అత్యాధునిక టెక్నాలజీతో అంతరిక్షయానం చేసి జయహో నరుడా అనిపించుకున్నప్పటికీ ఈ పేదరికం నుంచి బయటపడలేకపోవడవ బాధకకరం. కారణాలు ఏవైనా ప్రపంచ దేశాల్లో ఇంకా ఇప్పటికీ పేదరికంలో మగ్గిపోతున్న వాళ్లు ఎందెందరో అభాగ్యులు ఉన్నారు. ఎన్నో పోరాటాలు చేసే కావలిసినవి సాధించుకున్నాం గానీ. ఇప్పటికీ పేదవాడు ఎప్పుడు ఆకలి పోరాటం చేస్తునే ఉన్నాడు.
(చదవండి: బలశాలి బామ్మ)
అయితే ప్రభుత్వాధి నేతలు, దేశాధి నేతలు ఎన్ని పథకాలను తీసుకువచ్చిన పేదవాడికి చేరకపోవడమే మింగుడుపడిన విషయంగా మిగిలిపోతుంది. ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి పేదరిక నిర్మూలనకై తీసుకోవల్సిన చర్యల పై ప్రపంచ దేశాలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే ప్రతి ఏడాది అక్టోబర్ 17న అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం నిర్వహిస్తోంది.
నేపథ్యం
ఫ్రెంచ్ మతాధికారి, మానవతవాది అయిన జోసెఫ్ వ్రెసిన్స్కీ పేదరికంతో బాధితులను పట్ల వివక్షకు తావు లేకుండా వారిని గౌరవప్రదంగా చూడాలంటూ ఎన్నో పోరాటాలు చేశారు. అంతేకాదు పారిస్‌లోని ట్రోకాడోరోలో లక్షలాది మంది తన మద్దతుదారులతో కలిసి పేదరికంలో మగ్గిపోతున్న వాళ్ల సమస్యల దేశాధినేతలకు అర్ధమయ్యేలా ఒక ఉద్యమాన్ని తీసుకురావడమే కాక అక్టోబర్ 17, 1987న పారిస్ ప్లాజా ఆఫ్ లిబర్టీ మానవ హక్కుల స్మారక శిలను ఆవిష్కరించారు. పైగా ఆ శిలపై మహిళలు, పురుషులు పేదరికంలో ఉన్నారంటే మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలి అనే వాక్యాలను చెక్కించారు.
ఈ క్రమంలో 1988లో జోసెఫ్ మరణాంతరం నాలుగు సంవత్సరాల తర్వాత 1992 డిసెంబర్ 22 ఐక్యరాజ్యసమితి పేదరిక నిర్మూలన కోసం ప్రపంచదేశాలన్ని ఏకతాటిపై కృషి చేయాలంటూ ఒక తీర్మానాన్ని తీసుకురావడమే కాక ఆమోదించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి పేదల కోసం ఆహర్నిసలు కృషి చేసిన జోసెఫ్ వ్రెసిన్స్కీని పేద ప్రజల తండ్రిగా కొనియాడుతూ ఆయన ఆవిష్కరించిన స్మారక శిల రోజునే అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవంగా ప్రకటించింది.
ఈ ఏడాది థీమ్
"పేదరికాన్ని అంతం చేసేలా అందరూ కలిసి ముందుకు సాగాలి, ఈ భూమి పై నివశించే ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా జీవించాలి"
మళ్లీ పేదరికంలోకి నెట్టిన కోవిడ్ -19 మహమ్మారి.....
2020 లో ప్రపంచాన్ని వణికించిన కరోనావైరస్ మహమ్మారి 88 నుండి 115 మిలియన్ల మంది ప్రజలను పేదరికంలోకి నెట్టిందని ప్రపంచ బ్యాంకు నివేదికలో పేర్కొంది. ఈ మేరకు పేదరికం రేటు ఇప్పటికే ఉన్న దక్షిణ ఆసియా, ఉప-సహారా దేశాలలో అధికంగా ఉన్నట్లు తెలిపింది. పైగా ఈ సంవత్సరం పేదరికం ప్రపంచ దేశాల్లో 143 మిలయన్ల నుంచి 163 మిలియన్లకు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఈ సందర్భంగా యుఎన్ చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ " ప్రస్తుతం ప్రపంచ దేశాలన్ని తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి పెద్ద విధ్వంసం సృష్టించింది. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
(చదవండి: 9 గంటల్లో 51 పబ్‌లు చుట్టి.. ప్రతీ పబ్‌లోనూ డ్రింక్ తీసుకుని)
Comments
Please login to add a commentAdd a comment