కీలక పరిశ్రమల జోరు.. | Core sector output accelerates to 6.3% in October | Sakshi
Sakshi News home page

కీలక పరిశ్రమల జోరు..

Published Tue, Dec 2 2014 12:17 AM | Last Updated on Wed, Sep 5 2018 1:45 PM

కీలక పరిశ్రమల జోరు.. - Sakshi

కీలక పరిశ్రమల జోరు..

అక్టోబర్‌లో 6.3% వృద్ధి  4 నెలల గరిష్టం

న్యూఢిల్లీ: ఎనిమిది కీలక పరిశ్రమల గ్రూప్ అక్టోబర్‌లో మంచి పనితీరును ప్రదర్శించింది. వృద్ధి రేటు  6.3 శాతంగా నమోదయ్యింది. బొగ్గు, రిఫైనరీ ఉత్పత్తులు, విద్యుత్ రంగాల సానుకూల తీరు మొత్తం గ్రూప్‌ను 4 నెలల గరిష్ట స్థాయిలో నిలబెట్టింది.  గత ఏడాది ఇదే నెలలో ఈ గ్రూప్ అసలు వృద్ధినే నమోదుచేసుకోకపోగా (2012 అక్టోబర్‌తో పోల్చితే) క్షీణతలో -0.1 శాతంగా ఉంది. 2014 సెప్టెంబర్ నెలలో ఈ గ్రూప్ వృద్ధి రేటు 1.9 శాతం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఎనిమిది పరిశ్రమల వాటా 38 శాతం. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన తాజా గణాంకాలు 2013 అక్టోబర్‌తో పోల్చితే ఇలా ఉన్నాయి...

బొగ్గు: 3.5 క్షీణత (-) నుంచి 16.2 శాతం వృద్ధి బాటకు చేరింది.
ముడి చమురు: ఈ రంగం కూడా -0.6% క్షీణత నుంచి 1% వృద్ధికి మళ్లింది.
రిఫైనరీ ఉత్పత్తులు: ఈ రంగం -5% క్షీణత నుంచి 4.2% వృద్ధి రేటుకు చేరింది.
విద్యుత్: వృద్ధి రేటు 1.3 శాతం నుంచి 13.2 శాతానికి ఎగసింది.
ఉక్కు: ఈ రంగం వృద్ధిలోనే ఉన్నా, ఈ రేటు 5.8% నుంచి 2.3%కి పడింది.
సహజ వాయువు: క్షీణత -13.5 శాతం నుంచి -4.2 శాతానికి తగ్గింది.
ఎరువులు: 4.1 శాతం వృద్ధి బాట నుంచి -7 శాతం క్షీణతలోకి జారిపోయింది.
సిమెంట్: ఈ పరిశ్రమ కూడా 0.9 శాతం వృద్ధి నుంచి -1.0 క్షీణతలోని దిగింది.
 
7 నెలల్లో వ్యవధికి ఇలా...
కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఎనిమిది పరిశ్రమల వృద్ధి రేటు స్వల్పంగా పెరిగింది. 2013-14 ఇదే కాలంతో పోల్చితే 4.2 శాతం నుంచి 4.3 శాతానికి చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement