Refinery Products
-
భారత్‌కు రష్యా క్రూడ్.. 50 రెట్లు అప్
న్యూఢిల్లీ: భారత్‌కు రష్యా నుంచి చమురు దిగుమతులు ఏప్రిల్ నుండి దాదాపు 50 రెట్లు పెరిగాయి. ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మొత్తం క్రూడాయిల్ పరిమాణంలో 10 శాతానికి చేరాయి. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధానికి దిగడానికి ముందు ఆ దేశం నుంచి భారత్‌కు చమురు దిగుమతులు 0.2 శాతం మాత్రమే ఉండేవి. రష్యా ప్రస్తుతం టాప్ 10 సరఫరా దేశాల్లో ఒకటిగా మారిందని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ రిఫైనరీ సంస్థలు దాదాపు 40 శాతం మేర రష్యన్ ఆయిల్‌ను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. మేలో దేశీ రిఫైనర్లు 2.5 కోట్ల బ్యారెళ్ల చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాయి. ఇక, ఏప్రిల్ నెలకు చూస్తే సముద్రమార్గంలో భారత్‌కు వచ్చే మొత్తం దిగుమతుల్లో రష్యన్ క్రూడాయిల్ వాటా 10 శాతానికి పెరిగింది. ఇది 2021 ఆసాంతం, 2022 తొలి త్రైమాసికంలో 0.2 శాతమే. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో తమ ముడిచమురును డిస్కౌంటుకే రష్యా విక్రయిస్తోంది. క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల పైనే తిరుగాడుతున్న తరుణంలో 30 డాలర్ల వరకూ డిస్కౌంటు లభిస్తుండటంతో దేశీ రిఫైనర్లు పెద్ద ఎత్తున రష్యా చమురును కొనుగోలు చేస్తున్నాయి. -
డిసెంబర్లో మౌలికం 5.6% అప్
న్యూఢిల్లీ: ఎనిమిది కీలక పరిశ్రమలతో కూడిన మౌలిక రంగం డిసెంబర్లో 5.6 శాతం వృద్ధి నమోదు చేసింది. బొగ్గు, ముడి చమురు, సహజవాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంటు, విద్యుత్ పరిశ్రమల మేళవింపైన కీలక మౌలిక రంగ సంస్థల వృద్ధి డిసెంబర్ 2015లో 2.6 శాతం. కాగా గతేడాది నవంబర్‌లో ఇది 4.9 శాతంగా ఉంది. మొత్తం పారిశ్రామికోత్పత్తిలో ఇన్ఫ్రా వాటా 38 శాతంగా ఉంటుంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2016 ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో ఇది 5 శాతంగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే వ్యవధిలో వృద్ధి 2.6 శాతం. జీడీపీ అంచనాలను సవరించిన సీఎస్ఓ న్యూఢిల్లీ:ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలను సవరించింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతం వృద్ధి ఉండగలదన్న అంచనాలను కేంద్ర గణాంక సంస్థ(సీఎస్ఓ) 7.9 శాతానికి సవరించింది. వ్యవసాయం, పారిశ్రామికోత్పత్తిలకు సంబంధించిన తాజా గణాంకాలను పరిగణనలోకి తీసుకొని వృద్ధి అంచనాలను సవరించామని సీఎస్ఓ తెలిపింది. నిలకడ (2011–12) ధరల్లో గత ఆర్థిక సంవత్సరం జీడీపీ రూ.113.58 లక్షల కోట్లని(7.9 శాతం), అలాగే 2014–15 ఆర్థిక సంవత్సరం జీడీపీ రూ.105.23 లక్షల కోట్లని(7.2 శాతం) పేర్కొంది. -
మెరిసిన మౌలిక రంగం
♦ ఫిబ్రవరిలో 5.7% వృద్ధిరేటు ♦ 15 నెలల గరిష్ట స్థాయి న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక విభాగాల గ్రూప్ ఫిబ్రవరిలో మంచి పనితనాన్ని కనబరిచింది. 2015 ఫిబ్రవరితో పోల్చిచూస్తే... 2016 ఫిబ్రవరి ఉత్పత్తిలో 5.7 శాతం వృద్ధి రేటును సాధించింది. ఇది 15 నెలల గరిష్ట స్థాయి. 2014 నవంబర్‌లో ఇది 6.7 శాతంగా ఉంది. ఎనిమిది రంగాల్లో సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, సిమెంట్, విద్యుత్, క్రూడ్ ఆయిల్, బొగ్గు, స్టీల్ రంగాలు ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో ఈ ఎనిమిది పారిశ్రామిక విభాగాల వాటా 38 శాతం. గత ఏడాది ఫిబ్రవరిలో గ్రూప్ వృద్ధిరేటు 2.3 శాతం. కాగా ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-ఫిబ్రవరి) 11 నెలల కాలంలో రేటు ఐదు శాతం నుంచి 2.3 శాతానికి తగ్గింది. -
మౌలిక పరిశ్రమల మందగమనం
జనవరిలో 1.8% వృద్ధిరేటు న్యూఢిల్లీ: ఎనిమిది కీలక పరిశ్రమల గ్రూప్ జనవరిలో పేలవ పనితీరును ప్రదర్శించింది. 13 నెలల కనిష్ట స్థాయిలో కేవలం 1.8 శాతం వృద్ధిని (2014లో ఇదే నెల విలువతో పోల్చితే) నమోదుచేసుకుంది. 2014 జనవరితో పోల్చి- 2015 జనవరిలో 8 రంగాల పనితీరునూ పరిశీలిస్తే... బొగ్గు: వృద్ధి 1.2% నుంచి 1.7%కి మెరుగుపడింది. క్రూడ్ ఆయిల్: 3% వృద్ధి రేటు -2.3% క్షీణతలోకి జారింది. సహజ వాయువు: -5.2% నుంచి -6.6%కి పడిపోయింది. రిఫైనరీ ప్రొడక్టులు:-4.2% క్షీణత నుంచి 4.7% వృద్ధికి చేరింది. ఎరువులు: ఈ రంగం కూడా చక్కటి ఫలితాన్ని నమోదు చేసింది. వృద్ధి రేటు 1.2 శాతం నుంచి 7.1 శాతానికి పెరిగింది. స్టీల్: వృద్ధి రేటు 10.8% నుంచి 1.6%కి తగ్గింది. సిమెంట్: ఈ రంగంలో కూడా వృద్ధి 2 శాతం నుంచి 0.5 శాతానికి తగ్గింది. విద్యుత్: ఈ రంగంలో వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 2.7 శాతానికి పడిపోయింది. 10 నెలల్లో...: కాగా ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి మధ్య కాలంలో గ్రూప్ రంగాల వృద్ధి 4 శాతం నుంచి 4.1 శాతానికి పెరిగింది. ఐఐపీలో 8 పరిశ్రమల వాటా 38 శాతం. -
కీలక పరిశ్రమలు హ్యాపీ
నవంబర్‌లో 6.7% వృద్ధి ⇒ ఐదు నెలల గరిష్టం న్యూఢిల్లీ: ఎనిమిది కీలక పరిశ్రమల గ్రూప్ నవంబర్‌లో మంచి పనితీరును కనబరిచింది. వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదయ్యింది. ఇది ఐదు నెలల గరిష్ట స్థాయి. 2013 నవంబర్‌లో ఈ రేటు 3.2 శాతం. బొగ్గు, రిఫైనరీ ప్రొడక్టులు, విద్యుత్, సిమెంట్ రంగాల మంచి పురోగతి- మొత్తం పరిశ్రమల గ్రూప్ చక్కటి వృద్ధికి కారణమైంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ బుధవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన ద్రవ్య, పరపతి సమీక్ష, విధాన ప్రకటనకు పరిగణనలోకి తీసుకునే పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఎనిమిది పరిశ్రమల గ్రూప్ వాటా (వెయిటేజ్) 38 శాతం. జనవరి రెండవ వారం చివర్లో ఐఐపీ నవంబర్ గణాంకాలు వెలువడతాయి. తాజాగా విడుదలైన గణాంకాలకు సంబంధించి 2013 నవంబర్‌లో చోటుచేసుకున్న వృద్ధి రేటుతో పోల్చి 2014 నవంబర్‌లో వృద్ధి రేటును పరిశీలిస్తే... ప్లస్... బొగ్గు: వృద్ధి రేటు 3.3 శాతం నుంచి 14.5 శాతానికి ఎగసింది. రిఫైనరీ ప్రొడక్టులు: క్షీణత రేటు వృద్ధి బాటలోకి మారింది. ఈ రేటు -5.2 శాతం నుంచి 8.1 శాతానికి ఎగసింది. విద్యుత్: చక్కటి పనితీరుతో ఉత్పత్తి వృద్ధి 6.3 శాతం నుంచి 10.2 శాతానికి చేరింది. సిమెంట్: ఈ రంగంలో వృద్ధి రేటు 3.9 శాతం నుంచి 11.3 శాతానికి ఎగసింది. స్టీల్: వృద్ధి రేటు 10.1 శాతం నుంచి 1.3 శాతానికి పడింది. మైనస్... క్రూడ్ ఆయిల్: ఈ రంగంలో అసలు వృద్ధి లేకపోగా క్షీణత (మైనస్)లోకి జారింది. ఈ క్షీణ రేటు -0.1 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెలలో ఈ రేటు 1.2 శాతం. సహజ వాయువు: క్షీణ రేటు కొనసాగుతోంది. అయితే ఈ రేటు -11.2 శాతం నుంచి -2.9 శాతానికి తగ్గడమే కొంచెం ఊరట. ఎరువులు: వృద్ధి రేటు (0.6 శాతం) క్షీణతలోకి జారింది. ఇది -2.8 శాతంగా నమోదయింది. ఎనిమిది నెలల్లో... కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15, ఏప్రిల్-నవంబర్) ఎనిమిది నెలల కాలంలో 2013-14 ఇదే కాలంతో పోల్చిచూస్తే- ఎనిమిది పరిశ్రమల గ్రూప్ రేటు 4.1 శాతం నుంచి 4.6 శాతానికి పెరిగింది. -
కీలక పరిశ్రమల జోరు..
అక్టోబర్‌లో 6.3% వృద్ధి 4 నెలల గరిష్టం న్యూఢిల్లీ: ఎనిమిది కీలక పరిశ్రమల గ్రూప్ అక్టోబర్‌లో మంచి పనితీరును ప్రదర్శించింది. వృద్ధి రేటు 6.3 శాతంగా నమోదయ్యింది. బొగ్గు, రిఫైనరీ ఉత్పత్తులు, విద్యుత్ రంగాల సానుకూల తీరు మొత్తం గ్రూప్‌ను 4 నెలల గరిష్ట స్థాయిలో నిలబెట్టింది. గత ఏడాది ఇదే నెలలో ఈ గ్రూప్ అసలు వృద్ధినే నమోదుచేసుకోకపోగా (2012 అక్టోబర్‌తో పోల్చితే) క్షీణతలో -0.1 శాతంగా ఉంది. 2014 సెప్టెంబర్ నెలలో ఈ గ్రూప్ వృద్ధి రేటు 1.9 శాతం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఎనిమిది పరిశ్రమల వాటా 38 శాతం. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన తాజా గణాంకాలు 2013 అక్టోబర్‌తో పోల్చితే ఇలా ఉన్నాయి... బొగ్గు: 3.5 క్షీణత (-) నుంచి 16.2 శాతం వృద్ధి బాటకు చేరింది. ముడి చమురు: ఈ రంగం కూడా -0.6% క్షీణత నుంచి 1% వృద్ధికి మళ్లింది. రిఫైనరీ ఉత్పత్తులు: ఈ రంగం -5% క్షీణత నుంచి 4.2% వృద్ధి రేటుకు చేరింది. విద్యుత్: వృద్ధి రేటు 1.3 శాతం నుంచి 13.2 శాతానికి ఎగసింది. ఉక్కు: ఈ రంగం వృద్ధిలోనే ఉన్నా, ఈ రేటు 5.8% నుంచి 2.3%కి పడింది. సహజ వాయువు: క్షీణత -13.5 శాతం నుంచి -4.2 శాతానికి తగ్గింది. ఎరువులు: 4.1 శాతం వృద్ధి బాట నుంచి -7 శాతం క్షీణతలోకి జారిపోయింది. సిమెంట్: ఈ పరిశ్రమ కూడా 0.9 శాతం వృద్ధి నుంచి -1.0 క్షీణతలోని దిగింది. 7 నెలల్లో వ్యవధికి ఇలా... కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఎనిమిది పరిశ్రమల వృద్ధి రేటు స్వల్పంగా పెరిగింది. 2013-14 ఇదే కాలంతో పోల్చితే 4.2 శాతం నుంచి 4.3 శాతానికి చేరింది. -
8 కీలక పరిశ్రమలు ఓకే
ఏప్రిల్‌లో వృద్ధి 4.2 శాతం విద్యుత్, ఎరువులు, సిమెంట్ బెటర్ న్యూఢిల్లీ: మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో దాదాపు 38 శాతం వాటా కలిగిన 8 కీలక పరిశ్రమల గ్రూప్ ఏప్రిల్‌లో కొంత మంచి ఫలితాన్ని ఇచ్చింది. 4.2 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంది. 2014 మార్చిలో ఈ రేటు 2.5 శాతంకాగా, 2013 ఏప్రిల్ నెలలో 3.7 శాతం. విద్యుత్, ఎరువులు, సిమెంట్, బొగ్గు రంగాలు మంచి ఫలితాలను ఇవ్వడం వృద్ధి కొంత మెరుగ్గా ఉండడానికి కారణమయ్యింది. ఇంకా ఈ గ్రూప్‌లో క్రూడ్ ఆయిల్, సహజ వాయువులు, రిఫైనరీ ప్రొడక్టులు, స్టీల్ ఉన్నాయి. సోమవారం వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది. వివిధ రంగాల పనితీరును 2013 ఏప్రిల్‌తో పోల్చిచూస్తే... బొగ్గు: వృద్ధి రేటు 1.2% నుంచి 3.3%కి ఎగసింది. ఎరువులు: ఈ రంగం క్షీణత నుంచి బైటపడింది. ఈ రంగం మైనస్ (-) 2.4 శాతం నుంచి 11.1 శాతం వృద్ధిలోకి మళ్లింది. సిమెంట్: వృద్ధి 5.2% నుంచి 6.7 శాతానికి ఎగసింది. విద్యుత్: ఈ రంగంలో వృద్ధి రేటు భారీగా 3.5 శాతం నుంచి 11.2 శాతానికి ఎగసింది. క్రూడ్ ఆయిల్: వృద్ధి క్షీణతలోనే ఉన్నా (-1.2 శాతం) ఇది కొంత తగ్గి మైనస్ (-) 0.1 శాతంగా ఉంది. సహజ వాయువులు: క్షీణత (-) 17.4 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గింది. రిఫైనరీ ప్రొడక్టులు: 6.2% వృద్ధి రేటు క్షీణతలోకి జారిపోయింది. ఈ రేటు -2.2%గా నమోదయ్యింది. ఉక్కు: వృద్ధి రేటు 10.1% నుంచి 3.1%కి పడింది. ఐఐపీ నిరుత్సాహమే: ఇక్రా అంచనా కోర్ ఇన్ఫ్రా పరిశ్రమల పనితీరు బాగున్నప్పటికీ, ఏప్రిల్ 2014 ఐఐపీ వృద్ధి మాత్రం ఒక శాతం లోపే ఉండే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తోంది. ఈ గణాంకాలు ఈ నెల రెండవ వారం చివర్లో రానున్నాయి. ఐఐపీ గణాంకాలు వరుసగా రెండవనెల మార్చిలో క్షీణ దిశలో ఉన్నాయి. మార్చిలో ఈ రేటు -0.5 శాతంగా నమోదయ్యింది.