పూణే : ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో సరదాగా గడిపేందుకు స్కూటీ మీద ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతున్నారు. అయితే జాతీయ రహదారి మీద వెళ్తున్న ఆమె స్కూటీని ఓ కారు సుమారు రెండున్న కిలోమీటర్లు వెంబడించింది. తన కారు వెళ్లేందుకు దారి ఇవ్వలేదనే నెపంతో స్కూటీని అడ్డుకున్నారు. అనంతరం కారులో నుంచి దిగిన భార్య, భర్తలు సదరు మహిళపై దాడికి దిగారు. పిడుగుద్దులు గుద్దుతూ దూర్బుషలాడారు. అక్కడి నుంచి పరారయ్యారు.
పూణే పోలీసుల కథనం ప్రకారం.. పూణేలో నివాసం ఉండే జెర్లిన్ డిసిల్వా కంటెంట్ క్రియేటర్‌గా, మార్కెటింగ్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో శనివారం తన ఇద్దరు పిల్లలతో స్కూటీ మీద పాషన్-బానర్ లింక్ రోడ్డు మీద వెళ్తున్నారు. ఆ సమయంలో డిసిల్వా స్కూటీని కారు యజమాని స్వప్నిల్ కేకరేలు రెండున్న కిలోమీరట్లు వెంబడించారు. స్కూటీని ఆపేశారు.
అనంతరం కారులో నుంచి దిగిన స్వప్నిల్ కేకరే దంపతులు డిసిల్వాను జుట్టు పట్టుకుని ఈడ్చారు. పిల్లలు ఎదురుగా ఉన్న పట్టించుకోకుండా భర్త బాధితురాలిపై పిడుగులు గుద్దారు. ఈ ఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడ్డారు. దాడి అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.
ముక్కు నుంచి రక్తం దారాళంగా కారుతుండగా డిసిల్వా తనపై జరిగిన దాడిని వివరిస్తూ వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డిసిల్వా ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు నెంబర్ ఆధారంగా నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా డిసిల్వా మాట్లాడుతూ.. జాగ్రత్తగా ఉండండి. ఈ నగరం ఎంత సురక్షితంగా ఉందో చూడండి? ప్రజలు ఉన్మాదుల్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అని ప్రశ్నించారు. డిసిల్వా మేనమామ విశాల్ సంఘటన జరిగిన తర్వాత ఆమె నాకు ఫోన్ చేసి కారణం లేకుండా నిందితుడు తనపై దాడి చేశాడని చెప్పారు.
తన మేనకోడలు స్కూటీ ఆ కారును ఢీకొట్టలేదు. అయినా కారణం లేకుండా దాడి చేశాడు. తానెంత శక్తివంతుడినో చూపించడానికి అతను అలా చేసి ఉండవచ్చు. స్వప్నిల్‌కేకరే’తోపాటు ఆయన భార్య ఉంది. కానీ ఆమె దాడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని వాపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment