వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో వింత ఘటన ఘటన చోటుచేసుకుంది. రోడ్డు మీద ప్రయాణిస్తున్న ఓ కారును.. విమానం ఢీకొట్టింది. ఇదేంటి గాల్లో ఉండే విమానం ఎలా ఢీకొట్టింది అనుకుంటున్నారా?. అదే ఇక్కడ వెరైటీ. కాగా, ఈ వింత ఘటన టెక్సాస్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. టెక్సాస్ రాష్ట్రంలోని మెక్‌కిన్నేలో ఓ విమానం రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. శనివారం మధ్యాహ్నం స్థానిక ఏరో కౌంటీ ఎయిర్‌పోర్టులో Iv-P ప్రాప్‌జెట్ విమానం రన్‌వే పై నుంచి టేకాఫ్ అయ్యింది. కానీ, వెంటనే దానిని పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆ విమానం రన్‌వేపై చివరి వరకు వచ్చినా ఆగలేదు. దీంతో అక్కడే ఉన్న కంచెను దాటుకొని రోడ్డుపై వెళుతున్న కారును ఢీకొంది.
That’s gonna leave a mark, ouch! 🫣
— Thenewarea51 (@thenewarea51) November 11, 2023
T31 airport in Mc Kinney, Texas today
🎥 IG jackschneider17 via @HamWa07 pic.twitter.com/CKbgCTHOse
దీంతో, వెంటనే అత్యవసర సహాయక బృందాలు అక్కడికి చేరుకొన్నాయి. పైలట్, ప్రయాణికుడు, కారు డ్రైవర్‌ను రక్షించాయి. వీరిలో ఒకరికి స్వల్పగాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన రోడ్డును కొన్ని గంటలపాటు మూసివేశారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇది కూడా చదవండి: Israel-Hamas War: గాల్లో వేలాది ప్రాణాలు!
Comments
Please login to add a commentAdd a comment