Ministry of Industry
-
బ్లాక్‌లిస్టులో ఈవీ కంపెనీలు!
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్, బెన్లింగ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాల నుండి బ్లాక్‌లిస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫేమ్–2 పథకం కింద తప్పుగా అందుకున్న సబ్సిడీ ప్రయోజనాలను తిరిగి ఇవ్వడంలో ఈ సంస్థలు విఫలం కావడమే ఇందుకు కారణం. ఈ పథకం కింద నమోదైన వివిధ తయారీ సంస్థలు ఫేమ్–2 మార్గదర్శకాలను ఉల్లంఘించడంపై భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు 2022లో ఫిర్యాదులు అందాయి. ఫేమ్–2 నిబంధన ప్రకారం దేశీయంగా విడిభాగాలను కొనుగోలు చేయకుండా విదేశాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకున్నాయన్నది ఈ ఫిర్యాదుల సారాంశం. -
శరవేగంగా ఏటీజీ టైర్స్ నిర్మాణ పనులు
సాక్షి, అమరావతి: జపాన్‌కు చెందిన యొకహోమా గ్రూపు కంపెనీ అలయన్స్ టైర్ గ్రూపు (ఏటీజీ) విశాఖలో ఏర్పాటుచేస్తున్న తయారీ యూనిట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విశాఖపట్టణంలోని అచ్యుతాపురం సెజ్ వద్ద సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ నిర్మాణ పనులను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించారు. తొలుత రూ.1,250 కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు చేయగా రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఏటీజీ ఈ మొత్తాన్ని రూ.2,500 కోట్లకు పెంచింది. ఇప్పటికే యూనిట్ ప్రధాన షెడ్ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చిందని పరిశ్రమలశాఖ అధికారులు తెలిపారు. 2023 ప్రారంభం నాటికి వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. తొలిదశలో 36,750 టన్నుల రబ్బరు వినియోగ సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ, నిర్మాణ, అటవీ రంగాల్లో వినియోగించే భారీ యంత్రాల టైర్లను తయారు చేస్తారు. రెండు దశలు పూర్తయితే ఐదువేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని, ఇందులో సగం మంది స్థానిక మహిళలకే అవకాశం కల్పిస్తామని ఏటీజీ అధికారులు తెలిపారు. దేశంలో మూడో ప్లాంట్ జపాన్‌కు చెందిన ఏటీజీకి దేశంలో ఇప్పటికే గుజరాత్‌లోని ధహేజ్లో, తమిళనాడులోని తిరువన్వేళిలో తయారీ యూనిట్లున్నాయి. విశాఖలో ఏర్పాటు చేస్తున్నది మూడో యూనిట్. ధహేజ్ యూనిట్ ఉత్పత్తి సామర్థ్యం 1.26 లక్షల టన్నులు కాగా 2,600 మందికి ఉపాధి కల్పిస్తోంది. తిరువన్వేళి యూనిట్ సామర్థ్యం 86,800 టన్నులు కాగా 2,300 మంది ఉపాధి పొందుతున్నారు. -
విశాఖలో భారీ స్టీల్ క్లస్టర్
సాక్షి, అమరావతి: తయారీ వ్యయాన్ని తగ్గించడం ద్వారా ఎగుమతి అవకాశాలను పెంచుకునే విధంగా విశాఖలో భారీ స్టీల్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్రం ముందుకు వచ్చింది. ఇందుకోసం విశాఖ సమీపంలో పూడిమడక వద్ద సుమారు వెయ్యి ఎకరాల్లో స్టీల్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఉత్పత్తి ఆధారిత రాయితీలు (పీఎల్ఐ) స్కీం కింద కీలకమైన పదిరంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి (ఈడీబీ), ఏపీఐఐసీ, పరిశ్రమలశాఖ అధికారుల బృందం సోమ, మంగళవారాల్లో ఢిల్లీలో వివిధ శాఖల అధికారులతో జరిపిన చర్చలు విజయవంతమైనట్లు రాష్ట్ర పరిశ్రమలశాఖ డైరెక్టర్ జవ్వాది సుబ్రమణ్యం మీడియాకు చెప్పారు. పీఎల్ఐ కింద విశాఖపట్నం ఉక్కు కర్మాగారం సమీపంలో స్టీల్ క్లస్టర్ ఏర్పాటు ప్రతిపాదనలను ఉక్కు మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి రసికా చాబేకి వివరించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పూర్ణోదయ ప్రాజెక్టు కింద పరిశ్రమలశాఖ ప్రతిపాదించిన విశాఖలోని పూడిమడక వద్ద క్లస్టర్ ఏర్పాటుకు సహకరిస్తామని చౌబే హామీ ఇచ్చినట్లు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఏపీ నుంచి ఎగుమతులు రెట్టింపవుతాయని, దీనికి అనుగుణంగా ప్రభుత్వం సప్లై చైన్, ఎగుమతి వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తెలిపారు. అనంతపురంలో అపెరల్ పార్కు, నగరిలో టెక్స్టైల్ పార్కులతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, ఆటో, ఏరోస్పేస్, ఇంజనీరింగ్ వంటి పదిరంగాల్లో థీమ్ ఆధారిత పార్కులను అభివృద్ధి చేయడానికి కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు ఏపీఐఐసీ వీసీ, ఎండీ రవీన్‌కుమార్‌రెడ్డి చెప్పారు. వీటితో పాటు పారిశ్రామిక కారిడార్లలో భాగంగా అభివృద్ధి చేస్తున్న వివిధ నోడ్ల వివరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో అక్టోబర్–డిసెంబర్ కాలంలో రాష్ట్రం రెండో స్థానంలో ఉండటంపై డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమెషన్ ఆఫ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐటీ) కార్యదర్శి గురుప్రసాద్ మోహాపాత్ర రాష్ట్ర అధికారులను అభినందించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి చేపడుతున్న సంస్కరణలు, స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించడంపట్ల మన రాష్ట్ర కృషిని తైవాన్ ఇండియా ప్రతినిధి బాషన్ మెచ్చుకున్నారని చెప్పారు. వైఎస్సార్ కడప జిల్లాలో తాజాగా అపాచీ పెట్టుబడులు పెట్టడమే తైవానీయులకు ఆంధ్రప్రదేశ్ పట్ల గల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. పీఎల్ఐ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.1.46 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేయగా అందులో అత్యధిక భాగం రాష్ట్రానికి తీసుకువచ్చే విధంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్లు రవీన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. -
ఐటీకి తెలంగాణ బంగారు గని
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి తెలంగాణ రాష్ట్రం బంగారు గనిగా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. దీంతో ఇక్కడ ఐటీ సంస్థలు, అందులో పనిచేసే ఉద్యోగులు గణనీయంగా లబ్ధి పొందుతున్నారని చెప్పారు. ఐటీ రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పాలసీలు, ప్రోత్సాహకాలు అమలు చేస్తోందని వెల్లడించారు. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్), క్రెడిట్ రిపోర్టింగ్ బహుళ జాతి సంస్థ ఈక్విఫాక్స్ శుక్రవారం మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఈ రెండు సంస్థల భాగస్వామ్యం ద్వారా ఉపాధి కల్పన ప్రక్రియ మెరుగ్గా, మరింత పారదర్శకంగా జరుగుతుంది. ఉద్యోగ కల్పన రంగంలో ఈ ఒప్పందం మైలురాయి వంటిది. సమర్థత కలిగిన ఉద్యోగులను సంస్థలు నియమించుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుంది’అని వ్యాఖ్యానించారు. డీట్ వేదిక ద్వారా రాష్ట్రంలోని ఉద్యోగార్థులు తమ నైపుణ్యానికి తగిన ఉద్యోగాలను వెతుక్కోవచ్చని మంత్రి మల్లారెడ్డి అన్నారు. నియామక సంస్థలకు కూడా తమకు అవసరమైన మానవ వనరులను ఎంపిక చేసుకునే వీలు కలుగుతుందని చెప్పారు. ఉపాధి కల్పన రంగంలో ఈ తరహా వేదిక దేశంలోనే మొదటిదని ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. కార్యక్రమంలో ఈక్విఫాక్స్ ఇండియా ఎండీ కేఎం నానయ్య, వర్క్‌ఫోర్స్ సొల్యూషన్స్ ప్రతినిధి నిపా మోదీ, వర్క్‌రూట్ సీఈఓ మణికాంత్ చల్లా పాల్గొన్నారు. డీట్‌తో సత్వర ఉద్యోగాలు కృత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీ ఆధారంగా వర్క్‌రూట్ సంస్థ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) యాప్‌ను రూపొందించింది. ఉద్యోగాల కోసం అన్వేషించే వారు, ఉద్యోగాలిచ్చే వారు డీట్ వేదికగా సంప్రదింపులు జరుపుకునేలా యాప్‌ను సిద్ధం చేశారు. ఇలా ఎంపికైన ఉద్యోగుల వివరాలను వెరిఫై చేసేందుకు ప్రస్తుతం 8 నుంచి 10 రోజుల సమయం పడుతోంది. అయితే ప్రస్తుతం ఈక్విఫాక్స్‌తో డీట్ భాగస్వామ్యం ద్వారా ఇంటర్వ్యూలో ఎంపికైన ఉద్యోగుల వివరాలను తక్షణమే తెలుసుకునే అవకాశముంటుంది. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి కల్పన వాతావరణానికి డీట్, ఈక్విఫాక్స్ భాగస్వామ్యం కొత్త రూపునిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. -
కాలుష్య రహితంగా ఫార్మాసిటీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ ఫార్మా సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. మంగళవారం ‘టీ ఫైబర్’కార్యాలయంలో హైదరాబాద్ ఫార్మాసిటీపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో పాటు, ఆర్థిక, పురపాలక, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. ఫార్మాసిటీలో తమ యూ నిట్ల ఏర్పాటుకు వందలాది ఫ్యాక్టరీలు ఎదు రు చూస్తున్నాయని తెలిపారు. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా కాలుష్య రహితంగా ఫార్మాసిటీని తీర్చిదిద్దాలని కేటీఆర్ అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మాసిటీని ఏర్పాటు చేసేందుకు పరిశ్రమల శాఖ అధికారులు ఇప్పటికే పలు దేశాల్లోని ఫార్మా క్లస్టర్లను సందర్శించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. విండ్ ఫ్లో వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మాస్టర్‌ప్లాన్ రూపొందించినట్లు వెల్లడించారు. ఫార్మాసిటీని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు జీరో లిక్విడ్ డిశ్చార్జి యూనిట్లు ఎక్కువగా ఏర్పాటవుతాయని తెలిపారు. రసాయన వ్యర్థాలను కేంద్రీకృతంగా శుద్ధి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని, ఫార్మాసిటీలో పనిచేసే వారికి అక్కడే నివాస సౌకర్యం ఉంటుందన్నారు. ఫార్మాసిటీకి అనుబంధంగా అత్యుత్తమ విద్యా సంస్థలు ఏర్పడతాయని పేర్కొన్నారు. అలాగే స్థానికులకు ఉద్యోగాలు కల్పించేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి పాల్గొన్నారు. -
మౌలిక రంగానికి కరోనా సెగ..
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ఎంత తీవ్రంగా ఉందన్న అంశాన్ని తాజాగా వెలువడిన మార్చి మౌలిక రంగం గణాంకాలు వెల్లడించాయి. ఎనిమిది పారిశ్రామిక రంగాల గ్రూప్ ఉత్పత్తి మార్చిలో అసలు వృద్ధి నమోదుచేసుకోకపోగా –6.5 క్షీణతలోకి జారిపోయింది. తాజా గణాంకాలను గురువారం వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసింది. ఎనిమిది రంగాలనూ పరిశీలిస్తే... ► క్రూడ్ ఆయిల్ (–5.5 శాతం), సహజ వాయువు (–15.2 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (–0.5%), ఎరువులు (–11.9%) స్టీల్ (–13 శాతం), సిమెంట్ (–24.7%), విద్యుత్ (–7.2 శాతం) రంగాలు క్షీణ రేటును నమోదుచేసుకున్నాయి. ► ఇక బొగ్గు ఉత్పత్తి వృద్ధిలోనే ఉన్నా, ఈ రేటు 9.1 శాతం నుంచి 4.1 శాతానికి పడింది. ఏప్రిల్–మార్చి 0.6 శాతం: 2019 మార్చిలో ఈ ఎనిమిది రంగాల వృద్ధి రేటు 5.8%. ఈ ఏడాది ఫిబ్రవరిలో 7 శాతం వృద్ధి చోటుచేసుకుంది. ఇక 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి మధ్య ఈ ఎనిమిది రంగాల వృద్ధి రేటు కేవలం 0.6%గా నమోదయ్యింది. 2018–19లో ఈ రేటు 4.4%. వృద్ధికి మౌలికం కీలకం: ఆర్థికశాఖ టాస్క్‌ఫోర్స్ ఇదిలావుండగా, భారత్ వృద్ధికి, 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరడానికి మౌలిక రంగం అభివృద్ధి కీలకమని ఆర్థికమంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ఒక టాస్క్‌ఫోర్స్ తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు తుది నివేదికను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు సమర్పించింది. మౌలిక రంగంలో ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టుల పూర్తికి ప్రయత్నం, కొత్తప్రాజెక్టులు చేపట్టడం వృద్ధికి కీలకమని అభిప్రాయపడింది. 2019–20 నుంచి 2024–25 మధ్య మౌలిక రంగంలో దాదాపు రూ.111 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమవుతాయని విశ్లేషణలను ప్రస్తావించింది. మౌలిక రంగం పర్యవేక్షణ, అమలు, నిధుల సమీకరణ విషయంలో దృష్టి పెట్టడానికి మూడు వేర్వేరు గ్రూపులను ఏర్పాటు చేయాలని టాస్క్‌ఫోర్స్ సూచించింది. -
‘బిల్ట్’కు మంచి రోజులు !
సాక్షి, హైదరాబాద్: ఖాయిలా పడిన బల్లార్పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (బిల్ట్)కు మంచి రోజులొచ్చాయి. భూపాలపల్లి జిల్లా కమలాపూర్ బిల్ట్ (పూర్వం ఏపీ రేయాన్స్) పునరుద్ధరణకు రూ.192 కోట్లు విలువ చేసే ప్రత్యేక రాయితీ, ప్రోత్సాహాకాలను మంజూరు చేస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రం ఏర్పడటానికి ముందు 2014 ఏప్రిల్‌లో బిల్ట్ మూత పడటంతో 750 కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. కంపెనీ పునరుద్ధరణ కోసం యాజమాన్యంతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు కె. తారకరామారావు, చందూలాల్ పలు మార్లు చర్చలు జరిపారు. ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లుగా కంపెనీ యాజమాన్యం, కార్మికులు, కార్మిక శాఖ అధికారులు, కార్మిక సం ఘాల నేతలతో ఈ సమావేశాలు జరిగాయి. గత నెల జరిగిన చర్చల సందర్భంగా కంపెనీ పునరుద్ధరణకు నిర్ణయం తీసుకొని వారం రోజుల్లో ప్రణాళికలతో రావాలని ప్రభుత్వం యాజమాన్యానికి సూచించింది. ఈ క్రమంలో కంపెనీ కోరిన పునరుద్ధరణ ప్యాకేజీ ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. పెట్టుబడి రాయితీ రూ.12.5 కోట్లు.. ముడి సరుకు (పల్ప్ వుడ్) కొనుగోళ్లపై ఏటా రూ.21 కోట్లు చొప్పున ఏడేళ్ల పాటు, విద్యుత్ కొనుగోళ్లపై ఏటా రూ.9 కోట్లు చొప్పున ఐదేళ్ల పాటు.. మొత్తం రూ.192 కోట్ల రాయితీని ప్రభుత్వం మంజూరు చేసింది. దీనికి అదనంగా మెట్రిక్ టన్ను బొగ్గుపై రూ.1,000 చొప్పున ఏటా 1,50,000 మెట్రిక్ టన్నుల బొగ్గుకు ఏడేళ్ల పాటు రాయితీ అందించనుంది. కంపెనీ ప్లాంట్ ఆధునికీకరణకు యాజమాన్యం అదనంగా రూ.125 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాగా, అందులో 10 శాతాన్ని పెట్టుబడి రాయితీగా రూ.12.5 కోట్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది. కంపెనీ నుంచి రావాల్సిన పన్నులు, విద్యుత్ బకాయిలు, అటవీ శాఖకు రావాల్సిన బకాయిలను విడతల వారీగా రాబట్టుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వానికి రూ.34.5 కోట్ల వాణిజ్య పన్నుల బకాయిలను చెల్లించాల్సి ఉండగా, తక్షణమే రూ.10 కోట్లు.. మిగిలిన బకాయిలను వడ్డీ లేని వాయిదాలుగా 60 నెలల్లో చెల్లించాలని ప్రభుత్వం కోరింది. రూ.3.34 కోట్ల విద్యుత్ బిల్లులను చెల్లించాల్సి ఉండగా, తక్షణమే రూ.కోటి.. మిగిలిన బకాయిలను 30 నెల వాయిదాల్లో చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అలాగే అటవీ శాఖకు రూ.4.75 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండగా, రెండేళ్ల మారటోరియాన్ని ప్రభుత్వం విధించింది. ఆ తర్వాత వడ్డీ లేకుండా 30 నెలల వాయిదాల్లో చెల్లించాలని కోరింది. మరో విజయం: కేటీఆర్ కొత్త పరిశ్రమల ఏర్పాటుతో పాటు మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణకు కేసీఆర్ మార్గదర్శనంలో ముందుకు సాగుతున్న తమకు దక్కిన మరో విజయం ‘బిల్ట్’అని కేటీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో వందల కుటుంబాలకు ఉపాధి లభిస్తుందన్నారు. తమ ప్రభుత్వం కార్మిక పక్షపాతి అని, కార్మికుల బతుకులు బాగు చేయడానికి ఖాయిలా పరిశ్రమలను పునరుద్ధరించే విధానాన్ని అమలు చేస్తోందన్నారు. -
పత్తాలేని టీ–ప్రైమ్..!
సాక్షి, హైదరాబాద్: ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు ఇతర మైనారిటీ సామాజిక వర్గాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం కరువైంది. ఉత్పాదక రంగంలో అట్టడుగున కార్మికులుగా గణనీయ సంఖ్యలో ఉన్న ఈ సామాజిక వర్గాల ప్రజలు ఈ స్థాయిని అధిగమించి పారిశ్రామికవేత్తలుగా ఎదగలేకపోతున్నారు. మైనారిటీ వర్గాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీ, ప్రోత్సాహకాలు అందించేందుకు ఎలాంటి పథకం లేకపోవడంతో ఈ వర్గాల నుంచి పారిశ్రామికవేత్తలు తయారు కావట్లేదు. దళిత, గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాయితీ, ప్రోత్సాహకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2014 నవంబర్ 2న ‘తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ రాపిడ్ ఇంక్యూబేషన్ ఆఫ్ దళిత్ ఎంట్రప్రెన్యూర్స్(టీ–ప్రైడ్)’అనే కార్యక్రమాన్ని ప్రకటించింది. మైనారిటీ సామాజిక వర్గాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇదే తరహా ప్రోత్సాహం అందించేందుకు త్వరలో‘తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ రాపిడ్ ఇంక్యూబేషన్ ఆఫ్ మైనారిటీస్ ఎంట్రప్రెన్యూర్స్ (టీ–ప్రైమ్) అనే కొత్త పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ దాదాపు 9 నెలల కింద అసెంబ్లీలో ప్రకటించారు. ఈ పథకం ద్వారా మైనారిటీ వర్గాల పారిశ్రామికవేత్తలకు దళిత, గిరిజనులతో సమానంగా రాయితీ, ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. టీ–ప్రైమ్ విధాన రూపకల్పన బాధ్యతలను మైనారిటీల సంక్షేమశాఖకు అప్పగించింది. ఇప్పటికీ ముసాయిదా విధానాన్ని ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపలేదు. పరిస్థితి ఇలా ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కాదు వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా టీ–ప్రైమ్ అమల్లోకి వచ్చే సూచనలు కన్పించట్లేదని పరిశ్రమల శాఖ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రోత్సాహం లేక నిరుత్సాహం.. ప్రస్తుతం అమల్లో ఉన్న సాధారణ రాయితీ విధానం కింద మైనారిటీ వర్గాల పారిశ్రామికవేత్తలకు రూ.20 లక్షలకు మిం చకుండా గరిష్టంగా 15 శాతం వరకు మాత్రమే పెట్టుబడి రాయితీ లభిస్తోంది. టీ–ప్రైమ్ అమల్లోకి వస్తే మైనారిటీ వర్గాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు రూ.75 లక్షల వరకు గరిష్టంగా 35 శాతం పెట్టుబడి రాయితీని ప్రభుత్వం అందించనుంది. ఐదేళ్ల వరకు విద్యుత్ బిల్లులు, స్టేట్ జీఎస్టీ వాటాతో పాటు పలు రకాల పన్నులను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఈ పరిశ్రమల యజమానులకు చెల్లిస్తుంది. టీ–ప్రైమ్‌ను అమల్లోకి తెస్తే ఇలాంటి ఎన్నో ప్రత్యేక ప్రోత్సాహకాలు మైనారిటీ వర్గాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందనున్నాయి. అయితే, టీ–ప్రైమ్ విధాన రూపకల్పనలో జరుగుతున్న జాప్యంతో మైనారిటీ వర్గాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని కోల్పోతున్నారు. పరిశ్రమల శాఖ అభిప్రాయాన్ని కోరాం టీ–ప్రైమ్ ముసాయిదా రూపొందించి పరిశ్రమల శాఖ అభిప్రాయాన్ని కోరాం. అక్కడి నుంచి సలహాలు, సూచనలు అందాక ముసాయిదాకు తుది రూపునిచ్చి ప్రభుత్వ ఆమోదానికి పంపిస్తాం. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే అమల్లోకి తీసుకొస్తాం. –ఉమర్ జలీల్, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి -
విశాఖలో రైలింజన్లు, బోగీల కర్మాగారం!
స్టాడ్లర్ రైల్ మేనేజ్మెంట్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిపిన సీఎంవో జ్యూరిచ్‌లో పలు సంస్థలతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ సాక్షి, అమరావతి: రైలింజన్లు, బోగీల తయారీ కర్మాగారాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్ రైల్ మేనేజ్మెంట్ ఏజీ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) వెల్లడించింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు వెళుతూ మధ్యలో జ్యూరిచ్‌లో ఆగిన ముఖ్యమంత్రి.. సోమవారం అక్కడ స్టాడ్లర్ రైల్ మేనేజ్మెంట్ ఏజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పీటర్ జెనెల్టర్ తదితరులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా స్టాడ్లర్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏపీలో ప్రారంభించాలని సీఎం కోరగా అందుకు సంస్థ ప్రతినిధులు అంగీకరించారు. అల్యూమినియంతో బోగీలు తయారు చేయడం తమ ప్రత్యేకతని పీటర్ చెప్పారు. రైలింజన్లు, బోగీల తయారీ కర్మాగారంతో పాటు అన్ని విడిభాగాల తయారీకి విశాఖలో మరో ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతామన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలోని రెండు నగరాల్లో మెట్రో రైలు వ్యవస్థలను నెలకొల్పనున్నామని, హైస్పీడు రైళ్లను ప్రవేశపెడతామని చెప్పారు. రైల్వే మంత్రి కూడా ఏపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండడం వల్ల ఉత్పాదక కేంద్రాల ఏర్పాటుకు సానుకూలాంశాలు అధికంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు తగినంత భూ బ్యాంకు ఉందని తెలిపారు. పోలవరం జల విద్యుత్ కేంద్రానికి బీకేడబ్ల్యూ సాంకేతికత ఏపీలోని జల విద్యుత్ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే విషయాన్ని పరిశీలిస్తామని స్విట్జర్లాండ్‌కు చెందిన బీకేడబ్ల్యూ ఎనర్జీ సంస్థ హామీ ఇచ్చింది. జ్యూరిచ్‌లో ఆ సంస్థ ప్రతినిధి పాల్ కాజ్, ఎస్ఐసీసీ అధ్యక్షుడు ఫ్రాన్సిస్కో ఘోరితో సీఎం చంద్రబాబు పలు అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని సీఎం కోరగా.. వారు తమ సమ్మతి తెలిపారు. దీనికి ముందు యూరోపియన్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చి కౌన్సిల్ ప్రతినిధులతో ఏర్పాటైన ద్వైపాక్షిక సమావేశంలోనూ సీఎం పాల్గొన్నారు. ఎస్వీయూ, ఆంధ్ర, ఎఎన్‌యూల్లో సంస్థ నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాలని, అమరావతిలో సంస్థ కార్యకలాపాలు విస్తరించాలని వారిని సీఎం కోరారు. అలాగే జర్మనీలో ముఖ్యమంత్రితో ఈఈఏఆర్సీ వ్యవస్థాపకుడు, ఏపీకి చెందిన రాజ్ వంగపండు, డ్యూర్ టెక్నాలజీస్ ప్రతినిధులు సమావేశమయ్యారు. సీఎం వెంట ఆర్థిక మంత్రి యనమల, ప్రభుత్వ సలçహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, సీఎం ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, ఇంధన వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ఆర్థికాభివృద్ధి బోర్డు సీఈవో జాస్తి కృష్ణకిశోర్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి సాల్మన్ ఆరోగ్యరాజ్ తదితరులున్నారు. -
రూ.8 వేల కోట్లతో ఫార్మాసిటీ
-
రూ.8 వేల కోట్లతో ఫార్మాసిటీ
• రంగారెడ్డిలో 12,500 ఎకరాలు సేకరించాలని పరిశ్రమల శాఖ ఆదేశం • తొలి దశలో 5 వేల ఎకరాలు సేకరించాలని నిర్ణయం • అంతర్గత మౌలిక సదుపాయాలకు రూ.1,600 కోట్ల ఖర్చు సాక్షి, హైదరాబాద్: దేశంలో మరెక్కడా లేనివిధంగా పెద్ద ఎత్తున ఫార్మా సిటీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దాదాపు రూ.8 వేల కోట్ల వ్యయంతో అంతర్జాతీయ స్థారుులో ‘హైదరాబాద్ ఫార్మా సిటీ లిమిటెడ్’ పేరిట జాతీయ పెట్టుబడుల ఉత్పత్తుల కేంద్రం(నిమ్జ్)ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఏకంగా 12,500 ఎకరాల్లో ఫార్మా సిటీ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంలో టీఎస్ఐఐసీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఇప్పటికే ఫార్మా సిటీ ఏర్పాటుకు సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించే బాధ్యతను సింగపూర్ సంస్థకు అప్పగించారు. ఇటీవల పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరా మారావుకు సింగపూర్ సంస్థ ప్రెజెంటేషన్ రూపంలో ప్రాథమిక నివేదిక కూడా అందజేసింది. ఫార్మాసిటీలో అంతర్గత మౌలిక సదుపాయాల కోసం రూ.1,600 కోట్లు(20 శాతం) ఖర్చు చేయాలని తన నివేదికలో ప్రతిపాదించింది. ఫార్మా సిటీ ఏర్పాటు ద్వారా దాదాపు రూ.64 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. అట్లాగే ప్రత్యక్షంగా 1.3 లక్షల మందికి ఉద్యోగాలు, పరోక్షంగా 3.25 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని భావిస్తోంది. మరోవైపు ఫార్మాసిటీ మాస్టర్ ప్లానింగ్ డిజైన్ కోసం ప్రభుత్వం రూ.30 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిసింది. తొలి దశలో 5 వేల ఎకరాల సేకరణ తొలి దశలో 5 వేల ఎకరాలను సేకరించాలని, 2017 మార్చి నాటికి ఫార్మా కంపెనీలకు భూమిని కేటారుుంచాలని పరిశ్రమల శాఖ ప్రణాళిక రూపొందించింది. మొదటి దశలో హడ్కోనుంచి రూ.550 కోట్లు రుణం తీసుకోవాలని నిర్ణరుుంచింది. ఫార్మాసిటీలో ఫార్మా యూనివర్సిటీ, నైపుణ్యాభివృద్ధి శిక్షణా సంస్థ, ఇంక్యూబేషన్ సెంటర్‌ను నెలకొల్పాలని ఆ శాఖ అధికారులు యోచిస్తున్నారు. ఫార్మా సిటీలో కంపెనీలు నెలకొల్పేందుకు 200 సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు చెబుతున్నారు. ఫార్మాసిటీకి సంబంధించి పూర్తి వివరాలను నాలుగైదు రోజుల్లో పరిశ్రమల మంత్రి కేటీఆర్ వెల్లడించనున్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు పేర్కొన్నారుు. -
‘సూక్ష్మ, చిన్నతరహా’కు మహర్దశ
- ఖారుులా సంస్థలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన ప్రభుత్వం - ఇండస్ట్రియల్ హెల్త్ క్లీనిక్ విధానం రూపకల్పన - రూ.100 కోట్లతో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స కార్పొరేషన్ ఏర్పాటుకు కసరత్తు - పావలా వడ్డీకే రుణాలిచ్చి ఎంఎస్ఎంఈలను ఆదుకునేలా ప్రతిపాదన - వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు సాక్షి, హైదరాబాద్: ‘‘గడిచిన 9 నెలల్లోనే రాష్ట్రానికి రూ. 44,791 కోట్ల పెట్టుబడులతో 2,550 కొత్త పరిశ్రమలొచ్చారుు. వాటి ద్వారా ప్రత్యక్షంగా 1,60,894 మందికి ఉద్యోగాలు లభించారుు’’ రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన ఇది. గత పదేళ్లలో లక్షల కోట్ల పెట్టుబడులు లక్షలాది మందికి ఉపాధి కల్పించినట్లు రికార్డులు చెబుతున్నారుు. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. గత రెండున్నరేళ్ల కాలంలో రాష్ట్రంలో ఖారుులా పడ్డ సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు వెరుు్యకి పైమాటే. ఇవిగాకుండా రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో ఖారుులా పడ్డ పరిశ్రమల సంఖ్య 7,840. తద్వారా రోడ్డునపడ్డ కార్మికుల సంఖ్య లక్షపైమాటే. ఇవన్నీ కూడా పరిశ్రమల శాఖ వద్దనున్న గణాంకాలే. ఇది నాణేనికి రెండోవైపు. ఇండస్ట్రియల్ హెల్త్ క్లీనిక్ విధానం ఒకవైపు పెద్ద పెద్ద పరిశ్రమల ఏర్పాటుకు అనేక రారుుతీలిస్తూ పారిశ్రామికాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వానికి ఇది తీవ్ర ఆందోళన కలిగి స్తోంది. ఖారుులా సంస్థలను గట్టెక్కించేందుకు స్టేట్ లెవెల్ ఇంటర్ ఇన్స్టిట్యూషనల్ కమిటీ(స్లిక్) చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఇండస్ట్రియల్ హెల్త్ క్లీనిక్ ’ పేరిట కొత్త తరహా విధానానికి శ్రీకారం చుట్టింది. నాన్‌బ్యాంకింగ్ కార్పొరేషన్ ఏం చేస్తుందంటే... ఖారుులా దిశగా పయనించే సంస్థలకు బ్రిడ్జ ఫైనాన్స తరహాలో పావలా వడ్డీకే స్వల్పకాలిక (90 రోజుల్లో తిరిగి చెల్లించేలా) రుణాలిచ్చి ఆదుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ (టీఎస్ఐడీసీ) పరిధిలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స కార్పొరేషన్(ఎన్‌బిఎఫ్‌సీ)ను ఏర్పాటు చేసేలా ప్రతిపాదన రూపొందించింది. అందులో రూ.100 కోట్ల కార్పస్‌ఫండ్‌ను జమ చేస్తారు. ఈ ప్రతిపాదన ప్రకారం....ఈ కార్పొరేషన్ ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తారు. ఐఏఎస్, డిపార్ట్మెంట్ వ్యక్తిని కాకుండా ఫండ్‌ను మేనేజ్‌చేసే వ్యక్తిని కార్పొరేషన్ సీఈవోగా నియమిస్తారు. ఖారుులా దిశగా పయనిస్తున్న పరిశ్రమలు సాయం కోసం బోర్డుకు దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి అర్హత ఉన్న వాటికి రుణం అందిస్తారు. ఆ రుణాన్ని నేరుగా కాకుండా ఖారుులా దిశగా వెళుతున్న సంస్థలకు ఏ బ్యాంకు రుణమిచ్చిందో... మళ్లీ ఆ బ్యాంకు ద్వారానే రుణం మంజూరు చేరుుస్తారు. రుణం కోసం దరఖాస్తు మొదలు మంజూరు వరకు ప్రక్రియ మొత్తం ఆన్లైన్లో జరుగుతుంది. అందరి భాగస్వామ్యంతోనే కార్పస్‌ఫండ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల భాగస్వామ్యంతోనే రూ.వంద కోట్ల కార్పస్‌ఫండ్ మొత్తాన్ని సమకూరుస్తారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ, ప్రమోషన్(డీఐపీపీ) శాఖ తెలంగాణకు రూ.50 కోట్లు ఇవ్వాలి. ఆ మొత్తాన్ని కార్పస్‌ఫండ్‌కు జమ చేస్తారు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.10 కోట్లు సమకూరుస్తుంది. ఈ కార్పస్‌ఫండ్‌లో భాగస్వాములు కాదల్చుకున్న సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు బ్యాంకు నుంచి తీసుకున్న రుణ మొత్తంలో గరిష్టంగా ఒక శాతం లేదా కనిష్టంగా రూ.10 వేలు చెల్లించి ఎన్బీఎఫ్సీలో సభ్యత్వం తీసుకోవాలి. తద్వారా మరో రూ.10 కోట్లు సమకూరుతుంది. దీంతో కలిపి రూ.70 కోట్లు జమ అవుతుండగా, మిగిలిన రూ.30 కోట్లు బ్యాంకుల ద్వారా సమకూర్చుకునేలా ప్రతిపాదన రూపొందించారు. బ్యాంకులు సమకూర్చే మొత్తానికి కార్పొరేషన్ 8 శాతం వడ్డీ చెల్లించేలా ప్రతిపాదన రూపొందించారు. ఈ ప్రతిపాదనను క్షుణ్నంగా పరిశీలించిన ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. పది రోజుల్లో నిర్ణయం వెల్లడి! ఎన్బీఎఫ్సీ ఏర్పాటు, బోర్డు సభ్యులు, సీఈవో నియామకం, కార్పస్‌ఫండ్ సేకరణ వంటి ఏర్పాట్లకు మరో మూడు నెలల సమయం పట్టే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం విధాన నిర్ణయం ప్రకటించిన వెంటనే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎన్బీఎఫ్సీని అమల్లోకి తీసుకొస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీనిపై విధానపరమైన నిర్ణయాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వారం, పది రోజుల్లో ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. -
2,550 కొత్త పరిశ్రమలొచ్చాయ్!
- గత 9 నెలల్లో ప్రత్యక్షంగా 1.6 లక్షలు, పరోక్షంగా 4.5 లక్షల మందికి ఉపాధి - టీఎస్ఐపాస్తో రూ. 44,791 కోట్ల పెట్టుబడుల రాక - తెలంగాణ పారిశ్రామిక ప్రగతి వివరాలను వెల్లడించిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: కొత్త పారిశ్రామిక విధానం (టీఎస్ఐపాస్) అమల్లోకి వచ్చాక పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. గడచిన 9 నెలల్లో రాష్ట్రానికి 2,550 కొత్త పరిశ్రమలు రాగా, ఏకంగా రూ.44,791 కోట్ల పెట్టుబడులొచ్చాయి. ఆయా పరిశ్రమల ద్వారా ఇప్పటికే ప్రత్యక్షంగా 1,60,894 మందికి, పరోక్షంగా 4.5 లక్షల మందికి పైగా ఉపాధి లభించింది. రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త పరిశ్రమల్లో ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఫార్మా, పవర్, ప్లాస్టిక్, ఇంజ నీరింగ్, ఆగ్రో బేస్డ్, గ్రానైట్ స్టోన్ క్రషింగ్, ఎల క్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పేపర్, ప్రింటింగ్, టెక్స్టైల్, సిమెంట్, ఏరోస్పేస్, సోలార్, ఆటోమొబైల్ రంగాలకు చెందినవి ఉన్నాయి. గత 9 నెలల్లో రాష్ట్రానికి వచ్చిన కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి కల్పనపై రాష్ట్ర పరిశ్రమల శాఖ నివేదిక రూపొందించింది. ఏ జిల్లాలో ఎన్ని కోట్ల పెట్టుబడులొచ్చాయి? ఎన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యాయి? ఎంత మందికి ఉద్యోగాలు కల్పించామనే వివరాలను అందులో పొందుపర్చింది. అధికంగా రంగారెడ్డి జిల్లాలో 68,622 మందికి ఉద్యోగాలు కల్పించారు. సంగారెడ్డి, మేడ్చల్, గద్వాల జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక పరిశ్రమల విషయానికొస్తే కొత్తగా ఏర్పాటైన వాటిలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అధికంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 361 ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. 169 ఫార్మా, కెమికల్స్, 87 పవర్, 165 ప్లాస్టిక్, రబ్బర్, 280 ఇంజనీరింగ్, 195 ఆగ్రో బేస్డ్, 46 ఎలక్ట్రికల్, ఎల క్ట్రానిక్స్, 166 గ్రానైట్ స్టోన్ క్రషింగ్, 69 పేపర్ ప్రింటింగ్, 63 టెక్స్టైల్, 117 సిమెంట్, 7 ఏరోస్పేస్, 820 ఇతర పరిశ్రమలున్నాయి. -
లోకేశ్ కోసం మంత్రివర్గంలో మార్పులు!
-
లోకేశ్ కోసం మంత్రివర్గంలో మార్పులు!
ఆయనకు పరిశ్రమల శాఖతోపాటు ఐటీ శాఖ? సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కల త్వరలోనే నెరవేరనుంది. ఆయన మంత్రి పదవి కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. తన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబుపై వివిధ మార్గాల్లో ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ ఒత్తిళ్లకు తలొగ్గిన చంద్రబాబు తన కేబినెట్లో మార్పులు చేర్పులు చేయనున్నారు. ముఖ్యంగా లోకేశ్‌కు అవకాశం కల్పించడం కోసమే కేబినెట్లో మార్పులు చేర్పులకు చంద్రబాబు పూనుకుంటున్నట్లు సమాచారం. దీపావళి పండుగ ముందు గానీ, ఆ తరువాత గానీ రాష్ట్ర మంత్రిమండలిలో మార్పులు చేర్పులు చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా లోకేశ్‌ను కేబినెట్లోకి తీసుకోవాలని అన్ని వైపుల నుంచి ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెరిగిపోతోంది. ఇటీవల జరిగిన మూడు రోజుల పార్టీ శిక్షణా కార్యక్రమానికి తొలి రెండు రోజులు లోకేశ్ హాజరు కాని సంగతి తెలిసిందే. కేబినెట్లో మార్పులు చేర్పులపై ముఖ్యమంత్రి జాప్యం చేస్తున్నందునే లోకేశ్ అలిగినట్లు టీడీపీ వర్గాలు ధ్రువీకరించాయి. ఈ నేపథ్యంలో లోకేశ్‌ను శాంతింపజేయడానికి త్వరలోనే కేబినెట్లో మార్పులు చేర్పులపై చంద్రబాబు కసరత్తు ప్రారంభించినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కేబినెట్లోని కొంతమందికి ఉద్వాసన పలకడంతోపాటు మరి కొంతమంది శాఖల్లో మార్పులు చేయాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. కేబినెట్లో మార్పులు చేర్పులు చేసిన తరువాత జన్మభూమి కార్యక్రమం అనంతరం చంద్రబాబు నవంబరు 12వ తేదీన అమెరికా పర్యటనకు బయల్దేరి వెళ్తారని తెలిసింది. మృణాళినికి ఉద్వాసన తప్పదా? ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖలను నిర్వహిస్తున్న కె.మృణాళిని మంత్రివర్గం నుంచి తప్పించి, ఆ స్థానంలో ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావును కేబినెట్లోకి తీసుకోనున్నట్లు సమాచారం. లోకేశ్‌కు కీలకమైన పరిశ్రమల శాఖతోపాటు ఐటీ శాఖను కేటాయిస్తారని తెలుస్తోంది. -
దారిమళ్లిన రాయితీ సొమ్ము
♦ రూ.10.71 కోట్లే ♦ ‘సాక్షి’ వార్తపై పరిశ్రమల శాఖ వివరణ సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక రాయితీల వ్యవహారంలో రూ.10.71 కోట్లు మాత్రమే పక్కదారి పట్టాయని, ఇందులో రూ.7.5 కోట్లు తిరిగి రాబట్టామని, ఇంకా రూ.3.66 కోట్లను రాబట్టాల్సి ఉందని పరిశ్రమల శాఖ తెలిపింది. ‘రావత్ అవుట్... మిశ్రాపై సీఎస్ సీరియస్’ పేరుతో ఈ నెల 7న ‘సాక్షి’లో వచ్చిన కథనంపై ఆ శాఖ స్పందించింది. పారిశ్రామిక రాయితీల కింద రూ.1,990.52 కోట్లు విడుదల చేసినట్టు తెలిపింది. ఇందులో కొన్ని తప్పుగా, మరికొన్ని ఇచ్చిన సంస్థలకే మళ్లీ ఇవ్వడం జరిగిందని పేర్కొంది. వీటిని తిరిగి తెప్పించే క్రమంలో జాయింట్ డెరైక్టర్ రామిరెడ్డి బ్యాంకులో తప్పుడు ఖాతా సృష్టించి.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, ఈ వ్యవహారంలో మరో ముగ్గురి పాత్ర కూడా ఉందని, ఈ కారణంగానే వారిని సస్పెండ్ చేసినట్టు వెల్లడించింది. దాదాపు రూ.100 కోట్ల వరకూ రాయితీ సొమ్ము పక్కదారి పట్టాయన్న ఆరోపణల్లో నిజం లేదని పరిశ్రమలశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. -
మానవీయ కోణంలో పారిశ్రామికాభివృద్ధి
పలు రాష్ట్రాల పారిశ్రామిక విధానాల అధ్యయనం * పారిశ్రామికవేత్తలుగా ఎస్సీ, ఎస్టీ మహిళలు * హైదరాబాద్‌కు దూరంగా ‘కాలుష్య’ పరిశ్రమలు * పరిశ్రమల శాఖపై కేటీఆర్ సుదీర్ఘ సమీక్ష సాక్షి, హైదరాబాద్: మానవీయ కోణంలో పారిశ్రామిక అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా పరిశ్రమల శాఖ పనిచేస్తుందని ఆ శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. ఇటీవల పరిశ్రమల శాఖ బాధ్యతలు స్వీకరించిన ఆయన గురువారం పరిశ్రమల భవన్లో సమీక్ష నిర్వహించారు. పారిశ్రామికాభివృద్ధికి పలు రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని, పెట్టుబడిదారులను తెలంగాణకు పరిచయం చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. నూతన పారిశ్రామిక విధానం టీఎస్ఐపాస్ ద్వారా పెట్టుబడులు వస్తున్నా దానికి పారిశ్రామిక వర్గాల్లో మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ‘ప్రమోషనల్ వింగ్’ ఏర్పాటు చేయాల్సిందిగా దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రావడంతో పాటు ఇదివరకే స్థాపించిన వాటిని కాపాడుకుంటూ వృద్ధి సాధించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. వ్యాపార నిర్వహణలో సౌలభ్యతలో రాష్ట్రం తక్కువ ర్యాంకు సాధించడానికి కారణాలను ఆరా తీశారు. టీఎస్ఐపాస్ ఆవిష్కరణలో ఆలస్యమే అందుకు కారణమని అధికారులు వివరించారు. ఈ ఏడాది మెరుగైన ర్యాంకు సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. అసోచామ్, ఫిక్కి, డిక్కి వంటి పారిశ్రామిక, వాణిజ్య సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్ చుట్టూ వున్న కాలుష్యకారక పరిశ్రమలను నగరానికి దూరంగా తరలించేందుకు వాటి యాజమాన్యాలతో సంప్రదింపులు జరపాలని సూచించారు. చేనేత కార్మికులకు తగిన ప్రతిఫలం చేనేత కార్మికుల కష్టానికి తగిన ప్రతిఫలముండేలా ప్రణాళికలు రూపొందించాలని చేనేత, జౌళి శాఖ అధికారులను కేటీఆర్ ఆదేశించారు. తమిళనాడు కో ఆప్టెక్స్ తరహాలో చేనేత, పవర్లూమ్ వస్త్ర దుకాణాల ఏర్పాటును పరిశీలించాలన్నారు. చేనేత విభాగంలో విభజన సమస్యలపై సమీక్ష జరిపారు. సమీక్షలో పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, చేనేత, వస్త్ర పరిశ్రమ డైరక్టర్ సభ్యసాచి ఘోష్, ఆప్కో ఎండీ శైలజా రామయ్యర్ తదితరులు పాల్గొన్నారు. -
బాబు... రావత్..ఓ చిన్నట్విస్ట్..!
