International Day of Education 2025 : ప్రతీ ఏడాది జనవరి 24న అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. జనవరి 24ని అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) 2018 డిసెంబర్ 3, 2018న ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా శాంతి, అభివృద్ధి, సమానత్వాన్ని తీసుకురావడంలో విద్య ప్రాముఖ్యతను గుర్తించడం, అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం.నైజీరియాతో సహా 58 సభ్య దేశాల మద్దతుతో వచ్చిన ఈ చారిత్రాత్మక తీర్మానం, విద్య ప్రాప్యత , ప్రతి వ్యక్తికి దాని లోతైన ప్రాముఖ్యత గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన అవసరం అని నొక్కి చెబుతుంది.
International Day of Education.
To grow is to become wise, and the foundation of wisdom is learning.#UGC #Education #InternationalDayofEducation@PMOIndia @EduMinOfIndia @PIB_India pic.twitter.com/Eam5G2Jiq6— UGC INDIA (@ugc_india) January 24, 2025
మానవ అభివృద్ధిలో విద్య పాత్రను గుర్తించడంతోపాటు, సమానమైన నాణ్యమైన విద్యను ప్రాథమిక మానవ హక్కుగా ప్రోత్సహించేలా జనవరి 24, 2019న తొలి సారి అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకున్నారు.
అంతర్జాతీయ విద్యా దినోత్సవం 2025, థీమ్
ఈ సంవత్సరం, అంతర్జాతీయ విద్యా దినోత్సవం థీమ్ "ఏఐ అండ్ ఎడ్యుకేషన్‌గా నిర్ణయించారు. ఆటోమేషన్ ప్రపంచంలో మానవ విలువను పరిరక్షించడం". అంటే ఆటోమేషన్ యుగంలో రోజు రోజుకి అభివృద్ది చెందుతున్న సాంకేతిక తీరుతెన్నులు, పురోగతులు అర్థం చేసుకోవడం, అటువంటి వ్యవస్థలు మానవ నిర్ణయాలు, విద్యా కార్యకలాపాలను ఎలా ప్రభావితం చేస్తాయో ప్రశ్నించడం, విద్యలో కృత్రిమ మేధస్సును పెంచడం ఈ థీమ్ ముఖ్య ఉద్దేశం.
విద్య ప్రాముఖ్యత
పేదరికం,లింగ సమానత్వంతో సహా అనేక సమస్యలను పరిష్కరించడంలో విద్య చాలా అవసరం. వ్యక్తిగత అభివృద్ధి, సామూహిక పురోగతిని పెంపొందిస్తుంది. శాంతిని నిర్మించడానికి విద్య ప్రాథమికమైనదని యూఎన్‌జీఏ పేర్కొంది. సమానమైన నాణ్యమైన విద్యను అందించడం, అందరికీ జీవితాంతం అవకాశాలను ప్రోత్సహించడంతోపాటు, ఆయా వ్యక్తులు సమాజాలు విద్యకు ప్రాధాన్యతనిచ్చి పెట్టుబడి పెట్టడానికి ఇది పిలుపు.
విద్యమనిషిని మనస్సును శక్తివంతం చేస్తుంది. భవిష్యత్తుకు దారి చూపిస్తుంది. ఈ అంతర్జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా నేర్చుకోవడంలోని శక్తిని గుర్తిద్దాం. సెలబ్రేట్ చేసుకుందాం. అది అందరికీ చేరేలా చూసుకుందాం.
ఇదీ చదవండి : National Girl Child Day 2025: నీ ధైర్యమే.. నీ సైన్యమై..!
Comments
Please login to add a commentAdd a comment