
న్యూయార్క్ : కళ్లముందు గిర్రున తిరిగే స్పిన్నర్‌ను కాసేపు చూస్తే మానసిక ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం కలుగుతుందని చెప్పే వాళ్లు ఉన్నారు. స్పిన్నర్‌ను గిర్రున తిప్పి తదేకంగా దాన్నే చూస్తుంటే ఏకాగ్రత పెరుగుతుందని అనే వాళ్లు ఉన్నారు. ఏదేమైనా ఈ స్పిన్నర్‌ను తిప్పుతూ ఆడేవాళ్లు పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు మార్కెట్‌లో దొరుకుతున్న స్పిన్నర్లలో ‘ఫిడ్‌గెట్’ కంపెనీవి ప్రమాణికంగా ఉన్నాయి.
రోదసిలోని అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో పనిచేస్తున్న వ్యోమగాములు కూడా తమ అలసటు తీర్చుకోవాలనుకున్నారో లేక కాస్త టైంపాస్ చేద్దామనుకున్నారో లేక నిజంగా ఈ స్పిన్నర్‌లు గురుత్వాకర్షణ శక్తిలేని చోట ఎలా పనిచేస్తాయో పరీక్షించాలనుకున్నారో.....నాసా లోగో కలిగిన ఓ స్పిన్నర్‌ను తెప్పించుకొని పరీక్షించారు. దాన్నంతా ఓ వీడియా తీసి భూమికి పంపించారు. భూమి మీద ఒక్కసాని స్పిన్నర్‌ను తిప్పితే కొన్ని నిమిషాలపాటు అతి తిరుగుతుంది. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదుగనుక స్పిన్నర్‌ను తిప్పితే అది కొన్ని నిమిషాలు కాకుండా కొన్ని గంటలపాటే తిరగాలి.
ఆ వీడియోలో అలా తిరుగున్నట్టే కనిపించింది. ఎంత సేపటికి అది ఆగిపోతుందో వ్యోమగాములే చెప్పలేకపోయారు. వ్యోమగామి రాండీ కోమ్‌ర్రేడ్ బ్రెస్నిక్ స్పెన్నర్‌ను తిప్పి తాన్ని పట్టుకోవడం వల్ల ఆ స్పిన్నర్‌తోపాటు తాను కూడా శూన్యంలో అలా గిరిగిరా తిరుగుతూ కనిపించారు. స్పిన్నర్ డైరెక్షన్ మారుస్తూ తాను ఆ డైరెక్షన్‌లో తిరిగారు. ఈ స్పిన్నర్ తిప్పడం వ్యోమగాములకు అలవాటైందో, లేదో తెలియదుగానీ భూమిమీద మాత్రం చిన్నా, పెద్ద తేడా లేకుండా దీన్ని పిచ్చిగా తిప్పుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment