Sydney Mall Attack మహిళలపై అంత పగ ఎందుకు? ఎవరీ జోయెల్‌? | Sydney Mall Attack Stabber Joel Cauchi Targeted Women Avoided Men | Sakshi
Sakshi News home page

Sydney Mall Attack మహిళలపై అంత పగ ఎందుకు? ఎవరీ జోయెల్‌?

Apr 15 2024 2:15 PM | Updated on Apr 15 2024 3:20 PM

Sydney Mall Attack Stabber Joel Cauchi Targeted Women Avoided Men - Sakshi

సిడ్నీ వెస్ట్‌ఫీల్డ్‌  షాపింగ్ మాల్‌లో మారణహోం సృష్టించిన నిందితుడిని జోయెల్‌ కౌచీగా పోలీసులు గుర్తించారు.  మహిళలే లక్ష్యంగా దాడికి పాల్పడ్డాడని పోలీసులు సోమవారం వెల్లడించారు.  జోయెల్‌ మొత్తం ఆరుగురిని పొడిచి చంపగా అందులో ఐదుగురు మహిళలే ఉన్నారని చెప్పారు. అలాగే  ఈ దుర్మార్గుడి దాడిలో గాయపడిన 12 మందిలో మహిళలే  ఎక్కువ ఉండటం గమనార్హం.  దీనిపైనే పోలీసులు  ఇపుడు దృష్టి సారించారు. 

మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న 40 ఏళ్ల వ్యక్తి మాల్‌లో పెద్ద కత్తితో తిరుగుతూ అరగంట పాటు హల్‌ చల్‌ చేశాడని, ఈ దాడిలో మహిళల్నే  ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఆస్ట్రేలియా పోలీసులు సోమవారం తెలిపారు. బాధితులను  చైనాకు చెందిన విద్యార్థిని యియువాన్‌ చెంగ్‌ గుర్తించారు. మిగిలిన వాళ్లలో ఒక డిజైనర్, ఒక స్వచ్ఛంద సేవకురాలు, ఒక పారిశ్రామికవేత్త కుమార్తె, 9 నెలల పసిబిడ్డ, ఆమె తల్లితోపాటు,  పాకిస్థాన్‌కు చెందిన 30 ఏళ్ల సెక్యూరిటీ గార్డు ఫరాజ్‌ తాహిర్‌గా గుర్తించారు. 

కాబోయే భర్తతో మాట్లాడుతూ ఉండగా
 ఆరో బాధితురాలు, చైనా విద్యార్థిని తన కాబోయే భర్తతో ఫోన్‌లో మాట్లాడుతుండగా దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు  కోల్పోవడం విషాదం.

ఎవరీ జోయెల్ కౌచి? 
జోయెల్ కౌచి  సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రకారం, క్వీన్స్‌లాండ్‌లోని బ్రిస్బేన్ సమీపంలోని టూవూంబా నుండి వచ్చాడు.  స్థానిక ఉన్నత పాఠశాల , విశ్వవిద్యాలయంలో చదివాడు.
జోయెల్ కౌచి తన కుడి చేతిపై  పలు రంగుల్లో డ్రాగన్ టాటూ ఉంది. ఇదే అతణ్ణి గుర్తించడంలో కీలకంగా మారింది.  


టీనేజ్‌నుంచి   మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నాడని  కుటుంబం చెబుతోంది.
♦ అడపాదడపా  మెసేజ్‌లద్వారా మాత్రమే టచ్‌ లో ఉండేవాడని అతని తల్లిదండ్రులు మీడియాకు  చెప్పారు.
దాడికి ఒక నెల ముందు, జోయెల్ కౌచి సిడ్నీకి వెళ్లి  ఒక రూం అద్దెకు తీసుకున్నాడు. అక్కడ  జోయెల్‌ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement