
సాక్షి, న్యూఢిల్లీ : ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వ ఎన్నికల్లో భారత్ విజయం సాధించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఐరాస ఎన్నికల్లో ఎలాంటి పోటీలేకుండా భారత్ విజయం సాధించడం గొప్ప పరిణామం అన్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా స్పందించిన మోదీ.. తమకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని పేర్కొన్నారు. సభ్య దేశాలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. శాంతి, సామరస్యత, సమానత్వం, భద్రత వంటి అంశాలపై పోరాటంలో భారత తన పంథాను కొనసాగిస్తుందని మోదీ స్పష్టం చేశారు. కాగా బుధవారం రాత్రి జరిగిన ఎన్నికల్లో మొత్తం 193 ఓట్లు పోలవ్వగా భారత్‌కు 184 ఓట్లు దక్కాయి. దీంతో రెండేళ్ల పాటు (2021-22 ) ఆ స్థానంలో కొనసాగనుంది. (ఐరాస ఎన్నికల్లో భారత్ విజయం)
Comments
Please login to add a commentAdd a comment