కన్నబిడ్డపై ‍ తండ్రి కర్కశం, ప్రాణం పోయే దాకా : తల్లడిల్లిన తల్లి | US Man Forcing 6 Year Old Son To Run On Treadmill Because He Was Too Fat | Sakshi
Sakshi News home page

కన్నబిడ్డపై ‍ తండ్రి కర్కశం, ప్రాణం పోయే దాకా : తల్లడిల్లిన తల్లి

Published Thu, May 2 2024 6:06 PM | Last Updated on Thu, May 2 2024 6:24 PM

US Man Forcing 6 Year Old Son To Run On Treadmill Because He Was Too Fat

బిడ్డలు ఎలా ఉన్నా తల్లిదండ్రులు ప్రాణానికి ప్రాణంగా  చూసుకుంటారు.  మానసికంగా, శారీరంగా బలహీనంగా ఉన్నా, లోపాలతో పుట్టినా  అపూరూపంగా  సాదుకుంటారు. కానీ ఒక తండ్రి శాడిస్ట్‌లా ప్రవర్తించాడు. లావుగా ఉన్నాడంటు కన్న కొడుకు పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. తండ్రి క్రూరత్వంగా ఆరేళ్ల బాలుడిని పొట్టనపెట్టుకున్నాడు.  అమెరికాలోని న్యూజెర్సీలోని ఈ ఘటన చోటు చేసుకుంది.  ఈ విషాద ఘటన వివరాలు..

న్యూజెర్సీలో నివసించే  క్రిష్టోపర్ గ్రెగర్ ఆరేళ్ల తన కుమారుడు కోరీ కొంచెం బొద్దుగా ఉండటంతో జిమ్‌కు తీసుకెళ్లాడు. కుమారుడితో ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తించాడు. బలవంతంగా ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తించడంతో బాలుడు పరిగెత్త లేకపోయాడు. పదే పదే కిందపడిపోయాడు. అయినా  ఏమాత్రం కనికరం లేకండా కర్కశంగా ప్రవర్తించాడు.  క్రిష్టోపర్. ఉన్మాదిలో మారి మళ్లీ మళ్లీ ఒత్తిడి చేసి, చాలా వేగంగా కదులుతున్న ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తించాడు. 

దీంతో కోరీ డస్సి పోయి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మాటలు తడబడటం, సంయమనం కోల్పోవడం, వికారం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాల కారణంగా కోరీని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలొదిలాడు. తీవ్ర గాయాలు, గుండె, కాలేయ పల్మనరీ కంట్యూషన్, సంబంధిత కారణాలతో చనిపోయినట్టు   పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లోతేలింది. కోరీ మూర్ఛ వచ్చి మరణించినట్టు సీటీ స్కాన్‌ రిపోర్ట్‌లో వెల్లడైంది.

 ఫోరెన్సిక్ పాథాలజిస్ట్ కోరీది హత్యగా నిర్ధారించారు. ఈ దారుణ ఘటన 2021, మార్చిలో అట్లాంటిక్ హైట్స్ క్లబ్ హౌస్ ఫిటినెస్ సెంటర్‌లో జరిగింది.   కన్నకొడుకును హత్య చేశాడన్న ఆరోపణలపై  2022 మార్చి 9న గ్రెగర్‌ను అరెస్టు చేశారు. బాండ్ లేకుండా ఓషన్ సిటీ జైలులో ఉంచారు. తాజాగా జరిగిన కోర్టు విచారణలో న్యూజెర్సీ ఓషన్ సిటీలోని సుపీరియల్ కోర్టులో ఈ చిన్నారికి సంబంధించిన వీడియోను కోర్టులో ప్రదర్శించారు. ఈ దృశ్యాలు చూసిన తల్లి బ్రె మిక్కియోలో తల్లడిల్లిపోయింది. దుఃఖంతో  కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement