
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో సుదీర్ఘకాలం గడిపి రికార్డు సృష్టించిన మహిళా వ్యోమగామి క్రిస్టీనో కోచ్‌కు తన కుటుంబ సభ్యుల నుంచి ఆత్మీయ స్వాగతం లభించింది. అమెరికాకు చెందిన ఆమె గతేడాది మార్చి 14న ఐఎస్‌ఎస్‌కు వెళ్లగా గత గురువారం భూమి మీద ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టెక్సాస్‌లోని తన ఇంటికి చేరుకున్న క్రిస్టీనో తాజాగా ఓ వీడియో షేర్ చేశారు. ‘‘ఎవరు ఎక్కువగా ఎగ్జైట్ అయ్యారో తెలియదు. అయితే ఒక విషయం ఏడాది తర్వాత కూడా తను నన్ను గుర్తుపట్టింది. సంతోషం’’ అంటూ పెంపుడు కుక్క గురించి ఆమె పోస్ట్ చేసిన వీడియో ఇప్పటికే రెండున్నర మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది.
కాగా.. క్రిస్టీనో తన భర్తతో పాటు ఇంట్లో అడుగుపెట్టగానే.. ఎదురొచ్చిన కుక్క.. కాళ్లు చాస్తూ, అరుస్తూ ఆమెను హత్తుకోవడం ఈ వీడియోలో చూడవచ్చు. ఇక ఈ వీడియోపై నాసా కూడా తనదైన శైలిలో స్పందించింది. వాలెంటైన్స్ డేను పురస్కరించుకుని లవ్ సింబల్‌తో ఆస్ట్రోనాట్ విష్ చేస్తున్న జిఫ్ ఇమేజ్‌ను పోస్ట్ చేసింది. కాగా అమెరికాలోని మిషిగన్‌లో జన్మించిన క్రిస్టీనో గత ఏడాది డిసెంబరు 28న సుదీర్ఘకాలం అంతరిక్షంలో గడిపిన మహిళ వ్యోమగామిగా పెగ్గి విట్సన్ పేరుతో ఉన్న రికార్డును బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. దాదాపు 328 రోజులపాటు క్రిస్టీనో అంతరిక్షంలో గడిపారు.
Not sure who was more excited. Glad she remembers me after a year! pic.twitter.com/sScVXHMHJn
— Christina H Koch (@Astro_Christina)February 13, 2020