♦ ఫిబ్రవరిలో 5.7% వృద్ధిరేటు
♦ 15 నెలల గరిష్ట స్థాయి
న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక విభాగాల గ్రూప్ ఫిబ్రవరిలో మంచి పనితనాన్ని కనబరిచింది. 2015 ఫిబ్రవరితో పోల్చిచూస్తే... 2016 ఫిబ్రవరి ఉత్పత్తిలో 5.7 శాతం వృద్ధి రేటును సాధించింది. ఇది 15 నెలల గరిష్ట స్థాయి. 2014 నవంబర్‌లో ఇది 6.7 శాతంగా ఉంది. ఎనిమిది రంగాల్లో సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, సిమెంట్, విద్యుత్, క్రూడ్ ఆయిల్, బొగ్గు, స్టీల్ రంగాలు ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో ఈ ఎనిమిది పారిశ్రామిక విభాగాల వాటా 38 శాతం. గత ఏడాది ఫిబ్రవరిలో గ్రూప్ వృద్ధిరేటు 2.3 శాతం. కాగా ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-ఫిబ్రవరి) 11 నెలల కాలంలో రేటు ఐదు శాతం నుంచి 2.3 శాతానికి తగ్గింది.