‘‘థర్టీ ఇయర్స్ ఇన్ పాలిటిక్స్.. సీఎంగా.. ప్రతిపక్ష నేతగా నాదే రికార్డు అంటూ’’ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఇటీవలే షాక్‌కు గురయ్యారట. ఎందుకంటారా.. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసి తెలంగాణకు వెళ్లేందుకు క్యాట్‌కు దరఖాస్తు చేసుకున్న ఎస్.ఎస్.రావత్ నిర్ణయం తెలుసుకున్న చంద్రబాబు కొద్ది సేపు తేరుకోలేదట. క్యాట్ కూడా రావత్‌కు అనుమతి ఇవ్వడంతో బాబు షాక్ తిన్నారట. ఏపీలో పరిశ్రమల స్థాపన ప్రమోషన్‌కు దావోస్‌కు వెళ్లిన రావత్ అక్కడే స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. ఆయన కాలు దెబ్బతినడంతో అక్కడే చికిత్స చేయించుకున్నారు. చంద్రబాబు ప్రత్యేకంగా రావత్ బాగోగులకు ఆదేశాలిచ్చారు. దావోస్ నుంచి తిరిగొచ్చిన రావత్ తెలంగాణకు వెళ్లేందుకు తీసుకున్న నిర్ణయంతో బాబు కొంత ఇబ్బందికి గురయ్యారట. రావత్ బాటలోనే పలువురు ఐఏఎస్‌లు పొరుగు రాష్ట్రానికి వెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారనే వార్తలకు బాబు ఉక్కిరి బిక్కిరవుతున్నారట. తాను ఏం తక్కువ చేశాను.. అని బాబు ముఖ్యుల వద్ద వాపోతుంటే.. అదేదో సినిమాలో పాపులరైన డైలాగు ‘‘అంతా మీరే చేశారు..’’ అని బాబు కోటరీ ముఖ్యులు అంటున్నారట. ప్రభుత్వ విధానమేంటో స్పష్టంగా చెప్పకుండా.. నిత్యం గంటల కొద్దీ సమీక్షలు... పొద్దుపోయే వరకు మీటింగులతో ఐఏఎస్‌లు విసుక్కుని పొరుగు రాష్ట్రానికి, కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ఆలోచిస్తున్నారట. ఐఏఎస్‌ల ఆలోచన తెలుసుకున్న బాబు తన పంథా మార్చుకుంటారా.. లేక భ్రమలు కల్పిస్తూ కాగితాల్లోనే అభివృద్ధి చూసుకుంటారా? అని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
మైనింగ్ పరిశ్రమకు ఊతం
♦ జిల్లాల వారీగా ఖనిజాల లభ్యతపై అధ్యయనం ♦ ఖనిజ ఆధారిత పరిశ్రమల స్థాపనపై ప్రత్యేక దృష్టి ♦ 2015-16లో రూ. 3,300 కోట్ల ఆదాయ లక్ష్యం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఖనిజ ఆధారిత పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గనులు, ఖని జాల ద్వారా రాష్ట్రానికి లభిస్తున్న ఆదాయం.. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో 4 శాతం, పారిశ్రామిక రంగంలో 16 శాతంగా ఉంది. రాష్ట్రంలో ఖనిజ వినియోగం పెరుగుతున్నట్లు సామాజిక, ఆర్థిక సర్వే -2016 వెల్లడించింది. బొగ్గు, ముడి ఇనుము, సున్నపురాయి, డోల మైట్, మాంగనీస్ తదితర ఖనిజాలు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం లో ఖనిజ లభ్యతపై అంచనా వేస్తున్న గనులు, భూగర్భ వనరుల శాఖ.. జిల్లాల వారీగా ఏయే పరిశ్రమల ఏర్పాటుకు అవకాశముందనే కోణంలో జాబితాను రూపొందించింది. వివిధ ఖనిజాల వెలికితీతకు సంబంధించి గనులు, భూగర్భ వనరుల శాఖ ఇప్పటికే ప్రాథమిక అధ్యయనం చేసి.. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో ప్రత్యేక మైనింగ్ జోన్ల ఏర్పాటుకు ప్రతిపాదించింది. మరోవైపు మైనింగ్‌పై వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు పరిశ్రమల శాఖ కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటైం ది. నిర్మాణ రంగంలో వినియోగించే మైనర్ మినరల్స్ సీనరేజీ చార్జీల చెల్లింపులో వన్ టైం సెటిల్మెంట్ విధానం, గ్రానైట్ పాలి షింగ్, సున్నపురాయి పరిశ్రమలపై సీనరేజీ చార్జీల విధింపులో రెండేళ్ల పాటు శ్లాబ్ విధా నం అమలు ద్వారా మైనింగ్ రంగాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏటా పెరుగుతున్న ఆదాయం రాష్ట్రంలో ఏటా సుమారు రూ. 16 వేల కోట్ల విలువ చేసే ఖనిజ సంపదను వెలికితీస్తున్నారు. సీనరేజీ, లెసైన్సు ఫీజు తదితరాల ద్వారా 2015-16లో రూ. 3,300 కోట్ల మేర ఆర్జించాలని లక్ష్యం నిర్దేశించగా.. ఇప్పటి వరకు సుమారు రూ. రెండువేల కోట్ల మేర ఆదాయం లభించింది. నూతన ఇసుక విధానం కాసులు కురిపిస్తోంది. 2015-16లో ఇసుక వేలం ద్వారా రూ. 500 కోట్లు ఆర్జించాలని లక్ష్యం నిర్దేశించగా.. ఇప్పటికే రూ. 370 కోట్లు లభించింది. ప్రభుత్వ కొత్త మైనింగ్ విధానం, 31 మినరల్ పాలసీ అమల్లోకి వస్తే గనులు, ఖనిజాల ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ. ఐదువేల కోట్ల మేర ఆదాయం లభించే అవకాశం ఉందని గనుల శాఖ అంచనా వేస్తోంది. జిల్లా ఖనిజాధారిత పరిశ్రమ ఆదిలాబాద్ : బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి, సిమెంట్ నిజామాబాద్ : బూడిద ఇటుకలు, బ్లాక్స్, సిమెంట్ మొజాయిక్ టైల్స్, వైట్ సిమెంట్, గ్రానైట్ కట్టింగ్, పాలిషింగ్ కరీంనగర్ : బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి, గ్రానైట్ కట్టింగ్, పాలిషింగ్ మెదక్ : ఫెర్రో సిలికాన్, గ్రానైట్ కట్టింగ్, పాలిషింగ్, రాతి ఇసుక, కంకర, గ్లాస్ వరంగల్ : బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి, గ్రానైట్ కట్టింగ్, పాలిషింగ్, సున్నం, స్పాంజ్ ఐరన్ రంగారెడ్డి : సిమెంటు, సిరామిక్, గ్లాస్, ఫెర్రో సిలికాన్, గ్రానైట్ కట్టింగ్, పాలిషింగ్, రాతి ఇసుక, కంకర మహబూబ్‌నగర్ : గ్లాస్, ఫెర్రో సిలికాన్, పల్వరైజింగ్ యూనిట్లు, గ్రానైట్ కట్టింగ్, పాలిషింగ్, కంకర నల్లగొండ : యురేనియం శుద్ధ్ది, సిమెంట్, గ్లాస్, ఫెర్రోసిలికాన్, గ్రానైట్, కంకర ఖమ్మం : విద్యుత్ ఉత్పత్తి, సున్నం, స్పాంజ్ ఐరన్, ఇనుము, గ్రానైట్, గ్లాస్ -
గద్వాలలో ఐఐహెచ్‌టీ కాలేజీ
♦ ముందస్తుగా చేనేత ఐటీఐకి అనుమతి ♦ కేంద్రానికి పరిశ్రమల శాఖ ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: చేనేత కార్మికులు అధికంగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాను చేనేత పరిశ్రమ కేంద్రంగా తీర్చిదిద్దాలని పరిశ్రమల శాఖ పరిధిలోని చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం యోచిస్తోంది. జిల్లాలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ) కాలేజీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 ఐఐహెచ్‌టీ కాలేజీలు ఉండగా, వీటిలో కేంద్రం పరిధిలో ఆరు, రాష్ట్రాల పరిధిలో నాలుగు కాలేజీలు నడుస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రగడ కోటయ్య ఐఐహెచ్‌టీని స్థాపించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో స్థానికంగా చేనేత రంగానికున్న ప్రాముఖ్యతను వివరిస్తూ పరిశ్రమల శాఖ ప్రతిపాదనలు సమర్పించింది. ఐఐహెచ్‌టీ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించిన కేంద్రం.. తొలుత డిప్లొమా కోర్సులు ప్రారంభించేందుకు వీలుగా చేనేత ఐటీఐ కాలేజీని ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో తాజాగా చేనేత ఐటీఐ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు కేంద్రానికి పంపారు. తొలి దశలో ఐఐటీలో డిప్లొమా కోర్సులు ప్రవేశపెట్టి.. పూర్తి స్థాయిలో కాలేజీ ఏర్పాటు చేసిన తర్వాత పోస్టు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని యోచిస్తున్నారు. చేనేత ఐఐటీ, ఐఐహెచ్‌టీ ఏర్పాటుతో చేనేత, వస్త్ర పరిశ్రమ రంగంలో వస్తున్న ఆధునాతన సాంకేతిక అంశాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడానికి సాధ్యపడుతుందని అధికారులు చెబుతున్నారు. మెగా క్లస్టర్పైనా కసరత్తు జాతీయ చేనేత అభివృద్ధి పథకం (ఎన్‌హెచ్‌డీపీ) కింద మహబూబ్‌నగర్ జిల్లాలో మెగా చేనేత క్లస్టర్ ఏర్పాటు దిశగా సన్నాహాలు సాగుతున్నాయి. గద్వాల లో 2006-07లో 50 ఎకరాల్లో రూ.8.21 కోట్లతో చేనేత పార్కు ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపినా, ప్రాథమిక స్థాయిలోనే పనులు నిలిచిపోయాయి. దీంతో తాజాగా రూ.70 కోట్ల అంచనాతో ప్రాజెక్టు నివేదికను రూపొందిస్తున్నారు. -
మేకిన్ ఇండియాలో పెట్టుబడుల ఆకర్షణ
ముగింపు కార్యక్రమానికి మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: ముంబైలో జరుగుతున్న ‘మేకిన్ ఇండియా’ వారోత్సవాలు వేదికగా రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు పరిశ్రమల శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 13న ప్రారంభమైన వారోత్సవాల్లో తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసింది. రోజుకు సగటున 50కి పైగా జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు తెలంగాణ స్టాల్‌ను సందర్శించారు. వారికి రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం(టీఎస్ఐపాస్) ప్రత్యేకతలతోపాటు, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై పరిశ్రమల శాఖ అధికారులు వివరించారు. స్టాల్‌ను సందర్శించిన సంస్థల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. చైనాలోని హునాన్ ప్రావిన్స్‌కు చెందిన పరిశ్రమల ప్రతినిధులతోపాటు, ఎయిర్‌బస్, సిప్లా వంటి ప్రముఖ పారిశ్రామిక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపాయి. స్టాల్‌ను సందర్శించిన సంస్థల వివరాలు సేకరించిన పరిశ్రమల శాఖ.. పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న 25 సంస్థల జాబితాను సిద్ధం చేశారు. గురువారం జరిగే వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొంటారు. -
కీలక పరిశ్రమల జోరు..
అక్టోబర్‌లో 6.3% వృద్ధి 4 నెలల గరిష్టం న్యూఢిల్లీ: ఎనిమిది కీలక పరిశ్రమల గ్రూప్ అక్టోబర్‌లో మంచి పనితీరును ప్రదర్శించింది. వృద్ధి రేటు 6.3 శాతంగా నమోదయ్యింది. బొగ్గు, రిఫైనరీ ఉత్పత్తులు, విద్యుత్ రంగాల సానుకూల తీరు మొత్తం గ్రూప్‌ను 4 నెలల గరిష్ట స్థాయిలో నిలబెట్టింది. గత ఏడాది ఇదే నెలలో ఈ గ్రూప్ అసలు వృద్ధినే నమోదుచేసుకోకపోగా (2012 అక్టోబర్‌తో పోల్చితే) క్షీణతలో -0.1 శాతంగా ఉంది. 2014 సెప్టెంబర్ నెలలో ఈ గ్రూప్ వృద్ధి రేటు 1.9 శాతం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఎనిమిది పరిశ్రమల వాటా 38 శాతం. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన తాజా గణాంకాలు 2013 అక్టోబర్‌తో పోల్చితే ఇలా ఉన్నాయి... బొగ్గు: 3.5 క్షీణత (-) నుంచి 16.2 శాతం వృద్ధి బాటకు చేరింది. ముడి చమురు: ఈ రంగం కూడా -0.6% క్షీణత నుంచి 1% వృద్ధికి మళ్లింది. రిఫైనరీ ఉత్పత్తులు: ఈ రంగం -5% క్షీణత నుంచి 4.2% వృద్ధి రేటుకు చేరింది. విద్యుత్: వృద్ధి రేటు 1.3 శాతం నుంచి 13.2 శాతానికి ఎగసింది. ఉక్కు: ఈ రంగం వృద్ధిలోనే ఉన్నా, ఈ రేటు 5.8% నుంచి 2.3%కి పడింది. సహజ వాయువు: క్షీణత -13.5 శాతం నుంచి -4.2 శాతానికి తగ్గింది. ఎరువులు: 4.1 శాతం వృద్ధి బాట నుంచి -7 శాతం క్షీణతలోకి జారిపోయింది. సిమెంట్: ఈ పరిశ్రమ కూడా 0.9 శాతం వృద్ధి నుంచి -1.0 క్షీణతలోని దిగింది. 7 నెలల్లో వ్యవధికి ఇలా... కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఎనిమిది పరిశ్రమల వృద్ధి రేటు స్వల్పంగా పెరిగింది. 2013-14 ఇదే కాలంతో పోల్చితే 4.2 శాతం నుంచి 4.3 శాతానికి చేరింది.