నవంబర్ కల్లా అటవీ శాఖలో నియామకాలు
అటవీ సంరక్షణ ప్రధానాధికారి పీకే ఝా
సాక్షి, హైదరాబాద్: అటవీ శాఖ లో కొత్త పోస్టుల నియామక ప్రక్రియ వచ్చే నవంబర్ నాటికి పూర్తి అవుతుందని, ఈ మేరకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సీ) కసరత్తు చేస్తోందని అటవీ సంరక్షణ శాఖ ప్రధానాధికారి పీకే ఝా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన అదనపు అటవీ సంరక్షణ అధికారులు పృథ్వీరాజ్, లోకేశ్ జైస్వాల్, ఆర్ శోభ, మునీంద్ర ఆర్‌ఎం డోబ్రియాల్, స్వర్గం శ్రీనివాస్ తది తరులతో కలసి జిల్లా అటవీ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.అటవీశాఖలో దాదాపు 18,057 పోస్టులను భర్తీ చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఝా మాట్లాడుతూ హరితహారం వంటి కార్యక్ర మాలతో ఒకవైపు పచ్చదనం పెంచే ప్రయ త్నం చేస్తుంటే, మరోవైపు అడవులు అంతరిం చి పోతున్నాయన్నారు. అడవుల ఆక్రమణకు పాల్పడే వారిపట్ల కఠినంగా ఉండాలని, అన్యక్రాంతమైన ప్రతి ఇంచు భూమిని తిరిగి స్వాధీనం చేసుకొని మళ్లీ అడవిగా మార్చాలని అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అటవీ అనుమతుల ను వేగంగా సాధించటంతో రాష్ట్ర అటవీ శాఖ ప్రతిష్ట పెరిగిందని అన్నారు. ఆక్రమణకు గురైన అటవీ భూములను తిరిగి శాఖ పరిథిలోకి తీసుకొచ్చి సామాజిక వనాలను పెంచుతున్న తీరును మహబూబాబాద్ డీఎఫ్‌వో కృష్ణాగౌడ్ వివరించగా ఈ విధానాన్ని మిగతా జిల్లాల్లోనూ అమలు చేయాలని డీఎఫ్‌వోలకు సూచించారు. గొర్రెల కోసం గడ్డి పెంపకాలను అన్ని జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.