
సాక్షి, హైదరాబాద్: అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్వో) పోస్టులకు సం బంధించిన ఇంటర్వ్యూలను అక్టోబర్ 5న నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఉదయం 9.30 గంటలకు ఇంటర్వ్యూలు ఉంటాయని ఒక ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు www. tspsc. gov. in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది.