
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలిలో ఐదు తాత్కాలిక సభ్యదేశాల నియామక ప్రక్రియ మొదలైంది. 75వ ఐక్యరాజ్యసమితి సమావేశాల అధ్యక్షుడిని ఎంపిక చేయడంతోపాటు సామాజిక, ఆర్థిక మండలి సభ్యుల నియామకానికి కూడా ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికలను ఐక్యరాజ్యసమితి సాధారణ సభ బుధవారం నిర్వహించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఎన్నికల్లో తమకు స్పష్టమైన విజయం లభించడం ఖాయమని భారత్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇందులో విజయం సాధిస్తే రెండేళ్లపాటు (2021–22) ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు తాత్కాలిక సభ్యదేశ హోదా లభిస్తుంది. 55 మంది సభ్యులున్న ఆసియా–పసిఫిక్ గ్రూప్ నుంచి కేవలం భారత్ ఒక్కటే పోటీ చేస్తోంది కాబట్టి గెలుపు తథ్యమే. భారత్ 1950–51, 1967–68, 1972–73, 1077–78, 1984–85, 1991–92, 2011–22లో భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశ హోదా దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment