International Day
-
అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: వయోవృద్ధులు అంటే చిన్న పిల్లలతో సమానం. చిన్న పిల్లలను చూసుకున్నట్టే వారినీ చూసుకోవాలి, కాపాడుకోవాలి. ఇప్పుడున్న బిజీ ప్రపంచంలో చాలా మందికి తమ కుటుంబాల్లోని పెద్ద వయసువారిని చూసుకోవడం ఇబ్బందిగా మారుతోంది. ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఉన్నా.. అది ప్రాక్టికల్‌గా సాధ్యపడకపోవచ్చు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ వేరే ప్రాంతాలు, దేశాల్లో ఉండేవారు.. ఇంట్లోనే ఉన్నా పొద్దస్తమానం పనుల ఒత్తిడితోనే సతమతం అయ్యేవారు.. పెద్దవారి ఆరోగ్యం, ఆలనాపాలనా చూసుకోవడానికి ‘టెక్నాలజీ’సాయం చేస్తోంది.వృద్ధుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసే స్మార్ట్ వాచీలు, పరికరాలు మార్కెట్లోకి వచ్చాయి. రక్తపోటు, గుండె వేగం, షుగర్ లెవల్స్ వంటి వివరాలను ఎప్పటికప్పుడు గమనించి.. ‘మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామ్’ల సాయంతో ఆరోగ్యాన్ని విశ్లేషించి హెచ్చరించే పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఏదైనా ఇబ్బంది ఏర్పడితే వెంటనే.. చికిత్స అందించేందుకు, పెద్దలకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు చేందుకు వీలు ఏర్పడుతోంది. పెద్దల కోసం ‘అన్వయ’!..: హైదరాబాద్ కేంద్రంగా ‘అన్వయ కిన్ కేర్ టెక్నాలజీ’వృద్ధులకు అవసరమైన సేవలు అందిస్తుంది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వయోవృద్ధులను స్మార్ట్ వాచ్ సాయంతో గమనిస్తూ ఉండవచ్చు. అందులో ప్రత్యేక యాప్ పెద్దల ఆరోగ్యాన్ని గమనించడమే కాదు.. ఒకవేళ జారిపడినా, ఏదైనా ప్రమాదం జరిగినా వెంటనే పిల్లలకు అలర్ట్ పంపుతుంది.పిల్లలు గనుక దగ్గర లేకపోతే అన్వయ కేర్ సెంటర్ తమ సిబ్బందిని వెంటనే పంపి అవసరమైన సాయం అందిస్తుంది. అంతేకాదు.. వయోవృద్ధుల్లో చాలా మందికి ‘డిమెన్షియా (మతిమరుపు)’వ్యాధి వస్తుంటుంది. ఏం చేస్తున్నామో కూడా తెలియని, అర్థంకాని స్థితిలోకి వెళ్లిపోతుంటారు. అలాంటి వారికోసం కూడా ‘అన్వయ’లో సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. జియో ట్యాగింగ్, జియో ఫెన్సింగ్ వంటివాటితో పెద్దలను మానిటర్ చేస్తారు. నిర్ధారిత ప్రాంతం వదిలి పెద్దవారు బయటకి వెళ్తే.. వెంటనే పిల్లలకు మెసేజ్ వెళ్తుంది. ఎక్కడున్నారో ఆచూకీ చూపుతుంది. -
Sign Languages Day: ఒకప్పుడు చులకనగా చూసినవాళ్లే నేడు..
అంతర్జాతీయ సంజ్ఞా భాష (సైన్ లాంగ్వేజ్) దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న జరుపుకుంటారు. వినికిడి లోపం కలిగినవారికి సంజ్ఞా భాష అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ దినోత్సవం నిర్వహణ వెనుక సుదీర్ఘ చరిత్ర, ఎంతో ప్రాముఖ్యత ఉన్నాయి. సంజ్ఞా భాష అనేది వినికిడి లోపం కలిగినవారు ఒకరితో ఒకరు సంభాషించడానికి ఉపయోగించే దృశ్య భాష. ఇది ఒక సహజ భాష, దానికి సొంత వ్యాకరణం, వాక్య నిర్మాణం, పదజాలం ఉన్నాయి. సంకేత భాషలో ప్రధానంగా చేతులు, ముఖ కవళికలు, శరీర కదలికలను ప్రదర్శిస్తారు.సంజ్ఞా భాష ఎంతో పురాతనమైనది. మొదట్లో ఈ భాషను చులకనగా చూసేవారట. అలాగే కొన్ని చోట్ల సంకేత భాషను ఉపయోగించకుండా నిరోధించారని కూడా చెబుతారు. అయితే కాలక్రమేణా సంజ్ఞా భాష అభివృద్ధి చెందిన భాషగా గుర్తింపు పొందింది. బధిరుల హక్కుల సాధన కోసం జరిగే పోరాటంలో ఉపయుక్తమయ్యింది.సామాన్యులలో సంజ్ఞా భాషపై అవగాహన పెంచడానికి ఈ దినోత్సవం దోహదపడుతుంది. సంజ్ఞా భాష అనేది ఒక కమ్యూనికేషన్ మాధ్యమం. దీనిని ఉపయోగించే వారి విషయంలో ఉండే వివక్షను తొలగించాలనే విషయాన్ని ఈ ప్రత్యేక దినోత్సవం గుర్తు చేస్తుంది. సంకేత భాష అనేది వక్రీకరణ కాదు, సహజమైన, అందమైన భాష అని గుర్తెరగాలని నిపుణులు చెబుతుంటారు.సంజ్ఞా భాషలు ప్రపంచవ్యాప్తంగా విభిన్నంగా ఉంటాయి. బధిరులకు విద్య, వైద్యం, ఇతర సేవలను ఇతరులతో సమానంగా అందించేందుకు ఈ సైన్ లాంగ్వేజ్ ఉపయోగపడుతుంది. ఇతర భాషల మాదిరిగానే సంకేత భాషలు కూడా నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయి. కొత్త పదాలు, చిహ్నాలు, కొత్త ఆలోచనలు, సాంకేతికతలకు అనుగుణంగా అవి కొత్త రూపం తీసుకుంటున్నాయి. సంజ్ఞా భాష అనేది ఆలోచనలను వ్యక్తీకరించడానికి మాత్రమే కాకుండా భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది కూడా చదవండి: నిద్రలో నడుస్తూ అడవిలోకి...! -
ప్లేఫుల్ పేరెంట్స్
డ్రెస్సింగ్ స్టైల్స్‌లో గానీ.. అదిరిపోయే స్టెప్స్‌లో గానీ మాకు మేమే సాటి అన్నట్టుగా కనిపిస్తున్నారు.. డ్యాన్స్ ఫ్లోర్ మీద వారిద్దరినీ చూస్తే కళ్లు తిప్పుకోలేకపోయారు..‘హేయ్, నీకు తెలుసా? వాళ్లిద్దరూ మామ్ అండ్ సన్ అట’... అంటూ వింతగా చెప్పుకుంటున్నారు. నగరంలో ఇలాంటి నృత్యాలు నిత్య కృత్యాలుగా మారుతున్నాయి. అహాలను వదిలేస్తున్న తల్లిదండ్రులు, పిల్లలకు నమ్మలేనంత స్నేహాల్ని పంచుతున్నారు. నేను తండ్రిని కాబట్టి నా మాట వినాలి.. నేను తల్లిని కాబట్టి నాకు విలువ ఇవ్వాలి.. అంటూ పిల్లల మీద అజమాయిషీ చేస్తే.. చెల్లుబాటయ్యే కాలం కాదిది. పిల్లలపై పెత్తనం చెలాయించాలని కాకుండా వాళ్లలో తమ పట్ల స్నేహమనే విత్తనం మొలకెత్తాలని తల్లిదండ్రులు తపిస్తున్నారు. దానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. స్నేహసిరి.. ఉభయకుశలోపరి..‘మా అబ్బాయితో స్నేహం వల్ల నాకు వయసు రోజు రోజుకూ తగ్గిపోతున్నట్టు అనిపిస్తోంది’ అని చెప్పారు లోయర్ ట్యాంక్ బండ్ నివాసి అలీసాగర్. ఆరుపదుల వయసుకు చేరువలో అలీ సాగర్ (58).. తన వయసులో సగం కూడా లేని కుమారుడు అమ్మార్ (28)తో కలిసి దాదాపు అన్ని సరదాలూ పంచుకుంటారు. ‘పబ్స్‌కి వెళతాం, షటిల్ ఆడతాం, మూవీస్, వెబ్‌సిరీస్ చూస్తూ వాటి గురించి బోల్డ్‌గా చర్చించుకుంటాం..’ అంటూ చెప్పుకుంటూ పోయే అలీసాగర్ మాటల్ని ఆపొచ్చేమో గానీ.. ఆయన తన కుమారుడితో కలిసి చేసే బైక్ టూర్స్‌ను మాత్రం ఆపలేం. నగరం నుంచి బెంగుళూర్, ముంబయి.. తదితర నగరాలకు ఇద్దరూ కలిసి బైక్స్‌పై ఝామ్మని దూసుకుపోతుంటారు. హిందుస్తాన్ రాయల్ బుల్లెటీర్స్ క్లబ్ సభ్యులు కూడా. తరాలకు అతీతంగా వరి్థల్లుతున్న ఈ స్నేహం.. పెద్దవాళ్లకు వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంటే.. యువతకు అవసరమైన పరిణితిని అందిస్తోంది. సన్నిహితమైతేనే..హితం.. ‘మా అబ్బాయి విధాన్కి నన్ను మించిన ఫ్రెండ్ ఎవరూ లేరు’ అంటూ సగర్వంగా చెబుతారు ఈస్ట్ మారేడ్‌పల్లి నివాసి సుశీలా బొకాడియా. పబ్స్‌లో కావచ్చు, పేజ్ త్రీ పారీ్టస్లో కావచ్చు.. ఈ తల్లీ కొడుకులు ఇద్దరూ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుంటారు. పిల్లల పట్ల స్నేహ హస్తం చాస్తున్న ఆధునిక తల్లిదండ్రుల వైఖరికి సుశీల అచ్చమైన నిదర్శనంగా నిలుస్తారు. ‘తన వ్యక్తిగత విషయాలు నాతో పంచుకునేటప్పుడు నన్ను క్లోజ్ ఫ్రెండ్‌లా భావిస్తాడు’ అని చెబుతారామె. ఖచి్చతంగా ఇలాంటి భావన తమ పిల్లల్లో స్థిరపడడానికే పేరెంట్స్ ఇలా తమను తాము మలచుకుంటున్నారని చెప్పొచ్చు.నేర్పుగా..నేస్తంగా.. ‘పిల్లలతో గ్యాప్ ఉండకూడదంటే స్నేహం చేయాలి. వీలైనంత వరకూ వారితో ఆటలు, పాటలతో సరదాగా గడుపుతా’ అంటున్నారు బంజారాహిల్స్‌లో నివసించే ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ సుచిర్ ఇండియా అధినేత లయన్ డా.వై.కిరణ్. వ్యాపార వ్యవహారాలతో బిజీగా గడిపే ఆయన తన కుమార్తెలు రూపాలీ, దీప్శిఖలతో గడిపే సమయం మాత్రం అమూల్యం అంటారు. ‘పిల్లలకు ఏ రకమైన మంచి నేర్పాలన్నా నేస్తంగా మారడం ఒక్కటే మార్గం’ అని స్పష్టం చేస్తున్నారు. ఆయనలాగే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తాము ఏదైనా నేర్పడానికి నేస్తాలుగా మారడాన్నే ఏకైక మార్గంగా ఎంచుకుంటున్నారు. -
ఆమె'కు అవకాశమిస్తే.. సైన్స్ కు ఆకాశమే హద్దు
(రమేష్ గోగికారి): ‘ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం’ అంటూ ఎన్నో ఉపోద్ఘాతాలు.. రిజర్వేషన్ల కోసం పోరాటాలు.. ఎంతో కొంత మార్పు.. అయినా ఏదో వెలితి. కొన్ని రంగాలకే, ఓ స్థాయి వరకే మహిళలు పరిమితమవుతున్న పరిస్థితి. సైన్స్–టెక్నాలజీ రంగాల్లో, పరిశోధనల్లో వారు చాలా తక్కువ. మరి మహిళల మేధాశక్తి ఏమైనా తక్కువా? పురుషులతో సమానంగానేకాదు.. ఒకింత ఎక్కువే చేసి చూపగలమని నిరూపించిన మేరీ క్యూరీ వంటి శాస్త్రవేత్తలు ఎందరో. మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉన్నప్పుడే ఇంత సాంకేతికత, అభివృద్ధి జరుగుతుంటే.. ‘ఆమె’ తోడుంటే ఇంకెంత గొప్ప ఆవిష్కరణలు వస్తాయో, మరెంత అభివృద్ధి సాధ్యమో. చేయాల్సిందల్లా.. ‘ఆమె’కు అవకాశమివ్వడమే. రెండేళ్లపాటు ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ మొదలు.. భవిష్యత్తుపై భయం రేపుతున్న వాతావరణ మార్పుల (క్లైమేట్ చేంజ్) వరకు ఎన్నో సవాళ్లు. వాటిని ఎదుర్కొనే మార్గాలు, పరిష్కారాలను చూపగలిగేది సైన్స్ అండ్ టెక్నాలజీ. ప్రస్తుతం అత్యుత్తమ నైపుణ్యమున్న పరిశోధకుల కొరత ఈ రంగాలను వెంటాడుతోంది. ఇలాంటి సమయంలో ఆదుకోగలిగినది మహిళా శక్తే. ఇన్నాళ్లూ బాలికలు, మహిళలకు విద్యలో, అభిరుచికి తగిన రంగాల్లో సరైన అవకాశాలు అందక.. వారిలోని సామర్థ్యం వృథాగా పోతోంది. వారికి తగిన అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తే.. ఆకాశమే హద్దుగా వినూత్నమైన, విభిన్నమైన, అత్యాధునిక ఆలోచనలు, సాంకేతికతలను సృష్టించడం, అభివృద్ధి చేయడం వీలవుతుందనేది నిపుణుల మాట. ఇందుకోసం విద్యా రంగంలో బాలికలకు సమాన అవకాశాలు దక్కేలా చూడాలని.. శాస్త్ర, సాంకేతిక, పరిశోధన రంగాల్లో వారి సామర్థ్యాన్ని వెలికితీసేలా చర్యలు చేపట్టాలని వారు సూచిస్తున్నారు. మేరీ క్యూరీకి నివాళిగా..: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, తగిన ప్రోత్సాహం కోసం ‘మహిళలకు సైన్స్ కావాలి.. సైన్స్‌కు మహిళలు కావాలి’ అని ‘ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక విభాగం (యునెస్కో)’ నినాదం ఇచ్చింది. ప్రఖ్యాత శాస్త్రవేత్త మేరీ క్యూరీ జయంతి అయిన ఫిబ్రవరి 11వ తేదీని ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’గా నిర్వహించాలని 2015లో నిర్ణయించింది. సైన్స్–టెక్నాలజీ రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ‘స్టెమ్’ రంగాల్లో ప్రోత్సాహం అవసరం: దశాబ్దాల ఎదురుచూపుల తర్వాత మన పార్లమెంటు ‘మహిళా రిజర్వేషన్ల బిల్లు’ను ఆమోదించింది. అది చట్టరూపమూ దాలి్చంది. ‘నారీ శక్తి’ అంటూ కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే రోజున త్రివిధ దళాల్లో మహిళాశక్తిని చాటింది. ఈ ‘నారీ శక్తి’ మరింత విస్తృతమై ‘స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడికల్)’ రంగాల్లో సత్తా చాటితే.. దేశ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. ప్రపంచగతిని మార్చిన మహిళా శాస్త్రవేత్తలు మరెందరో... ►1910వ దశాబ్దంలోనే కుష్టు రోగానికి చికిత్సను కనుగొన్న అలైస్ అగస్టా బాల్.. ►సూర్యుడు సహా విశ్వంలోని నక్షత్రాలన్నీ ఎక్కువభాగం హైడ్రోజన్, హీలియంతోనే నిండి ఉన్నాయని తొలిగా ప్రతిపాదించిన బ్రిటీష్–అమెరికన్ అంతరిక్ష శాస్త్రవేత్త సెసిలియా పేన్ గాపోష్కిన్..∙అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తమ ప్రయోగాల్లో కంప్యూటర్లను వినియోగించడానికి ముందు.. స్పేస్ ప్రయోగాల సమయాన్ని, వాటి ప్రయాణతీరును కచ్చితంగా గణించి చెప్పిన ‘హ్యూమన్ కంప్యూటర్’ కేథరిన్ జాన్సన్..∙ఇన్సూలిన్, పెన్సిలిన్, విటమిన్ బీ12 వంటి బయోరసాయనాల అణు నిర్మాణాన్ని ఎక్స్–రే క్రిస్టలోగ్రఫీ సాయంతో గుర్తించే విధానాన్ని అభివృద్ధి చేసిన డొరోతీ హాడ్కిన్ (ఇన్సూలిన్ వంటి బయో మాలిక్యూల్స్‌ను కృత్రిమంగా తయారు చేయడానికి ఈ విధానం తోడ్పడింది). మన దేశం నుంచీ ఎందరో.. ►మొక్కల కణాల్లో శక్తి ఉత్పాదనకు కీలకమైన ‘సైటోక్రోమ్ సీ’ అనే ఎంజైమ్‌ను గుర్తించిన మధ్యప్రదేశ్ శాస్త్రవేత్త కమలా సొహోనీ ►కేన్సర్‌ను నిరోధించే ‘వింకా ఆల్కలాయిడ్స్’, మలేరియా చికిత్స కోసం వాడే ఔషధాలపై పరిశోధన చేసిన రసాయన శాస్త్రవేత్త అసిమా చటర్జీ (పశ్చిమబెంగాల్).. ►మైక్రోవేవ్ పరికరాలపై పరిశోధన చేసి, మన దేశంలో తొలి మైక్రోవేవ్ రీసెర్చ్ ల్యాబ్ నెలకొలి్పన శాస్త్రవేత్త రాజేశ్వరి చటర్జీ (కర్ణాటక).. ఇటీవలి కాలాన్ని చూస్తే.. ►కోవిడ్ వైరస్ ధాటిని ముందే గుర్తించి హెచ్చరించిన భారత శాస్త్రవేత్త, డబ్ల్యూహెచ్ఓ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్.. ►పుణె వైరాలజీ ల్యాబ్‌లో కోవిడ్ వైరస్‌ను ఐసోలేట్ చేసి..కోవ్యాక్సిన్ రూపకల్పనకు మార్గం వేసిన ల్యాబ్ డైరెక్టర్ ప్రియా అబ్రహం.. ►అగ్ని–4,5 క్షిపణుల రూపకల్పన ప్రాజెక్టుకు హెడ్‌గా వ్యవహరించిన శాస్త్రవేత్త టెస్సీ థామస్.. ఇలా ఎందరో మహిళా శాస్త్రవేత్తలు ఈ రంగంలో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ తీరు సమాజానికి నష్టం మహిళలకు సైన్స్‌లో తగిన అవకాశాలొస్తే అద్భుతాలు సృష్టించగలరు. కానీ సమాజంలో మహిళలను డాక్టర్లు, టీచర్లు వంటి కొన్ని రంగాలవైపే మళ్లిస్తున్నారు. వినూత్న ఆలోచనలను, ఆవిష్కరణలను, అభివృద్ధి చెందే అవకాశాలను సమాజం కోల్పోతోంది. బాలికల్లో స్కూల్ స్థాయి నుంచే సైన్స్ పట్ల ఆసక్తిని గమనించి ప్రోత్సహిస్తున్నాం. – మర్లిన్ మనాస్, ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపాల్ తగిన ప్రోత్సాహం కావాలి నాకు సైన్స్, మేథమేటిక్స్ అంటే చాలా ఇష్టం. ఈ సబ్జెక్టుల్లో అన్ని అంశాలను ఆకళింపు చేసుకుని చదువుతున్నా.. భవిష్యత్తులో పరిశోధనలు చేసి, సమాజానికి పనికొచ్చే ఆవిష్కరణలు చేయాలని ఉంది. తగిన ప్రోత్సాహం అందిస్తే సాధిస్తానన్న నమ్మకముంది. – కేఎన్ శ్రీచరణి, ఇంటర్ ఫస్టియర్, మొయినాబాద్ ‘నోబెల్’కే ఘనతనిచ్చిన మేరీ క్యూరీ ఆధునిక ఫిజిక్స్ రూపునిచ్చిన శాస్త్రవేత్తల్లో మేరీ క్యూరీ ఒకరు. రెండు వేర్వేరు రంగాల్లో నోబెల్ పొందిన ఏకైక శాస్త్రవేత్త ఆమె. రేడియో ధార్మిక మూలకాలైన రేడియం, పోలోనియంలను క్యూరీ గుర్తించారు. ఆ రేడియం పేరు మీదుగానే రేడియేషన్ పదం పుట్టింది. ఈ పరిశోధనకుగాను 1903లో ‘ఫిజిక్స్ నోబెల్’ అందుకున్నారు. తర్వాత కెమిస్ట్రీలో పరిశోధనకు 1911లో ‘కెమిస్ట్రీ నోబెల్’ పొందారు. తన పరిశోధనల సమయంలో క్యూరీ ఎంతగా రేడియేషన్‌కు గురయ్యారంటే..ఆమె రాసిన నోట్ పుస్తకాల నుంచి ఇప్పటికీ రేడియేషన్ వెలువడుతోంది. అణుశక్తికి మార్గం చూపిన చీన్ షుంగ్ వు చైనాలో పుట్టినా అమెరికాలో స్థిరపడి అణుశక్తికి బాటలు వేసిన శాస్త్రవేత్త చీన్ షుంగ్ వు. అణుబాంబుల తయారీ కోసం ‘మాన్ హట్టన్ ప్రాజెక్టు’లో ఆమె కీలకపాత్ర పోషించారు. రసాయనిక ప్రక్రియల ద్వారా యురేనియం ఉత్పత్తి చేసే విధానాన్ని ఆవిష్కరించారు. కంప్యూటర్‌కు ‘భాష’ నేర్పిన గ్రేస్ హోపర్ తొలి ఎ ల్రక్టానిక్–డిజిటల్ కంప్యూటర్ ‘యూనివాక్’ ను రూపొందించిన బృందంలో కీలక పాత్ర పోషించింది అమెరికన్ శాస్త్రవేత్త గ్రేస్ హోపర్. ‘బైనరీ’ భాషలోకి మార్చే తొలి కంపైలర్ ప్రోగ్రామ్‌ను రూపొందించినది ఆమెనే. ‘కోబాల్’ ప్రోగ్రామ్ రూపకల్పనలోనూ ఈమెది కీలకపాత్రే. (యునెస్కో గణాంకాల ప్రకారం..) ►ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులలో మహిళల శాతం:33.3% చూడటానికి ఈ శాతం ఓ మోస్తరుగానే ఉన్నా.. కొన్ని విభాగాల్లోనే మహిళలకు అవకాశాలు అందుతున్నాయి. మహిళా పరిశోధకులకు సమాన అవకాశాలిస్తున్న దేశాలు: 30 ► చాలా దేశాల్లో మహిళా పరిశోధకుల సంఖ్య అతి తక్కువ. కీలక పరిశోధనలు చేసే అవకాశం, నిధుల వంటి అంశాల్లో వివక్షే ఎదురవుతోంది. ‘స్టెమ్’ విభాగాల్లోని విద్యార్థుల్లో మహిళలు: 35% ► మెడికల్, కొంతవరకు టెక్నాలజీ రంగంలోనే మహిళలు ఎక్కువ. తల్లిదండ్రులు, ఫ్యాకల్టీ ఈ రంగాల దిశగా బాలికలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటివరకు నోబెల్ పొందిన మహిళలు: 22 మంది ► పరిశోధన రంగంలో మహిళల భాగస్వామ్యం పెరిగినా.. ఉన్నతస్థాయి పోస్టులు, ప రిశోధక బృందాలకు నేతృత్వం వహించే అవకాశాలు తక్కువ. దీనితో మంచి ప్రతిభ ఉన్నా అవార్డులకు, గుర్తింపునకు నోచుకోవడం లేదు. ఈ తీరు సమాజానికి నష్టం మహిళలకు సైన్స్‌లో తగిన అవకాశాలొస్తే అద్భుతాలు సృష్టించగలరు. కానీ సమాజంలో మహిళలను డాక్టర్లు, టీచర్లు వంటి కొన్ని రంగాలవైపే మళ్లిస్తున్నారు. వినూత్న ఆలోచనలను, ఆవిష్కరణలను, అభివృద్ధి చెందే అవకాశాలను సమాజం కోల్పోతోంది. బాలికల్లో స్కూల్ స్థాయి నుంచే సైన్స్ పట్ల ఆసక్తిని గమనించి ప్రోత్సహిస్తున్నాం. – మర్లిన్ మనాస్, ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపాల్ తగిన ప్రోత్సాహం కావాలి నాకు సైన్స్, మేథమేటిక్స్ అంటే చాలా ఇష్టం. ఈ సబ్జెక్టుల్లో అన్ని అంశాలను ఆకళింపు చేసుకుని చదువుతున్నా.. భవిష్యత్తులో పరిశోధనలు చేసి, సమాజానికి పనికొచ్చే ఆవిష్కరణలు చేయాలని ఉంది. తగిన ప్రోత్సాహం అందిస్తే సాధిస్తానన్న నమ్మకముంది. – కేఎన్ శ్రీచరణి, ఇంటర్ ఫస్టియర్, మొయినాబాద్ నేడు (ఫిబ్రవరి 11న) ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’ సందర్భంగా.. -
గిరిజనుల ప్రాధాన్యతకి ఇదే నిదర్శనం: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందుతున్నా గిరిపుత్రులు మాత్రం అమ్మలా భావిస్తున్న అడవులపైనే ఆధారపడి జీవిస్తూ.. నిత్యం ప్రకృతిని కాపాడుతున్నారు. వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మన ప్రభుత్వంలో వివిధ కార్యక్రమాలను ప్రవేశపెట్టాం. నాణ్యమైన విద్య, వైద్యం వంటి సౌకర్యాలు కల్పిస్తూనే లక్షల మంది గిరిజనులకు పోడు భూములపై యాజమాన్య హక్కులు కల్పించాం. గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చి, కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేశాం. నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారాయన. ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందుతున్నా గిరిపుత్రులు మాత్రం అమ్మలా భావిస్తున్న అడవులపైనే ఆధారపడి జీవిస్తూ.. నిత్యం ప్రకృతిని కాపాడుతున్నారు. వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మన ప్రభుత్వంలో వివిధ కార్యక్రమాలను ప్రవేశపెట్టాం. నాణ్యమైన విద్య, వైద్యం వంటి సౌకర్యాలు క… pic.twitter.com/GAp3Ria9J2 — YS Jagan Mohan Reddy (@ysjagan) August 9, 2023 -
International Day for Older Persons: భారమవుతున్న పేగు బంధాలు..
పిల్లలు పుట్టింది మొదలు జీవితంలో స్థిరపడే వరకు వారి కోసమే అన్నట్లుగా కష్టపడుతుంటారు తల్లిదండ్రులు. వృద్ధాప్యంతో బాధపడుతున్నా.. పిల్లలు దూరంగా ఉంటున్నా.. వీరి మనసు మాత్రం బిడ్డల చుట్టే తిరుగుతుంది. ఎన్నో త్యాగాలు చేసి కూడబెట్టిన ఆస్తిపాస్తులను వారి బిడ్డల పేరున రాస్తున్నారు. అప్పటి వరకు బాగా ఉండే పిల్లలు ఆస్తి చేతిలో పడగానే మారిపోతున్నారు. కన్న వారి నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. వృద్ధ తల్లిదండ్రులను భారంగా భావిస్తున్నారు. చట్టం ఏం చెబుతుందంటే? కేంద్రం తల్లిదండ్రులు, వయోవృద్ధులు పోషణ చట్టం– 2007 తీసుకొచ్చింది. 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఇది వర్తిస్తుంది. పిల్లల నుంచి పోషణ ఖర్చులు ఇప్పించడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది. బాధితులు రెవెన్యూ డివిజన్ స్థాయిలోని ట్రిబ్యునల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై ఆర్డీఓ విచారణ అనంతరం పోషణ ఖర్చులు ఇవ్వాలని ఆదేశిస్తారు. ఆదేశాలు అమలుకాకుంటే జిల్లా అప్పి లేట్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. పిల్లలకు రాసిచ్చిన ఆస్తులను స్వాధీనం చేసుకునే వీలు కల్పిస్తుంది. అయితే తొలుత గృహహింస కేసులు నమోదు చేయిస్తున్నా..ఆ తర్వాత తమ పిల్లలు ఇబ్బంది పడతారనే ఆలోచనతో వాటిని ఉపసంహరించుకుంటున్నారు. పింఛన్ డబ్బులూ లాగేసుకుంటుండ్రు ప్రాణం పోసిన అమ్మానాన్నలకు చివరకు ఛీత్కారాలే మిగులుతున్నాయి. కొందరైతే తల్లిదండ్రుల పింఛన్ డబ్బులను కూడా లాగేసుకుంటున్నారు. కన్నవారికి ఆసరాగా ఉండాల్సిన కుమారులే నరకం చూపిస్తున్నారు. ఇళ్లు, స్థలాలను లాగేసుకుని బయటికి వెళ్లగొడుతున్న ఘటనలూ చోటుచేసుకుంటున్నాయి. వయోభారంతో ఉన్న వారు కష్టాలను ఎవరికి చెప్పుకోలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం ప్రతినెలా వీరికి ఇస్తున్న పెన్షన్ డబ్బులను కూడా కొడుకులు, కో డళ్లు, మనవళ్లు బలవంతంగా వారి నుంచి లాక్కుంటున్నారు. బయటికి చెబితే పిల్లల పరువు పో తుందనే భయంతో వృద్ధులు మౌనంగా ఉంటున్నారు. 60 శాతం పెరిగిన వేధింపులు తల్లిదండ్రులపై వేధింపుల విషయంలో పేదా గోప్పా తేడా లేదు. అంతో ఇంతో ఆస్తిపాస్తులున్న సంపన్న కుటుంబాల్లోనే ఈ వేధింపులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. 28.6 శాతం మంది వయోవృద్ధులు తమ పిల్లల నిర్లక్ష్యానికి గురైతే.. కోవిడ్ తర్వాత ఈ సంఖ్య 60 శాతం పెరిగినట్లు అంచనా. కోవిడ్ సమయంలో తుమ్మినా, దగ్గినా ఛీ త్కారాలు తప్పలేదు. కొంతమందైతే ఏకంగా వా ళ్లను గదుల్లో బంధించిన దాఖలాలు లేకపోలేదు. ఇదీ పరిస్థితీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌జిల్లాల నుంచి పో షణ వేధింపులకు సంబంధించి ప్రతి నెలా 35 నుంచి 40 ఫిర్యాదులు అందుతున్నాయంటే పరిస్థితి ఎంత దారణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2020–21లో ప్రభుత్వ వయో వృద్ధుల సహాయ కేంద్రం కాల్ సెంటర్ 14567 నంబర్‌కి 2020–21లో రాష్ట్ర వ్యాప్తంగా 46,771 ఫిర్యాదులు అందగా.. 2021–2022లో 14,567 ఫిర్యాదులు అందాయి. వీ టిలో అత్యధికంగా హైదరాబాద్‌లో 2868 (37శాతం), మేడ్చల్‌లో 1404(18 శాతం) రంగారెడ్డిలో 1093(14 శాతం) ఫిర్యాదులు అందడం గమనార్హం. -
అడవి అంటే..అందం.. ఆర్థికం
-
శాస్త్ర అస్త్రాలతో...
శాస్త్ర, సాంకేతిక రంగాలలో మహిళల ప్రాతినిధ్యం, వారి విజయాల గురించి తలచుకునే అవకాశం ఇస్తుంది.. ఐక్యరాజ్యసమితి ‘ఇంటర్నేషనల్ డే ఫర్ వుమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’ దినోత్సవం. డా. ఏ.సీమ కేరళ త్రిసూర్‌లోని ‘సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (సి–మెట్) విభాగంలో సైంటిస్ట్. ఒకసారి ఆమె ‘మలబార్ క్యాన్సర్ సెంటర్’కు వెళ్లినప్పుడు ఆ సంస్థ డైరెక్టర్ ‘బ్రెస్ట్ క్యాన్సర్’ గురించి తనతో కొంతసేపు మాట్లాడారు. ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. పరీక్షలు చేయించుకోవడానికి మహిళలు చొరవ చూపకపోవడం వెనుక ఉన్న పరిమితులు తెలిశాయి. ఈ నేపథ్యంలో సీమ తక్కువ ఖర్చుతో, సులభంగా ఉపయోగించగలిగే, ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్లగలిగే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరికరాన్ని తయారు చేశారు. ఇలాంటి పరికరం దేశచరిత్రలోనే ప్రథమం. రేపటి విజయాల కోసం నిన్నటి విషయాలను గుర్తు చేసుకోవాలంటారు. అలా ఒకసారి వెనక్కి వెళితే... పాశ్చాత్య వైద్యవిద్యను అభ్యసించిన తొలి భారతీయ మహిళ ఆనంది బాయి, 1883లో ‘ఫస్ట్ ఫిమేల్ గ్రాడ్యుయేట్ ఇన్ మెడికల్ హిస్టరీ’ (ఇండియా)గా కాదంబినీ గంగూలీ చరిత్ర సృష్టించారు. సౌమ్య స్వామినాథన్.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిప్యూటి డైరెక్టర్‌గా ప్రపంచాన్ని మెప్పించారు. రాయల్ సొసైటీకి ఎంపికైన తొలి మహిళగా గగన్‌దీప్ ఎంతోమంది యువతులకు స్ఫూర్తి ఇచ్చారు. విజ్ఞాన్ ప్రసార్ ‘విజ్ఞాన్ విదూషి’ (ఇండియన్ వుమెన్ సైంటిస్ట్స్) పుస్తకం స్పేస్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, న్యూరోసైన్స్, సైన్స్ అడ్మినిస్ట్రేషన్.. మొదలైన శాస్త్రీయరంగాల రోల్‌మోడల్స్‌గా చెప్పుకునే మహిళల గురించి చెప్పడమే కాదు, వారు ఎలాంటి పరిమితులు ఎదుర్కొన్నారు, వాటిని అధిగమించడానికి చేసిన కృషి గురించి చెప్పడం ఈ తరానికి స్ఫూర్తి ఇస్తుంది. -
అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం
అత్యాధునిక టెక్నాలజీతో అంతరిక్షయానం చేసి జయహో నరుడా అనిపించుకున్నప్పటికీ ఈ పేదరికం నుంచి బయటపడలేకపోవడవ బాధకకరం. కారణాలు ఏవైనా ప్రపంచ దేశాల్లో ఇంకా ఇప్పటికీ పేదరికంలో మగ్గిపోతున్న వాళ్లు ఎందెందరో అభాగ్యులు ఉన్నారు. ఎన్నో పోరాటాలు చేసే కావలిసినవి సాధించుకున్నాం గానీ. ఇప్పటికీ పేదవాడు ఎప్పుడు ఆకలి పోరాటం చేస్తునే ఉన్నాడు. (చదవండి: బలశాలి బామ్మ) అయితే ప్రభుత్వాధి నేతలు, దేశాధి నేతలు ఎన్ని పథకాలను తీసుకువచ్చిన పేదవాడికి చేరకపోవడమే మింగుడుపడిన విషయంగా మిగిలిపోతుంది. ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి పేదరిక నిర్మూలనకై తీసుకోవల్సిన చర్యల పై ప్రపంచ దేశాలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే ప్రతి ఏడాది అక్టోబర్ 17న అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం నిర్వహిస్తోంది. నేపథ్యం ఫ్రెంచ్ మతాధికారి, మానవతవాది అయిన జోసెఫ్ వ్రెసిన్స్కీ పేదరికంతో బాధితులను పట్ల వివక్షకు తావు లేకుండా వారిని గౌరవప్రదంగా చూడాలంటూ ఎన్నో పోరాటాలు చేశారు. అంతేకాదు పారిస్‌లోని ట్రోకాడోరోలో లక్షలాది మంది తన మద్దతుదారులతో కలిసి పేదరికంలో మగ్గిపోతున్న వాళ్ల సమస్యల దేశాధినేతలకు అర్ధమయ్యేలా ఒక ఉద్యమాన్ని తీసుకురావడమే కాక అక్టోబర్ 17, 1987న పారిస్ ప్లాజా ఆఫ్ లిబర్టీ మానవ హక్కుల స్మారక శిలను ఆవిష్కరించారు. పైగా ఆ శిలపై మహిళలు, పురుషులు పేదరికంలో ఉన్నారంటే మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలి అనే వాక్యాలను చెక్కించారు. ఈ క్రమంలో 1988లో జోసెఫ్ మరణాంతరం నాలుగు సంవత్సరాల తర్వాత 1992 డిసెంబర్ 22 ఐక్యరాజ్యసమితి పేదరిక నిర్మూలన కోసం ప్రపంచదేశాలన్ని ఏకతాటిపై కృషి చేయాలంటూ ఒక తీర్మానాన్ని తీసుకురావడమే కాక ఆమోదించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి పేదల కోసం ఆహర్నిసలు కృషి చేసిన జోసెఫ్ వ్రెసిన్స్కీని పేద ప్రజల తండ్రిగా కొనియాడుతూ ఆయన ఆవిష్కరించిన స్మారక శిల రోజునే అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవంగా ప్రకటించింది. ఈ ఏడాది థీమ్ "పేదరికాన్ని అంతం చేసేలా అందరూ కలిసి ముందుకు సాగాలి, ఈ భూమి పై నివశించే ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా జీవించాలి" మళ్లీ పేదరికంలోకి నెట్టిన కోవిడ్ -19 మహమ్మారి..... 2020 లో ప్రపంచాన్ని వణికించిన కరోనావైరస్ మహమ్మారి 88 నుండి 115 మిలియన్ల మంది ప్రజలను పేదరికంలోకి నెట్టిందని ప్రపంచ బ్యాంకు నివేదికలో పేర్కొంది. ఈ మేరకు పేదరికం రేటు ఇప్పటికే ఉన్న దక్షిణ ఆసియా, ఉప-సహారా దేశాలలో అధికంగా ఉన్నట్లు తెలిపింది. పైగా ఈ సంవత్సరం పేదరికం ప్రపంచ దేశాల్లో 143 మిలయన్ల నుంచి 163 మిలియన్లకు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఈ సందర్భంగా యుఎన్ చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ " ప్రస్తుతం ప్రపంచ దేశాలన్ని తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి పెద్ద విధ్వంసం సృష్టించింది. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: 9 గంటల్లో 51 పబ్‌లు చుట్టి.. ప్రతీ పబ్‌లోనూ డ్రింక్ తీసుకుని) -
మహాత్ముడి స్ఫూర్తితో కరోనాపై పోరు
ఐక్యరాజ్యసమితి: గాంధీజీ ఇచ్చిన శాంతి సందేశాన్ని ప్రపంచ సమాజం అందిపుచ్చుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకోవడం కాదు, మనందరి ఉమ్మడి శత్రువైన కరోనా మహమ్మారిపై మహాత్ముడి స్ఫూర్తితో కలిసికట్టుగా యుద్ధం సాగిద్దామని సూచించారు. కరోనాను ఓడించడమే మన లక్ష్యం కావాలని చెప్పారు. గాంధీజీ జయంతి రోజే అంతర్జాతీయ అహింసా దినం కావడం యాదృచ్ఛికం కాదని అన్నారు. ఆయన పాటించిన అహింసా, శాంతియుత నిరసనలు, గౌరవం, సమానత్వం అనేవి మాటలకు అతీతమైనవని తెలిపారు. మానవాళి భవిష్యత్తుకు అవి చోదక శక్తులని ఉద్ఘాటించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులకు ఇవి చక్కటి పరిష్కార మార్గాలని వివరించారు. ఈ మేరకు అంతర్జాతీయ అహింసా దినం సందర్భంగా గుటెరస్ శనివారం ఒక సందేశం విడుదల చేశారు. ఘర్షణలు, వాతావరణ మార్పులు, పేదరికం, అసమానతలు, అపనమ్మకం, ప్రజల మధ్య విభజనలు ప్రపంచానికి పెద్ద సమస్యగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
అంతర్జాతీయ శాంతి దినోత్సవం 2021: ఎక్కడ శాంతి? ఎన్నాళ్లకు విముక్తి?
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ దేశాల్లోని ప్రజలంతా శాంతియుత జీవనం గడపాలనే ఉద్దేశంతో ఏటా సెప్టెంబర్ 21న అంతర్జాతీయ శాంతి దినోత్సవం నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ 1981వ సంవత్సరంలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. అంతర్జాతీయంగా ఘర్షణలు తొలగిపోయి శాంతియుత సమాజం నిర్మాణమే లక్ష్యంగా శాంతి దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ మూడో మంగళవారం అంతర్జాతీయ శాంతి దినోత్సవం జరపాలని 1981లో ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ సమావేశంలో నిర్ణయించినా ఆ తరువాత 2001లో సెప్టెంబర్ 21 తేదీన నిర్వహించాలని ఐరాస నిర్ణయించింది. ఆ ఏడాది అంతర్జాతీయంగా అహింస, కాల్పుల విరమణ దినోత్సవంగా నిర్వహించింది. అది మొదలు ప్రతీ ఏడాది ఏదో ఒక థీమ్‌తో అంతర్జాతీయ శాంతి దినోత్సవం జరుపుకోవడం అనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో 2021 అంతర్జాతీయ శాంతి దినోత్సవం థీమ్: సమాన, సుస్థిరమైన ప్రపంచం కోసం వేగంగా కోలుకోవడం (Recovering Better for an Equitable and Sustainable World) ప్రస్తుతం, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో అహింస నెలకొంది. ముఖ్యంగా అఫ్గానిస్తాన్‌లో ఇటీవలి సంక్షోభంతో అక్కడి ప్రజలు, ముఖ్యంగా మహిళలు అనేక రకాల హింసను అనుభవిస్తున్నారు. ఈ దీర్ఘకాలిక హింస, అనిశ్చితి కారణంగా పౌరుల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు అలముకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ శాంతి స్థాపన అనేది కలగా మారుతోంది. హింసాత్మక, వినాశకర సంఘర్షణలను నివారించడమే కాకుండా దాన్ని పరిష్కరించడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి. మరోవైపు కరోనా మహమ్మారి ప్రపంచ పరిస్థితులను తల్లకిందులు చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది థీమ్‌ను వేగంగా కోలుకోవడం అనే అంశాన్ని ప్రధానంగా తీసుకోవడం గమనార్హం. కరోనా మహమ్మారి అంతమైపోవాలని ప్రతిన బూనుదాం. పూర్తి ఆరోగ్యమైన ప్రపంచాన్ని కలగందాం. అలాగే మనుషులందరూ మానవత్వమున్న పౌరులుగా మారాలని, మానవ విలువలకు పెద్ద పీట వేస్తూ, పొరుగువాడిని ప్రేమిస్తూ జీవించాలని కోరుకుందాం. శాంతియుత ప్రపంచాన్ని కోరుకుందాం. ‘శాంతి చిరునవ్వుతో మొదలవుతుంది’- మదర్ థెరిస్సా ‘‘న్యాయస్థానాల కంటే ఉన్నత న్యాయస్థానం మనస్సాక్షి. ఇది అన్ని ఇతర కోర్టులకంటే చాలా ఉన్నతమైంది" - మహాత్మా గాంధీ ఈ సంవత్సరం ప్రపంచ శాంతి సగటు స్థాయి 0.07 శాతం క్షీణించింది. గత పదమూడు సంవత్సరాలలో వరుసగా ఇది తొమ్మిదవ క్షీణత. ఈ విషయంలో 87 దేశాలు మెరుగుపడుతుంటే 73 దేశాలు రికార్డ్ స్థాయిలో క్షీణిస్తున్నాయి. ♦ ఐస్‌ల్యాండ్ ప్రపంచంలో అత్యంత ప్రశాంతమైన దేశం. ఈ విషయంలో 2008 నుండి తన ప్రత్యేకతను నిలుపుకుంటోంది. ♦ యూరప్ ప్రపంచంలో అత్యంత ప్రశాంతమైన ప్రాంతంగా ఉంది. ♦ న్యూజిలాండ్, డెన్మార్క్, పోర్చుగల్, స్లోవేనియా 3, 4, 5 స్థానాల్లో ఉన్నాయి. ♦ అఫ్గానిస్తాన్ వరుసగా నాలుగో సంవత్సరం ప్రపంచంలోనే అతిపెద్దఅశాంతి దేశంగా నిలుస్తోంది. ♦ ప్రపంచం అత్యంత శాంతియుతంలో దేశాల ర్యాంకులో భారత్ 135 స్థానంలో ఉంది. ♦ దక్షిణ ఆసియాలో అత్యంత ప్రశాంతమైన దేశం భూటాన్. -
International Day for Biological Diversity: జీవవైవిధ్య దినోత్సవం
సిరికొండ: సూక్ష్మజీవుల నంచి క్రిమికీటకాల వరకు వృక్షాల నుంచి జంతు జలచరాల వరకు ప్రకృతిలోని ప్రాణులన్ని పరస్పర జీవనం గడపడమే జీవవైవిధ్యం. ప్రకృతి వనరులను కొల్లగొడుతూ మానవుడు తన ఉనికిని ప్రశ్నార్థకం చేసుకుంటున్నాడు. సంరక్షణ మాట మరిచి ఇష్టానుసారంగా చెట్లను నరికి వేయడం, విరివిగా రసాయనాల వాడకం, ప్లాస్టిక్ వ్యర్థాలు ఇతరత్రా కాలుష్యాలకు కారణమవుతు జీవవైవిధ్య సమతుల్యతను దెబ్బతీస్తున్నాడు. నేడు ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవం సందర్బంగా ప్రత్యేక కథనం. పర్యావరణ పరిరక్షణలో ఆహార గొలుసు చెడిపోకుండా 2002లో జీవవైవిధ్య చట్టం అమలులోకి వచ్చింది. దశాబ్దం తర్వాత 2014లో రాష్ట్ర జీవవైవిధ్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఆ బోర్డు ఆరంభశూరత్వంలా మారింది. గ్రామ, మండల జీవవైవిధ్య కమిటీల ఏర్పాటు సాగుతూనే ఉండటం, జిల్లాల్లో తగినంత సిబ్బందిని నియమించకపోవడం, కమిటీలు ఏర్పాటైన సభ్యులకు సరైన శిక్షణ లేకపోవడం, నిధుల ఖర్చుపై ఆడిట్ లేకపోవడం సమస్యలుగా మారాయి. పేరుకు కమిటీలు.. ఉమ్మడి జిల్లాలో జీవవైవిధ్య అమలు కోసం ఇద్దరు సమన్వయకర్తలు ఉండాలి. ఒక్కరే ఉన్నారు. ఉమ్మ డి జిల్లాలో 51 మండలాలకు నాలుగు మండలాల్లో 1056 గ్రామ పంచాయతీలకు 219 గ్రామాలలో మాత్రమే కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకు పథకం అమలు, జీవవైవిధ్య సంరక్షణపై తగిన శిక్షణ ఇవ్వాలి. వారసత్వ సంపదలైన వృక్షా లు, జంతువులు, పవిత్రవనాలు, జలాశయాలు, వారసత్వ కట్టడాలు, ఔషధ మొక్కలు మొదలైన వాటిపై అవగాహన కలి్పంచాలి. కానీ గడిచిన ఏడెండ్లలో జిల్లా స్థాయి, మండల, గ్రామ స్థాయిలో తగిన శిక్షణ లేక కమిటీల పనితీరు నామమాత్రంగా మారింది. ప్రతి జిల్లాలో జీవవైవిధ్య కమిటీలకు రెండు దశల్లో నిధులు ఇవ్వాలని రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు నిర్ణయించింది. అందులో భాగంగా గ్రామ జీవవైవిధ్య కమిటీకి రూ.1.50 లక్షలు, మండల కమిటీకి రూ.1.50 లక్షలు, జిల్లా కమిటీకి రూ.2.30 లక్షలు ఇవ్వాలి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో 24 గ్రామ పంచాయతీలకు రూ. 8.80 లక్షలు విడుదల అయ్యాయి. వీటిలో కార్యాలయ ఏర్పాటు అవసరమైన రికార్డులు ఫరీ్నచర్ కొనుగోలు క్షేత్ర స్థాయి పరిశోధనలకు కేటాయించాలి. కానీ చాలా గ్రామ పంచాయతీల్లో వీటి ఏర్పాటు లేకుండానే నిధులు స్వాహ అయ్యాయి. సరైన ఆడిట్ లేనందువల్ల గత సర్పంచుల హయాంలో నిధులకు లెక్కలేకుండా పోయాయి. మిగతా నిధులు విడుదల చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేయలేదు. దెబ్బతింటున్న జీవవైవిధ్యం ప్రకృతిలో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. దీంతో హనికరమైన వైరస్లు విజృంభిస్తున్నాయి. గడిచిన వందేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 20 వేల జాతుల జీవులు వైరస్‌లతో అంతరించిపోయాయి. మానవుల తప్పిదాలతో 75 శాతం మేర జన్యుజీవవైవిధ్య పంటలు కనుమరుగయ్యాయి. 24 శాతం క్షీరదాలు, 12 శాతం పక్షి జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. -
ఆటకు సై
ఒలింపిక్స్‌కు దగ్గూ జ్వరం. ఐపీఎల్‌కు ఒళ్లునొప్పులు. అండర్–17 మహిళల కప్‌కు గొంతునొప్పి. కోట్ల మంది క్రీడాభిమానులకు ఐసొలేషన్. ‘మీ ఆటలు సాగవు..’ అంటోంది కరోనా. ‘నీ ఆటల్నే కట్టిపెట్టు’ అంటున్నారు క్రీడాకారిణులు. ఓడించేందుకు అటువైపు ఎత్తుగడలు. గెలిచి తీరేందుకు ఇటువైపు సర్వశక్తులు. వైరస్‌పై యుద్ధానికి బరి ఉండకపోవచ్చు. స్పోర్ట్స్ ఉమెన్ ఇచ్చే విరాళాల పోరాట స్ఫూర్తికి తిరుగుంటుందా! ఈషాసింగ్ ముప్పై వేలు గన్‌లో బులెట్ మాత్రమే ఉంటుంది. ఆ బులెట్ వెళ్లి టార్గెట్‌కు తగిలేలా గురి చూసి ట్రిగ్గర్ నొక్కడం మాత్రం షూటర్ చేతిలో ఉంటుంది. ఈషా సింగ్ షూటర్. వయసు పదిహేను. పి.ఎం. రిలీఫ్ ఫండ్‌కి 30 వేల విరాళం ఇచ్చింది. ‘నా సేవింగ్స్ నుంచి ఇస్తున్నాను’ అని ట్వీట్ చేసింది. కరోనా సంహారానికి విరాళం ఇవ్వడం ద్వారా తన గన్ ట్రిగ్గర్ నొక్కిన అతి చిన్న వయసు క్రీడాకారిణి ఈషా.. హైదరాబాద్‌లోని బోల్టన్ స్కూల్ విద్యార్థిని. వయసెంత అని కాదు, దాచుకున్న మొత్తం ఇచ్చేయడం భారీ విరాళం కాదంటారా?! హిమాదాస్.. నెల జీతం హిమాదాస్ (20) స్ప్రింటర్. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన 49 మంది ‘టాప్ స్పోర్ట్స్పర్సన్స్’లో హిమ ఒకరు. కరోనాను పరుగెత్తించేందుకు ఆమె కూడా తను ఇవ్వగలినంత ఇచ్చారు. తన ఒక నెల జీతాన్ని అస్సాం ప్రభుత్వానికి ఇచ్చారు. గౌహతిలోని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్లో హెచ్.ఆర్.ఆఫీసర్‌గా ఉన్నారు హిమ. సింధు ఐదు ప్లస్ ఐదు తెలుగు రాష్ట్రాల క్రీడాజ్యోతి పి.వి.సింధు (20) ఏపీ, తెలంగాణ సీఎంల రిలీఫ్ ఫండ్‌కు పది లక్షల రూపాయలు ఇచ్చారు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన ఈ బాడ్మింటన్ చాంపియన్.. కరోనాపై పోరులోనూ చాంపియనేనని తన విరాళం ద్వారా నిరూపించుకున్నారు. ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడటంతో ఆమె అభిమానులు నిరుత్సాహపడినప్పటికీ ఆమె మాత్రం... ‘‘ముందు జీవితం. తర్వాతే ఈవెంట్స్’’ అన్నారు. మిథాలీ పది లక్షలు రైట్ హ్యాండ్ బాట్స్ఉమన్, వన్డే ఇంటర్నేషనల్ టీమ్ కెప్టెన్ మిథాలీరాజ్ (37) కరోనాకు ముక్కు పగిలే షాటే ఇచ్చారు. ప్రధాని ఫండ్‌కి 5 లక్షలు, తెలంగాణ సీఎం ఫండ్‌కి 5 లక్షలు. ‘కొద్దిగా మాత్రమే ఇవ్వగలుగుతున్నాను’ అని ట్వీట్ కూడా చేశారు మిథాలి. పదిలో, ఐదులో లేదు విలువ. ‘ఇవ్వడం’లో ఉంది. భారత మహిళా క్రికెట్ జట్టులోని ఈ సీనియర్ హ్యాండ్.. ఆటలో తనకెదురైన సమస్యల్ని గుండె నిబ్బరంతో డీల్ చేశారు. కరోనాను తరిమికొట్టేందుకు ప్రభుత్వాలకైనా, ప్రజలకైనా కావలసింది అలాంటి నిబ్బరమే. దీప్తి శర్మ లక్షన్నర బ్యాటింగ్‌లో లెఫ్ట్ హ్యాండ్, బౌలింగ్‌లో రైట్–ఆర్మ్ ఆఫ్ బ్రేక్ ప్రావీణ్యాలు గల టీ20 వరల్డ్ కప్ టీమ్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ (22) కరోనాకు లెఫ్ట్ అండ్ రైట్ వాయించడానికి తన వైపు నుంచి వెస్ట్‌బెంగాల్ స్టేట్ ఎమర్జెన్సీ ఫండ్‌కి 50 వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. అది కాకుండా, పి.ఎం. రిలీఫ్ ఫండ్‌కి, యు.పి. రిలీఫ్ ఫండ్‌కి కలిపి లక్ష రూపాయలు ఇచ్చారు. దీప్తి ఆగ్రాలో పుట్టారు. తండ్రి రైల్వేస్‌లో చేశారు. అలా ఆమెకు యు.పి.తోనూ, పశ్చిమ బెంగాల్తోనూ అనుబంధం ఉంది. ప్రియాంక పది వేలు ప్రస్తుతం బెంగాల్ జట్టుకు యు–19 కోచ్‌గా ఉన్న భారత జట్టు మాజీ క్రికెట్ ప్లేయర్ ప్రియాంక రాయ్ (32) బెంగాల్ కరోనా రిలీఫ్ ఫండ్‌కి పది వేల రూపాయలు ఇచ్చారు. బ్యాటింగ్‌లో రైట్ హ్యాండ్, బౌలింగ్‌లో లెగ్ బ్రేక్, కోచింగ్‌లో.. ‘హెడ్స్ అండ్ షోల్డర్స్, నీస్ అండ్ టోస్’లా ఉండే ప్రియాంక.. విరాళం మాత్రమే ఇచ్చి ఊరుకోలేదు. లాక్డౌన్లో ప్రజలెవ్వరూ ఇళ్లలోంచి రాకుండా మోటివేట్ కూడా చేస్తున్నారు. పూనమ్ రెండు లక్షలు ఇటీవలి ఉమెన్ టి20 వరల్డ్ కప్‌లో దుమ్ము రేపిన స్పిన్నర్ పూనమ్ యాదవ్ (28) కరోనా కొమ్ములు వంచడం కోసం పి.ఎం.–కేర్స్ ఫండ్‌కి, యు.పి. సీఎం ఫండ్‌కి కలిపి 2 లక్షల రూపాయలను ఇచ్చారు. కెరీర్ ఆరంభంలో ఎదురైన తట్టుకోలేని పరిస్థితులకు నిరుత్సాపడి క్రికెట్‌ను వదిలేసినప్పుడు తండ్రే ఆమెలో ఫైటింగ్ స్పిరిట్ నింపి, మళ్లీ క్రికెట్లోకి పంపించారు. ఆర్మీ ఆఫీసర్ ఆయన. పూనం జీవితంలోంచి ఇప్పుడు మనం తీసుకోవలసింది ఇదే. కరోనాపై ఆర్మీ స్పిరిట్‌తో పోరాడాలని. మేరీ కోమ్ కోటీ లక్ష కరోనాకు ఇవ్వవలసిన పంచ్‌నే ఇచ్చారు బాక్సర్ మేరీ కోమ్ (37). రాజ్యసభ సభ్యురాలు కూడా అయిన కోమ్ ఎంపీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ నుంచి కోటి రూపాయలను కరోనాపై పోరుకు విడుదల చేశారు. రాజ్యసభ సభ్యురాలిగా తన ఒక నెల జీతాన్ని పి.ఎం. నేషనల్ రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చేశారు. రీచా.. మనూ.. అపూర్వీ ఉమెన్ టి20 వరల్డ్ కప్‌లో భారత జట్టు ఆల్ రౌండర్ పదహారేళ్ల రీచా ఘోష్ లక్ష, ఎయిర్ గన్ షూటింగ్ ఒలింపియన్ మనూ భాకర్ (18) లక్ష, షూటర్ అపూర్వీ చండేలా (27) 5 లక్షలు.. విరాళంగా అందించారు. టెన్నిస్ తార సానియా మీర్జా (33) ప్రతిరోజూ దినసరి కార్మికులకు ఆహార దినుసులు పంపిణీ చేస్తున్నారు. ఎవరు ఎంత ఇచ్చారని కాదు. క్రీడారంగంలోనైనా, మరే రంగంలోనైనా విరాళంగా మహిళలు ఇచ్చే ప్రతి రూపాయి కూడా అమూల్యమైనదే. క్రీడల్లో ఆ విరాళం మరింత విలువైనది. ఈవెంట్లలో పురుషులకు వచ్చినంత రెమ్యునరేషన్ మహిళలకు రాదు. అయినా వారు తాము ఇవ్వగలిగినంత ఇస్తున్నారంటే.. ఇచ్చే ఆ మనసును చూడాలి. ఏప్రిల్ 6 సరిగ్గా ఈరోజునే నూట ఇరవై నాలుగేళ్ల క్రితం 1896 ఏప్రిల్‌లో గ్రీసు రాజధాని ఏథెన్స్లోని పనాథినైకో స్టేడియంలో తొలి ఒలింపిక్ క్రీడల ప్రారంభ వేడుకలు జరిగాయి. ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 15 వరకు జరిగిన ఆ ఒలింపిక్స్‌లో 14 దేశాలు పోటీపడ్డాయి. 241 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వారిలో మహిళలు లేరు. ఆ తర్వాతి (1900) ఒలింపిక్స్ నుంచి మహిళల ప్రవేశం మొదలైంది. తొలి ఒలింపిక్స్ మొదలైన ఏప్రిల్ 6ను 2014 నుంచి ఐక్యరాజ్య సమితి ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్’గా గుర్తిస్తోంది. -
చిట్టితల్లిపై చిన్నచూపు
ఆడపిల్ల, అబల, వంటింటి కుందేలు.. లాంటి ఎన్నో అవమానాల పరిధులు దాటి అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటూ మహిళలు రాణిస్తున్నారు. సమాజంలో తమకంటూ ఓ ప్రత్యేకత కోసం నిరంతరం మగవారితో పోటీ పడుతున్నారు. నింగి, నేలా మాదేనంటూ దూసుకెళ్తున్నారు. సత్తా చాటుతున్నారు.. ఒక రకంగా మగపిల్లల కంటే ఆడపిల్లలే నయమనిపించే పరిస్థితులు, ఘటనలు సమాజంలో కనిపిస్తూనే ఉన్నాయి. అయినా కూడా ఇంకా సమాజంలో ఆడపిల్లంటే చిన్న చూపే ఉంది. వారిపై ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆడపిల్ల వద్దు.. మగపిల్లాడే ముద్దు అని చాలామంది భావిస్తున్నారు. మగవారి నిష్పత్తితో పోలిస్తే ఆడపిల్లల నిష్పత్తి తగ్గుతున్నా.. సృష్టికి విరుద్ధంగా వ్యవహరిస్తూ భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నారు. బాలురతో పోలిస్తే బాలికల నిష్పత్తి తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. కామారెడ్డి క్రైం: మగబిడ్డపై మమకారం చూపే తల్లిదండ్రులు.. ఆడపిల్లను వద్దనుకుంటున్నారు. కడుపులో పెరుగుతున్నది ఆడపిండం అని తెలిస్తే చాలు కడుపులోనే తుంచేస్తున్నారు. జిల్లాలో జనాభా గణాంకాలను పరిశీలిస్తే భవిష్యత్తు ప్రమాదకరమనే హెచ్చరికలు కనిపిస్తాయి. జిల్లా జనాభాలో పురుషుల జనాభా కన్నా మహిళలే ఎక్కువగా ఉన్నారు. పురుష, స్త్రీ నిష్పత్తి 1000 ః 1003గా ఉంది. కానీ బాలబాలికల విషయానికి వచ్చేసరికి బాలికల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆరేళ్లలోపు పిల్లల జనాభాను పరిశీలిస్తే.. మగ పిల్లలు 57,528 మంది ఉంటే, ఆడపిల్లలు 54,138 మందే ఉన్నారు. మగపిల్లలకన్నా ఆడపిల్లలు 3,390 మంది తక్కువగా ఉన్నారు. బాలబాలికల నిష్పత్తి 1000 @ 941గా ఉంది. వారసుడి కోసం.. సమాజంలో మగబిడ్డే వారసుడన్న భావన ఉంది. ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తారింటికి వెళ్తుంది. అదే మగపిల్లవాడు అయితే వంశాన్ని నిలబెడతాడని, అత్తారింటికి వెళ్లే ఆడపిల్ల వారసురాలు కాదన్న ఉద్దేశం చాలామందిలో బలంగా నాటుకుపోయింది. కొడుకు అయితే తమ బాధ్యతను మోస్తాడనే భావన ఉండడం కూడా ఓ కారణం. దీంతో తొలి కాన్పులో ఆడపిల్ల పుడితే సంతోషిస్తున్నవారూ.. రెండో కాన్పు విషయానికి వచ్చేసరికి గర్భనిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం కడుపులో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలిస్తే చాలు అబార్షన్ చేయించుకుంటున్నారు. పుట్టేది ఆడో మగ శిశువో చెప్పడం చట్టరీత్యా నేరమైనా.. పలు స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు డబ్బుపై వ్యామోహంతో నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. దీంతో పుట్టేది ఆడ అని తెలియగానే పలువురు అబార్షన్ చేయించుకుంటుండడంతో జిల్లాలో బాలికల జనాభా నిష్పత్తి పడిపోతోంది. అనర్థాలే... జనాభా పెరుగుదలలో స్త్రీ, పురుష జనాభాలో వ్యత్యాసం ఎక్కువైతే అనర్థాలు తలెత్తే అవకాశాలుంటాయి. ఇప్పటికే చాలా మంది పెళ్లీడుకొచ్చిన అబ్బాయిలకు అమ్మాయిలు దొరక్క ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భవిష్యత్తులో ఈ పరిస్థితి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఆడపిల్లలపై వివక్షకు అంతం పలకాల్సిన అవసరం ఉంది. వ్యత్యాసం పోవాలి.. బాలురు, బాలికల అనే వ్యత్యాసం పోవాలి. అమ్మాయిలను కూడా అబ్బాయిలతో సమానంగా చూడాలి. అమ్మాయిలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. వారికి సరైన ప్రోత్సాహం అందించాలి. విద్యాపరంగా మగపిల్లలకు చదివించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి వ్యత్యాసాలు మంచివి కావు. చదువులో అబ్బాయిల కంటే అమ్మాయిలే రాణిస్తారు. – అనిత, అంగన్వాడీ టీచర్, కామారెడ్డి చిన్నచూపు వద్దు.. ఆడపిల్లలు ఆది పరాశక్తులు. వారిని చిన్నచూపు చూడొద్దు. మగపిల్లలతో సమానంగా చూడాలి. ఆడపిల్లలు దేంట్లోను తీసిపోరు. ఇందిరాగాంధీని మొదలుకుని రాజకీయాల్లో ఐఏఎస్, ఐపీఎస్, పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. ఆడపిల్లలను చదివిస్తే వారి సత్తా ఏంటో చాటుతారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేటీ పడావో, బేటీ బచావో నినాదాన్ని నిజం చేయాలి. – సీహెచ్.లక్ష్మి, హెచ్ఎం, ప్రాథమిక పాఠశాల, చిన్నమల్లారెడ్డి ఇంటికి మహాలక్ష్మి ఆడపిల్లే... అందరూ మగపిల్లలను కావాలని కోరుకుంటారు. కానీ ఇంటికి ఆడపిల్లే మహాలక్ష్మి. అన్ని రంగాల్లోనూ మగవారితో సమానం గా రాణిస్తున్నారు. ఉన్నతస్థానాల్లో నిలుస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల ఆడపిల్లల పట్ల వివక్ష కనిపిస్తుంది. జనాభా విషయంలో ఆడపిల్లల నిష్పత్తి తగ్గడం మంచిది కాదు. ఆడపిల్లల విషయంలో చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. ఆడపిల్లలను కాపాడుకోవడం అందరి బాధ్యత. – విజయ, గృహిణి, కామారెడ్డి -
పిల్లలు చెప్పలేరు పెద్దలే తెలుసుకోవాలి
ఎవరినైనా చూసి మన పాప/బాబు హడలిపోతుంటే... దానికి కారణం చిన్నపిల్లల్లో సహజంగా ఉండే బెరుకు కావచ్చు అనుకుంటాం మనం. అంతేతప్ప, అది అసహజమైన భయం కావచ్చునన్న ఆలోచనే రాదు. ‘‘ఇక్కడే చాలామంది తల్లులు తప్పు చేస్తున్నారు’’ అంటోంది హైదరాబాద్‌లోని ‘బ్రేక్ ద సెలైన్‌స’ సంస్థ. శిశుహింస (చైల్డ్ అబ్యూజ్) అనేక విధాలుగా ఉంటుంది. పిల్లల్ని కొట్టడం, తిట్టడం, లైంగికంగా వేధించడం, ఏ పని చేసినా విమర్శించడం, కఠినమైన శిక్షలు విధించడం, ఆఖరికి ప్రేమ చూపకపోవడం కూడా శిశుహింసే. వీటిల్లో అతి ప్రధానమైన లైంగిక హింసను నివారించేందుకు ‘బ్రేక్ ద సెలైన్స్’ సంస్థ కృషి చేస్తోంది. లైంగిక హింసకు బలవుతున్న చిన్నారులను కాపాడటానికి, ఈ హింస గురించి తల్లిదండ్రులకు, చిన్నారులకు అవగాహన కలిగించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్న సంస్థ ఇది. సంస్థ అంచనా ప్రకారం చిన్నపిల్లల పట్ల వేధింపులు రోజురోజుకీ పెరిగిపోవడానికి కారణాలు ముఖ్యంగా రెండు. పిల్లలు నోరు తెరచి తమ పట్ల జరుగుతోన్న హింసను చెప్పలేకపోవడం, పిల్లల విషయంలో ఏం జరుగుతుందో పేరెంట్స్ గుర్తించలేకపోవడం. ఈ పరిస్థితి మారాలంటే... తమ పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో ముందు తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలి, తర్వాత పిల్లలను అప్రమత్తం చేయాలి. మీ ఇంటికి తరచుగా వచ్చేవారు, బడిలో టీచర్లు తదితరులు మీ పిల్లలతో ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించండి. వాళ్ల ప్రవర్తనలో తేడా కనిపిస్తే వెంటనే జాగ్రత్తపడండి. అనుచితంగా ఉంటే వారించండి. ఎలాంటి మనుషులు ఉంటారు, వారు ఎన్ని రకాలుగా ప్రవర్తిస్తారు, లోబర్చుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు... వంటివి పిల్లలకు అర్థమయ్యే విధంగా వివరించండి. చిన్నపిల్లలు కదా అని చెప్పడానికి మీరు సంకోచిస్తే... రేపు జరగరానిది జరగవచ్చు. పిల్లలు కనుక తమ పట్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తున్నారని చెబితే తేలిగ్గా తీసి పారేయకండి. ‘నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా’ అంటూ కోప్పడకండి. అలా చేస్తే వాళ్లు ఇంకెప్పుడూ ఏమీ చెప్పరు. దానివల్ల మనం పెద్ద మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. ఎప్పుడూ అల్లరిచేసే పిల్లలు మౌనంగా ఉండిపోయినా, భయం భయంగానో దిగులుగానో ఉంటున్నా విషయమేంటో ఆరా తీయండి. తగని చోట టచ్ చేస్తున్నా, మీరు లేనప్పుడు తనని దగ్గరకు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నా, ఫొటోలూ వీడియోలూ తీయాలని ప్రయత్నిస్తున్నా... వెంటనే మీకు చెప్పమని మీ చిన్నారికి బోధించండి. వీలైనంత వరకూ పిల్లలను పరాయివాళ్ల ఇళ్లలో వదిలిపెట్టడం, పరాయి వాళ్లతో బయటకు పంపడం చేయకండి. పిల్లలు ఎక్కువగా గడిపేది తల్లితోనే. కాబట్టి వారిని అనుక్షణం తల్లే కంటికి రెప్పలా చూసుకోవాలి. తమకు ఏం జరుగుతోందో, దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియని పసివాళ్లు వాళ్లు. కాబట్టి ప్రమాదం ఎటునుంచి వస్తుందో, ఎలా వస్తుందో వాళ్లకి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత తల్లిదే.