ఐక్యరాజ్య సమితి: ఐక్యరాజ్య సమితి భద్రతా మండ లి అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ (29)ను బ్లాక్‌లిస్టులో పెట్టింది. అతని ఆచూకీ లేదా సమాచారం ఇచ్చిన వారికి అమెరి కా రూ.7 కోట్లు రివార్డు ప్రకటించి రోజే భద్రతా మం డలి ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. హమ్జాపై ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించడంతో ఇకపై అతడు స్వేచ్ఛగా తిరగలేడు. అతని ఆర్థిక వనరులను స్తంభింపజేయనున్నారు. అంతేకాకుండా ఆయు ధాలు కొనడం, అమ్మడంపై కూడా నిషేధం విధించనున్నారు.
అలాగే సౌదీ అరేబియా కూడా హమ్జా పౌరసత్వాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు శుక్రవా రం ప్రకటించింది. పాక్–అఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో హమ్జా ఉన్నట్లు అమెరికా అనుమానం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం అల్ ఖైదా నాయకుడిగా ఉ న్న అమన్ అల్–జవహిరికి వారసుడిగా హమ్జా అవుతాడని భావిస్తోంది. 2015 ఆగస్టులో హమ్జా బిన్ లాడెన్ ఒక ఆడియో, వీడియో సందేశాలను విడుదల చేశాడు. అందులో అమెరికా దాని మిత్రదేశాలపై దాడులు చేయాలని అతని అనుచరులకు పిలుపునిచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment