
లిస్ట్‌లో హీరో ఎలక్ట్రిక్, ఒకినావా, బెన్లింగ్
ఫేమ్–2 నిబంధనల ఉల్లంఘన నేపథ్యం
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్, బెన్లింగ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాల నుండి బ్లాక్‌లిస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫేమ్–2 పథకం కింద తప్పుగా అందుకున్న సబ్సిడీ ప్రయోజనాలను తిరిగి ఇవ్వడంలో ఈ సంస్థలు విఫలం కావడమే ఇందుకు కారణం.
ఈ పథకం కింద నమోదైన వివిధ తయారీ సంస్థలు ఫేమ్–2 మార్గదర్శకాలను ఉల్లంఘించడంపై భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు 2022లో ఫిర్యాదులు అందాయి. ఫేమ్–2 నిబంధన ప్రకారం దేశీయంగా విడిభాగాలను కొనుగోలు చేయకుండా విదేశాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకున్నాయన్నది ఈ ఫిర్యాదుల సారాంశం.