Shocking Video: Angry Woman Beats Her Sister In Interview Goes Viral - Sakshi
Sakshi News home page

Viral Video: ఇంటర్వ్యూలో ఉండగా చెల్లిని చితకబాదిన అక్క..

Published Mon, Sep 13 2021 6:00 PM | Last Updated on Mon, Sep 20 2021 5:14 PM

Woman Job Interview Beats Her Sister During Interview Affair With Her Husband Goes Viral - Sakshi

Women Beats Sister Video: సోషల్‌మీడియా వాడకం పెరిగేకొద్ది నెట్టింట వైరల్‌ వీడియోల హవా పెరుగుతోంది. ఈ జాబితాలో వింతలు, విశేషాలు, డాన్స్‌లు, కొట్లాటలు ఇలా నెటిజన్లకు నచ్చితే చాలు అవి వైరల్‌ కావడం.. లైక్స్‌, వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. తాజాగా ఓ వీడియో నెట్టంట హల్‌చల్‌ చేస్తోంది. అందులో ఓ చెల్లి ఇంటర్వ్యూలో ఉండగా మధ్యలో అక్క వచ్చి ఆమెను చితకబాదుతుంది. అయితే అలా చేయడానికి ఓ బలమైన కారణమే ఉందండోయ్‌!

వివరాల్లో​​కి వెళితే.. ఉద్యోగ అన్వేషణలో ఉన్న ఓ యువతి ఇంటర్వ్యూ గదిలో కంపెనీ ప్రతినిధి ప్రశ్నలకు సమాధానమిస్తుంటుంది. అలా కొనసాగుతుండగా మధ్యలో అకస్మాత్తుగా ఆమె అక్క అక్కడికి వచ్చి మెరుపు వేగంతో తన చెల్లిపై పిడి గుద్దులు కురిపిస్తుంది. అంతటితో ఆగకండా తన చెల్లి మీద కూర్చుని ఎడాపెడా వాయిస్తుంది. క్షణం కూడా గ్యాప్‌ ఇవ్వకుండా చితకబాదేస్తుంది. ఆమె కోపం చూసి ఆ పరిసరాల్లో ఉన్న కంపెనీ సిబ్బంది కూడా అక్కని ఆపేంత సాహసం చేయలేకపోయారు.

మరీ అంతలా ఆమె ఎందుకు కొట్టిందంటే..  తన భర్తతో చెల్లి వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం అక్కకి తెలిసింది. దీంతో కోపంతో ఊగిపోయి చెల్లి ఇంటర్య్వూ జరుగుతున్న ఆఫీస్‌కు వచ్చి మరీ బాదేసి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు  మిశ్రమంగా స్పందిస్తూ కామెంట్‌ పెడుతున్నారు.

చదవండి: అమ్మా దొంగా ఇక్కడున్నావా? చిన్నారి బిస్కెట్‌ దొంగతనం వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement