interview day
-
చెప్పేది గాంధీ సూక్తులు.. కొలిచేది గాడ్సేను
సాక్షి, హైదరాబాద్: ‘‘దేశంలో ఎవరైనా నోరు తెరిస్తే.. వారిపై మతం పేరిట ఎదురుదాడులు, అణచివేతకు ప్రధాని మోదీ పూనుకుంటున్నారు. తెలం గాణ మంత్రిగా, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చెప్తున్నా.. నరేంద్ర మోదీ గాడ్సే వర్షిపర్ (గాడ్సే ఆరాధకుడు). చెప్పేది గాంధీ సూక్తులు, కొలిచేది గాడ్సేను. నాపై కేసులు పెడతారా పెట్టండి. దేశ స్వాతంత్య్రం తర్వాత మొదటి తీవ్రవాది నాథూరామ్ గాడ్సే. అలాంటి గాడ్సేను బీజేపీ ఎంపీలు పొగుడుతుంటే మోదీ నోరు మూసుకుంటారు. అలాంటి గాడ్సే భక్తులు గాంధీ సూక్తులు వల్లె వేస్తున్నారు. ఏడేళ్లలో దేశంలో ఏం చేశారో చెప్పకుండా.. హిజాబ్, హలాల్ అంటూ ఏ బట్టలు వేసుకోవాలి, ఏం తినాలి అని చెప్తారా? దేశంలో వేరే సమస్యలు లేవా? జిగ్నేష్ మేవానీని జైల్లో పెట్టినట్లు.. కేసీఆర్‌ను తూలనాడితే మేమూ జైల్లో పెట్టలేమా..? మేవానీపై పెట్టినట్లు నాపైనా కేసులు పెట్టండి’’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు సవాల్ చేశారు. ఈ నెల 27న టీఆర్ఎస్ 21వ వ్యవస్థాపక దినోత్సవం నేపథ్యంలో కేటీఆర్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలివీ.. సాక్షి: టీఆర్ఎస్ 21 ఏళ్ల ప్రస్థానంలో మీకు సంతృప్తి ఇచ్చిందేమిటి? కేటీఆర్: ఉద్యమ పార్టీగా రాష్ట్రాన్ని సాధించడంతోపాటు ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం చాలా అరుదైన విషయమని గతంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. మంచి ఉద్యమకారులు.. మంచి పాలకులు ఒకరే కావడం అరుదైన అంశమని అరుణ్ జైట్లీ కూడా కితాబునిచ్చారు. కేసీఆర్ పేరు ఉద్యమ నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయింది. తెలంగాణ సాధనతో పోలిస్తే మిగతావన్నీ చిన్నవే. ఇన్నేళ్ల ప్రస్థానంలో అనేక ఎత్తుపల్లాలు చూశాం. విభజన హామీల విషయంలో కేంద్రం వైఖరిపై ఏమంటారు? – విభజన హామీలను నెరవేర్చడంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం చేష్టలుడిగి చూస్తోంది. రెండు (తెలంగాణ, ఏపీ) రాష్ట్రాలకూ ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వలేదు. హామీల అమలు ఊసే లేకపోవడంతో రెండు రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి. నదీ జలాల వివాదాలను పరిష్కరించకపోవడంతో అనవసర ఘర్షణ తలెత్తుతోంది. కేంద్రం తీరుతో ఇరు ప్రభుత్వాలు, రైతులు గోస పడుతున్నారు. జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్ర ఏంటి? – సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు దేశానికి దిక్సూచిలా మారాయి. అనేక రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం మన పథకాలను కాపీ కొట్టడమే దీనికి ఉదాహరణ. ఇలా దేశ రాజకీయాల్లో ఇప్పటికే ముద్ర వేసిన టీఆర్ఎస్, కేసీఆర్.. భవిష్యత్తులో జాతీయస్థాయిలో ఏ తరహా పాత్ర పోషించాలో చాలా విస్తృతంగా చర్చించాం. 2014కు ముందు మోదీ ఎవరో దేశానికి తెలియకున్నా ‘గుజరాత్ మోడల్’ను దేశమంతా అమలు చేస్తామంటూ బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ ఈ ఎనిమిదేళ్లలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, గ్యాస్, పెట్రో ధరలు 30, 40 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. ఇప్పుడు కావాల్సింది ‘గోల్మాల్ గుజరాత్ మోడల్కాదు.. గోల్డెన్ తెలంగాణ మోడల్’. రాష్ట్రంలో విద్యుత్, తాగునీరు, పారిశ్రామీకరణ, వ్యవసాయం, ఐటీ, పర్యావరణం వంటి అనేక రంగాల్లో సాధించిన సమగ్రాభివృద్ధి నమూనాను దేశానికి పరిచయం చేయాలని నిర్ణయించాం. కేసీఆర్‌ను కలుపుకొని పోయే పార్టీల సంగతేంటి? – దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ పార్టీలకు స్థానిక ఎజెండా ఉంది. కలుపుకొని వెళ్లేందుకు, కలిసి వచ్చేందుకు చాలా పార్టీలు సిద్ధంగా ఉన్నా.. ఎవరి ఇబ్బందులు, పరిస్థితులు, ఎజెండా వారికి ఉన్నాయి. అందరం ఏ తరహాలో కలిసి పనిచేయాలనే దానిపై గతంలో చర్చ జరిగింది, భవిష్యత్తులోనూ జరుగుతుంది. అయితే సమయం, సందర్భం రావాలి. కేసీఆరే వ్యూహకర్త అన్నప్పుడు.. ప్రశాంత్ కిషోర్ ఎందుకు? – కేసీఆర్‌ను మించిన వ్యూహకర్త దేశంలోనే ఎవరూ లేరు. ఆయనకు ఎవరూ అవసరం లేదు. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిపించలేరు, ఓడించలేరు. కానీ తన శక్తిని జోడించగలరు. 2014లో మేం అధికారంలోకి వచ్చేనాటికి పదేళ్ల వయసున్న పిల్లలు ఇప్పుడు ఓటర్లు అయ్యారు. వారికి కేసీఆర్ సీఎంగానే తెలుసు. ఉద్యమకారుడిగా తెలంగాణ ఎలా సాధించారో తెలియదు. మారుతున్న కాలం, సమాజం, తరానికి అనుగుణంగా సామాజిక మాధ్యమాల్లో వారిని ఆకట్టుకునేందుకు ప్రశాంత్ కిషోర్ వంటి వ్యక్తులు అవసరమని భావిస్తున్నాం. పార్టీలో సరుకుంటేనే ఏదైనా చేయొచ్చు. ప్రజలు తిరస్కరించే మూడ్‌లో ఉంటే ఎవరూ కాపాడలేరు. ఏపీలో జగన్ సీఎం కావాలనే భావన ప్రజల్లో ఉంది. పీకే దానికి కొంత జోడించారు. పీకే కాంగ్రెస్‌లో చేరుతున్న విషయం మీడియాలో చూశా. బీజేపీ జైశ్రీరాం, హిందూత్వ నినాదాల మీద మీ అభిప్రాయమేంటి? – దేశంలోని 28 రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ తరహాలో యాగాలు చేసినవారు, గుడులు కట్టినవారు, హైందవ ధర్మాన్ని ఆచరించే వారు ఎవరైనా ఉన్నారా? మేం హిందువులం కాదా? మాకు భద్రాచల రాముడు లేడా? భద్రాచలం సహా రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రధాన ఆలయానికి నిధులు తేలేని బీజేపీకి.. తెలంగాణలో జైశ్రీరాం నినాదం ఇచ్చే హక్కు ఉందా? రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు పూజకు పనికిరాని పూల వంటివారు. వాళ్లు జైశ్రీరాం అనగానే గందరగోళం చెందాలా? దేవుళ్ల పేరిట ఓట్లు అడగటం, హైందవ ధర్మాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం మా పద్ధతికాదు. హిందూత్వ అనేది ఒక జీవన విధానం. అది ఒక పార్టీకో, సంస్థకో సంబంధించిన విషయం కాదు. ప్రజల సమష్టి పోరాటంతో సాధించిన తెలంగాణ ఏ ఒక్క వ్యక్తితో, వర్గానికో, కులానికో, మతానికో పరిమితం కాదు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వందకుపైగా సీట్లలో డిపాజిట్లు కూడా రావు. ఆ పార్టీ సమాజంలో తక్కువ, సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ఉంటోంది. వాపును చూసి బలుపు అనుకుంటోంది. అక్రమ కేసులు పెట్టారన్న బండి సంజయ్, రేవంత్‌ల ఆరోపణలపై స్పందన? – వారు సక్రమ వ్యక్తులు అయితే అక్రమ కేసులు ఎందుకు పెడతాం. ఒకాయన ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికారు. మరొకరు తంబాకు నములుతూ కరీంనగర్ గల్లీలో తిరిగి, అకస్మాత్తుగా అదృష్టవశాత్తూ ఎంపీ అయ్యారు. మేం వ్యవస్థను దుర్వినియోగం చేస్తే వీళ్లు బయట తిరుగుతారా? ప్రజాస్వామ్యంలో ప్రజలే చూసుకుంటారు. బండి సంజయ్ పాదయాత్ర అసమర్థుని పాదయాత్ర, సన్నాసుల పాదయాత్ర. సోషల్ మీడియాలో ప్రచారాలపై ఏమంటారు? – సోషల్ మీడియాలో కొన్ని అసాంఘిక శక్తులు దూరి.. కేసీఆర్ ఒక్కరనే కాదు, తమకు ఇష్టంలేని వారిపై బురద చల్లుతున్నాయి. వాటిని నియంత్రిస్తే నియంత అని విమర్శిస్తారు. సామాజిక మాధ్యమాల్లో స్వీయ నియంత్రణ అవసరం. ఉన్న చట్టాలతోపాటు కొత్త చట్టాలతో ఇలాంటి అసాంఘిక శక్తులను నియంత్రించాల్సి వస్తుందేమో! ఖమ్మం ఘటన, బీజేపీ వైఖరిపై మీ స్పందన ఏంటి? – ఖమ్మంలో బీజేపీ బలమెంత? ఎందుకు రెచ్చగొడుతున్నారు? వాళ్ల ఎజెండా ఒక్కటే.. రెచ్చగొట్టి, శాంతిభద్రతల సమస్య సృష్టించి శవ రాజకీయం చేయడమే. వరి కొనుగోళ్ల విషయంలోనూ రైతులను రోడ్ల మీదకు తెచ్చి శవ రాజకీయాలు చేయాలని బీజేపీ కుట్ర పన్నింది. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ ఇచ్చిన రీతిలో రైతాంగాన్ని కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తోంది. మిల్లర్లతో కలిసి కుంభకోణం చేస్తున్నామంటూ ఆరోపణలు చేస్తున్న కిషన్‌రెడ్డికి విషయ పరిజ్ఞానం లేదు. ఆదానీ, అంబానీ కలిస్తే ప్రధాని అనే ఆరోపణలు వస్తున్నాయి. రఫేల్ కుంభకోణంలో మోదీ లక్షల కోట్లు తిన్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇలా ఎన్నైనా చేయొచ్చు. బీజేపీ, మోదీ తెలంగాణ వ్యతిరేకులు. కేసీఆర్‌ను జైల్లో పెడతామని వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. మోదీని జైల్లో పెడతామని మేమూ అనాలా? కుటుంబ పాలన ఆరోపణల సంగతేమిటి? – మమ్మల్ని విమర్శించేందుకు విపక్షాలకు అంశాలేవీ లేవు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు, ఇంటింటికి తాగునీరు వంటివి మేం ఒక్కరమే అనుభవిస్తున్నామా? మీడియా కోసమే విమర్శలు, ఆరోపణలు. బీజేపీలో వారసులు లేరా? అమిత్‌షా కొడుకు జైషా బీసీసీఐ కార్యదర్శి ఎలా అయ్యాడు? బీజేపీలో వారసుల జాబితా చాలా పెద్దది. మేం ఉద్యమంలో రోడ్ల మీద కొట్లాడాం, జైలుకు వెళ్లాం. ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాం. గవర్నర్ తమిళిసైని అవమానిస్తున్నారనే ఆరోపణలపై వివరణ – గౌరవ మర్యాదలు పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాల్సినవి. గవర్నర్ తమిళిసై రాష్ట్రాన్ని, ప్రజలను అవమానిస్తున్నారు. రాష్ట్రానికి మోదీ ఇవ్వని మెడికల్ కాలేజీలను ఇచ్చినట్టు గవర్నర్ మాట్లాడుతున్నారు. 105 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 15 రోజుల్లో పడగొడతానని మాట్లాడటం తెలంగాణ ప్రజలను అవమానించడం కాదా? గవర్నర్ వ్యవస్థలో రాజకీయేతరులు ఉండాలని గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ అన్నారు. ఇప్పుడు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిని తెలంగాణ గవర్నర్‌గా నియమించారు. ప్రత్యర్థి పార్టీలున్న చోటే గవర్నర్ వ్యవస్థతో విరోధం ఎందుకు వస్తోంది? పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర ఇలా రాజకీయ ప్రత్యర్థులు అధికారంలో ఉన్నచోట గవర్నర్, దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని బీజేపీ డ్రామాలు ఆడుతోంది. 111 జీవో రద్దు అంశంలో ఆరోపణలపై సమాధానం? – ఈ జీవో రద్దుకు సంబంధించి 2014 ఎన్నికల్లో అన్ని పార్టీలు హామీ ఇచ్చాయి. మేం ఇచ్చిన హమీ మేరకు 80 గ్రామాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రద్దు చేశాం. నాకు అక్కడ భూములు ఉంటే ఆధారాలు ఇవ్వండి. కొత్త సచివాలయంలో కేటీఆర్‌ను కొత్త సీఎంగా చూడవచ్చా? – నాకు అలాంటి పెద్ద ఆశలు లేవు. మంత్రి అవుతా అనుకోలేదు. సిరిసిల్ల ప్రజల ఆశీస్సులతో మంత్రినయ్యా. మంచి మెజారిటీతో టీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావాలి. దేశంలో తెలంగాణ అగ్రశ్రేణి రాష్ట్రంగా వెలుగొందాలన్నదే నా కోరిక. మోదీ–ఈడీ.. జుమ్లా–హమ్లా.. ► సీబీఐ, ఈడీ తదితరాలన్నీ ప్రధాని మోదీ జేబుసంస్థలుగా మారిపోయాయి. ప్రతిపక్షాల ప్రభుత్వాలు ఉన్నచోట వీటిని మోదీ కనుసన్నల్లో వేటకుక్కల్లా ఉసిగొల్పుతారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దాడులు జరగకపోవడం.. బీజేపీలో చేరిన తర్వాత సుజనా చౌదరి, సీఎం రమేశ్ వంటి వారిపై దాడులు ఆగడం దీనికి ఉదాహరణ. ‘మోదీ–ఈడీ, జుమ్లా– హమ్లా..’ ఇదీ మోదీ మార్కు డబుల్ ఇంజిన్ గ్రోత్. మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన ఆకార్ పటేల్, ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ అరెస్టు వంటివి బీజేపీ బెదిరింపులకు అద్దంపడుతున్నాయి. డ్రగ్స్‌కే కాదు.. ఏ టెస్టుకైనా రెడీ ► పాశ్చాత్య సంస్కృతిలో భాగంగా పబ్, క్లబ్ కల్చర్ విస్తరిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ సమస్యను ఎదుర్కొనాలి. నేను మంత్రిని, సీఎం కొడుకును కావ డంతో నోటికొచ్చినట్టు ఆరోపణలు చేస్తు న్నారు. నేను డ్రగ్ టెస్ట్‌కే కాదు.. ఏ తరహా పరీక్షకైనా సిద్ధం. రేవంత్‌రెడ్డి సీరియల్ కిల్లర్ అని, బండి సంజయ్ బ్యాంకులను ముంచాడని ఆరోపిస్తే సరిపోతుందా? నేను డ్రగ్ టెస్ట్‌లో కడిగిన ముత్యంలా బయటికొస్తే నాపై ఆరోపణలు చేస్తున్నవారు బహిరంగ క్షమాపణ చెప్తారా? -
వైరల్: తండ్రి లైవ్ ఇంటర్వ్యూలో కొడుకు చిలిపి చేష్టలు..
కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో కొన్ని నెలల పాటు అన్ని కార్యాలయాలు మూతపడిన విషయం తెలిసిందే. దీంతో ప్రతి ఆఫీస్ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించింది. ఈ క్రమంలో అందరూ ఇంటి నుంచి పనులు చేసుకుంటారు. ఇప్పటికీ కొన్ని కార్యాలయాలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంనే కొనసాగిస్తున్నాయి. కరోనా దెబ్బతో పిల్లలకు క్లాస్‌లు, ఇంటర్వ్యూలు కూడా ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. అయితే ఇంట్లో నుంచి లైవ్ మీటింగ్‌లు, డిబెట్లు చేస్తుండగా కొన్నిఇబ్బందులు తలెత్తడం సహజమే. చదవండి: వైరల్: వరుడిని చూసి పట్టరాని సంతోషం.. గాల్లో ముద్దులు పంపి.. తాజాగా అలాంటి ఓ ఫన్నీ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి టీవీ ఛానల్‌కు లైవ్ ఇంటర్వ్యూ ఇస్తుండగా తన పిల్లలు అంతరాయం కలిగించాడు. తండ్రి వెనకాలకు వచ్చిన కొడుకు కెమెరాకు హాయ్ చెబుతూ కనిపించాడు. ఇది గమనించిన వ్యక్తి కొడుకును పక్కకు పంపేందుకు ప్రయత్నించగా అతడు వెళ్లిపోయాడు. అయితే మళ్లీ స్క్రీన్ ముందుకు వచ్చిన పిల్లవాడు తండ్రి వెనకాల డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. పిల్లవాడి చేష్టలకు చివరికి యాంకర్ కూడా నవ్వేశాడు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. A special guest on @bsurveillance was very excited about Weidmann’s departure from the Bundesbank pic.twitter.com/o2sgMk2MK0 — Aggi (@aggichristiane) October 20, 2021 -
వైరల్: ఇంటర్వ్యూలో ఉండగా చెల్లిని చితకబాదిన అక్క.. గ్యాప్ కూడా ఇవ్వలే..
Women Beats Sister Video: సోషల్‌మీడియా వాడకం పెరిగేకొద్ది నెట్టింట వైరల్ వీడియోల హవా పెరుగుతోంది. ఈ జాబితాలో వింతలు, విశేషాలు, డాన్స్‌లు, కొట్లాటలు ఇలా నెటిజన్లకు నచ్చితే చాలు అవి వైరల్ కావడం.. లైక్స్, వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. తాజాగా ఓ వీడియో నెట్టంట హల్చల్ చేస్తోంది. అందులో ఓ చెల్లి ఇంటర్వ్యూలో ఉండగా మధ్యలో అక్క వచ్చి ఆమెను చితకబాదుతుంది. అయితే అలా చేయడానికి ఓ బలమైన కారణమే ఉందండోయ్! వివరాల్లోకి వెళితే.. ఉద్యోగ అన్వేషణలో ఉన్న ఓ యువతి ఇంటర్వ్యూ గదిలో కంపెనీ ప్రతినిధి ప్రశ్నలకు సమాధానమిస్తుంటుంది. అలా కొనసాగుతుండగా మధ్యలో అకస్మాత్తుగా ఆమె అక్క అక్కడికి వచ్చి మెరుపు వేగంతో తన చెల్లిపై పిడి గుద్దులు కురిపిస్తుంది. అంతటితో ఆగకండా తన చెల్లి మీద కూర్చుని ఎడాపెడా వాయిస్తుంది. క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా చితకబాదేస్తుంది. ఆమె కోపం చూసి ఆ పరిసరాల్లో ఉన్న కంపెనీ సిబ్బంది కూడా అక్కని ఆపేంత సాహసం చేయలేకపోయారు. మరీ అంతలా ఆమె ఎందుకు కొట్టిందంటే.. తన భర్తతో చెల్లి వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం అక్కకి తెలిసింది. దీంతో కోపంతో ఊగిపోయి చెల్లి ఇంటర్య్వూ జరుగుతున్న ఆఫీస్‌కు వచ్చి మరీ బాదేసి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తూ కామెంట్ పెడుతున్నారు. చదవండి: అమ్మా దొంగా ఇక్కడున్నావా? చిన్నారి బిస్కెట్ దొంగతనం వైరల్ -
వాసవీ కాలేజీ లో మిస్ ఇండియా సందడి
-
సంక్షేమం.. పారదర్శకతే లక్ష్యం
‘ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలకు చేర్చేందుకు కృషి చేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్న పథకాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రస్తుతం రైతు భరోసా లబ్ధిదారుల ఎంపిక సర్వే కొనసాగుతోంది. స్పందనలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం కలిగేలా చేస్తున్నాం. భూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం. ఇసుక కొరతను అధిగమించేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం’ అని కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనందకుమార్ చెప్పారు. ఆయన ‘సాక్షి’తో మంగళవారం ప్రత్యేకంగా మాట్లాడారు. సాక్షి : ఇసుక కొరతను అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటి? కలెక్టర్: జిల్లాలో ఎన్జీటీ తీర్పుతోపాటు కృష్ణానదికి వరద రావడంతో కొంత మేర ఇసుక కొరత తలెత్తింది. దీన్ని అధిగమించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో మరో తొమ్మిది కొత్త రీచ్‌లకు కూడా ప్రతిపాదనలు పంపాం. ఐదు స్టాక్ యార్డులను సిద్ధం చేస్తున్నాం. మున్నంగిలో వే బ్రిడ్జితో అన్ని ఏర్పాట్లు చేశాం. కృష్ణా నదిలో ప్రవాహం తగ్గగానే స్టాక్ యార్డులకు ఇసుక తరలించి, అవసరమైన వారికి సరఫరా చేస్తాం. ప్రజలకు కోరినంత ఇసుకను పారదర్శకంగా అందిస్తాం. సాక్షి : రైతు భరోసా లబ్ధిదారుల ఎంపిక సర్వే ఎలా సాగుతోంది? కలెక్టర్: జిల్లాలో రైతు భరోసా పథకం లబ్ధిదారుల గుర్తింపునకు సంబంధించి గ్రామస్థాయిలో ప్రత్యేక బృందాల ద్వారా సర్వే చేస్తున్నాం. ప్రధాన మంత్రి కిసాన్ యోజనకు ఎంపికైన లబ్ధిదారుల జాబితాలను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శిస్తాం. అనర్హులను తొలగిస్తాం. అర్హులై ఉండి పీఎం కిసాన్ జాబితాలో చోటు చేసుకోని వారికి చోటు కల్పిస్తాం. రైతు భరోసా ద్వారా భూమి లేని కౌలు రైతులకు ఎంతో మేలు చేకూరనుంది. దీని ద్వారా జిల్లాలో నాలుగు లక్షల కుటుంబాలు లబ్ధిపొందుతాయి. రైతు పెట్టుబడి సహాయం కింద ఏడాదికి రూ.12,500 అందించనున్నాం. సాక్షి : సచివాలయాల ఏర్పాటు వివరాలు ఏమిటి? కలెక్టర్: అక్టోబర్ 2వ తేదీన జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థ అందుబాటులోకి రానుంది. జిల్లాలో 57 మండలాల్లో మండలానికి ఒకటి చొప్పున గ్రామ సచివాలయాలను ప్రారంభించేం దుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. నగర, పట్టణాల్లో ఒక వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలో మోడల్ గ్రామ పంచాయతీగా బొల్లాపల్లి మండలంలోని మూగచింతల గ్రామాన్ని ఎంపిక చేశాం. జిల్లా ఇన్చార్జి మంత్రి పేర్ని వెంకట్రామయ్య, జిల్లా మంత్రులతో అక్కడ లాంఛనంగా మోడల్ సచివాలయాన్ని ప్రారంభిస్తాం. సచివాలయాలకు అవసరమైన ఫర్నిచర్, కంప్యూటర్లను అందుబాటులో ఉంచాం. గ్రామ, నగర, పట్టణాల్లో గ్రామ, వార్డు సచివాలయాలను గుర్తించాం. నవంబర్ నాటికి పూర్తి స్థాయిలో గ్రామ సచివాలయాలను ప్రారంభిస్తాం. సాక్షి : ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందా? కలెక్టర్: పక్కా ఇళ్లు, ఇళ్ల స్థలాలు అవసరమైన లబ్ధిదారుల ఎంపిక ముమ్మరంగా జరుగుతోంది. గ్రామ వలంటీర్లు, రెవెన్యూ సిబ్బంది ద్వారా నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు, ఇంటి స్థలాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు తీసుకున్నాం. ప్రజా సాధికారిక సర్వే ప్రకారం ఆరు స్థాయిల్లో జాబితాను పరిశీలిస్తున్నాం. 2.12 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, పక్కాఇళ్లు అందించేందుకు అవసరమైన స్థలాలను గుర్తించే పనిలో రెవెన్యూ శాఖ పూర్తిస్థాయిలో నిమగ్నమైంది. సాక్షి : ఆర్థిక సాయం కోసం ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు? కలెక్టర్: జిల్లాలో ట్యాక్సీ, ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం రూ.10 వేల ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈనెల 25వ తేదీ వరకు అర్హులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అందిన దరఖాస్తులను ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు పరిశీలిస్తాం. అక్టోబర్ నాల్గో తేదీ నుంచి సహాయం అందిస్తాం. జిల్లాలో ఇప్పటి వరకు 9,200 దరఖాస్తులు వచ్చాయి. సాక్షి : జిల్లాలో పంటల సాగు పరిస్థితి ఎలా ఉంది? కలెక్టర్: జిల్లాలో పశ్చి డెల్టా, నాగార్జున సాగర్ కుడికాలువ ద్వారా ఆయకట్టుకు సాగు నీరు పుష్కలంగా అందిస్తున్నాం. ఎన్ఎస్పీ పరిధిలో అన్ని చెరువులనూ పూర్తిగా నింపాం. ఈ ఏడాది పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉండటంతో రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువులు, పురుగు మందులు అందిస్తున్నాం. నకిలీ ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే వ్యాపారులకు, వ్యవసాయ అధికారులను హెచ్చరించాం. కృష్ణానది వరదతో వ్యవసాయ, ఉద్యాన పంటలకు రూ.13.5 కోట్ల పంట నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి నివేదిక పంపాం. సాక్షి : స్పందనలో వచ్చిన దరఖాస్తులను ఎలా పరిష్కరిస్తున్నారు? కలెక్టర్: స్పందనలో వచ్చిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. వీలైనంత వరకు అక్కడికక్కడే పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటున్నాం. స్పందన కార్యక్రమంపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్పందనలో ఫిర్యాదుచేస్తే తమ సమస్య పరిష్కారం అవుతుందనే భరోసాను ప్రజలకు కల్పించగలిగాం. సాక్షి : భూ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? కలెక్టర్: జిల్లాలో ఎక్కువ శాతం భూ సమస్యలే ఉన్నాయి. ప్రస్తుతం రెవెన్యూ రికార్డులను ఆధునికీకరణ చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేశాం. ఆయా గ్రామాల్లో సర్వే చేసి రికార్డులను ప్రక్షాళన చేయనున్నాం. దీని ద్వారా ఎక్కువ శాతం రెవెన్యూ సమస్యలు పరిష్కారం కానున్నాయి. గ్రామ సచివాలయాల్లో కొత్తగా వచ్చే సర్వే అసిస్టెంట్ల ద్వారా అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చి ఇందులో వారిని భాగస్వాములను చేస్తాం. సాక్షి : పారిశుద్ధ్యం, సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలు ఏమిటి? కలెక్టర్ : జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ వారికి తగు సూచనలు, సలహాలు ఇస్తూ పారిశుద్ధ్య సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాం. -
నేటి నుంచి గ్రామ వలంటీర్ల ఇంటర్వ్యూలు
సాక్షి, అరసవల్లి(శ్రీకాకుళం) : గ్రామ వలంటీర్ల నియామక ప్రక్రియ జోరందుకుంది. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి తుది జాబితా సిద్ధం చేశారు. కీలకమైన ఇంటర్వ్యూ (మౌఖిక పరీక్ష) ఘట్టం నేటి నుంచి మొదలు కానుంది. ఈనెల 11 నుంచి 23వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నాలుగు స్లాట్లలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. జిల్లాలోని 38 మండలాల్లో 11,924 గ్రామ వలంటీర్ల ఉద్యోగాలకు మొత్తం 68,740 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే శ్రీకాకుళం నగరం, జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 1704 వార్డు వలంటీర్ పోస్టులకు 4192మంది పోటీ పడుతున్నారు. వీరిలో సామాజిక బాధ్యత, సేవా దృక్పథంలో ఆసక్తినే ప్రధాన అర్హతగా చూసుకుని, అర్హులను ఎంపిక చేసేందుకు అన్ని మం డలాల్లో ఎంపీడీవో, తహసీల్దార్, ఈవోపీఆర్డీలతో కూడి న త్రిసభ్య కమిటీని నియమించారు. అలాగే అన్ని మం డలాల్లో పరిస్థితులను పర్యవేక్షించేందుకు వీలుగా జిల్లా పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్ ఎస్.వాసుదేవరావు ఆధ్వర్యంలో ఏడుగురితో సెంట్రల్ మానిట రింగ్ కమిటీని నియమించారు. ఇందుకోసం జిల్లా పరిషత్ సీఈవో టి.కైలాస గిరీశ్వర్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన చర్యలను చేపట్టారు. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్ల కు ఒక్కో వలంటీర్‌ను నియమించనున్నారు. ప్రతి గ్రామంలో 50 ఇళ్లకు సంబంధించిన వివరాలతో ఒక కీ రిజిస్టర్ తయారు చేయాలని పంచాయతీరాజ్ కమిషన ర్ గిరిజాశంకర్ ఇప్పటికే ఎంపీడీవోలను ఆదేశించారు. ఇంటర్వ్యూలు ఇలా.... ఇంటర్వ్యూ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరిగేలా జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆధ్వర్యంలో జెడ్పీ సీఈవో టి.కైలాస్ గిరీశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి బి.కోటేశ్వరరావులు తగు చర్యలు చేపట్టారు. ఈనెల 11వ తేదీన 2850 మందికి, 12న 6108, 13న 6108, 14న 6108, 15న 6050, 16న 6008, 17న 6008, 18న 6008, 19న 6008, 20న 5997, 21న 5715, 22న 4356, 23న 1416 మంది చొప్పున ప్రత్యేక స్లాట్ల ద్వారా మౌఖిక పరీక్షలను నిర్వహించనున్నారు. వీరికి ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, తర్వాత 12 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అలాగే 2.30 గంటల నుంచి 4 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు స్లాట్ల కేటాయింపుల ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈమేరకు జిల్లాలో 38 మండల కేంద్రాల్లోని మండల పరిషత్ కార్యాలయాలే వేదికలు కానున్నాయి. అభ్యర్థులకు ఆయా మండల పరిషత్ అధికారి, తహసీల్దార్, ఈవోపీఆర్డీల బృందమే ఇంటర్వ్యూ చేయనుంది. ఇవి తప్పనిసరి ఇక ఇంటర్వ్యూలకు హాజరుకానున్న అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్లతోపాటు ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు వంటి ఐడెంటిటీ కార్డును వెంట తీసుకురావాల్సి ఉంది. అలాగే కేటాయించిన స్లాట్ సమయానికి అర్ధగంట సమయం ముందు ఇంటర్వ్యూ కేంద్రానికి రావాల్సిందేనని నిబంధన విధించారు. సాక్షరతా భారత్ వంటి ప్రాజెక్టుల్లో పనిచేసి, ఉద్యోగాలను కోల్పోయిన నిరుద్యోగులకు ఈ వలంటీర్ల పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎటువంటి సిఫారసు లెటర్లు, ఇతరత్రా ఒత్తిళ్లను అనుమతించేది లేదని, పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ జరుగనుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎంపికైన వలంటీర్ల జాబితాను ఆగస్టు 1వ తేదీన అధికారులు ప్రకటించనున్నారు. -
నేటి నుంచి గ్రామ వలంటీర్లకు ఇంటర్వ్యూలు
సాక్షి, అమరావతి : గ్రామ వలంటీర్ల నియామకానికి సంబంధించి ప్రతి మండలంలోని ఎంపీడీవో కార్యాలయాల్లో గురువారం నుంచి ఇంటర్వూ్యలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 1,81,885 గ్రామ వలంటీర్ల పోస్టుల కోసం జూన్ 24వ తేదీ నుంచి జూలై 5 వరకు 7,92,334 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ ఇంటర్వూ్యలు నిర్వహించేందుకు ఎంపీడీవో చైర్మనుగా, తహసీల్దార్, ఈవోపీఆర్డీలు సభ్యులుగా నియామక బోర్డులను ఏర్పాటు చేశారు. మండలంలో మొత్తం 800కు మించి వచ్చిన దరఖాస్తుల సంఖ్యను బట్టి మండల ప్రత్యేకాధికారి చైర్మనుగా మరో ఇద్దరి అధికారులతో రెండో బోర్డు ఏర్పాటు చేశారు. మూడో బోర్డు అవసరమైన చోట పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు చైర్మనుగా మండలంలోని మరో ఇద్దరు అధికారులు నియామక సభ్యులుగా వ్యవహరించనున్నారు. గ్రామంలోని అభ్యర్థులందరికీ ఒకే రోజుఇంటర్వ్యూలు..: ఒక్కొక్క నియామక బోర్డు రోజుకు 60 మంది చొప్పున ఇంటర్వూ్యలు నిర్వహించనుంది. ఈ కార్యక్రమం మొదలయ్యే గురువారం రోజు మాత్రం ప్రతి బోర్డు కేవలం 30 మందికే ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ప్రతి అభ్యర్థికి వంద మార్కులకు ఇంటర్వూ్య ఉంటుంది. బోర్డు చైర్మను 50 మార్కులకు, మిగిలిన ఇద్దరు సభ్యులు 25 చొప్పున 50 మార్కులు వేస్తారు. ఆయా గ్రామాల్లో అత్యధిక మార్కులు తెచ్చుకున్న వారిని వలంటీర్లుగా ఎంపిక చేస్తారు. మండల యూనిట్‌గా తీసుకుని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళ పోస్టులుగా వర్గీకరిస్తారు. అలాగే ఒక గ్రామంలో వలంటీర్ల నియామకానికి దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఒకే రోజున ఇంటర్వూ్య జరపాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్వూ్యల సమయంలో మండలాల్లో తలెత్తే సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి జిల్లా స్థాయిలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు. దీని పర్యవేక్షణకు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి జిల్లాకొక ప్రత్యేకాధికారిని నియమించారు. గ్రామ సచివాలయాల ఏర్పాటుపై సీఎస్ సమీక్ష..: గ్రామ సచివాలయ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు సమన్వయ శాఖలు పకడ్బందీగా ప్రణాళికలను అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. వలంటీర్ల నియామకం, గ్రామ సచివాలయాల ఏర్పాటుపై బుధవారం సచివాలయంలో సమన్వయశాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఆయా శాఖల మార్గదర్శకాలకు, నియమ నిబంధనలకు అనుగుణంగా గ్రామ సచివాలయాల్లో ఉద్యోగుల నియామకాలను చేపట్టాలన్నారు. సిబ్బందికి శిక్షణను అందించేందుకు తగిన ప్రణాళికలను రూపుదిద్దాలని సూచించారు. పని భారం ఆధారంగా సిబ్బందికి విధులను కేటాయించడం కోసం శాశ్వతమైన ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) ఆధ్వర్యంలో ఎంపికయ్యే గ్రామ సచివాలయ ఉద్యోగులకు సెప్టెంబర్‌లోగా నియామక పత్రాలను అందజేయాలని, ఆ తర్వాత శిక్షణా కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్ 2, 2019 నాటికి విధుల్లో చేరాల్సి ఉంటుందని తెలిపారు. సమావేశంలో సీఎంవో ముఖ్య సలహాదారు అజయ కల్లం, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు -
అవినీతికి చరమగీతం
-
ఎఫ్ఆర్వో పోస్టులకు అక్టోబర్ 5న ఇంటర్వ్యూలు
సాక్షి, హైదరాబాద్: అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్వో) పోస్టులకు సం బంధించిన ఇంటర్వ్యూలను అక్టోబర్ 5న నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఉదయం 9.30 గంటలకు ఇంటర్వ్యూలు ఉంటాయని ఒక ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు www. tspsc. gov. in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది. -
ఇంటర్వ్యూ రోజే కాల్‌లెటర్
పోస్టాఫీస్ అధికారుల నిర్లక్ష్యం నిరుద్యోగికి శాపం కరీంనగర్: పోస్టల్ అధికారుల నిర్లక్ష్యం ఓ నిరుద్యోగికి శాపమైంది. హుస్నాబాద్ పట్టణానికి చెందిన చుక్క తిరుపతి కోర్టులో అటెండర్ పోస్టుకు దరఖాస్తు చేశాడు. హైదరాబాద్‌లో ఈ నెల 22న జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలని సిటీ సివిల్ కోర్టు నుంచి ఈ నెల 14న కాల్‌లెటర్‌ను స్పీడ్ పోస్టు ద్వారా పంపించారు. కాల్‌లెటర్ ఈ నెల 16న హుస్నాబాద్ పోస్టాఫీస్‌కు వచ్చింది. పోస్టుమ్యాన్ లీవ్‌లో ఉండగా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు. అప్పటికి తిరుపతి పలుమార్లు కాల్‌లెటర్ కోసం పోస్టాఫీస్‌లో వాకబు చేసినా రాలేదనే సమాధానం చెప్పారు. తిరిగి విధులకు చేరిన పోస్ట్‌మెన్ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు కాల్‌లెటర్ తిరుపతికి అందించాడు. తిరుపతి దాన్ని తెరిచి ఆతృతగా చూడగా 22న ఇంటర్వ్యూకు రావాలని ఉండగా, ఇదే రోజు కాల్‌లెటర్ అందడంతో కన్నీటిపర్యంతమయ్యాడు. కాల్‌లెటర్ వచ్చి ఆరు రోజులు గడిచినా సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయానని ఎస్పీఎం సంపత్‌ను నిలదీశాడు. పోస్ట్‌మెన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.