేట్స్ అలెక్సీ ఓఛినిమ్, ఒలేగ్ స్ర్కిపోచ్కాలు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి సురక్షితంగా భూమికి చేరుకుని నాసా వ్యోమగాముల జాబితాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. మొత్తం 48 మంది సాహస అంతరిక్ష యాత్రికులతో కూడిన సోయజ్ టిఎంఏ-20ఎం స్పేస్ క్రాఫ్ట్... కజకిస్తాన్ లోని చెజ్ కజగన్ నగరంలో 7 సెప్టెంబర్ 2016 బుధవారం ఉదయం సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. ఈ ప్రత్యేక యాత్రలో విలియమ్స్, అలెక్సీ ఓఛినిమ్, ఒలేగ్ స్ర్కిపోచ్కా లు అంతరిక్ష కేంద్రంలో 172 రోజులపాటు గడిపారు. గతేడాది డిసెంబర్ నెలలో నింగికి ఎగిరిన ఈ వ్యోమగాములు అనేక పరిశోధనలు నిర్వహించి సురక్షితంగా భూమికి చేరుకున్నారు. వీరిలో ముఖ్యంగా విలియమ్స్ అంతరిక్షంలో 534 రోజులు గడిపిన నాసా వ్యోమగాముల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. స్ర్కిపోచ్కా రెండు విమానాల్లో మొత్తం 331 రోజులు... అలెక్సీ ఓఛినిమ్ 172 రోజులు అంతరిక్షంలో గడిపి నాసా వ్యోమగాముల జాబితాలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. -
అంతరిక్షంలో పూసిన తొలిపువ్విది..
-
అంతరిక్షంలో పూసిన తొలిపువ్విది..
'జిన్నియా ఫ్లవర్' గా పిలుచుకునే ఈ పుష్పం అలాంటిలాంటికాదు. అంతరిక్షంలో విరబూసిన మొట్టమొదటి పువ్వు. వందలమంది శాస్త్రవేత్తలు.. భూమ్మీద కొన్నేళ్లు, భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరీక్ష పరిశోధనా కేంద్రం (ఐఎస్ఎస్)లో దాదాపు ఆరునెల కష్టానికి ప్రతిఫలంగా పుట్టిన ఈ పువ్వు ఫొటోను మహిళా శాస్త్రవేత్త స్కాట్ కెల్లీ ఐఎస్ఎస్ నుంచి భూమికి ట్వీట్ చేశారు. అంతరిక్ష కేంద్రంలో జిన్నియా విత్తనాలు నాటడం ద్వారా శాఖాహార మొక్కల పెంపకం (వెజ్జీ సిస్టం) విధానానికి శ్రీకారం చుట్టిన నాసా.. ఈ ప్రయోగం సఫలమైతే, మరిన్ని పూల మొక్కలను, ఆ తర్వాత కాయగూరలనూ పెంచడానికి కూడా మార్గం సుగమమవుతుందని భావిస్తోంది. జినియాకు ఎరుపు, నీలి, ఆకుపచ్చని ఎల్ఈడీ లైట్లను ఎరువుగా వినియోగించారు. అన్నంటూ ఈ పుష్పాన్ని కడుపారా ఆరగించొచ్చుకూడా.