B17 Bomber Collides With Another Plane In Mid Air At US Airshow, Video Goes Viral - Sakshi
Sakshi News home page

USA Airshow: ఎయిర్‌ షోలో ఘోర ప్రమాదం.. ఆకాశంలోనే ఢీకొన్న యుద్ధ విమానాలు

Published Sun, Nov 13 2022 7:45 AM | Last Updated on Sun, Nov 13 2022 12:30 PM

B17 Bomber Collides With Another Plane At US Airshow - Sakshi

అగ్రరాజ్యం అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అమెరికాలో నిర్వహించిన వైమానిక ప్రదర్శనలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. రెండు యుద్ధ విమానాలు ఆకాశంలో ఎగురుతున్న సమయంలో ఒకదానినొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో పైలట్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

వివరాల ప్రకారం.. అమెరికాలో టెక్సాస్‌లోని డల్లాస్‌లో వైమానిక ప్రదర్శన జరుగుతున్న సమయంలో బోయింగ్ బీ-17 బాంబర్ యుద్ధ విమానం, పీ-63 కింగ్ కోబ్రా యుద్ధ విమానం రెండూ ఢీకొన్నాయి. అయితే, బోయింగ్‌ విమానం ప్రయాణిస్తుండగా మార్గం తప్పిన కోబ్రా యుద్ధ విమానం వచ్చి దాన్ని ఢీకొట్టింది. దీంతో, పెద్ద శబ్ధంతో విమానాలు నేలపై కుప్పకూలిపోయాయి. ఆకాశంలోనే విమానం ముక్కలైంది. ఈ రెండు విమానాల్లోని పైలట్ల ఆరోగ్య వివరాలపై ఇంకా సమాచారం అందలేదు. ఈ ప్రమాదంలో పైలట్ల గురించిన సమాచారం ఇంకా నిర్దారించలేదని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) వెల్లడించింది. 

కాగా, వైమానిక ప్రదర్శనలు వచ్చిన వారు చూస్తుండగా.. వీడియోలు తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో, ప్రమాదానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు.. ఎయిర్ ఫోర్స్ వింగ్స్ స్మారకంగా నిర్వహించిన ఎయిర్ షోలో ఈ ప్రమాదం జరిగిందని అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. ఎఫ్ఏఏ, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్.. ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. బీ-17 యుద్ధ విమానం రెండో ప్రపంచ యుద్ద కాలంలో కీలక పాత్ర పోషించింది. ఇదే సమయంలో పీ-63 కింగ్ కోబ్రా యుద్ధ విమానాన్ని కూడా తయారుచేశారు. ఈ చిన్న విమానాన్ని సోవియెట్ ఎయిర్ ఫోర్స్‌కు వ్యతిరేకంగా మాత్రమే వినియోగించినట్టు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement