
దీర్ఘకాలం వేడిమి పరిస్థితులను ఎదుర్కొంటే వేగంగా ఆయుక్షీణం
మెల్‌బోర్న్: రోజంతా వేడిమి పరిస్థితుల్లో పనిచేశాక అలసిపోయిన భావన కలగడం సహజం. అలసిపోతే పర్లేదు గానీ దానివల్ల ఆయుష్షు కూడా వేగంగా క్షీణిస్తుందట! పర్యావరణ ఒత్తిళ్లకు తలొగ్గి మన శరీరంలో చాలా మార్పులే జరుగుతాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. డీఎన్‌ఏలో మార్పులు జరగకపోయినా మారే ఉష్ణ పరిస్థితులకు తగ్గట్లు ఒంట్లో ఏ ప్రొటీన్ ఉత్పత్తి ఏ మేరకు పెరగాలో, ఏది ఎంతగా తగ్గాలో నిర్ణయాలు జరిగిపోతాయట.
ఈ ఎపీజెనిటిక్స్ శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆ్రస్టేలియాలో జరిగిన తాజా అధ్యయనంలో తేలింది. అధిక ఉష్ణోగ్రతలు మనిషిపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై మొనాష్ విశ్వవిద్యాలయంలోని రోంగ్‌బిన్ క్సూ, యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్‌లోని షుఆయ్ లీ సారథ్యంలోని అధ్యయన బృందం పరిశోధన చేసింది. అత్యధిక ఉష్ణోగ్రతలకు లోనైన వ్యక్తుల్లో వృద్దాప్య ఛాయలు త్వరగా కనిపిస్తాయని తేల్చారు. అంతేకాదు, దీర్ఘకాలం పాటు వేడిమి పరిస్థితుల ప్రభావానికి గురైతే వృద్ధుల ఆయుష్షు రెండేళ్లకు పైగా హరించుకు పోతుందని వెల్లడించారు!
వాతావరణ మార్పుల ప్రభావం
వాతావరణ మార్పుల వల్ల వేడి పెరిగేకొద్దీ మన శరీరం మరింత ఒత్తిడికి గురవుతుంది. ఈ ఒత్తిడే వృద్ధాప్యం త్వరగా రావడానికి ప్రధాన కారణంగా మారుతోంది. ముఖ్యంగా వడగాల్పులకు, వేడి వాతావరణానికి చిరునామాగా నిలిచే ఆ్రస్టేలియాలో కొన్నేళ్లుగా ఈ పరిస్థితులు పరిపాటిగా మారుతున్నాయి. ఉష్ణోగ్రత ప్రభావ మార్పులు అక్కడ మనుషులపై స్పష్టంగా కనిపించాయని అధ్యయనం పేర్కొంది.
జెనటిక్ స్థాయిల పరిస్థితేంటి?
తీసుకునే ఆహారానికి తగ్గట్లు శరీరంలో మార్పులు జరుగుతాయి. పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, దుంపల వంటి తేలిగ్గా జీర్ణమయ్యే సహజసిద్ద ఆహారం తీసుకుంటే ప్రోటీన్లు, విటమిన్లు తగిన మోతాదులో అంది శరీరంలో సానుకూల మార్పులు జరుగుతాయి. అలాగాక బాగా వేయించిన, ప్యాక్ చేసిన, నూనెలు అతిగా వాడిన, పూర్తి ప్రాసెస్డ్ ఆహారం తీసుకుంటే పోషకాలందక ఒంట్లో ప్రతికూల మార్పులు సంభవిస్తాయి. దాంతో వయసు మీద పడకుండా ఆపే సహజసిద్ధ సామర్థ్యం తగ్గుతుంది. వేడిమి సందర్భాల్లోనూ ఒంట్లోని జన్యు కణాలు విరుద్ధ రీతిలో స్పందిస్తాయి. ఫలితంగా ఏ సందర్భంలో ఏ రకం ప్రొటీన్‌ను ఎంత మోతాదులో ఉత్పత్తి చేయాలనే డీఎన్‌ఏ సీక్వెన్స్ దెబ్బ తింటుంది. ఇది శరీర భౌతిక క్రియలపై ప్రతికూల ప్రభావం చూపి ఆరోగ్య స్థితిని పాడుచేసే ప్రమాదముంది. వేడిమి వృద్దాప్య రేటును నిర్దేశించే జన్యు కణాలను అసంబద్ధంగా క్రియాశీలం చేస్తుంది. అలా ముందుగానే వృద్ధాప్యంలోకి జారిపోతాం.
పరిశోధనల్లో
ఏం తేలింది? 68 ఏళ్ల పైబడిన 3,700 మందిపై సదరన్ కాలిఫోరి్నయా వ ర్సిటీలో పరిశోధన చేశారు. తక్కువ వయ సు వారిలో పోలిస్తే పెద్దవాళ్ల మీదే అత్యధిక ఉష్ణోగ్రత పరిస్థితులు అధిక ప్రభావం చూ పాయి. వయసు పెరిగేకొద్దీ వేడిని నియంత్రించుకునే సామర్థ్యమూ సన్నగిల్లుతోంది. దాంతో అనారోగ్యం బారిన పడటం, చనిపోవడం వంటివి జరుగుతున్నాయి. వృద్ధాప్య ఛాయలను నిర్ధారించే మూడు రకాలైన పీసీఫీనో ఏజ్, పీసీగ్రిమ్ ఏజ్, డ్యూన్‌డిన్ పేస్ జీవ గడియార పద్దతుల్లో వలంటీర్ల రక్త నమూనాలను పరిశీలించారు. 2010 నుంచి ఆరేళ్లపాటు వీళ్లంతా అధిక వేడి పరిస్థితులను ఎదుర్కొన్నప్పటి పరిస్థితులను పోలి్చచూశారు. అమెరికాలో ప్రామాణికమైన 32 డిగ్రీ సెల్సియస్ వరకు సాధారణ, 32–39 డిగ్రీలను మధ్యస్థ, 39–51 డిగ్రీల దాకా అతి తీవ్ర వేడిమిగా పరిగణించి వ లంటీర్ల డేటాతో సరిచూశారు. పీసీఫినో ఏజ్ ప్రకారం సుదీర్ఘకాలం వేడికి గురైతే 2.48 ఏళ్లు ముందుగానే వృద్ధాప్యం వస్తుందని తేలింది. పీసీగ్రిమ్ ఏజ్ పద్దతిలో 1.09 ఏళ్లు, డ్యూన్‌డిన్ పేస్ పద్ధతిలో 0.05 ఏళ్లు ముందుగా వృద్ధాప్యం వస్తుందని వెల్లడైంది.
వేడికి, వయసుకు లింకేమిటి?
వయసు మీద పడటం సహజ ప్రక్రియ. వృద్ధాప్య ఛాయలు బయట పడటం ఒక్కో మనిషిలో ఒక్కోలా ఉంటుంది. ఒత్తిళ్లు, షాక్ వంటి అనూహ్య ఘటనలు ఎదురైనప్పుడు శరీరంలో పెనుమార్పులు సంభవిస్తాయి. చాన్నాళ్లపాటు సరిగా నిద్ర పోకుంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా రావడం ఖాయం. అత్యధిక వేడిమి పరిస్థితులు మనిషిలోని సత్తువను లాగేస్తాయి. జీవక్రియలను పూర్తిస్థాయిలో చేసే సామర్థ్యాన్ని శరీరం క్రమంగా కోల్పోతుంది. వయసు మీదపడే రేటు పెరుగుతుంది. వృద్ధాప్యంలో రావాల్సిన రోగాలు ముందే ముసురుకుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment