అటవీ, వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీ | Replace posts in forest and medical department | Sakshi
Sakshi News home page

అటవీ, వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీ

Published Wed, Aug 16 2017 3:38 AM | Last Updated on Wed, Sep 26 2018 5:59 PM

Replace posts in forest and medical department

2,345 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ
 
సాక్షి, హైదరాబాద్‌: అటవీ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీస్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న 2,345 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అటవీ శాఖలో ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌–67, ఫారెస్టు సెక్షన్‌ ఆఫీసర్‌–90, ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌–1,857 పోస్టులను భర్తీ చేయనుంది. వీటికి ఈనెల 21 నుంచి వచ్చే నెల 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది.

వైద్యారోగ్య శాఖలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (స్పెషలిస్టులు)–205, డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌–10, వైద్య విద్యలో ట్యూటర్స్‌–65, వైద్య విద్యలో లెక్చరర్స్‌ ఇన్‌ రేడియోలాజికల్‌ ఫిజిక్స్‌ అండ్‌ ఫిజిసిస్ట్స్‌–6, ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌–43, అసిస్టెంట్‌ పిజియోథెరపిస్టు–2 పోస్టులను భర్తీ చేయనుంది. వీటికి ఈనెల 22 నుంచి వచ్చే నెల 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనుంది. ఆయా పోస్టులకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ను, పరీక్ష తేదీల వివరాలను తమ వెబ్‌సైట్‌లో పొందొచ్చని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement