అంతరిక్షంలో పూసిన తొలిపువ్విది.. | NASA astronaut Scott Kelly shares picture of first flower grown in space | Sakshi
Sakshi News home page

అంతరిక్షంలో పూసిన తొలిపువ్విది..

Published Sun, Jan 17 2016 2:39 PM | Last Updated on Sun, Sep 3 2017 3:48 PM

అంతరిక్షంలో పూసిన తొలిపువ్విది..

అంతరిక్షంలో పూసిన తొలిపువ్విది..

'జిన్నియా ఫ్లవర్' గా పిలుచుకునే ఈ పుష్పం అలాంటిలాంటికాదు. అంతరిక్షంలో విరబూసిన మొట్టమొదటి పువ్వు. వందలమంది శాస్త్రవేత్తలు.. భూమ్మీద కొన్నేళ్లు, భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరీక్ష పరిశోధనా కేంద్రం (ఐఎస్ఎస్)లో దాదాపు ఆరునెల కష్టానికి ప్రతిఫలంగా పుట్టిన ఈ పువ్వు ఫొటోను మహిళా శాస్త్రవేత్త స్కాట్ కెల్లీ ఐఎస్ఎస్ నుంచి భూమికి ట్వీట్ చేశారు.

 

అంతరిక్ష కేంద్రంలో జిన్నియా విత్తనాలు నాటడం ద్వారా శాఖాహార మొక్కల పెంపకం (వెజ్జీ సిస్టం) విధానానికి శ్రీకారం చుట్టిన నాసా.. ఈ ప్రయోగం సఫలమైతే, మరిన్ని పూల మొక్కలను, ఆ తర్వాత కాయగూరలనూ పెంచడానికి కూడా మార్గం సుగమమవుతుందని భావిస్తోంది. జినియాకు ఎరుపు, నీలి, ఆకుపచ్చని ఎల్‌ఈడీ లైట్లను ఎరువుగా వినియోగించారు. అన్నంటూ ఈ పుష్పాన్ని కడుపారా ఆరగించొచ్చుకూడా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement