United Nation Organizations
-
UNO: పాలస్తీనాకు భారత్ మద్దతు.. ఇజ్రాయెల్ ఏం చేసిందంటే?
ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు సభ్యత్వం కోరుతూ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానం సందర్భంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పాలస్తీనాకు భారత్ మద్దతు పలికింది. ఇక, ఇజ్రాయెల్ రాయబారి గిలాడ్ ఎర్డాన్ మాత్రం పాలస్తీనాకు అదనపు హక్కులు ఇవ్వడాన్ని నిరసిస్తూ చార్టర్ కాపీని చించేశారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.కాగా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పాలస్తీనాకు భారత్ మద్దతుగా నిలిచింది. ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు సభ్యత్వం కోరుతూ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసింది. అంతేకాకుండా పాలస్తీనా సభ్యత్వంపై భద్రతామండలి సానుకూలంగా వ్యవహరించాలని కూడా ఈ తీర్మానంలో పేర్కొన్నారు.ఇక, శుక్రవారం ముసాయిదా తీర్మానం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ముందుకు వచ్చింది. ఐక్యరాజ్య సమితి చార్టర్‌లోని ఆర్టికల్ 4 ప్రకారం, పాలస్తీనాను సభ్యదేశంగా చేర్చుకోవాలని తీర్మానంలో ప్రతిపాదించారు. ఈ తీర్మానానికి భారత్ సహా 143 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. తొమ్మిది దేశాలు వ్యతిరేకించగా మరో 25 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయాయి. దీంతో, ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వానికి పాలస్తీనాకు అన్ని అర్హతలు ఉన్నట్టు ఈ తీర్మానం తేల్చింది. NEW: Israeli Ambassador to the UN Gilad Erdan shreds the UN charter with a mini shredder as the UN General Assembly supported a Palestinian bid to become a UN member.Palestine does *not* have full UN membership, but they are now simply qualified to join.The assembly adopted… pic.twitter.com/Fo1fty1RvW— Collin Rugg (@CollinRugg) May 10, 2024 ఇదిలా ఉండగా.. ఈ తీర్మానంతో పాలస్తీనాకు పూర్తిస్థాయి సభ్యత్వం లభించదు. సభ్యత్వానికి అర్హత సాధించినట్లు గుర్తింపు మాత్రమే లభిస్తుంది. ఈ తీర్మానాన్ని సర్వప్రతినిధి సభ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి పంపుతుంది. అక్కడ తీర్మానం ఆమోదం పొందాల్సి ఉంటుంది. తమకు పూర్తిస్థాయి సభ్యత్వం కావాలంటూ ఏప్రిల్‌లో కూడా ఐరాస భద్రతా మండలిని పాలస్తీనా అథారిటీ కోరింది. అయితే, ఈ తీర్మానానికి 12 సభ్యదేశాలు ఆమోదం తెలిపినా.. అమెరికా వీటో చేసింది. కాగా, ప్రస్తుతం మాత్రం ఈ సెప్టెంబర్ నుంచి మొదలయ్యే 79వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాలస్తీనా పాల్గొనవచ్చు. ఈ మేరకు పాలస్తీనాకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ తీర్మానం ఆమోదించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పాలస్తీనాను ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశంగా చేయాలని భద్రతా మండలిని అభ్యర్థించారు. అఖండ మెజారిటీతో తీర్మానం ఆమోదం పొందడంతో ఈ సమావేశంలో అందరూ ఆనందం వ్యక్తం చేశారు. -
సంపన్న రాజ్యాల కపటత్వం
‘పర్యావరణ పరిరక్షణ విషయంలో నిర్లిప్తంగా ఉండటం ద్వారా మానవాళి నరకానికి ద్వారాలు తెరుస్తోంది సుమా...’ అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ హెచ్చరించిన మర్నాడే 2015 ప్యారిస్ వాతావరణ శిఖరాగ్ర సదస్సుకు పూచీపడిన లక్ష్యాలను నీరుగారుస్తూ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నిర్ణయాలు తీసుకున్నారు. సహజంగానే పర్యావరణ ఉద్యమకారులను ఈ ప్రకటన దిగ్భ్రాంతిపరిచింది. గతంలో డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక గత ప్రభుత్వ నిర్ణయాలను తాము ఆమోదించబోమని ప్యారిస్ ఒడంబడిక నుంచి వైదొలగారు. తిరిగి జో బైడెన్ వచ్చాకే అమెరికా పాత విధానానికి మళ్లింది. సునాక్ అంత మాట అనకపోయినా ఆయన తాజా చర్యలు మాత్రం అలానే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ కార్ల విక్రయాన్ని 2030 నుంచి నిలిపేస్తామని ప్యారిస్ శిఖరాగ్ర సదస్సులో బ్రిటన్ వాగ్దానం చేయగా, దీన్ని ఆయన మరో అయిదేళ్లు పొడిగించారు. అలాగే 2035 నాటికి కొత్త గ్యాస్ బాయిలర్ల ఏర్పాటును ఆపేస్తామన్న వాగ్దానాన్ని కూడా పక్కన బెట్టారు. 2050 నాటికల్లా కర్బన ఉద్గారాలను సంపూర్ణంగా తొలగించటమే లక్ష్యమని చెబుతూనే ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలను వాయిదా వేయటం సంపన్న రాజ్యాల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. హరిత లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకుంటే ఉపాధి దెబ్బతింటుందని, జనాగ్రహం వెల్లువెత్తుతుందని ఆయన చెబుతున్న మాటలు కేవలం సాకు మాత్రమే. కర్బన ఉద్గారాలకు కారణమయ్యే పరిశ్రమలు మూతబడినా, హరిత ఇంధనంతో పనిచేసే పరిశ్రమల్లో ఉపాధి లభిస్తుంది. భిన్నరూపాల్లో సబ్సిడీలు, ఆర్థిక సాయం అందిస్తే ప్రజలకు అంత కష్టం అనిపించదు. అందుకు భిన్నంగా ఆ లక్ష్యాల నుంచే తప్పుకోవటం అన్యాయం. వచ్చే ఎన్నికల్లో మధ్యతరగతి మద్దతు కోసం వారికి నొప్పి కలిగించే నిర్ణయాలు తీసుకోరాదని సునాక్ భావిస్తున్నారు. ఇందుకు పర్యావరణం బలయ్యే ప్రమాదం ఉన్నా ఆయనకు పట్టడం లేదు. అసలు సంపన్న రాజ్యాల తీరుతెన్నులను ఐక్యరాజ్యసమితి సదస్సే పట్టిచూపింది. ఆ సదస్సుకు 34 దేశాల ప్రతినిధులు హాజరుకావాల్సివుండగా ప్రధాన కాలుష్యకారక దేశాలైన అమెరికా, చైనా లతో సహా ఎవరూ రాలేదు. నిజానికి బ్రిటన్ ప్రధాని హోదాలో పాల్గొనే అవకాశం తొలిసారి వచ్చినందున రిషి సునాక్ తప్పక హాజరవుతారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన గైర్హాజరు కావటమే కాదు... పర్యావరణానికి ముప్పు తెచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సదస్సులో పాల్గొనే ప్రతినిధులు లక్ష్యసాధన దిశగా తీసుకున్న చర్యలేమిటో, వైఫల్యాలుంటే కారణాలేమిటో చెప్పాలని సమితి అన్ని దేశాలనూ కోరింది. సరైన చర్యలు తీసుకుంటున్న దేశాలు ఇతర దేశాలకు స్ఫూర్తిదాయ కంగా నిలుస్తాయన్నది ఐక్యరాజ్యసమితి ఉద్దేశం. కానీ హోంవర్క్ చేయని పిల్లలు ఆ మర్నాడు బడి ఎగ్గొట్టినట్టు పర్యావరణ హిత నిర్ణయాల అమలులో అలసత్వం ప్రదర్శిస్తున్న దేశాలన్నీ ఈ సదస్సుకు గైర్హాజరయ్యాయి. చిత్తశుద్ధి ఉంటే స్వచ్ఛమైన గాలి, నిరపాయకరమైన ఇంధనం అందు బాటులోకి రావటం పెద్ద కష్టం కాదని...ఈ రంగాల్లో ఉపాధి కల్పన అవకాశాలు కూడా పెరుగు తాయని గుటెరస్ చెబుతున్న మాట అరణ్యరోదనే అయింది. 2030 నాటికి బొగ్గు వినియోగం నుంచి ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) దేశాలు పూర్తిగా వైదొలగితే, మరో పదేళ్లకు ఇతర దేశాలు దాన్ని సాధించగలుగుతాయని పారిస్ సదస్సు నిర్దేశించింది. కానీ సంపన్న రాజ్యాలు సభ్యులుగా ఉన్న ఓఈసీడీలో ఏ ఒక్క దేశమూ ఆ దిశగా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. సరి గదా కెనడా, అమెరికా, బ్రిటన్ తదితర సంపన్న దేశాలు మూతబడిన పాత ఫ్యాక్టరీలను సైతం తెరుస్తూ బొగ్గు వినియోగాన్ని మరింత పెంచాయి. ఈ ఏడాది జూన్–ఆగస్టు మధ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్నిచోట్లా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పారిశ్రామికీకరణకు ముందున్న వాతావరణంతో పోలిస్తే కనీసం 1.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరగటం ఎంతో దూరంలో లేదని పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్పిన మాట అక్షరసత్యమని ఈ పరిణామం వెల్లడిస్తోంది. గుటెరస్ చేస్తున్న హెచ్చరిక మరింత గుబులు పుట్టిస్తుంది. మరో 2.8 డిగ్రీల సెల్సి యస్ ఉష్ణోగ్రత పెరిగే క్రమంలో ఉన్నామని ఆయన ప్రకటించారు. ప్యారిస్ ఒడంబడిక కుదిరిన సమ యంలో ప్రపంచ దేశాలన్నీ 2020నాటికే ఇంతకు మూడింతల క్రియాశీల కార్యాచరణకు పూనుకోవా లని సదస్సు నిర్దేశించింది. అలాగైతే తప్ప లక్ష్యసాధనను చేరుకోలేమని చెప్పింది. కానీ మరో నాలుగేళ్లకే సంపన్న రాజ్యాల నిర్వాకం బయటపడింది. 2019లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో దాదాపు 60 దేశాలు తాము పూచీపడిన లక్ష్యాలకు మించి కర్బన ఉద్గారాలను తగ్గించు కున్నామని ప్రకటించగా...అందులో అత్యధిక దేశాలు చిన్నవే, తక్కువస్థాయి కాలుష్య కారక దేశాలే. మరి సంపన్న దేశాలు ఏం చేసినట్టు? ఇచ్చిన వాగ్దానాలను గాలికొదిలేసి, పర్యావరణానికి తూట్లు పొడిచాయి. ఈ విషయంలో కాస్తయినా సిగ్గుపడటం మానేశాయి. వాతావరణ సదస్సుకు ముందురోజే జరిగిన సమితి సర్వసభ్య సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భూగోళాన్ని వడగాడ్పులు చుట్టుముట్టడం, అడవులు తగలబడటం, కరువుకాటకాలు, వరదలు వగైరాల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. శిలాజ ఇంధనాల వాడకం ఆపకపోతే ఈ ముప్పు మరింత పెరుగుతుందని హెచ్చరించారు. కానీ గత అయిదేళ్లలో సాధించిందేమిటో చెప్పాలి గనక ఆ మర్నాడు జరిగిన సదస్సుకు మాత్రం గైర్హాజరయ్యారు. ఇలాంటి ధోరణులు సరి కాదు. ఇప్పటికైనా సంపన్న రాజ్యాల తీరు మారాలి. భూగోళం ఉనికికి ముప్పు తెచ్చే చర్యలకు స్వస్తి పలకాలి. ఇది కూడా చదవండి: నారీలోకానికి నీరాజనం! -
గ్లోబల్ వార్మింగ్ కథ ముగిసింది.. ఐరాస తీవ్ర ఆందోళన
న్యూయార్క్: పర్యావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 1,20,000 సంవత్సరాల్లో ఈ జులై నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని శాస్త్రవేత్తలు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ.. గ్లోబల్ వార్మింగ్ యుగం ముగిసిందని.. ఇక మరిగే యుగంలోకి అడుగుపెట్టామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారాయన. న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రికార్డు స్థాయిలో ధ్వంసమయ్యే ఉష్ణోగ్రతలు భూమిని వేడెక్కిస్తూ వచ్చాయని.. ఇక నుంచి సలసల మరిగే పరిస్థితులను ఎదుర్కొబోతున్నాం Era of global boiling has arrived అని వ్యాఖ్యానించారు. ఇప్పటిదాకా గ్లోబల్ వార్మింగ్ గురించే ఆందోళన చెందుతూ వచ్చాం. ఇక దాని గురించి ఆలోచన అక్కర్లేదు. ఎందుకంటే ఇక నుంచి భూమి సలసల మరిగిపోతుంది. ఉత్తర అర్ధగోళంలో నమోదు అవుతున్న తీవ్రమైన వేడిని.. క్రూరమైన వేసవిగా అభివర్ణించారాయన. ఇది భూగ్రహానికి వచ్చిన విపత్తు. మంచు యుగం నుంచి చూసుకుంటే.. ఈ జులైలో ప్రపంచ స్థాయి ఉష్ణోగ్రతలతో రికార్డులు బద్ధలు అయ్యాయని పేర్కొన్నారాయన. వాతావరణ మార్పు ఊహించని రీతిలో శరవేగంగా జరిగింది. ఇది భయంకరమైన పరిణామం.. ఆరంభం అయ్యిందనే అనుకోవాలి. ఇంక హెచ్చరికలు ఉండవు. త్వరపడి చర్యలు చేపట్టాలంతే అని ప్రపంచ నేతలకు పిలుపు ఇచ్చారాయన. 'The era of global warming has ended. The era of global boiling has arrived' UN Secretary General António Guterres warns of 'unbreathable' air and 'unbearable' temperatures to come.https://t.co/XO2D0c5uIb 📺 Sky 501, Virgin 602, Freeview 233 and YouTube pic.twitter.com/dhJGEC0YoD — Sky News (@SkyNews) July 27, 2023 -
చైనా దుష్టబుద్ధి.. మరోసారి భారత్, అమెరికాకు అడ్డుపడిన జిన్‌పింగ్
ఐక్యరాజ్యసమితి: డ్రాగన్ దేశం చైనా మరోసారి తన దుష్టబుద్ధిని చాటుకుంది. పాక్‌కు చెందిన లష్కరే తోయిబా సభ్యుడు, 26/11 ముంబై ఉగ్ర దాడుల్లో పాల్గొన్న సాజిద్ మీర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా పరిగణిస్తూ ఐరాస బ్లాక్‌లిస్టులో చేర్చాలంటూ భారత్, అమెరికా ప్రతిపాదించగా చైనా మంగళవారం అడ్డుకుంది. అయితే, భద్రతా మండలికి సంబంధించిన ‘1267 అల్‌ఖైదా శాంక్షన్స్ కమిటీ’ ప్రకారం సాజిద్ మీర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని, అతడి ఆస్తులను స్తంభింపజేయాలని, ప్రయాణ నిషేధం విధించాలని భారత్, అమెరికా ప్రతిపాదించాయి. ఈ ప్రతిపాదన ఆమోదం పొందకుండా చైనా అడ్డుపడింది. సాజిద్ మీర్ భారత్‌లో మోస్ట్ వాంటెడ్ జాబితాలో కొనసాగుతున్నాడు. అతడి తలపై అమెరికా ప్రభుత్వం 5 మిలియన్ డాలర్ల బహుమానం ప్రకటించింది. సాజిద్ మీర్ గతంలోనే చనిపోయాడని పాకిస్తాన్ ప్రభుత్వం వాదిస్తోంది. ఇది కూడా చదవండి: నేను మోదీ అభిమానిని.. భారత్‌కు ఆయన సరైందే చేస్తున్నారు: మస్క్ -
మన్ కీ బాత్ @100.. ఐరాసలో ప్రసారం..
రేడియో ద్వారా ప్రజలతో సంభాషిస్తూ, దేశాభివృద్ధిలో వారందరినీ భాగస్వాముల్ని చేస్తూ, దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం తీసుకువచ్చారు. ఇక 2014 అక్టోబర్ 3న తీసుకువచ్చిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమం విజయవంతమైంది. రాజకీయాలకు అతీతంగా దేశంలోని సామాన్యుల అసామాన్య గాథలను ఇందులో ప్రస్తావిస్తుండటం దేశ పౌరులపై లోతైన ప్రభావం చూపిందనడంలో సందేహం లేదు. ప్రధానమంత్రిగా కాకుండా.. స్నేహితుడిగా, సంరక్షకుడిగా, సన్నిహితుడిగా.. వివిధ సందర్భాల్లో, వివిధ పాత్రల్లో ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ‘మన్ కీ బాత్’ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి నెలా చివరి ఆదివారం వచ్చే ఈ కార్యక్రమం ఈ రోజు వందో ఎపిసోడ్ పూర్తి చేసుకోనుండటం విశేషం. ఇక, ఆదివారం ఆల్ ఇండియా రేడియోలో చేస్తున్న ‘మన్‌కీ బాత్’ వందో ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుంది. ఈ కార్యక్రమాన్ని కోట్ల మంది ప్రజలు వినేలా బీజేపీ కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా 4 లక్షల ప్రాంతాల్లో ప్రజలు ఆలకించేందుకు చర్యలు చేపట్టింది. పార్టీ జాతీయ అధ్యక్షుడి నుంచి.. పోలింగ్ కేంద్రం స్థాయి నాయకుల వరకూ అంతా పాల్గొనేలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులూ వినేలా ఏర్పాట్లు చేసినట్లు పార్టీ వివరించింది. ఇక, ఇండియాలో 22 ప్రముఖ భాషలు, 29 మాండలికాలలో ప్రసారం కానుంది. మరోవైపు.. 11 విదేశీ భాషల్లో కూడా మన్ కీ బాత్ ప్రసారం కానుంది. అన్ని రాష్ట్రాల రాజ్ భవన్లు, బీజేపీ, మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రుల నివాసాల్లో వందో ఎపిసోడ్‌ను వినిపించనున్నట్లు పార్టీ పేర్కొంది. రాజ్ భవన్లకు ఆయా రాష్ట్రాల్లో పద్మ అవార్డులు అందుకున్న వారిని ఆహ్వానించనునట్లు వెల్లడించింది. ఇక, మన్ కీ బాత్ వందో ఎపిసోడ్.. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. -
అత్యధిక జనాభా భారత్‌దే: ఐరాస
న్యూయార్క్: ప్రపంచంలో అత్యధిక జనాభా దేశంగా భారత్ అవతరించిందని ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం గణాంకాలతో కూడిన డేటాను విడుదల చేసింది. చైనా జనాభా 142.57 కోట్లు కాగా, దానిని అధిగమించి భారత్ 142.86 కోట్ల జనాభాతో అగ్రస్థానంలో నిలిచినట్లు ఐరాస వెల్లడించింది. అంటే చైనా కంటే 29 లక్షల జనాభా భారత్‌లో ఎక్కువగా ఉందన్నమాట. 1950 నుంచి ఐక్యరాజ్య సమితి అత్యధిక జనాభా దేశాల జాబితాను విడుదల చేస్తోంది. ఈ లిస్ట్‌లో భారత్ అగ్రస్థానంలో నిలవడం ఇదే ప్రథమం. అయితే ఈ గణాంకాలపై భారత్ నుంచి అధికారిక నిర్ధారణ లేదు. ఎందుకంటే ప్రతీ పదేళ్లకొకసారి భారత్‌లో జనాభా లెక్కల ప్రక్రియను కేంద్రం చేపడుతుంది. అయితే.. 2011 తర్వాత 2021లో జనాభా లెక్కలు చేపట్టాల్సి ఉండగా, కరోనా కారణంగా అది వాయిదా పడింది. మరోవైపు చైనాలో 2022లో జనాభా పెరుగుదలలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. 1960 తర్వాత ఈ స్థాయిలో తగ్గిపోవడం ఇదే. అక్కడి పరిస్థితులు, చట్టాలు అందుకు కారణం కాగా, జనాభా పెరుగుదల రేటును పెంచేందుకు అక్కడి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సైతం విఫలమవుతున్నాయి. 2022లో ఏకంగా 8,50,000 జనాభా తగ్గిపోయింది అక్కడ. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ బుధవారం ది స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్, 2023', '8 బిలియన్ లైవ్స్, ఇన్ఫినిట్ పాసిబిలిటీస్: ది కేస్ ఫర్ రైట్స్ అండ్ ఛాయిసెస్' పేరుతో ఒక జాబితా విడుదల చేసింది. భారత్, చైనా తర్వాత జనాభాలో అమెరికా, ఇండోనేషియా, పాకిస్తాన్‌లు ఈ లిస్ట్‌లో తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఇదీ చదవండి: రాక్షస క్రీడకు శిక్ష తప్పదు.. -
భారత్ ప్రతిపాదనకు నో.. పాకిస్థాన్ ఉగ్రవాదికి చైనా అండ!
వాషింగ్టన్: ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన కీలక నాయకుడు షాహిద్ మహమూద్‌కు ఐక్యరాజ్య సమితిలో చైనా అండా నిలిచింది. మహమూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ భారత్, అమెరికాలు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా అడ్డుకుంది. పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాదులపై చర్యలు చేపట్టకుండా ఐక్యరాజ్య సమితిలో గత కొన్ని నెలల్లో చైనా అడ్డుకోవడం ఇది నాలుగోసారి కావటం గమనార్హం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ)లో 1267 అల్‌ఖైదా ఆంక్షల కమిటీ కింద షాహిద్ మహమూద్‌పై చర్యలు తీసుకోవాలని.. భారత్, అమెరికా ప్రతిపాదనలు చేశాయి. అయితే, పాకిస్థాన్ మిత్రదేశమైన చైనా అందుకు అడ్డుపడింది. ఈ ప్రతిపాదనలను నిలిపివేసింది. మరోవైపు.. 2016లోనే అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ షాహిద్ మహమూద్, మహుమ్మద్ సార్వర్లపై ఆంక్షలు విధించింది. ఉగ్రవాదానికి వీరు నిధులను సమకూర్చటాన్ని అడ్డుకునే క్రమంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా తెలిపింది. ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ భారత పర్యటనలో భాగంగా 26/11 ముంబై ఉగ్రదాడిలో మరణించి వారికి నివాళులర్పించిన క్రమంలోనే.. చైనా టెర్రరిస్టులకు అండగా నిలవటం గమనార్హం. ఎవరీ షాహిద్? అమెరికా ట్రెజరీ విభాగం వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. షాషిద్ మహమూద్ కరాచీలోని లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో సీనియర్ సభ్యుడు. 2007 నుంచి లష్కరే ఉగ్రసంస్థ కోసం పనిచేస్తున్నాడు. 2013లో అతడు లష్కరే పబ్లికేషన్స్ విభాగ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టాడు. 2014 నుంచి లష్కరే అనుబంధ విభాగమైన ఫలహ్ ఇ ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్ఐఎఫ్)లో కొనసాగి.. 2015-16 మధ్యలో ఆ సంస్థ వైస్ ఛైర్మన్‌గా వ్యవహరించాడు. సిరియా, టర్కీ, బంగ్లాదేశ్, గాజా వంటి ప్రాంతాల్లో పర్యటించి ఉగ్రవాదానికి నిధులు సమకూర్చాడు. మరో ఉగ్రనేత సాజిద్ మిర్‌తో కలిసి విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించాడు. ఇదీ చదవండి: ఎందుకింత ఉగ్రరూపం? జెలెన్స్కీ ట్వీట్ -
బీజేపీకి సంకటం.. దేశ ప్రతిష్టకు భంగపాటు
జ్ఞానవాపి మసీదు వ్యవహారంలో మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మపై, పార్టీ ఢిల్లీ శాఖ మీడియా హెడ్ నవీన్ జిందాల్‌పై కాషాయ పార్టీ పెద్దలు సస్పెన్షన్ వేటు వేశారు. ఖతార్, కువైట్, ఇరాన్ సహా పలు అరబ్ దేశాల నుంచి సదరు అభ్యంతర వ్యాఖ్యలకు నిరసన ఎదురవడంతో, అధికార బీజేపీ.. వారిపై వేటు వేసింది. మరోపక్క ఆమె వ్యాఖ్యలు.. పశ్చిమాసియా దేశాల్లో లక్షలాది భారతీయుల ఉద్యోగాలకూ, సూపర్ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులకూ ఉద్వాసన లాంటి వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అరబ్ దేశాలు ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. ఇలాంటి తరుణంలో ఐక్యరాజ్యసమితి కూడా ఈ విషయంపై తాజాగా స్పందించింది. భారత్‌ను సున్నితంగా హెచ్చరించింది. సహనంగా ఉండాలని సలహా ఇచ్చింది. తాజాగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి మాట్లాడుతూ.. అన్ని మతాల పట్ల గౌరవం, సహనంతో వ్యవహరించాలని సూచించారు. మరోవైపు.. బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ను స్పందించాలని పాకిస్తాన్ జర్నలిస్టు కోరారు. ఈ సందర్భంగా యూఎన్ సెక్రటరీ జనరల్ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ మాట్లాడుతూ.. "ఈ ఘటనకు సంబంధించిన వార్తా కథలను చూశాను. ఈ వ్యాఖ్యలను నేను స్వయంగా చూడలేదు, కానీ.. అన్ని మతాల పట్ల గౌరవం, సహనాన్ని మేము బలంగా ప్రోత్సహిస్తున్నామని నేను మీకు చెప్పగలను అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా ఆమె వ్యాఖ్యలు.. గల్ఫ్‌లోని భాగస్వామ్య దేశాలతో పెరుగుతున్న భారత సంబంధాలకు ఇబ్బంది తెచ్చాయి. భారత ఉపరాష్ట్రపతి మూడు రోజుల ఖతార్ పర్యటన వేళ మరింత ఇరుకునపెట్టాయి. ఇది కూడా చదవండి: ప్రవక్తపై వ్యాఖ్యలతో దుమారం.. భగ్గుమంటున్న ముస్లిం దేశాలు -
అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం
అత్యాధునిక టెక్నాలజీతో అంతరిక్షయానం చేసి జయహో నరుడా అనిపించుకున్నప్పటికీ ఈ పేదరికం నుంచి బయటపడలేకపోవడవ బాధకకరం. కారణాలు ఏవైనా ప్రపంచ దేశాల్లో ఇంకా ఇప్పటికీ పేదరికంలో మగ్గిపోతున్న వాళ్లు ఎందెందరో అభాగ్యులు ఉన్నారు. ఎన్నో పోరాటాలు చేసే కావలిసినవి సాధించుకున్నాం గానీ. ఇప్పటికీ పేదవాడు ఎప్పుడు ఆకలి పోరాటం చేస్తునే ఉన్నాడు. (చదవండి: బలశాలి బామ్మ) అయితే ప్రభుత్వాధి నేతలు, దేశాధి నేతలు ఎన్ని పథకాలను తీసుకువచ్చిన పేదవాడికి చేరకపోవడమే మింగుడుపడిన విషయంగా మిగిలిపోతుంది. ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి పేదరిక నిర్మూలనకై తీసుకోవల్సిన చర్యల పై ప్రపంచ దేశాలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే ప్రతి ఏడాది అక్టోబర్ 17న అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం నిర్వహిస్తోంది. నేపథ్యం ఫ్రెంచ్ మతాధికారి, మానవతవాది అయిన జోసెఫ్ వ్రెసిన్స్కీ పేదరికంతో బాధితులను పట్ల వివక్షకు తావు లేకుండా వారిని గౌరవప్రదంగా చూడాలంటూ ఎన్నో పోరాటాలు చేశారు. అంతేకాదు పారిస్‌లోని ట్రోకాడోరోలో లక్షలాది మంది తన మద్దతుదారులతో కలిసి పేదరికంలో మగ్గిపోతున్న వాళ్ల సమస్యల దేశాధినేతలకు అర్ధమయ్యేలా ఒక ఉద్యమాన్ని తీసుకురావడమే కాక అక్టోబర్ 17, 1987న పారిస్ ప్లాజా ఆఫ్ లిబర్టీ మానవ హక్కుల స్మారక శిలను ఆవిష్కరించారు. పైగా ఆ శిలపై మహిళలు, పురుషులు పేదరికంలో ఉన్నారంటే మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలి అనే వాక్యాలను చెక్కించారు. ఈ క్రమంలో 1988లో జోసెఫ్ మరణాంతరం నాలుగు సంవత్సరాల తర్వాత 1992 డిసెంబర్ 22 ఐక్యరాజ్యసమితి పేదరిక నిర్మూలన కోసం ప్రపంచదేశాలన్ని ఏకతాటిపై కృషి చేయాలంటూ ఒక తీర్మానాన్ని తీసుకురావడమే కాక ఆమోదించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి పేదల కోసం ఆహర్నిసలు కృషి చేసిన జోసెఫ్ వ్రెసిన్స్కీని పేద ప్రజల తండ్రిగా కొనియాడుతూ ఆయన ఆవిష్కరించిన స్మారక శిల రోజునే అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవంగా ప్రకటించింది. ఈ ఏడాది థీమ్ "పేదరికాన్ని అంతం చేసేలా అందరూ కలిసి ముందుకు సాగాలి, ఈ భూమి పై నివశించే ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా జీవించాలి" మళ్లీ పేదరికంలోకి నెట్టిన కోవిడ్ -19 మహమ్మారి..... 2020 లో ప్రపంచాన్ని వణికించిన కరోనావైరస్ మహమ్మారి 88 నుండి 115 మిలియన్ల మంది ప్రజలను పేదరికంలోకి నెట్టిందని ప్రపంచ బ్యాంకు నివేదికలో పేర్కొంది. ఈ మేరకు పేదరికం రేటు ఇప్పటికే ఉన్న దక్షిణ ఆసియా, ఉప-సహారా దేశాలలో అధికంగా ఉన్నట్లు తెలిపింది. పైగా ఈ సంవత్సరం పేదరికం ప్రపంచ దేశాల్లో 143 మిలయన్ల నుంచి 163 మిలియన్లకు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఈ సందర్భంగా యుఎన్ చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ " ప్రస్తుతం ప్రపంచ దేశాలన్ని తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి పెద్ద విధ్వంసం సృష్టించింది. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: 9 గంటల్లో 51 పబ్‌లు చుట్టి.. ప్రతీ పబ్‌లోనూ డ్రింక్ తీసుకుని) -
పెళ్లంటే పిల్లలాట కాదు
అవును. పెళ్లంటే ఆట కాదు. అల్లరి కాదు. చదువు కాదు. స్వేచ్ఛ కాదు, స్వతంత్రం కాదు. మోయవలసిన బాధ్యత. ఇంటిని, పిల్లల్ని, ఇంట్లో పెద్దల్ని మోయడానికి భుజ బలం కావాలి. మనోబలం ఉండాలి. చిన్నప్పుడే పెళ్లి చేయడం అంటే.. కాళ్లకు తాళ్లేసి కట్టేయడమే! పెళ్లంటే పిల్లలాట కాదని.. యశోద చెబుతోంది ఇందుకే. ఆమె ఓ గ్రామీణ యువతి. ఇప్పుడామె.. ఐక్యరాజ్య సమితి వాలంటీర్! ఇల్లిల్లూ కాదు, ఊరూరూ తిరిగి చెబుతోంది యశోద.. చిన్నప్పుడే పిల్లకు పెళ్లిళ్లు చేసేయొద్దని. చెప్పడం ఎవరైనా చెబుతారు. ప్రధాని చెప్పడం లేదా? రాష్ట్రపతి చెప్పడం లేదా. కానీ యశోద.. చెప్పడంతో పాటు ఎక్కడైనా బాల్యవివాహం జరుగుతుంటే వెళ్లి ఆ పెళ్లిని ఆపేస్తోంది! పీలగా, ఎముకల్లో బలం లేనట్లుగా ఉంటుంది ఈ 21 ఏళ్ల అమ్మాయి. ఈమె వెళ్లి ‘ఆపండి’ అని గర్జిస్తే ఎవరు వింటారు? ‘పో పోవమ్మా..’ అంటారు. ‘భజంత్రీలూ మీరు కానివ్వండయ్యా’ అంటారు. అసలు సొంత ఇంట్లోని వాళ్లే యశోదకు సపోర్టుగా రాలేదు. ‘నిన్న మొన్న పుట్టినదానివి, ఊళ్లో ఆచారాలను మార్చేస్తానని బయల్దేరుతున్నావా? కాళ్లిరగ్గొడతాం. ఇంట్లో కూర్చో’ అని చెప్పేశారు. ఇది జరిగింది ఆమెకు 18 ఏళ్ల వయసప్పుడు. యశోద వాళ్ల ఊరు దుమెర్పానీ. ఊరూ అదే, గ్రామ పంచాయితీ అదే. ఒడిశాలోని నౌపడ జిల్లాలో ఉంటుంది. దుమెర్పానీకి దగ్గరలో హల్దీ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఎవరో చిన్న పిల్లకు, చిన్న పిల్లాడికీ పెళ్లి చేస్తున్నారని తెలిసి రయ్యిన అక్కడికి వెళ్లింది. ఒక్కటే వెళ్లలేదు. అప్పటికే తను రెండు ఎన్జీవోలతో కలిసి పనిచేస్తోంది. ‘సేవ్ ద చిల్డ్రన్’ అనేదొకటి. ‘ఆశా’అనే సంస్థ మరొకటి. వాళ్లు వెనకుంటే, యశోద ముందుకు వెళ్లి.. ‘పిల్లలకు పెళ్లి చేయకండి’ అంది! కోపంగా చూశారు పెళ్లి చేస్తున్నవారు. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా గ్రామస్థులను చైతన్యపరుస్తున్న యశోద వింతగా చూశారు పెళ్లికొచ్చినవాళ్లు. ‘ఈ అమ్మాయి ఎవరో కనుక్కోండి’ అని పెద్దవాళ్లు అన్నారు. ‘తెలిసినమ్మాయే. పక్క గ్రామం’ అన్నారు.. యశోద ఎన్జీవోలతో కలిసి పనిచేస్తుండటం తెలిసినవాళ్లు. అప్పటికి పెళ్లి ఆగిపోయింది. అంతా వెళ్లిపోయాక చుట్టుపక్కల ఊళ్లలో నిరసన మొదలైంది. ‘‘ఊరి పిల్ల అయుండీ, ఊరి ఆచారాలు తెలియవా! ఎవర్నో వెంటేసుకుని వచ్చి మరీ పెళ్లిని ఆపేయిస్తుందా?’’ అని ఊళ్లో అరుగుల మీద ‘చుట్ట ముక్క’ చర్చలు మొదలయ్యాయి. ఊళ్లో చెరువుల దగ్గర నీళ్ల బిందెలు బుగ్గలు నొక్కుకున్నాయి. విషయం యశోద ఇంట్లో తెలిసింది. ‘నిన్న మొన్న పుట్టిన దానివి, ఊళ్లో ఆచారాలను మార్చేస్తానని బయల్దేరుతున్నావా? కాళ్లిరగ్గొడతాం. ఇంట్లో కూర్చో’’ అని అప్పుడే వాళ్లు అన్నది. ∙∙ కూర్చోలేదు యశోద. సామాజిక కార్యకర్తలతో కలిసి తిరిగింది. ఈ మూడేళ్లలో చుట్టుపక్కల ఊళ్లల్లో జరగబోయిన బాల్యవివాహాలను ఓ ఎనభై వరకు ఆపగలిగింది! ఊరికే లీడర్ అయింది. యువలీడర్. ఆడపిల్లలకు యశోదక్కను చూస్తే యమా క్రేజ్. ఇంట్లో వాళ్లు తమను బడి మాన్పించబోతున్నా, పెళ్లి సంబంధాలు వెతుకుతున్నా, తమను బయటికి వెళ్లి ఆడుకోనివ్వకపోయినా.. ‘యశోదక్కకు చెబుతాం’ అని పైపైకి లేస్తున్నారు. వాళ్లను చెయ్యిపట్టి ఆపడం తల్లిదండ్రుల పనౌతోంది. యశోదక్కకు చెబితే యశోదక్క టీమ్ ఏమీ కర్రలు పట్టుకుని వచ్చేయదు. కూడలి లో గ్రామస్తులకు ఒక మీటింగ్ పెట్టి, చిన్నప్పుడే పెళ్లి చేస్తే ఆడపిల్లల జీవితం ఎలా అయిపోతోందో కళ్లకు కట్టేలా చెప్పి వెళ్తుంది. యశోద మీటింగ్‌లలో ఆడవాళ్లే కాదు, మగవాళ్లూ కూర్చొని ఆమె చెప్పేది ఆసక్తిగా వింటున్నారిప్పుడు. ఆ మాటలు వారిలో ఆలోచన కలిగించేలా ఉంటాయి. ఆ ఊళ్లన్నీ దుర్భిక్ష ప్రాంతాలు. అందుకే ఆడపిల్లలకు త్వరగా పెళ్లిళ్లు చేసి, మెట్టినూళ్లలో వారికి మంచి పరిస్థితుల్ని కల్పించాలని తల్లిదండ్రులు త్వరపడుతుంటారు. పని వెతుక్కుంటూ వేరే ప్రాంతాలకు వలస వెళ్లే వాళ్లే వారిలో ఎక్కువమంది. దక్షణాది రాష్ట్రాలకొచ్చి ఇటుక బట్టీల్లో, ఫ్యాక్టరీలలో కూలీలుగా చేరి పిల్ల పెళ్లి కోసం నాలుగు రాళ్లు కూడబెట్టుకుని తిరిగి ఊరు చేరుతుంటారు. ఏడాదికి మూడు సీజన్ల వలసలు వాళ్లవి. యశోదకు ఇదంతా తెలియంది కాదు. పిల్ల పెళ్లి కోసం కష్టపడుతున్నవాళ్లు, పిల్లకు తగిన వయసు రాకుండానే పెళ్లి అనే కష్టాన్ని తెచ్చి పెట్టడం ఎందుకు అని ఊళ్లోవాళ్లకు నచ్చ చెబుతుంది. ‘సేవ్ ది చిల్డ్రన్’, ‘ఆశా’ సంస్థలు కలిసి ‘మ్యారేజ్: నో చైల్డ్స్ ప్లే’ అనే కార్యక్రమానికి రూపకల్పన చేశాయి. అందులో వాలంటీర్ యశోద. బాల్య వివాహాలను నివారించడంతో పాటు యశోద ఇప్పుడు బాలబాలికల సమానత్వం, రుతుక్రమ పరిశుభ్రత, గృహ హింస, బాలికల విద్య, నచ్చిన రంగాన్ని ఎంచుకునే విధంగా బాలికల్ని, యువతుల్ని ప్రోత్సహించేలా తల్లిదండ్రులను ఒప్పించడం వంటి బాధ్యతలను స్వచ్ఛందంగా స్వీకరించింది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఈ వాలంటీర్‌ను ప్రత్యేకంగా అభినందించడంతో ఇప్పుడు యశోద ఎంత చెబితే అంత అయింది. ఏమైనా మంచే కదా తను చెబుతోంది అనే దగ్గరికి ఊరూ వాడా వచ్చేశారు. ఐక్యరాజ్య సమితి ఏటా ‘వి–అవార్డు’ ఇస్తుంటుంది. ఈ అవార్డును ఈ ఏడాది యశోదకు ఇస్తున్నట్లుగా శనివారం ప్రకటించింది. వి అంటే వాలంటీర్. ది బెస్ట్ వాలంటీర్‌గా యశోద ఐరాస గుర్తింపు పొందింది. ∙∙ 2017లో మొదటి బాల్యవివాహాన్ని ఆపేశాక, యశోద ఆ చుట్టుపక్కల గ్రామాలలో నెలకు రెండుసార్లు కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్‌లు నిర్వహించింది. ఆ పని మొదట తన ఊరితో ప్రారంభించింది. రెండో ఏడాదికల్లా మిగతా ఊళ్లలోనూ అవేర్నెస్ కార్యక్రమాల్ని మొదలుపెట్టింది. ఆమె లక్ష్యం 10–19 ఏళ్ల వయసులోని పిల్లలు. వాళ్లను సమీకరించి మంచి చెడులు వివరించేది. సొంత ఊరు దుమెర్పానీలోనే 15 బాల్య వివాహాలను నివారించగలిగింది యశోద. అప్పటికే ఆ అమ్మాయి పేరు జిల్లా మొత్తం వ్యాపించింది. నౌపడలోని నేషనల్ కాలేజ్‌లో డిగ్రీ చదువుకుంది యశోద. నౌపడలో ఇప్పుడున్న చైల్డ్ హెల్ప్‌లైన్ సదుపాయం ఆమె తీసుకున్న చొరవ ఫలితమే. ‘ఆడపిల్లల్తో నేనొక సామాజిక చైతన్య సైన్యాన్ని తయారు చేస్తాను’ అంటోంది యశోద ఇప్పుడు. చేస్తోంది కూడా తను. అంత పట్టుదల గల అమ్మాయి. ఐక్యరాజ్యసమితి ‘వి–అవార్డు’ విజేత యశోదా పాండే -
భారత్‌లో తగ్గిన శిశు మరణాలు
ఐక్యరాజ్యసమితి: భారత్‌లో శిశుమరణాలు తగ్గుముఖం పట్టాయని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. 1990–2019 మధ్యలో శిశు మరణాలు భారీగా తగ్గినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే అయిదేళ్లలోపు చిన్నారుల మరణాల్లో మూడో వంతు నైజీరియా, భారత్‌లో సంభవిస్తున్నాయని తెలిపింది. ‘చైల్డ్ మోర్టాలిటీ లెవల్స్, ట్రెండ్స్ 2020’ పేరుతో ఐరాస నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 1990లో అయిదేళ్ల లోపు చిన్నారులు 1.25 కోట్ల మంది మరణిస్తే 2019 నాటికి వారి సంఖ్య 52 లక్షలకి తగ్గింది. అదే భారత్‌లో 34 లక్షల నుంచి 8 లక్షల 24వేలకి తగ్గింది. ► భారత్‌లో 1990లో అయిదేళ్ల వయసులోపు పిల్లల్లో ప్రతీ వెయ్యి మందిలో 126 మంది మరణిస్తే, 2019 సంవత్సరం నాటికి ఆ సంఖ్య 34కి తగ్గింది. ► ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మినహా మధ్య, దక్షిణాసియా దేశాల్లో అయిదేళ్ల లోపు చిన్నారుల మరణాలు తగ్గుముఖం పట్టాయి. ► అత్యధికంగా శిశు మరణాలు సంభవిస్తున్న దేశాల్లో సబ్ సహారా ఆఫ్రికా, మధ్య, దక్షిణాసియా దేశాలే ఉన్నాయి. ► సగానికి పైగా శిశు మరణాలు నైజీరియా, భారత్, పాకిస్తాన్, కాంగో, ఇథియోపియా దేశాల నుంచే నమోదయ్యాయి. -
ఇరాన్‌పై వీగిన అమెరికా తీర్మానం
ఐక్యరాజ్యసమితి: ఇరాన్‌పై ఐక్యరాజ్య సమితి విధించిన ఆయుధ ఆంక్షలను నిరవధికంగా కొనసాగించాలని కోరుతూ అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానం భద్రతా మండలిలో వీగిపోయింది. అమెరికా తీర్మానానికి అనుకూలంగా కేవలం డొమినికన్ రిపబ్లిక్ నుంచి మాత్రమే మద్దతు లభించింది. తీర్మానాన్ని ఆమోదించడానికి భద్రతా మండలిలోని 15 సభ్య దేశాల్లో కనీసం 9 దేశాలు మద్దతు పలకాల్సి ఉంటుంది. అమెరికా తీర్మానానికి అనుకూలంగా రెండు ఓట్లు, వ్యతిరేకంగా రెండు ఓట్లు రాగా, 11 మంది సభ్యులు ఓటింగ్‌కి దూరంగా ఉన్నారు. ఈ తీర్మానాన్ని రష్యా, చైనా తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే, తమ వీటో పవర్‌ని ఉపయోగించే అవసరం ఆ దేశాలకు రాలేదు. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తీర్మానం ఓడిపోయినట్లు ప్రకటించారు. 2015లో ఇరాన్‌కీ, ఆరు పెద్ద దేశాలైన రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీల మధ్య, అణ్వాయుధ నిరాయుధీకరణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్ అణ్వాయుధాలను నిర్వీర్యం చేస్తూ, నిరాయుధీకరణకు కృషిచేయాలి. ఈ ఒప్పందం నుంచి 2018లో ట్రంప్ ప్రభుత్వం వైదొలిగింది. -
ఈ ఉగ్ర గ్రూపులకు పాకిస్తానీలే బాస్‌లు
ఐక్యరాజ్యసమితి: భారత ఉపఖండంలో కార్యకలాపాలు సాగిస్తున్న అల్‌కాయిదా వంటి ఉగ్ర సంస్థలకు పాకిస్తానీ జాతీయులే నాయకత్వం వహిస్తున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ ది లెవాంట్–ఖొరాసాన్ (ఐఎస్ఐఎల్–కె), తెహ్రిక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) తదితర ఉగ్రసంస్థల నేతల పేర్లను ఆంక్షల జాబితాలో చేర్చలేదని తెలిపింది. ఐఎస్ఐఎల్, అల్‌కాయిదా, వాటి అనుబంధ వ్యక్తులు, ఆస్తులపై ఐరాస ఏర్పాటు చేసిన ఆంక్షల సమీక్ష కమిటీ ఈ విషయాలు వెల్లడించింది. ఐఎస్ఐఎల్–కె అధిపతి అస్లాం ఫరూఖీ అలియాస్ అబ్దుల్లా ఒరాక్జాయ్‌తోపాటు మాజీ అధినేత జియా ఉల్హక్ అలియాస్ అబూ ఒమర్ ఖొరాసానీ, అల్‌కాయిదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ (ఏక్యూఐఎస్) నేత ఒసామా మహ్మూద్ కూడా పాకిస్తాన్‌కు చెందిన వారేననీ,వీరి పేర్లు ఆంక్షల జాబితాలో లేవని ఆ నివేదిక పేర్కొంది. అఫ్గానిస్తాన్‌లోని అతిపెద్ద ఉగ్ర ముఠా టీటీపీ చీఫ్ అమిర్ నూర్ వలీ మెహ్సూద్ కూడా పాకిస్తాన్‌కు చెందిన వాడేనని తెలిపింది. -
ఉగ్రదాడులపై హెచ్చరించిన యూఎన్
న్యూఢిల్లీ: కేరళ, కర్ణాటకల్లో ఐసిస్ ఉగ్రవాదులు గణనీయమైన సంఖ్యలో ఉన్నట్లు ఐరాస నివేదిక హెచ్చరించింది. భారత ఉపఖండ టెర్రర్ గ్రూపులోని అల్-ఖైదా.. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్లకు చెందిన దాదాపు 150 నుంచి 200 మంది ఉగ్రవాదులను కలిగి ఉందని పేర్కొంది. వీరిలో ఎక్కువ మంది కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నట్లు తెలిపింది. అల్‌ఖైదా ఇండియన్ సబ్ కాంటినెంట్ ప్రస్తుత నాయకుడు ఒసామా మహమూద్ తమ మాజీ నాయకుడు అసీమ్ ఉమర్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ ప్రాంతాల్లో ప్రతీకార చర్యలకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు యూఎన్ నివేదికలో హెచ్చరించింది. -
ఐరాసలో భారత్ విజయం: మోదీ హర్షం
సాక్షి, న్యూఢిల్లీ : ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వ ఎన్నికల్లో భారత్ విజయం సాధించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఐరాస ఎన్నికల్లో ఎలాంటి పోటీలేకుండా భారత్ విజయం సాధించడం గొప్ప పరిణామం అన్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా స్పందించిన మోదీ.. తమకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని పేర్కొన్నారు. సభ్య దేశాలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. శాంతి, సామరస్యత, సమానత్వం, భద్రత వంటి అంశాలపై పోరాటంలో భారత తన పంథాను కొనసాగిస్తుందని మోదీ స్పష్టం చేశారు. కాగా బుధవారం రాత్రి జరిగిన ఎన్నికల్లో మొత్తం 193 ఓట్లు పోలవ్వగా భారత్‌కు 184 ఓట్లు దక్కాయి. దీంతో రెండేళ్ల పాటు (2021-22 ) ఆ స్థానంలో కొనసాగనుంది. (ఐరాస ఎన్నికల్లో భారత్ విజయం) -
ఐరాస ఎన్నికల్లో భారత్ విజయం
సాక్షి, న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వపు ఎన్నికల్లో భారత్ విజయం సాధించింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్ఎస్సి)లో భారత్‌కు మరోసారి తాత్కాలిక సభ్యదేశ హోదా లభించింది. దీంతో రెండేళ్లపాటు (2021–22) భారత్ కొనసాగనుంది. ఐరాసలో సభ్యదేశంగా భారత్ ఎంపిక కావడం ఇది ఎనిమిదోసారి. 55 మంది సభ్యులున్న ఆసియా–పసిఫిక్ గ్రూప్ నుంచి కేవలం భారత్ ఒక్కటే పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఐర్లాండ్, మెక్సికో, నార్వే కూడా భద్రతా మండలి ఎన్నికల్లో విజయం సాధించగా, కెనడా ఓటమిపాలైంది ఐరాసలో అత్యంత శక్తిమంతమైన విభాగం భద్రతా మండలి. అంతర్జాతీయంగా శాంతి భద్రతల పరిరక్షణను ఇదే పర్యవేక్షిస్తుంది. ప్రపంచ దేశాలపై ఆంక్షలు విధించే అధికారం ఉంది. సమితిలో ప్రస్తుతం 193 సభ్యదేశాలు ఉండగా, మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలు (అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్), పది తాత్కాలిక సభ్యదేశాలు ఉన్నాయి. శాశ్వత సభ్యదేశాలకు ‘వీటో’ అధికారం ఉంటుంది. తాత్కాలిక సభ్యదేశాలను రెండేళ్ల సభ్యత్వ కాలానికి రొటేషన్ పద్ధతిలో సర్వసభ్య సభ ఓటింగ్ ద్వారా ఎంపిక చేస్తుంది. మండలిలో కీలక నిర్ణయాలకు కనీసం 9 సభ్యదేశాల ఆమోదం అవసరం. అయితే ఏదైనా నిర్ణయానికి అవసరమైనన్ని సభ్యదేశాల ఆమోదం ఉన్నప్పటికీ.. శాశ్వత సభ్యదేశాల్లో ఏదైనా దేశం వ్యతిరేకించి వీటో చేస్తే ఆ నిర్ణయం ఆమోదం పొందదు. కాగా భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా, చైనా అందుకు మోకాలడ్డుతోంది. Member States elect India to the non-permanent seat of the Security Council for the term 2021-22 with overwhelming support. India gets 184 out of the 192 valid votes polled. pic.twitter.com/Vd43CN41cY — India at UN, NY (@IndiaUNNewYork) June 17, 2020 -
భద్రతా మండలిలో ఎన్నికల సందడి
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలిలో ఐదు తాత్కాలిక సభ్యదేశాల నియామక ప్రక్రియ మొదలైంది. 75వ ఐక్యరాజ్యసమితి సమావేశాల అధ్యక్షుడిని ఎంపిక చేయడంతోపాటు సామాజిక, ఆర్థిక మండలి సభ్యుల నియామకానికి కూడా ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికలను ఐక్యరాజ్యసమితి సాధారణ సభ బుధవారం నిర్వహించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఎన్నికల్లో తమకు స్పష్టమైన విజయం లభించడం ఖాయమని భారత్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇందులో విజయం సాధిస్తే రెండేళ్లపాటు (2021–22) ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు తాత్కాలిక సభ్యదేశ హోదా లభిస్తుంది. 55 మంది సభ్యులున్న ఆసియా–పసిఫిక్ గ్రూప్ నుంచి కేవలం భారత్ ఒక్కటే పోటీ చేస్తోంది కాబట్టి గెలుపు తథ్యమే. భారత్ 1950–51, 1967–68, 1972–73, 1077–78, 1984–85, 1991–92, 2011–22లో భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశ హోదా దక్కించుకుంది. -
కోవిడ్-19 ఎఫెక్ట్ : మరో 4.9 కోట్ల మంది పేదరికంలోకి..
న్యూయార్క్ : కోవిడ్-19 సంక్షోభంతో ఈ ఏడాది అదనంగా మరో 4.9 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి జారుకుంటారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామం ఆహార భద్రతపై పెనుప్రభావం చూపుతుందని హెచ్చరించింది. అంతర్జాతీయ ఆహార భద్రత కోసం అన్ని దేశాలు సత్వరమే పూనుకోవాలని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియా గుటెరస్ పిలుపుఇచ్చారు. సభ్య దేశాలు తక్షణమే చర్యలు చేపట్టని పక్షంలో అంతర్జాతీయ ఆహార అత్యవసర పరిస్థితి ఏర్పడి కోట్లాది పిల్లలు, వయోజనులపై దీర్ఘకాలం ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ప్రపంచ జనాభా 780 కోట్ల మందికి పైగా ప్రజల ఆకలి తీర్చేందుకు సరిపడా తగినంత ఆహారం ప్రపంచం వద్ద ఉందని, అయినా ఇప్పుడు 82 కోట్ల మందికి పైగా ఆకలితో అలమటిస్తున్నారని గుటెరస్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల మంది చిన్నారులకు ఆహారం అందుబాటులో లేదని, ఐదుగురు పిల్లల్లో ఒకరు క్షుద్భాద అనుభవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మన ఆహార వ్యవస్ధలు విఫలం కాగా, కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులను మరింత దిగజార్చిందని ఆహార భద్రతపై ఐక్యరాజ్యసమితి విధానంపై గుటెరస్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పలు దేశాల్లో తగినన్ని ఆహార నిల్వలున్నా ఆహార సరఫరా వ్యవస్ధల్లో అవాంతరాలు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చారు. వైరస్ మహమ్మారి నిరోధానికి ప్రపంచ దేశాలు కార్యాచరణకు పూనుకోవాలని అన్నారు. ఆహార భద్రత కొరవడిన దేశాలకు ఆహారం అందుబాటులోకి తీసుకువచ్చేలా దేశాలు చొరవచూపాలని కోరారు. చిన్నారులకు పోషకాహారం అందుబాటులో ఉంచాలని అన్నారు. చదవండి : కరోనాపై కలసికట్టుగా పోరాడుదాం -
కిమ్ ఆరోగ్యంపై స్పందించిన యూఎన్ఓ
న్యూయార్క్ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి వదంతులు వస్తున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి (యూఎన్ఓ) స్పందించింది. కిమ్ ఆరోగ్యం విషమించిందంటూ గతకొంత కాలంగా వార్తలు వస్తున్నాయని దీనిపై ఇప్పటివరకు తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని యూఎన్ తెలిపింది. వివిధ జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో వస్తున్న వార్తల ద్వారానే తమకు ఈ సమాచారం అందిందని ఆ దేశ ప్రతినిధుల నుంచి తమకు వర్తమానం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు యూఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ గురువారం రాత్రి ఓ ప్రకటన చేశారు. కిమ్ ఆరోగ్యం గురించి పూర్తి వివరాలను తెలుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. (కిమ్ ఎక్కడున్నారో తెలుసు) కాగా ఏప్రిల్ 15 నుంచి కిమ్ బయట ప్రపంచానికి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. ఆర్యోగం బాగలేదని పలు పత్రికలు సైతం ప్రచురించాయి. ఈ వార్తలును అమెరికాతో పాటు దక్షిణ కొరియా సైతం తీవ్రంగా ఖండిచాయి. తాజాగా మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఏప్రిల్ 15 నాటి కార్యక్రమానికి హాజరుకాకపోయి ఉండవచ్చని పలు దేశాలు అభిప్రాయపడుతున్నాయి. (‘కిమ్’ గురించి మాకు తెలియదు) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1341281459.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'నిర్లక్ష్యం చేస్తే లక్షల్లో ప్రాణాలు పోతాయి'
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా విలయ తాండవం చేస్తున్న కరోనా వైరస్‌ను వీలైనంత వేగంగా కట్టడి చేయలేకపోతే రాబోయే రోజుల్లో మరణాల సంఖ్య లక్షల్లో ఉండే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గ్యుటెరాస్ హెచ్చరించారు. కరోనాను కార్చిచ్చుతో పోల్చారు. కార్చిచ్చులా వ్యాపిస్తున్న ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయకుండా నిర్లక్ష్యం వహిస్తే లక్షల్లో ప్రాణాలు కోల్పోతారని దేశాలను హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కరోనా కారణంగా 10వేల మరణాలు సంభవించగా ఈ వైరస్‌తో ఆరోగ్య పరిస్థితులు రోజురోజుకు మరింత క్షీణిస్తున్నాయని తెలిపారు. దీని నుంచి బయటపడడానికి పరస్పరం సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమయంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయా దేశాల్లో పరిస్థితలను చక్కబెట్టుకుంటూ ఇతర దేశాలతో ఉమ్మడి కార్యాచరణ రూపొందించి ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఉందని సూచించారు. చదవండి: ఏప్రిల్ 19న యుగాంతం; ఏంటి కథ? ఆంటోనియో గ్యుటెరాస్ చేసిన వ్యాఖ్యలు: ►ప్రతి దేశం వ్యూహాత్మక చర్యలు చేపడుతూనే, కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేని దేశాలను కూడా ఆదుకోవాలి. ►కరోనాపై పోరులో జీ-20 దేశాలు ముందుండాలి. ఆర్థికంగా బలమైన దేశాలు స్వీయ పరిరక్షణతో సరిపెట్టుకోకుండా ఆఫ్రికా లాంటి పేద దేశాలపైనా, అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలపైనా దృష్టి సారించాలి. ►దేశాలు తమ మధ్య ఉన్న వాణిజ్య విభేదాలను పక్కనబెట్టి సరికొత్త సప్లై చైన్ వ్యవస్థలను పునరుద్ధరించాలి. ►త్వరలోనే ఈ వైరస్ ప్రతి ఒక్క దేశాన్ని తాకుతుంది. జీ20 దేశాలు ఇతర దేశాలకు సాయం చేయకపోతే దారుణ ఫలితాలు వస్తాయి. ►అల్పాదాయ, చిన్న, మధ్య తరహా వ్యాపారులను ఆదుకోవాలి. సామాజిక ఉద్యోగ భద్రత, జీతాలు ఇవ్వడం, బీమా సౌకర్యాలు వంటి వాటితో చేయూతనివ్వాలి. ►ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న దేశాలను వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఆదుకోవాలి. ►ప్రపంచవ్యాప్తంగా పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ►స్వదేశీ వస్తు రక్షణ విధానం పాటిస్తున్న దేశాలు ఈ తరుణంలో కాస్త వెసులుబాటు నిర్ణయాలు తీసుకోవాలి. ►కోవిడ్-19పై ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను అన్ని దేశాలు పాటించాలి. -
అఫ్రిది వ్యాఖ్యలను తిప్పికొట్టిన గంభీర్
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన భారత ప్రభుత్వాన్ని తప్పుబడుతూ.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చేసిన ట్వీట్‌పై టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ మండిపడ్డారు. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందన్న అఫ్రిది వ్యాఖ్యలను గంభీర్ తనదైన శైలిలో తిప్పికొట్టారు. ‘ఐక్యరాజ్య సమితి తీర్మానానికి అనుగుణంగా కశ్మీరీ పౌరులకు కనీస హక్కులు దక్కడం లేదు. స్వేచ్చ విషయంలో అందరికీ సమాన హక్కులు వర్తిస్తాయి. ఇంత జరుగుతున్నా ఐరాస ఎందుకలా నిద్రపోతోంది. కశ్మీరీల హక్కుల ఉల్లంఘనపై ఎందుకు స్పందించట్లేదు. అసలు ఐరాసను ఎందుకు ఏర్పాటు చేశారు? కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనను పరిగణలోకి తీసుకోవాలి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలి’ అని అఫ్రిది ట్వీట్ చేశాడు. దీనిపై గంభీర్ స్పందిస్తూ..‘అఫ్రిది ఎప్పుడూ చురుగ్గా ఉంటాడు. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది వాస్తవమే. ఈ విషయాన్ని తెలిపిన నిన్ను అభినందించాల్సిందే. కానీ నువ్వు మరిచిపోయిన విషయం ఏంటంటే.. ఇవన్నీ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో జరుగుతున్నాయని ప్రస్తావించకపోవడం. ఏం బాధపడకు త్వరలో పీఓకే పరిస్థితులను కూడా పరిష్కరిస్తాం.’ అంటూ అఫ్రిదికి గంభీర్ చురకలింటించారు. ఇక ఈ ఇద్దరు మాజీ క్రికెటర్లు వాదులాడుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా కశ్మీర్ విషయంలోనే ఇద్దరి మధ్య మాటల యుద్దం నడిచింది. మైదానంలో కూడా ఒకరిపై ఒకరు దూసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. -
ఆర్టికల్ 370 రద్దు: విషంకక్కిన అఫ్రిది
ఇస్లామాబాద్: జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ట్విట్టర్ వేదికగా స్పందించారు. భారత ప్రభుత్వ చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ఐక్యరాజ్య సమితి తీర్మానానికి అనుగుణంగా కశ్మీరీ పౌరులకు కనీస హక్కులు దక్కడం లేదు. అసలు ఐరాసను ఎందుకు ఏర్పాటు చేశారు? ఇంత జరుగుతున్నా ఎందుకలా నిద్రపోతోంది. కశ్మీరీల హక్కుల ఉల్లంఘనపై ఐరాస ఎందుకు స్పందించట్లేదు. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనను పరిగణలోకి తీసుకోవాలి’ అంటూ ట్వీటర్లో అభిప్రాయపడ్డారు. చదవండి: ఆర్టికల్ 370 రద్దు చదవండి: త్రిమూర్తులు... ఎంఎస్డీ అలాగే దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించాలని అఫ్రిది కోరారు. సదరు ట్వీట్‌ను ఐక్యరాజ్యసమితి, డొనాల్డ్ ట్రంప్‌కు ట్యాగ్ చేశారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370, 35–ఏ అధికరణాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కశ్మీర్‌పై భారత ప్రభుత్వ చర్యపై పాకిస్తాన్ ప్రభుత్వం ఇదివరకే ఖండించింది. ఐరాస తీర్మానాలకు వ్యతిరేకంగా భారత్ తీసుకున్న నిర్ణయంపై అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళతామని తెలిపింది. కశ్మీరీలకు మద్దతు కొనసాగిస్తామని పేర్కొంది. తాజా పరిణామంతో రెండు అణ్వస్త్ర దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణిస్తాయని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. భారత్ ప్రకటన ఐరాస తీర్మానాలకు వ్యతిరేకమని అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ పేర్కొన్నారు. చదవండి: హిందూ రాజు ముస్లిం రాజ్యం చదవండి: నాలుగు యుద్ధాలు -
ఐక్యరాజ్యసమితిలో సెప్టెంబర్‌లో మోదీ ప్రసంగం
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో భారత ప్రధాని మోదీ మరోసారి ప్రసంగిం చనున్నారు. ఐక్యరాజ్యసమితి 74వ వార్షిక జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సెప్టెంబర్ 28వ తేదీ ఉదయం ప్రధాని మోదీ ప్రసంగం ఉండనుంది. ఈ సమావేశాల్లో పాల్గొని ప్రసంగించే ప్రపంచ దేశాధినేతల షెడ్యూల్‌ను యూఎన్ గురు వారం ప్రకటించింది. దీని ప్రకారం సెప్టెం బర్ 24 నుంచి 30 వరకు సాధారణ అసెం బ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమా వేశాల కోసం 112 దేశాల అధ్యక్షులు, 48 మంది ప్రభుత్వాధినేతలు, 30 మంది విదేశాంగ శాఖ మంత్రులు న్యూయార్క్ చేరుకోనున్నారు. ఈ పర్యటన లోనే మోదీ మరికొన్ని ఉన్నత స్థాయి సదస్సులకు హాజరు కానున్నారు. మోదీ మొదటిసారి 2014లో ఐరాసలో ప్రసంగించారు. -
మంచంపట్టిన ప్రజారోగ్యం
‘దండిగా ఉండే బంగారం, వెండి నిల్వల కంటే మించిన నిజమైన సామాజిక సంపద ప్రజారోగ్యమే’ అన్నారు మహాత్మా గాంధీ. ఇంత అపురూపమైన సంపదను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని తాజా నీతి ఆయోగ్ విడుదల చేసిన ఆరోగ్య సూచీ వెల్లడించింది. ఈ గణాంకాలు 2017–18కి సంబంధించినవి. ఆరోగ్యరంగంలో మెరుగైన పనితీరును ప్రదర్శించిన రాష్ట్రాల్లో ఎప్పటిలాగే కేరళ 74.01 స్కోర్‌తో అగ్ర భాగాన ఉంది. తదనంతర స్థానాల్లో ఆంధ్రప్రదేశ్(65.13), మహారాష్ట్ర(63.99), గుజరాత్(63.52), పంజాబ్(63.01), హిమాచల్‌ప్రదేశ్(62.41), జమ్మూ–కశ్మీర్(62.37), కర్ణాటక (61.14), తమిళనాడు(60.41) వగైరాలున్నాయి. ఈమధ్యకాలంలో మెదడువాపు వ్యాధితో 170 మందికిపైగా పసిపిల్లలు మరణించిన బిహార్ 32.11తో, ఆ మాదిరి నాసిరకం వైద్య సేవలతో ఉత్తర ప్రదేశ్ 28.61తో అట్టడుగున ఉన్నాయి. రెండేళ్లక్రితం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో 600మంది పిల్లలు మెదడువాపు వ్యాధి బారినపడి కన్నుమూశారు. నీతి ఆయోగ్ మంచి పనితీరును ప్రదర్శించా యంటున్న రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గా ఉన్నమాట వాస్తవమే అయినా వాటి స్కోరు కనీసం 80 వరకూ వెళ్తేనే అవి ఆరోగ్యరంగంలో అన్నివిధాలా పటిష్టంగా ఉన్నట్టు లెక్క. ఆ సంగతలా ఉంచి ఆరోగ్య సేవల కల్పనలో రాష్ట్రాల మధ్య ఇంతగా వ్యత్యాసం ఉండటం ఆందోళన కలిగించే అంశం. రాష్ట్రాలమధ్యే కాదు– దాదాపు అన్ని రాష్ట్రాల్లోని నగరాలకూ, పట్టణాలకూ... పట్టణాలకూ, గ్రామాలకూ మధ్య కూడా ఇలాంటి వ్యత్యాసాలే ఉన్నాయి. మైదాన ప్రాంతాలకూ, ఆదివాసీ ప్రాంతాల మధ్యా ఇదే వరస. మరో దశాబ్దకాలంలో...అంటే 2030నాటికి ప్రపంచంలోని ప్రతి దేశమూ సుస్థిరాభివృద్ధి లక్ష్యా లను(ఎస్డీజీ) సాధించాలని ఐక్యరాజ్యసమితి నిర్దేశించింది. ఆ లక్ష్యాల్లో ‘అందరికీ, అన్నిచోట్లా’ సార్వత్రిక ఆరోగ్య సదుపాయం’ లభించడం కూడా ఒకటి. ఎంతటి అనారోగ్య సమస్య ఎదురైనా ఆర్థికపరమైన చిక్కుల్లో పడకుండా దాన్నుంచి పౌరులు బయటపడగలిగే స్థితి ఏర్పరచాలన్నదే ‘సార్వత్రిక ఆరోగ్య సదుపాయం’ సారాంశం. కానీ నీతిఆయోగ్ ఆరోగ్య సూచీని చూస్తే మన దేశంలో ఆ దిశగా బుడిబుడి అడుగులైనా పడుతున్నాయా అన్న సందేహం కలుగుతుంది. నీతిఆయోగ్ 2015 నుంచి ఏటా ఈ ఆరోగ్య సూచీని విడుదల చేస్తోంది. విషాదమేమంటే వీటిని గమనించుకుని సరి చేసుకోవాలని, ఇకపై మరింత మెరుగైన పనితీరును ప్రదర్శించాలని రాష్ట్రాలు ప్రయత్నిస్తున్న దాఖ లాలు లేవు. అత్యధిక రాష్ట్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కనీస పారిశుద్ధ్యం కొరవడి వైరస్‌లతో, బాక్టీరియాతో నిండి ఉంటున్నాయి. ఎక్కడా కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండటం లేదు. మందులు లేక, వైద్యులు లేక ఆసుపత్రులన్నీ అల్లాడుతున్నాయి. మొన్న అనేకమంది పసిపిల్లల ప్రాణాలు తీసిన ముజఫర్‌పూర్ ఆసుపత్రి దుస్థితి ఇదే. అక్కడ వెంటనే పిల్లలకు గ్లూకోజ్ అందిం చగలిగి ఉంటే వారిలో చాలామంది ప్రాణాలు నిలబడేవని వైద్య నిపుణులు చెబుతున్నారు. నీతి ఆయోగ్ ఆరోగ్య సూచీలు మాత్రమే కాదు... ఏటా విడుదలయ్యే జాతీయ శాంపిల్ సర్వే వంటివి కూడా ఎన్నో అంశాలను వెలుగులోకి తెస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, లాన్సెట్ కూడా అడపా దడపా హెచ్చరిస్తూనే ఉన్నాయి. కానీ ఎక్కడా కదలిక ఉండటం లేదు. ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్య ప్రదేశ్, రాజస్తాన్ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో మెజారిటీ జనం ఆరోగ్యానికి పెట్టే ఖర్చులు తడిసి మోపెడై అప్పుల బారినపడుతున్నారని ఒక సర్వే వెల్లడించింది. కొన్ని కుటుంబాల్లో తలసరి వినిమయం కన్నా ఆరోగ్య వ్యయమే అధికంగా ఉంటున్నదని తేల్చిచెప్పింది. జమైకా, బొలీవియా, వియత్నాం వంటి దేశాల పౌరులతో పోలిస్తే భారతీయులు చికిత్స కోసం చేసే వ్యయం బాగా ఎక్కువ. ఆర్థిక సంస్కరణల తర్వాత మన ఆర్థిక వ్యవస్థ శరవేగంతో అభివృద్ధి చెందింది. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) పుంజుకుంటోంది. కానీ దానికి దీటుగా ప్రామాణికమైన వైద్య సేవలు అందు బాటులోకి రావడం లేదు. సంపన్నులకు మాత్రమే అవి దక్కుతున్నాయి. ఇప్పుడు 23 అంశాలను ప్రాతిపదికగా తీసుకుని నీతిఆయోగ్ ఆరోగ్య సూచీని రూపొందించింది. అందులో నవజాత శిశు మరణాలు, శిశు మరణాలు, సంతాన సాఫల్యత రేటు, తక్కువ బరువుతో పుట్టే శిశువుల సంఖ్య, వ్యాధి నిరోధకత, క్షయవ్యాధి, మౌలిక సదుపాయాలు, హెచ్ఐవీ వంటివి అరికట్టడంలో సాధిస్తున్న పురోగతి, మౌలిక సదుపాయాల కల్పనలో సాధిస్తున్న ప్రగతి వగైరా అంశాలు అందులో ఉన్నాయి. నిరుటితో పోలిస్తే యూపీ, జార్ఖండ్ వంటివి స్వల్పంగా మెరుగైతే, తమిళనాడు స్థితి దిగజారింది. నిజానికి రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాసుపత్రుల్లో ఎన్ని దారుణాలు చోటు చేసుకున్నాయో లెక్కలేదు. బ్యాటరీ లైట్ల వెలుగులో శస్త్రచికిత్సలు, నవజాత శిశువులు ఎలుకలు కొరకడం వల్ల, చీమలు కుట్టడంవల్ల మరణించిన ఉదంతాలు బాబు పాలనలో జరిగి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఆరోగ్యశ్రీ, 108 వంటి ప్రాణప్రదమైన సేవలు నామమాత్రంగా మారాయి. నీతిఆయోగ్ ప్రాతిపదికల్లో ఇంకా అంటురోగాలు, మానసిక అనారోగ్యం, భయంకర వ్యాధులు వగైరాలను చేరిస్తే వాస్తవ చిత్రం మరింత స్పష్టంగా వెల్లడవుతుంది. సకాలంలో వైద్య సదుపాయం అందించగలిగితే జాతీయ స్థాయిలో సంభవించే మరణాల్లో కనీసం మూడోవంతు నిరోధించడం సాధ్యమేనని నిరుడు జాతీయ శాంపిల్ సర్వే వెల్లడించింది. మనతో సమానమైన తలసరి ఆదాయం గల దేశాలూ, తక్కువగా ఉన్న దేశాలు కూడా ఆరోగ్య రంగంలో మనకంటే ఎంతో మెరుగ్గా ఉంటు న్నాయి. మన దేశం ప్రజారోగ్యానికి కేటాయించే మొత్తం జీడీపీలో 1.02శాతం మించడం లేదు. దాన్ని 2.5 శాతానికి తీసుకెళ్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. చాలా దేశాలు ప్రజారోగ్యానికి 9.2 మొదలుకొని అయిదు శాతం వరకూ ఖర్చు చేస్తున్నాయి. కనుక కేటాయింపుల్ని మరింత పెంచి దేశంలో ప్రజారోగ్యరంగాన్ని పటిష్టం చేయడం తక్షణ కర్తవ్యమని పాలకులు గుర్తించాలి. -
భారత్‌కు ఆ హోదా ఇవాల్సిందే
పారిస్: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న భారత్‌కు ఆహోదా కల్పించాల్సిందేనని ఫ్రాన్స్ అభిప్రాయపడింది. భారత్‌తో పాటు జర్మనీ, బ్రెజిల్, జపాన్‌కు భద్రతా మండలిలో చోటు కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ప్రపంచీకరణ, సమకాలీన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆయా దేశాలకు శాశ్వత హోదా ఇవ్వాలని ఫ్రాన్స్ కోరింది. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో యూఎన్ఓ ఫ్రాన్స్ ప్రతినిధి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ అంశం ఆ దేశ వ్యూహాత్మక విధానాల్లో అత్యంత ప్రాధాన్య అంశంగా మారుతందని ఆయన పేర్కొన్నారు. ‘‘ఐరాస భద్రతా మండలి పరిధిని విస్తృతం చేయడం, అందుకు దారితీసే చర్చల్లో విజయం సాధించడానికి జర్మనీ, ఫ్రాన్స్‌కు పటిష్ఠ విధానం ఉంది. ప్రపంచ దేశాలకు తగిన ప్రాతినిధ్యం లభించాలంటే యూఎన్ఎస్సీలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది’’ అని ఐరాసలో ఫ్రాన్స్ శాశ్వత ప్రితినిధి ఫ్రానోయిస్ డెలాట్రే స్పష్టం చేశారు. అందులో భాగంగా భారత్, జర్మనీ, జపాన్, బ్రెజిల్‌తో పాటు ఆఫ్రికా దేశాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. దానికోసం తమవంతుగా ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో ప్రపంచ దేశాలను మధ్య సమన్వయం చేయడంలో యూఎన్ఓ పాత్రను మరింత పటిష్ఠం చేయడానికి జర్మనీ, ఫ్రాన్స్ కలిసి పనిచేస్తున్నాయని డెలాట్రే తెలిపారు. అందుకు మండలిలో తగిన మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. మండలి సంస్కరణ ఆవశ్యకతను భారత్ కూడా తీవ్రంగా పరిగణిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సంవత్సర ప్రారంభంలో జరిగిన ఓ సమావేశంలో.. మండలిలో సమాన ప్రాతినిధ్యం అంశాన్ని ఐరాస భారత ప్రతినిధి అక్బరుద్దీన్ కూడా లేవనెత్తిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలి విస్తరణకు 122 దేశాల్లో 113 సభ్య దేశాలు సముఖంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కాగా భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ తీవ్రంగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే అనేక అంతర్జాతీయ వేదికలపై కూడా భారత్ ఈ అంశాన్ని లేవనెత్తింది. ప్రపంచ దేశాల్లో భారత్ బలమైన శక్తిగా అవతరిస్తున్న నేపథ్యంలో భద్రతా మండలిలో సభ్యుత్వం ఖచ్చింతంగా సాధించాలని భారత్ ప్రయత్నిస్తోంది. దీని కొరకు ఇప్పటికే అనేక దేశాల మద్దతును కోరుతోంది.