Man Dancing Top Of Moving Truck Dies After Hit By Bridge Texas - Sakshi
Sakshi News home page

అతికి పోయి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు.. ట్రక్కుపై డాన్స్ చేస్తూ..

Published Fri, Nov 18 2022 7:36 PM | Last Updated on Fri, Nov 18 2022 8:27 PM

Man Dancing Top Of Moving Truck Dies After Hit By Bridge Texas - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో 25 ఏళ్ల యువకుడు అతిచేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కదులుతున్న ట్రక్కు ఎక్కి డాన్స్ చేస్తూ చనిపోయాడు. నవంబర్ 10న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

వీడియోలో యువకుడు 18 చక్రాల ట్రక్కు ఎక్కి కాసేపు డాన్స్ చేశాడు. అయితే వెనకాల చూసుకోకపోవడంతో ఓ బ్రిడ్జి తాకి ఒక్కసారిగా కుప్పకూలి కిందపడిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కారులో వెళ్తున్న ఓ వ్యక్తి ఈ దృశ్యాలను తన ఫోన్లో వీడియో తీశాడు.

యువకుడు కిందపడిపోయినప్పుడు అతని మెడ విరిగిందని, ఆ ప్రాంతమంతా రక్తం ఉందని వెనకాల కారులో వెళ్లిన ఓ మహిళ చెప్పింది. ఆ దృశ్యాలు చూసి వెన్నులో వణుకుపుట్టిందని భయాందోళన వ్యక్తం చేసింది. తన రోజును ఇలా ప్రారంభించాల్సి వస్తుందని అనుకోలేదని చెప్పింది.
చదవండి: వైరల్ వీడియో.. రష్యా క్షిపణులను పేల్చేసిన ఉక్రెయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement