Natural gas
-
రష్యాకు ఉక్రెయిన్ గ్యాస్ షాక్
మాస్కో/కీవ్: రష్యా నుంచి చౌకగా గ్యాస్‌ను సరఫరా చేసుకుంటూ లబ్ధి పొందుతున్న యూరప్ దేశాలకు కొత్త కష్టాలు వచ్చిపడే అవకాశం కనిపిస్తోంది. రష్యా నుంచి తమ భూభాగం నుంచి గ్యాస్ సరఫరాను ఉక్రెయిన్ నిలిపివేసింది. ఈ విషయంలో రష్యాతో కుదిరిన ఐదేళ్ల ఒప్పందం బుధవారం ముగిసింది. ఇకపై తమ భూభాగం నుంచి గ్యాస్ సరఫరాను అనుమతించే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తేల్చిచెప్పారు. ఒకవైపు ఉక్రెయిన్ ప్రజల రక్తాన్ని పీలుస్తూ మరోవైపు అదనపు బిలియన్ డాలర్లు రష్యా సంపాదిస్తామంటే అనుమతించబోమని అన్నారు. మూడేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో ఇదొక కీలక పరిణామం అని చెప్పొచ్చు. ఉక్రెయిన్ గుండా ఐరోపా ఖండానికి గ్యాస్ సరఫరా ఆగిపోవడాన్ని రష్యాపై మరో విజయంగా పోలాండ్ ప్రభుత్వం అభివరి్ణంచింది. రష్యా 1991 నుంచి ఉక్రెయిన్ భూభాగం ద్వారా యూరప్‌కు గ్యాస్ సరఫరా చేస్తోంది. ఈ మేరకు ఉక్రెయిన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఒప్పందం పొడిగింపునకు ఉక్రెయిన్ అంగీకరించలేదు. ఒప్పందం ముగిసిపోవడం, రష్యా నుంచి సహజవాయువు సరఫరా ఆగిపోవడం చరిత్రాత్మక ఘట్టమని ఉక్రెయిన్ ఇంధన శాఖ స్పష్టంచేసింది. → గ్యాస్ సరఫరా ఒప్పందాన్ని ఉక్రెయిన్ పొడిగించకపోవడం ఊహించిన పరిణామమే. దీనివల్ల యూరప్ దేశాలకు ఆర్థికంగా కొంత నష్టం వాటిల్లక తప్పదు. రష్యా నుంచి చౌకగా వచ్చే గ్యాస్ స్థానంలో ఇకపై ఖరీదైన గ్యాస్‌ను ఇతర దేశాల నుంచి కొనుక్కోవాల్సి ఉంటుంది.→ యూరప్ దేశాలకు గ్యాస్ సరఫరా ఇప్పటికే తగ్గుముఖం పట్టింది. దీనివల్ల రష్యాకు నష్టం జరుగుతోంది. రష్యా గ్యాస్ దిగ్గజం గాజ్ప్రోమ్ గత ఏడాది 6.9 బిలియన్ డాలర్లు నష్టపోయింది. ఇలా జరగడం గత 20 ఏళ్లలో ఇదే మొదటిసారి. → రష్యా నుంచి ఉక్రెయిన్ మార్గం కాకుండా టర్క్‌స్ట్రీమ్ లైన్ కూడా ఉంది. ఇది తుర్కియే, బల్గేరియా, సెర్బియా, హంగేరీ నుంచి యూరప్‌నకు చేరుతోంది. → యూరప్‌లో గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉందని యూరేíÙయా గ్రూప్ ఎనర్జీ హెడ్ హెనింగ్ గ్లోస్టీన్ చెప్పారు. గ్యాస్ ధరల భారంతో విద్యుత్ చార్జీలు అమాంతం పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. రష్యా గ్యాస్‌తో యూరప్ దేశాలు విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. → 2022లో ఉక్రెయిన్‌పై దండయాత్ర ప్రారంభం కాకముందు యూరోపియన్ యూనియన్ దేశాలకు అతిపెద్ద గ్యాస్ సరఫరాదారు రష్యా. 2021లో ఆయా దేశాలు తమ అవసరాల్లో 40 శాతం గ్యాస్‌ను రష్యా నుంచే పైప్‌లైన్ ద్వారా దిగుమతి చేసుకున్నాయి. యుద్ధం మొదలైన తర్వాత 2023 నాటికి అది 8 శాతానికి పడిపోయింది. → అయితే యూరప్‌కు ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి: ఉక్రెయిన్ ప్రజలకు జెలెన్స్కీ కీలక సందేశం -
మౌలిక రంగం.. మందగమనం
న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమల మౌలిక గ్రూప్ సెప్టెంబర్‌లో పేలవ పనితీరును ప్రదర్శించింది. వృద్ధి రేటు (2023 ఇదే నెలతో పోల్చి) కేవలం 2 శాతానికి పరిమితమైంది. గత ఏడాది ఇదే నెలలో ఈ గ్రూప్ వృద్ధి 9.5 శాతం. 2024 ఆగస్టుతో(1.6 శాతం క్షీణత) పోల్చితే మెరుగ్గా నమోదవడం ఊరటనిచ్చే అంశం. క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, విద్యుత్ రంగాలు క్షీణ రేటును నమోదుచేసుకున్నాయి. బొగ్గు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్ వృద్ధి రేటు స్వల్పంగా ఉంది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య, ఈ గ్రూప్ వృద్ధి రేటు 4.2 శాతంగా నమోదైంది. -
Interim Budget 2024: ఎలక్ట్రిక్.. ఇక ఫుల్ చార్జ్!
న్యూఢిల్లీ: చార్జింగ్, తయారీ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించనున్నట్లు వివరించారు. రవాణా కోసం ఉపయోగించే సీఎన్‌జీలోనూ, పైపుల ద్వారా సరఫరా చేసే సహజ వాయువులోను కంప్రెస్డ్ బయోగ్యాస్‌ను కలపడం తప్పనిసరని ఆమె పేర్కొన్నారు. మరోవైపు మధ్యంతర బడ్జెట్లో చర్యలను స్వాగతించిన క్వాంటమ్ ఎనర్జీ ఎండీ సి. చక్రవర్తి .. కొన్ని ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదని పేర్కొన్నారు. 2024 మార్చితో ముగిసిపోనున్న ఫేమ్ 2 సబ్సిడీ ప్రోగ్రామ్‌ను పొడిగిస్తారని ఆశలు నెలకొన్నప్పటికీ ఆ దిశగా ప్రతిపాదనలు లేవని ఆయన తెలిపారు. గడువు పొడిగించి ఉంటే ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకు గట్టి మద్దతు లభించి ఉండేదన్నారు. అలాగే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌లు, సెల్స్‌పై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించి ఉంటే ఈవీల ధరలు మరింత అందుబాటు స్థాయిలోకి వచ్చేందుకు ఆస్కారం లభించేందని చక్రవర్తి తెలిపారు. సోలార్ రూఫ్‌టాప్ స్కీములు.. స్వచ్ఛ విద్యుత్ లక్ష్యాల సాధనకు తోడ్పడగలవని సీఫండ్ సహ వ్యవస్థాపకుడు మయూరేష్ రౌత్ తెలిపారు. మరోవైపు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్ స్కీముకు కేటాయింపులను బడ్జెట్లో కేంద్రం రూ. 2,671 కోట్లుగా ప్రతిపాదించారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను సవరించిన అంచనాల (రూ. 4,807 కోట్లు) కన్నా ఇది 44 శాతం తక్కువ. ప్రస్తుతమున్న ఫేమ్ 2 ప్లాన్‌ను మరోసారి పొడిగిస్తారా లేదా అనే దానిపై స్పష్టత లేని పరిస్థితుల్లో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. ఆటోమొబైల్‌కు పీఎల్ఐ బూస్ట్ .. వాహన పరిశ్రమకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) స్కీము కింద బడ్జెట్లో కేటాయింపులను కేంద్రం ఏకంగా 7 రెట్లు పెంచి రూ. 3,500 కోట్లుగా ప్రతిపాదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనా ప్రకారం ఇది రూ. 484 కోట్లు. కాగా, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్, బ్యాటరీ స్టోరేజీకి కేటాయింపులను రూ. 12 కోట్ల నుంచి రూ. 250 కోట్లకు పెంచారు. ఈవీల షేర్లు అప్ .. బడ్జెట్లో సానుకూల ప్రతిపాదనల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల సంస్థల షేర్లు పెరిగాయి. బీఎస్ఈలో జేబీఎం ఆటో 2.48 శాతం పెరిగి రూ. 1,963 వద్ద, గ్రీవ్స్ కాటన్ సుమారు 1 శాతం పెరిగి రూ. 165 వద్ద ముగిశాయి. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ మాత్రం లాభాల స్వీకరణతో 0.69 శాతం క్షీణించి రూ. 1,729 వద్ద ముగిసింది. అయితే, ఒక దశలో 6 శాతం ఎగిసి 52 వారాల గరిష్టమైన రూ. 1,849 స్థాయిని తాకింది. -
ఏపీ ఇంట.. ఈ–వంట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అమలవుతోన్న అనేక సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శమవుతుండటం ఓ విశేషం కాగా..దేశంలో అమలు చేసే ఏ పథకానికైనా రాష్ట్రం ఎంపిక అవుతుండటం మరో విశేషం. తాజాగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ఆధ్వర్యంలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రాం (ఎన్‌ఈసీపీ), ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్స్ ప్రోగ్రాం (ఈఈఎఫ్‌పీ) పథకాలకు ఏపీ ఎంపికైంది. కుకింగ్ ప్రోగ్రామ్ ద్వారా దేశవ్యాప్తంగా 20 లక్షల ఇండక్షన్ కుక్‌స్టవ్‌లను ఈఈఎస్ఎల్ సరఫరా చేయనుంది. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో చురుకుగా వ్యవహరిస్తున్న యూపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ వీటిని పంపిణీ చేయనున్నట్లు ఈఈఎస్ఎల్ తెలిపింది. ఈ–కుక్కర్‌తో ఆరోగ్యం.. ‘ఎన్‌ఈసీపీ’ ద్వారా ఇచ్చే ఈ స్టవ్‌లు వంటకు ఉపయోగించే సంప్రదాయ సహజ వాయువు (ఎల్పీజీ), బయోమాస్ వంటి ఇంధనాలను ప్రత్యామ్నాయంగా ఉపయోగపడనున్నాయి. వంటకు వినియోగించే ఇంధనాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి్సన అవసరం, అధిక ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిన ఆగత్యం తప్పుతుంది. సాంప్రదాయ వంట పద్ధతుల కంటే 25–30% ఖర్చును దీనివల్ల ఆదా చేయవచ్చు. ఈ–కుకింగ్ ద్వారా చేసిన వంటకు, గ్యాస్ ఉపయోగించి వండిన ఆహారానికి ఎలాంటి తేడా ఉండదు. పైగా వంట పొయ్యి వద్ద పొగతో అనారోగ్యానికి గురికావాలి్సన అవసరం రాదు. వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించడం వీలవుతుంది. హానికరమైన బయోమాస్ ఆధారిత వంటకు దూరంగా పరిశుభ్రమైన వంట పద్ధతులను ప్రజలకు అలవాటు చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఫ్యాన్లతో ఇళ్లలో విద్యుత్ ఆదా.. ‘ఈఈఎఫ్‌పీ’ ద్వారా జగనన్న ఇళ్లలో విద్యుత్ ఆదా ఫ్యాన్లను పంపిణీ చేసేందుకు ఇటీవల గోవాలో జరిగిన జీ20 సదస్సులో గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఈఈఎస్ఎల్ సీఈవో విశాల్ కపూర్ సంతకాలు చేసి, ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో నిర్మిస్తోన్న ఇళ్లకు 6 లక్షల ఎల్ఈడీ బల్బులు, 3 లక్షల ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు, 3 లక్షల బ్రష్‌లెస్ డైరెక్ట్ కరెంట్ మోటర్(బీఎల్డీసీ) సీలింగ్ ఫ్యాన్లు సరఫరా చేయనున్నారు. ఒక్కో ఇంటికీ 4 ఎల్ఈడీ బల్బులు, 2 ట్యూబ్ లైట్లు, 2 ఎనర్జీ ఎఫిషియెన్సీ ఫ్యాన్లను రాయితీపై అందించనున్నారు. రూ.400 కోట్లతో పంపిణీ చేసే ఈ ఉపకరణాల వల్ల ప్రతి ఇంటికీ ఏడాదికి 734 యూనిట్ల ఇంధనం ఆదా అవుతుంది. తొలి దశలో 15.6 లక్షల ఇళ్లలో ఇంధన సామర్థ్య ఉపకరణాలను వినియోగించడం వల్ల ఏడాదికి 1,145 మిలియన్ యూనిట్ల విద్యుత్తు మిగులుతుందని అంచనా. విద్యుత్ బిల్లుల ఖర్చులను తగ్గించడానికి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది. ఏపీ ముందుకు రావడం అభినందనీయం వంటశాలలలో ఆధునిక ఎలక్ట్రిక్ వంట పరికరాలను వినియోగించడం ద్వారా ఎల్పీజీ, కిరోసిన్ ఆధారిత వంటపై ఆధారపడటాన్ని తగ్గించడం మా లక్ష్యం. ఇందుకోసం మోడరన్ ఎనర్జీ కుకింగ్ సర్వీసెస్ (ఎంఈసీఎల్)తో కలిసి ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ఈ–స్టవ్‌లను పంపిణీ చేయనున్నాం. పాండిచ్చేరి, కేరళ, లడ్హాక్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టులు ప్రారంభించాం. జగనన్న ఇళ్లలో బీఎల్డీసీ ఫ్యాన్లు అందించేందుకు ఏపీ ముందుకు రావడం అభినందనీయం. – విశాల్ కపూర్, సీఈవో, ఈఈఎస్ఎల్ -
ఎన్ఎస్ఈలో చమురు, గ్యాస్ ట్రేడింగ్
న్యూఢిల్లీ: నైమెక్స్ క్రూడ్, నేచురల్ గ్యాస్‌లలో ఫ్యూచర్ కాంట్రాక్టులను ప్రవేశపెట్టనున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ పేర్కొంది. కమోడిటీ డెరివేటివ్స్ విభాగంలో మే 15 నుంచి వీటిని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి గత నెలలో అనుమతులు లభించడంతో రుపీ ఆధారిత నైమెక్స్ డబ్ల్యూటీఐ చమురు, నేచురల్ గ్యాస్ ఫ్యూచర్ కాంట్రాక్టులకు తెరతీసింది. దీంతో ఎన్ఎస్ఈ ఎనర్జీ బాస్కెట్లో మరిన్ని ప్రొడక్టులకు వీలు చిక్కనుంది. కమోడిటీ విభాగం మరింత విస్తరించనుంది. వీటి ద్వారా మార్కెట్ పార్టిసిపెంట్ల(ట్రేడర్లు)కు ధరల రిస్క్ హెడ్జింగ్‌కు ఇతర అవకాశాలు లభించనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. డబ్ల్యూటీఐ చమురు, నేచురల్ గ్యాస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులను రుపీ ఆధారితంగా సెటిల్ చేసేందుకు ఎన్ఎస్ఈ సీఎంఈ గ్రూప్‌తో డేటా లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
కేంద్రం కీలక నిర్ణయం..తగ్గనున్న పీఎన్జీ,సీఎన్జీ గ్యాస్ ధరలు!
సహజ వాయివు (నేచురల్ గ్యాస్) ధరల విషయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేచురల్ గ్యాస్ ధరల్ని నియంత్రించేందుకు కొత్త పద్దతిని అమలు చేసింది. చమురు క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌ను ఇంధనం ధరల్ని ఇక నుంచి ముడిచమురు ధరలతో అనుసంధానం చేసినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీంతో పీఎన్జీ, సీఎన్జీ గ్యాస్ ధరలు మరింత తగ్గన్నాయి. సాధారణంగా కేంద్రం యూఎస్, కెనడా, రష్యాతో పాటు మిగిలిన దేశాల్లో గ్యాస్ ట్రేడింగ్ హబ్ల్లోని ధరలకు అనుగుణంగా సహజ వాయివు ధరల్ని ప్రతి 6 నెలలకు ఒకసారి మార్చుతూ వచ్చేది. కానీ ఇంధనం ధరల్ని ముడిచమురు ధరలతో అనుసంధానం చేయడంతో.. ధరల్లో ప్రతినెలా మార్పులు ఉండబోతున్నాయి.. #Cabinet approves revised domestic gas pricing guidelines price of natural gas to be 10% of the monthly average of Indian Crude Basket, to be notified monthly Move to ensure stable pricing in regime and provide adequate protection to producers from adverse market fluctuation pic.twitter.com/NRONPAOzzK — Rajesh Malhotra (@DG_PIB) April 6, 2023 తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) 10 శాతం చౌకగా మారుతుందని, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధర 6 శాతం నుండి 9 శాతానికి తగ్గుతుందని చమురు కార్యదర్శి పంకజ్ జైన్ తెలిపారు. సహజవాయు ఇంధన ధరలను నిర్ణయించటంలో కేంద్రం కొత్త విధానానికి ఆమోదంపై శనివారం నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. -
బాబోయ్ షాక్: భారీగా పెరిగిన గ్యాస్ ధరలు
న్యూఢిల్లీ: సహజ వాయువు రేట్లను ఏకంగా 40 శాతం పెంచుతూ చమురు శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో యూనిట్ (ఎంబీటీయూ) రేటు రికార్డు స్థాయిలో 6.1 డాలర్ల నుంచి 8.57 డాలర్లకు చేరింది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ రేటు 9.92 డాలర్ల నుంచి 12.6 డాలర్లకు పెంచుతూ చమురు శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా వాహనాల్లో ఉపయోగించే సీఎన్జీ, వంట అవసరాల కోసం పైపుల ద్వారా ఇళ్లకు సరఫరా చేసే పీఎన్జీ రేట్లకు రెక్కలు రానున్నాయి. ధరల పెంపు సామాన్యుడిపై ప్రభావం చూపనుంది. గ్యాస్‌ను ఉపయోగించి ఉత్పత్తి చేసే ఎరువులు, విద్యుత్ తయారీ వ్యయాల భారం కూడా పెరగనున్నాయి. సాధారణంగా గ్యాస్ రేట్లను ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకోసారి (ఏప్రిల్ 1న, అక్టోబర్ 1న) సమీక్షిస్తుంది. అమెరికా, కెనడా, రష్యా వంటి గ్యాస్ మిగులు దేశాల రేట్లకు అనుగుణంగా నిర్దిష్ట ఫార్ములా ప్రకారం సవరిస్తుంది. మరోవైపు, ఇంధన ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం ఎగిసే అవకాశాలు ఉన్నందున రేట్ల ఫార్ములాను సమీక్షించి, తగు సిఫార్సులు చేసేందుకు ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడు కిరీట్ పారిఖ్ సారథ్యంలో కేంద్రం కమిటీ వేసింది. ఇది సెప్టెంబర్ ఆఖరు నాటికే నివేదిక ఇవ్వాల్సి ఉన్నప్పటికీ మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
రిలయన్స్, ఓఎన్జీసీకి బొనాంజా
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువుకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలు ఏప్రిల్ 1 నుంచి మారనున్నాయి. గతేడాది కాలంగా ఇంధన ధరలు గణనీయంగా ఎగియడాన్ని పరిగణనలోకి తీసుకోనుండటంతో రేట్లు భారీగా పెరగనున్నాయి. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ తదితర గ్యాస్ ఉత్పత్తి సంస్థలకు ప్రయోజనం చేకూరనుంది. ఓఎన్జీసీకి నామినేషన్ ప్రాతిపదికన కేటాయించిన క్షేత్రాల నుంచి వెలికితీసే గ్యాస్ రేటు ప్రస్తుత 2.9 డాలర్ల నుంచి 5.93 డాలర్లకు (యూనిట్ – ఎంబీటీయూ) పెరగనుంది. అలాగే రిలయన్స్, దాని భాగస్వామ్య సంస్థ బీపీకి చెందిన కేజీ–డీ6 బ్లాక్‌లో సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధర 6.13 డాలర్ల నుంచి 9.9–10.1 డాలర్లకు పెరగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2019 ఏప్రిల్ తర్వాత ఈ గ్యాస్ రేట్లు పెరగడం ఇది రెండోసారి. అమెరికా, రష్యా తదితర గ్యాస్ మిగులు దేశాల్లో నిర్దిష్ట కాలంలో ధరలకు అనుగుణంగా దేశీయంగా సహజ వాయువు రేట్లను కేంద్రం ఆర్నెల్లకోసారి (ఏప్రిల్ 1, అక్టోబర్ 1) రేట్లను సవరిస్తుంది. ప్రస్తుతం 2021 జనవరి–డిసెంబర్ మధ్య కాలంలో అంతర్జాతీయంగా గ్యాస్ ధరలను బట్టి ఈ ఏడాది ఏప్రిల్ 1–సెప్టెంబర్ 30 మధ్య కాలానికి ప్రభుత్వం రేటు నిర్ణయించనుంది. గతేడాది రేటు భారీగా పెరిగిపోవడంతో ఆ ప్రభావం ఈ ఏడాది నిర్ణయించే గ్యాస్ ధరలపై పడనుంది. గ్యాస్ రేటు పెరగడం వల్ల ఎరువుల ఉత్పత్తి వ్యయం పెరగనుంది. అయితే, ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తున్నందున రేట్ల పెంపు పెద్దగా ఉండకపోవచ్చు. అలాగే, విద్యుదుత్పత్తి వ్యయాలూ పెరిగినా.. దేశీయంగా గ్యాస్ నుంచి విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా లేనందున.. వినియోగదారులపై అంతగా ప్రభావం ఉండదు. -
Putin: పుతిన్.. ఏం మెలిక పెట్టావయ్యా!
ఆంక్షలతో రష్యాను ఇరకాటంలో పెట్టాలని అమెరికా, పాశ్చాత్య దేశాలు(ఈయూ దేశాలతో కలిపి) తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కానీ, తగ్గేదే లే అనుకుంటూ ఉక్రెయిన్‌పై మిలిటరీ చర్యలను కొనసాగిస్తూనే ఉంది రష్యా. ఈ క్రమంలో.. రష్యా ఆర్థిక స్థితి కొద్దికొద్దిగా దిగజారుతోంది. తాజాగా పుతిన్ ‘మిత్రపక్షంలో లేని దేశాలకు’ పెద్ద షాకే ఇచ్చాడు. సహజ వాయువుల ఉత్పత్తులు కావాలంటే చెల్లింపులను రష్యన్ కరెన్సీ రూబుల్స్‌లో మాత్రమే చెల్లించాలంటూ కండిషన్ విధించాడు. లేదంటే ఉత్పత్తిని ఆపేస్తానని హెచ్చరించాడు. క్రెమ్లిన్‌ను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు, రష్యన్ ఆస్తులను ఫ్రీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. యూరోపియన్ దేశాల కరెన్సీ విశ్వసనీయతపై ప్రభావవంతంగా ఒక గీతను గీయడం, ఆ కరెన్సీల నమ్మకాన్ని దెబ్బతీయడం ద్వారా.. తన దారికి తెచ్చుకోవాలన్నది పుతిన్ ఫ్లాన్ అయి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే యూరోలు, డాలర్లకు బదులు.. రష్యన్ రూబుల్స్‌లోనే రష్యన్ గ్యాస్ కోసం చెల్లింపు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. పైగా ఈ షరతు పుతిన్‌కు పెద్ద అడ్వాంటేజే. ఒకవేళ ఈ షరతు.. రష్యాకు మునుముందు ఇబ్బందికరంగా గనుక మారితే వెంటనే ఎత్తేసే ఆలోచనలోనూ పుతిన్ ఉన్నట్లు తెలుస్తోంది. యూరోపియన్ యూనియన్ మొత్తం 90 శాతం సహజ వాయువుల్ని దిగుమతి చేసుకుంటున్నాయి. కరెంట్ తయారీకి, ఇళ్ల వెచ్చదనానికి, పరిశ్రమల కోసం ఈ గ్యాస్లనే ఉపయోగించుకుంటున్నాయి. అందులో 40 శాతం ఉత్పత్తి రష్యా నుంచి కావడంతోనే.. ఈయూ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రూబుల్ ఎలా ఉంటుందో తెలీదు ఇదిలా ఉంటే పుతిన్ రూబుల్ షరతుపై యూరోపియన్ యూనియన్ దేశాలు గగ్గోలు మొదలుపెట్టాయి. ‘నాకు తెలిసి యూరప్‌లో.. ఏ దేశానికీ రష్యా రూబుల్ ఎలా ఉంటుందో తెలిసి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు రూబుల్స్‌లో ఎలా చెల్లిస్తారు?’ అని స్వోవేనియా ప్రధాని జనెజ్ జన్సా అంటున్నారు. జర్మన్ ఛాన్స్లర్ ఒలాఫ్ స్కోల్జ్, ఇటలీ ప్రధాని మరియో డ్రాఘి తదితరులు కూడా ఇవే అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బెల్జియం లాంటి దేశం.. ఆకాశాన్ని అంటిన గ్యాస్ ధరలపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఒకవేళ పుతిన్ గనుక ఇదే ధోరణితో ముందుకు వెళ్తే గనుక.. కాంట్రాక్ట్ ఉల్లంఘనల కింద చర్యలకు దిగుతామని కొన్ని దేశాలు చెబుతున్నాయి. చదవండి: పుతిన్ పక్కన కూర్చోవడమా? నా వల్ల కాదు! -
జనవరిలో మౌలిక రంగం వృద్ధి 3.7 శాతం
న్యూఢిల్లీ: ఎనిమిది కీలక మౌలిక రంగ పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు జనవరిలో 3.7 శాతంగా నమోదయ్యింది. 2021 ఇదే నెల్లో ఈ వృద్ధి రేటు 1.3 శాతం. 2021 డిసెంబర్లో ఈ రేటు 4.1 శాతం. అధికారిక గణాంకాల ప్రకారం, బొగ్గు, సహజ వాయువు, సిమెంట్ పరిశ్రమల పనితీరు సమీక్షా నెల్లో కొంత మెరుగ్గా ఉంది. క్రూడ్ ఆయిల్, ఎరువుల ఉత్పత్తిలో వృద్ధి లేకపోగా క్షీణత నమోదయ్యింది. బొగ్గు (8.2 శాతం), సహజ వాయువు (11.7 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (3.7 శాతం), సిమెంట్ (13.6 శాతం) ఉత్పత్తులు బాగున్నాయి. స్టీల్, ఎలక్ట్రిసిటీ రంగాల పనితీరు అంతంతమాత్రంగానే నమోదయ్యింది. కాగా, ఆర్థిక సంవత్సరం 2021 ఏప్రిల్ నుంచి 2022 జనవరి వరకూ గడచిన 10 నెలల్లో ఈ ఎనిమిది రంగాల వృద్ధి రేటు 11.6 శాతంగా ఉంటే, 2020–21 ఇదే కాలంలో అసలు వృద్ధిలేకపోగా 8.6 క్షీణత నమోదయ్యింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) ఈ ఎనిమిది రంగాల వాటా దాదాపు 44 శాతం. రానున్న రెండు వారాల్లో ఐఐపీ జనవరి గణాంకాలు వెలువడనున్నాయి. -
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగకపోవడానికి అదే కారణమా..?
యుద్ధ మేఘాలు ఎంతగా కమ్ముకున్నా ఉక్రెయిన్‌పై రష్యా ఇప్పటికిప్పుడు యుద్ధానికి దిగకపోవడానికి సహజ వాయువు అంశం కూడా ఒక ముఖ్య కారణంగా కన్పిస్తోంది. యూరప్‌కు అతి పెద్ద గ్యాస్ సరఫరాదారు రష్యానే. యూరప్ గ్యాస్ అవసరాల్లో 40 శాతానికి పైగా తీరుస్తోంది. యూరప్ ఏటా సుమారు 237 బిలియన్ క్యుబిక్ మీటర్ల (బీసీఎం)కు పైగా గ్యాస్ దిగుమతి చేసుకుంటుంటే 2012లో 168 బీసీ ఎం గ్యాస్‌ను ఒక్క రష్యానే సరఫరా చేసింది. ముఖ్యంగా జర్మనీకి 60 శాతం దాకా గ్యాస్ రష్యా నుంచే అందుతోంది. ఇక మధ్య, తూర్పు యూరప్‌లోని పలు దేశాలు తమ గ్యాస్ అవసరాల్లో 90 శాతానికి పైగా రష్యా మీదే ఆధారపడ్డాయి! బాల్టిక్ సముద్రం గుండా జర్మనీ దాకా సాగే నార్డ్ స్ట్రీమ్ 1 పైప్ లైన్ ద్వారా యూరప్‌కు ఏటా 55 బీసీఎం గ్యాస్‌ను రష్యా సరఫరా చేస్తోంది. టర్క్ స్ట్రీమ్ లైన్ల ద్వారా మరో 33 బీసీఎం సరఫరా చేస్తోంది. 110 కోట్ల డాలర్ల ఖర్చుతో తలపెట్టిన కీలకమైన నోర్డ్ స్ట్రీమ్ 2 ప్రాజెక్టు పూర్తియితే జర్మనీకి సరఫరాలను రెండింతలు చేయడం రష్యాకు వీలవుతుంది. యూరప్‌కు చుక్కలే ఈ శీతాకాలంలో యూరప్ తీవ్ర గ్యాస్ కొరతతో అల్లాడుతోంది. ఈ నేపథ్యంలో యుద్ధమే వస్తే గ్యాస్ సరఫరా పూర్తిగా ఆగిపోయి యూరప్ దేశాలు అల్లాడతాయి. ప్రత్యామ్నాయంగా అమెరికా నుంచి గ్యాస్ దిగుమతి చేసుకునే అవకాశమున్నా దూరాభారం తదితరాలన్నీ కలిసి ధరలు చుక్కలను తాకే ప్రమాదముంది. ఎందుకంటే పెరిగిన డిమాండ్‌తో యూరప్ దిగుమతి చేసుకుంటున్న గ్యాస్ ధర ఇప్పటికే ఏకంగా 8 రెట్లు పెరిగింది. 2021లో మెగావాట్‌కు 19 యూరోలుగా ఉన్నది కాస్తా 80 యూరోలైంది. యుద్ధమే వస్తే రష్యా నుంచి సరఫరా ఆగిపోతుంది. యూఎస్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తే కనీసం మరో మూడు రెట్లు అధికంగా వెచ్చించాల్సి ఉంటుందని అంచనా. చదవండి: (ఇంకా యుద్ధ మేఘాలే) యూరప్ దేశాలకు ఇది తలకు మించిన భారమే. మరోవైపు యూరప్‌కు గ్యాస్ సరఫరాను పూర్తిగా ఆపేస్తే రష్యాకు రోజుకు కనీసం 100 కోట్ల డాలర్లకు పైగా నష్టమని అంచనా. పైగా ఒప్పందాలను ఉల్లంఘించినందుకు చెల్లించాల్సి వచ్చే భారీ జరిమానాలు అదనం. అందుకే యుద్ధాన్ని ఎలాగైనా నివారించేందుకు అటు యూరప్ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇటు రష్యా కూడా పైకి దూకుడు ప్రదర్శిస్తున్నా యుద్ధానికి దిగే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. అమెరికా, నాటో కూటమి నుంచి నయానో భయానో తను ఆశించిన హామీలను రాబట్టుకునే ప్రయత్నమే చేస్తోంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
పెట్రోనెట్ భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ద్రవ రూపంలోని సహజ వాయువు (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్/ఎల్ఎన్జీ) తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయిన పెట్రోనెట్ ఎల్ఎన్జీ వచ్చే 4–5 ఏళ్లలో రూ.40,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. విదేశాల్లోని ప్లాంట్లపై కలిపి ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయనున్నట్టు సంస్థ సీఈవో ఏకే సింగ్ వెల్లడించారు. ’’పెట్రోనెట్ ఎల్ఎన్జీ రూ.12,500 కోట్లతో ప్రొపేన్ డీహైడ్రోజెనరేషన్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా పెట్రోకెమికల్స్ వ్యాపారంలోకి ప్రవేశించనుంది. దిగుమతి చేసుకున్న ముడి సరుకు నుంచి ప్రాపీలేన్‌ను ఈ ప్లాంట్ తయారు చేస్తుంది. అలాగే, ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద రూ.1,600 కోట్లతో ఎల్ఎన్జీ దిగుమతి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాం’’ అని సింగ్ తెలిపారు. తాము ఎప్పటికప్పుడు విదేశీ పెట్టుబడుల అవకాశాలను పరిశీలిస్తుంటామని, దేశానికి ప్రయోజనకరం, మెరుగైనది అనిపిస్తే తప్పకుండా ముందుకు వెళతామని చెప్పారు. విద్యుత్, ఫెర్టిలైజర్, సీఎన్జీ అవసరాలను దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజవాయువు సగం మేరే తీరుస్తోంది. మిగిలినది దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ‘‘రూ.600 కోట్లతో గుజరాత్‌లోని దహేజ్ ఎల్ఎన్జీ దిగుమతి టర్మినల్ సామర్థ్యాన్ని ప్రస్తుత 17.5 మిలియన్ టన్నుల (వార్షిక) నుంచి 22.5 మిలియన్ టన్నులకు పెంచుకుంటాం. రూ.1,245 కోట్లతో అదనపు స్టోరేజీ ట్యాంకు సమకూర్చుకుంటాం’’ అని సింగ్ తెలిపారు. దేశీయంగా ఎల్ఎన్జీ దిగుమతి సామర్థ్యం, పెట్రోకెమికల్ వ్యాపారం కోసం ∙రూ.17,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామన్నారు. -
రష్యా సహజవాయువు సరఫరా ఆపేస్తే?
ఉరిమి ఉరిమి ఎక్కడో పడిందని.. రష్యా, అమెరికా పంతాలకు పోవడం తమకు చేటు తెస్తుందని సన్నకారు యూరప్ దేశాలు భయపడుతున్నాయి. ఉక్రెయిన్ వంకతో అమెరికా ఆంక్షలు పెంచితే ప్రతిగా రష్యా సహజవాయువు సరఫరా నిలిపివేయవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆంక్షలకు నిరసనగా యూరప్‌కు రష్యా మొత్తం గ్యాస్ సరఫరా నిలిపివేస్తుందా? అలాంటప్పుడు యూరప్‌లో ఇంధన సంక్షోభం తప్పదా? చూద్దాం.. ఉక్రెయిన్ను రష్యా ఆక్రమిస్తే తమకు ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని యూరప్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఉక్రెయిన్ను ఆక్రమిస్తే రష్యాపై యూఎస్ ఆంక్షలు తీవ్రతరం చేస్తుందని, ఇందుకు ప్రతిగా యూరప్‌కు సరఫరా అయ్యే సహజవాయువును రష్యా నిలిపివేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యూరప్ దేశాలు సహజవాయువు కోసం రష్యాపై ఆధారపడుతున్నాయి, యూరప్ సహజవాయు అవసరాల్లో మూడింట ఒక వంతు రష్యా సరఫరా తీరుస్తోంది. పైగా ప్రస్తుతం యూరప్ వద్ద సహజవాయు నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. రష్యా గ్యాస్ సరఫరా నిలిపివేస్తే తాము ఎగుమతి చేస్తామని అమెరికా యూరప్‌కు హామీ ఇస్తోంది. అయితే రష్యా నుంచి సరఫరా అయినంత సులభంగా అమెరికా నుంచి గ్యాస్ దిగుమతి చేసుకోవడం కుదరదు. ఈ నేపథ్యంలో యూరప్‌లో ఇంధన సంక్షోభ భయాలు పెరుగుతున్నాయి. గతేడాది శీతాకాలం తీవ్రత అధికంగా ఉండడంతో యూరప్‌లోని సహజవాయు నిల్వలు చాలావరకు ఖర్చయ్యాయి. పలు దేశాల్లో పునర్వినియోగ ఇంధన ఉత్పత్తి తక్కువగా ఉంది. మరోపక్క అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు దూసుకుపోతున్నాయి. ఇవన్నీ కలిసి తమను అంధకారంలోకి నెట్టవచ్చని పలు చిన్నాచితకా యూరప్ దేశాలు భయపడుతున్నాయి. పూర్తి నిలుపుదల సాధ్యం కాదా? ఆంక్షలను వ్యతిరేకిస్తూ రష్యా సహజవాయు సరఫరా నిలిపివేయాలనుకున్నా, పూర్తి ఎగుమతులను నిలిపివేయడం సాధ్యం కాదని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు రష్యా అధికారులు గ్యాస్ సరఫరా నిలిపివేయడంపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రష్యాకు గ్యాస్ ఎగుమతుల వల్ల చాలా ఆదాయం వస్తోంది. ఇటీవలే ఆ దేశం చైనాతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. అయినా యూరప్ నుంచే రష్యాకు అధికాదాయం లభిస్తోంది. అలాంటప్పుడు పూర్తిగా యూరప్‌కు ఎగుమతి ఆపితే అది తిరిగి రష్యా ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీసే ప్రమాదం ఉందన్నది నిపుణుల మాట. గతేడాది యూరప్‌కు రష్యా 1.75 లక్షల కోట్ల క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను సరఫరా చేసింది. ఇందులో పావుభాగాన్ని పైప్‌లైన్స్ ద్వారా పంపింది. ఆంక్షలు ముమ్మరమైతే ఉక్రెయిన్ నుంచి వెళ్లే పైప్‌లైన్ సరఫరాను మాత్రం రష్యా నిలిపివేయవచ్చని యూఎస్ మాజీ దౌత్యాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇది నేరుగా జర్మనీపై ప్రభావం చూపుతుంది. అప్పుడు జర్మనీకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రష్యా నార్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్ గుండా గ్యాస్‌ను సరఫరా చేసేందుకు ముందుకువస్తుందని, ఇది యూఎస్‌కు మరింత కోపాన్ని తెప్పించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. యూఎస్ సాయం ప్రపంచంలో అత్యధిక సహజవాయువు ఉత్పత్తిదారుల్లో ఒకటైన అమెరికా, గ్యాస్ ఎగుమతుల్లో కూడా ముందంజలో ఉంది. కానీ యూరప్‌కు అమెరికా సాయం పరిమితంగానే ఉండవచ్చని నిపుణుల అంచనా. రష్యా సరఫరాలను మించి యూరప్‌కు అమెరికా గ్యాస్‌ను పంపాలన్నా భౌగోళిక ఇబ్బందులున్నాయి. అందువల్ల ప్రస్తుతం కన్నా కొంతమేర ఎగుమతులను పెంచడం మాత్రమే యూఎస్ చేయగలదు. అందుకే ఉత్తర ఆఫ్రికా, మధ్యాసియా, ఆసియాల్లోని తన మిత్రపక్షాల నుంచి యూరప్‌కు సరఫరా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని బైడెన్ ప్రభుత్వం భావిస్తోంది. అలాగే పేద దేశాలకు ఎగుమతి చేసే నిల్వలను అధిక ధరల ఆశ చూపి యూరప్‌కు మరలిస్తోంది. ఉక్రెయిన్ పైప్‌లైన్ సరఫరాను రష్యా నిలిపివేస్తే యూరప్ దేశాలకు రోజుకు 1.27 షిప్పుల గ్యాస్‌ను యూఎస్ అదనంగా అందించాల్సిఉంటుంది. యూరప్‌కు సరఫరా పెంచితే స్వదేశంలో కొరత ఏర్పడవచ్చని కొందరు అమెరికా సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్యా ఇప్పటికే పరోక్షంగా గ్యాస్ సరఫరాను నియంత్రిస్తోందని, అందుకే మార్కెట్లో సహజవాయువు ధర పెరుగుతోందని ఇంధన రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందుకే చాలారోజులుగా యూరప్ దేశాల్లో ఇంధన బిల్లులు పెరిగిపోతున్నాయని చెప్పారు. ఈ సమస్యను ప్రజలపై పడకుండా చూసేందుకు పలు దేశాలు సబ్సిడీలను అందిస్తున్నాయి. పరిస్థితులను చక్కదిద్దేందుకు గ్యాస్ ఉత్పత్తి మరింత పెంచాలని అమెరికా యత్నిస్తోంది. అమెరికా ప్రయత్నాలు ఫలిస్తాయా? రష్యా నిజంగానే గ్యాస్ సరఫరా నిలిపివేస్తుందా? తేలాలంటే ఉక్రెయిన్ పీటముడి వీడాల్సిఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జీఎస్టీలోకి గ్యాస్..
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ లక్ష్యమైన గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ సాకారానికి.. సహజ వాయువును జీఎస్టీ కిందకు తీసుకురావాలని పరిశ్రమ డిమాండ్ చేసింది. దేశ ఇంధన బాస్కెట్లో సహజవాయవు వాటాను పెంచాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం ఇండస్ట్రీ (ఎఫ్‌ఐపీఐ) కోరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ఈ సమాఖ్యలో భాగంగా ఉన్నాయి. పైపులైన్ల ద్వారా సరఫరా చేసే సహజవాయువు, దిగుమతి చేసుకునే ఎల్ఎన్జీ ఆధారిత రీగ్యాసిఫికేషన్పై జీఎస్టీని తగ్గించాలని కోరింది. అప్పుడు పర్యావరణ అనుకూల ఇంధన ధరలు తగ్గుతాయని బడ్జెట్‌కు ముందు కేంద్ర ఆర్థిక శాఖకు సమర్పించిన వినతిపత్రంలో కోరింది. 2030 నాటికి దేశ ఇంధన వినియోగంలో సహజ వాయువు వాటా ప్రస్తుతం ఉన్న 6.2 శాతం నుంచి 15 శాతానికి చేర్చాలన్నది ప్రధాని లక్ష్యంగా ఉంది. -
Budget 2022: జీఎస్టీ పరిధిలోకి నేచురల్ గ్యాస్..!
భారత్‌ను గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు పురోగతిని సాధించేందుకుగాను నేచురల్ గ్యాస్‌ను వస్తు సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని పెట్రోలియం ఇండస్ట్రీ కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నేచురల్ గ్యాస్ జీఎస్టీ పరిధికి వెలుపల ఉంది. ఈ ఇంధనంపై సెంట్రల్ ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర వ్యాట్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ వంటి పన్నులు వర్తిస్తాయి. జీఎస్టీ పరిధిలోకి..! ఆర్థిక మంత్రిత్వ శాఖకు తన ప్రీ-బడ్జెట్ మెమోరాండంలో, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం ఇండస్ట్రీ (FIPI), పర్యావరణ వ్యయాన్ని తగ్గించడంలో సహాయపడటానికి పైప్‌లైన్ ద్వారా సహజ వాయువు రవాణాపై అలాగే దిగుమతి చేసుకున్న ఎల్ఎన్జీ తిరిగి గ్యాసిఫికేషన్‌పై జీఎస్టీని హేతుబద్ధీకరించాలని డిమాండ్ చేసింది. దేశంలో ప్రాథమిక ఆయిల్ వ్యవస్థలో సహజవాయువు వాటాను కేంద్ర ప్రభుత్వం పెంచాలనుకున్న లక్ష్యాలు నేరవేరాలంటే కచ్చితంగా నేచురల్ గ్యాస్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఆశించింది. నేచురల్ గ్యాస్‌పై పలు రాష్ట్రాలు 24.5 శాతం నుంచి 14 శాతం వరకు వ్యాట్‌ను విధిస్తోన్నాయి. నేచురల్ గ్యాస్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే ధరలు భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. COP-26 లక్ష్యాలే ..! 2030 నాటికి నేచురల్ గ్యాస్ వాటాను 6.2 శాతం నుంచి 15 శాతానికి పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. సహజ వాయువును ఎక్కువగా ఉపయోగించడంతో ఇంధన ధర భారీగా తగ్గే అవకాశం ఉంది. దాంతో పాటుగా భారీ ఎత్తున కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. COP-26 కట్టుబాట్లను చేరుకోవడంలో ఇది సహాయపడుతుంది. చదవండి: 69 ఏళ్ల తర్వాత టాటా గూటికి ఎయిర్ ఇండియా..! -
గెయిల్ లాభం రెట్టింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం గెయిల్ ఇండియా లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జులై– సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 131 శాతం దూసుకెళ్లి రూ. 2,863 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,240 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 57 శాతం పురోగమించి రూ. 21,515 కోట్లకు చేరింది. నేచురల్ గ్యాస్ అమ్మకాలు టర్న్అరౌండ్ కావడం ఫలితాల మెరుగుకు దోహదపడింది. ఈ విభాగం రూ. 1,079 కోట్ల పన్నుకు ముందు లాభం సాధించింది. అంతక్రితం క్యూ2లో రూ. 364 కోట్ల పన్నుకుముందు నష్టం ప్రకటించింది. గ్యాస్ పంపిణీ పన్నుకు ముందు లాభం సైతం రెట్టింపై రూ. 363 కోట్లను అధిగమించింది. గ్యాస్ పంపిణీ 107.66 ఎంఎంఎస్‌సీఎండీ నుంచి 114.32 ఎంఎంఎస్‌సీఎండీకి పెరిగింది. ఫలితాల నేపథ్యంలో గెయిల్ ఇండియా షేరు బీఎస్ఈలో 1.2 శాతం బలపడి రూ. 149 వద్ద ముగిసింది. -
భారత్‌లో అవకాశాలను సొంతం చేసుకోండి
న్యూఢిల్లీ: భారత్‌లో సహజవాయువు, చమురు అన్వేషణ అవకాశాలను సొంతం చేసుకోవాలంటూ అంతర్జాతీయ చమురు, గ్యాస్ కంపెనీలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వనం పలికారు. చమురు, గ్యాస్ రంగంలో అన్వేషణ, అభివృద్ధి కార్యకలాపాలకు భారత్‌తో చేతులు కలపాలని కోరారు. అంతర్జాతీయ చమురు కంపెనీల సీఈవోలు, ఈ రంగానికి చెందిన నిపుణులతో ప్రధాని మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. ఇంధన వనరుల పెంపు, అందుబాటు ధరలు, ఇంధన భద్రత దిశగా భారత్ చేపట్టిన చర్యలను పరిశ్రమకు చెందిన వారు మెచ్చుకున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. గత ఏడేళ్లలో కేంద్ర ప్రభుత్వం చమురు, గ్యాస్ రంగంలో చేపట్టిన సంస్కరణల గురించి వారికి ప్రధాని వివరంగా తెలియజేసినట్టు ప్రకటించింది. ఈ రంగంలో భారత్‌ను స్వావలంబన దిశగా తీసుకెళ్లడమే ఈ సంస్కరణల లక్ష్యమని తెలియజేసినట్టు.. ముడి చమురు నిల్వ సదుపాయాలను పెంచుకోవాల్సిన అవసరాన్ని ప్రధాని ప్రస్తావించినట్టు తెలిపింది. దేశంలో పెరుగుతున్న గ్యాస్ అవసరాలను తీర్చేందుకు వీలుగా గ్యాస్ పైపులైన్ల నిర్మాణం, పట్టణ గ్యాస్ పంపిణీ, ఎల్ఎన్జీ రీగ్యాసిఫికేషన్ యూనిట్ల ఏర్పాటు చర్యలను వారికి తెలియజేసినట్టు ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. -
సామాన్యులకు భారీ షాక్.. మరింత పెరగనున్న గ్యాస్ ధరలు
న్యూఢిల్లీ: ఇప్పటికే పెరుగుతున్న పెట్రో, డీజిల్ ధరలు వల్ల సామాన్యుడి నడ్డి విరుగుతుంటే మరోపక్క ఎల్పీజీ గ్యాస్, వంట నూనె వంటి నిత్యావసర ధరల పెరుగుదలతో సామాన్యుడు బ్రతుకు జీవుడా అంటూ జీవనం కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే, సామాన్యులపై వచ్చే నెలలో మరో భారం పడనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వెలువడుతున్న నివేదికల ప్రకారం.. వచ్చే నెల అక్టోబర్ నెలలో గ్యాస్ సిలిండర్ ధరలు భారీగానే పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్యాస్ ధరలు ఏకంగా 57 - 70 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. (చదవండి: ఆ ఈపీఎఫ్ఓ చందాదారులకు కేంద్రం శుభవార్త!) ఒకవేల గ్యాస్ సిలిండర్ ధరలు నిజంగానే పెరిగితే ఇక వాటిని కొనాలంటే సామాన్యుడికి భారంగా మారే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం 2014లో ప్రవేశపెట్టిన డొమెస్టిక్ గ్యాస్ పాలసీ నియమాల ప్రకారం.. ప్రతి 6 నెలలకు ఒకసారి నేచురల్ గ్యాస్ ధరలను సమీక్షిస్తుంది. అయితే, ఈ సమీక్షలో అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా మన దేశంలో గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం చూస్తే వచ్చే నెలలో దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు అధిక మొత్తంలో పెరగనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఏపీఎం గ్యాస్ ధర మీ.మీ.బీ.టీ.యుకు 1.79 డాలర్‌గా ఉంటే ఇది వచ్చే నెల 3 డాలర్ల పైకి పెరగవచ్చు అనే అంచనాలున్నాయి. విదేశీ మార్కెట్లో నేచురల్ గ్యాస్ ధర సెప్టెంబర్ 8న ఒక్క రోజే 8 శాతం పెరిగింది. -
రూ.5,000 కోట్లతో ‘మేఘా గ్యాస్’ ప్రాజెక్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు పనులు చకచకా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా మేఘా గ్యాస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో 16 జిల్లాల్లో పైపుల ద్వారా సహజ వాయువును (పీఎన్జీ) గృహాలకు, పారిశ్రామిక అవసరాలకు సరఫరా చేయనుంది. ఎల్పీజీతో పోలిస్తే పీఎన్జీ ధర 35–40 శాతం తక్కువగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇక వాహనాల కోసం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) స్టేషన్లను సైతం ఏర్పాటు చేస్తోంది. ప్రాజెక్టు కోసం సంస్థ రూ.5,000 కోట్లు వెచ్చించనుంది. ఇందులో ఇప్పటికే రూ.1,100 కోట్లు ఖర్చు చేసింది. 2019లో మొదలైన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనులను మేఘా గ్యాస్ 2026కి పూర్తి చేయాల్సి ఉంటుంది. 2021 డిసెంబర్ నాటికి.. మేఘా గ్యాస్ 7 జియోగ్రాఫికల్ ఏరియాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనులను చేపట్టింది. మూడు రాష్ట్రాల్లోని 16 జిల్లాలు దీని కింద కవర్ అవుతున్నాయి. 2026 కల్లా పైపుల ద్వారా దాదాపు 11 లక్షల గృహాలకు సహజ వాయువు సరఫరా చేయాలని సంస్థ నిర్దేశించుకుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, కర్ణాటకలోని బెల్గాం, తూముకూరు ఏరియాలు పూర్తి అయ్యాయి. ఈ మూడు యూనిట్స్ కింద 62,000 గృహాలకు కనెక్షన్లు ఇచ్చారు. తెలంగాణలోని నల్లగొండ యూనిట్ ఇటీవలే కార్యరూపం దాల్చింది. ఇక రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్ ఏరియాలు 2021 డిసెంబరుకల్లా పూర్తి చేయాలన్నది కంపెనీ లక్ష్యం. వచ్చే ఆరేళ్లలో ఈ ఏడు యూనిట్స్‌లో మొత్తం 250 సీఎన్జీ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయని ఎంఈఐఎల్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ హెడ్ పి.వెంకటేశ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఇందులో 25 స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ప్రత్యక్షంగా 1,000 మంది, పరోక్షంగా 3,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. -
నీళ్లలో మంటలా.. ఇదెలా సాధ్యం!
బీజింగ్ : సాధారణంగా ఎప్పుడైనా మంటలు అంటుకుంటే నీళ్లు పోసి ఆర్పడం సహజంగా చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం నీళ్లతో మంటలు వస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో కుళాయి తిప్పగానే ఒక వ్యక్తి నీళ్ల దగ్గర ఒక లైటర్‌ను వెలిగించాడు. దీంతో ఒక్కసారిగా నీటికి మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత కాసేపటికి మళ్లీ మాములు స్థితికి చేరుకుంది. కాగా వీడియోను పీపుల్స్ డెయిలీ తన ట్విటర్లో షేర్ చేయడంతో చూసినవారు కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు. నీళ్లలో మంటలా ఇదెలా సాధ్యం అని కామెంట్లు పెడుతున్నారు. చైనాకు చెందిన వెన్ అనే మహిళ ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏదో ఒక సందర్భంలో ఇలాంటివి తరచుగా జరుగుతూనే ఉన్నాయని వెన్ తెలిపింది. కేవలం మా ఇంట్లో మాత్రమే కాదు.. ఇక్కడున్న దాదాపు వంద ఇళ్లలో తరచుగా ఇలాంటి ఘటనలు చూస్తున్నాం అని పేర్కొంది. కాగా వీడియోపై అక్కడి జలవనరులశాఖ అధికారులు స్పందించారు. 'వాస్తవానికి గ్రామాన్ని మొత్తం అండర్‌గ్రౌండ్ వాటర్‌తో కనెక్టివిటీ చేశాం. ఆ సందర్భంలో ఒక దగ్గర నేచురల్ గ్యాస్‌కు సంబంధించిన పైప్‌లైన్ పగిలి కొద్దిపాటి గ్యాస్ లీకై అండర్‌గ్రౌండ్ వాటర్‌తో కలిసిపోయింది. దీంతో ఇలా తరచుగా నీళ్లకు మంటలు అంటుకుంటున్నాయని అసలు విషయం బయటపెట్టారు. కాగా ప్రస్తుతం నీళ్ల సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసి మరమత్తులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. Videos of flammable tap water in Panjin, NE China's Liaoning have gone viral. The odd scene is caused by natural gas infiltration due to temporary underground water supply system error, which is now shut down. Normal supply has resumed. Further probe will be conducted: local govt pic.twitter.com/a5EOA5SATU — People's Daily, China (@PDChina) November 24, 2020 -
సహజ వాయువుపై పన్ను పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సహజవాయువుపై ఏపీ వ్యాట్ చట్టం ప్రకారం పన్ను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 14.5 శాతం నుంచి 24.5 శాతానికి విలువ ఆధారిత పన్నును పెంచుతూ వాణిజ్య పన్నుల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే ఐదు రకాల పెట్రోలియం ఉత్పత్తులపై విలువ ఆధారిత పన్నును ప్రభుత్వం వసూలు చేస్తోంది. ముడి చమురు పై 5 శాతం మేర, పెట్రోలుపై 31 శాతంతో పాటు అదనంగా 4 రూపాయల మేర పన్ను వసూలు చేస్తుంది. డీజిల్ పై 22.5 శాతంతో పాటు అదనంగా 4 రూపాయలు, ఎయిర్ టర్బైన్ ఫ్యూయెల్ పై 1 శాతం మేర వాణిజ్య పన్నుల శాఖ వ్యాట్ వసూలు చేస్తుంది.(చదవండి: పెళ్లైన 20 రోజులకే భర్తను చంపిన భార్య) కోవిడ్ కారణంగా పన్నులపై ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ మే, జూన్, జూలై, ఆగస్టు నెలలకు ఆదాయం కోల్పోయినందున సహజవాయువుపై అదనంగా 10 శాతం మేర వ్యాట్ పెంచుతున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏప్రిల్ 2020 నెలకు 4480 కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉన్నా కేవలం 1323 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. రైతు భరోసా, నాడు నేడు, టెలి మెడిసిన్, సున్నా వడ్డీ, జగనన్న విద్యా దీవెన, వాహన మిత్ర, జగనన్న చేదోడు, అమ్మఒడి లాంటి పథకాలకు నిధులు కావాల్సి ఉన్నందున సహజ వాయువుపైనా పన్ను పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. -
దశాబ్ద కనిష్టానికి గ్యాస్ రేటు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దేశీయంగా సహజ వాయువు (నేచురల్ గ్యాస్) ధర దశాబ్దపు కనిష్ట స్థాయికి పడిపోయే అవకాశం ఉన్నట్లు పరిశ్రమవర్గాలు తెలిపాయి. గ్యాస్ ఎగుమతి దేశాల ప్రామాణిక రేట్లను బట్టి చూస్తే మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంబీటీయూ) ధర 1.9–1.94 డాలర్ల స్థాయికి తగ్గొచ్చని, ఇది దశాబ్దంపైగా కనిష్ట స్థాయి. అక్టోబర్1న జరిగే గ్యాస్ ధర సమీక్షలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వివరించాయి. ఎరువులు, విద్యుదుత్పత్తితో పాటు వాహనాల్లో సీఎన్జీగా, వంట గ్యాస్ అవసరాల కోసం ఉపయోగపడే గ్యాస్ రేటును ప్రతి ఆరు నెలలకోసారి (ఏప్రిల్ 1న, అక్టోబర్ 1న) ప్రభుత్వం సమీక్షిస్తుంది. ఓఎన్జీసీకి కష్టకాలం.. అమెరికా, కెనడా, రష్యా వంటి గ్యాస్ మిగులు దేశాల రేట్లను ప్రామాణికంగా తీసుకుని 2014 నవంబర్‌లో ప్రభుత్వం కొత్తగా గ్యాస్ ఫార్ములాను ప్రవేశపెట్టినప్పట్నుంచీ దేశీ క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌పై ఓఎన్జీసీ నష్టాలు చవిచూస్తోంది. బ్రేక్ ఈవెన్ రేటు (లాభ నష్టాలు లేని ధర) 5–9 డాలర్లుగా ఉంటోందని, ప్రస్తుతం నిర్ణయించిన 2.39 డాలర్ల ధర గిట్టుబాటు కాదంటూ కేంద్రానికి ఓఎన్జీసీ ఇటీవలే తెలిపినట్లు సమాచారం. గతంలో గ్యాస్ విభాగంలో నష్టాలను చమురు విభాగం ద్వారా ఓఎన్జీసీ కాస్త భర్తీ చేసుకోగలిగేది. కానీ ప్రస్తుతం చమురు వ్యాపారం కూడా తీవ్ర ఒత్తిడిలో ఉండడం కంపెనీకి ప్రతికూలాంశం. -
అదానీ గ్యాస్‌తో ఫ్రెంచ్ దిగ్గజం డీల్
సాక్షి,ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజ ఇంధన కంపెనీ అదానీ గ్యాస్ బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఫ్రెంచ్ ఇంధన దిగ్గజం టోటల్ ఎస్ఏ గ్యాస్ పంపిణీ సంస్థ అదానీ గ్యాస్‌లో 37.4 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. కంపెనీలో 37.4 శాతం వాటా కొనుగోలుకి ఇంధన రంగ ఫ్రాన్స్ దిగ్గజం టోటల్ ఎస్ఏ అంగీకరించింది. గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్యాస్‌లో 37.4 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ఫ్రెంచ్ ఇంధన దిగ్గజం టోటల్ సోమవారం ప్రకటించింది. అయితే ఈ ఒప్పందం మొత్తం విలువను వెల్లడించలేదు. ఈ మేరకు సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్ సమాచారం అందించడంతో అదానీ గ్యాస్ లిమిటెడ్ కౌంటర్లో కొనుగోళ్ల జోరందుకుంది. 10శాతం లాభంతో 151 వద్ద ముగిసింది. కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి భారతదేశం భారీగా ఖర్చు చేస్తున్న సమయంలో చోటు చేసుకున్న ఈ డీల్ ప్రాధాన్యతను సంతరించుకుంది. బీపీ, పీఎల్సి, షెల్ తరువాత దేశీయ గ్యాస్ రంగంలోకి ప్రవేశించిన మూడవ విదేశీ చమురు మేజర్ టోటల్ ఎస్ఏ. పబ్లిక్ షేర్ హోల్డర్లకు 25.2 శాతం ఈక్విటీ షేర్లను అదానీ నుండి కొనుగోలు చేయడానికి ముందు టెండర్ ఆఫర్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. వచ్చే 10 సంవత్సరాలలో గ్యాస్ పంపిణీని భారతీయ జనాభాలో 7.5 శాతం, పారిశ్రామిక, వాణిజ్య, దేశీయ వినియోగదారులకు మార్కెట్ చేస్తుంది, 6 మిలియన్ల గృహాలను లక్ష్యంగా చేసుకుని 1,500 రిటైల్ అవుట్లెట్ల ద్వారా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. భారతదేశంలో సహజవాయువు మార్కెట్ బలమైన వృద్ధిని నమోదు చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ధ్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జి) ప్లేయర్ టోటల్, భారతదేశంలో అతిపెద్ద ఇంధన, మౌలిక సదుపాయాల సమ్మేళనం అదానీ గ్రూపుతో తన భాగస్వామ్యాన్ని విస్తరిస్తున్నట్లు టోటల్ చైర్మన్ , సీఈవో సిఇఒ పాట్రిక్ పౌయన్నే ఒక ప్రకటనలో చెప్పారు. ఈ భాగస్వామ్యం దేశంలో తమ అభివృద్ధి వ్యూహానికి మూలస్తంభం లాంటిదన్నారు. 2030 నాటికి దేశ ఇంధన వినియోగంలో నేచురల్ గ్యాస్ వాటాను 15 శాతానికి పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్నసంగతి తెలిసిందే. -
రుణభారం తగ్గించుకోడానికి కసరత్తు: కంట్రీక్లబ్
ముంబై: రుణభారాన్ని గణనీయంగా తగ్గించుకునే క్రమంలో నిధుల సమీకరణకు కంట్రీ క్లబ్ వివిధ మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని బేగంపేట్, కర్ణాటకలోని సర్జాపూర్ ప్రాపర్టీలను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కంట్రీ క్లబ్ హాస్పిటాలిటీ అండ్ హాలిడేస్ (సీసీహెచ్‌హెచ్‌ఎల్) చైర్మన్ వై.రాజీవ్ రెడ్డి వెల్లడించారు. వీటిని అభివృద్ధి చేయడంతో 5 లక్షల చదరపుటడుగుల డెవలప్మెంట్ ఏరియా అందుబాటులోకి వస్తుందని, కంపెనీకి రూ.140 కోట్ల దాకా లభించగలవని ఆయన చెప్పారు.ప్రస్తుతం దేశీయంగా తమ రుణభారం రూ. 275 కోట్లని, రూ.1,500 కోట్ల మేర ఆస్తులున్నాయని చెప్పారాయన. -
దేశీయ సహజవాయువు ధర 10 శాతం పెంపు
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజవాయువు ధరను 10 శాతం పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. దీంతో గ్యాస్ ఆధారిత విద్యుత్, ఎరువుల తయారీ వ్యయాలు పెరిగి అంతిమంగా ధరల పెరుగుదలకు దారితీయనుంది. మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ గ్యాస్ ధరను అక్టోబర్ 1 నుంచి 3.36 డాలర్లకు పెంచింది. ఇది ఆరు నెలల పాటు అమల్లో ఉంటుంది. ప్రస్తుతం ఇది 3.06 డాలర్లుగా ఉంది. అమెరికా, రష్యా, కెనడా దేశాల్లో సగటు ధరను ఆధారంగా చేసుకుని ప్రతీ ఆరు నెలలకు ప్రభుత్వం దేశీయంగా ధరలను నిర్ణయిస్తుంటుంది. మన దేశ గ్యాస్ అవసరాల్లో సగం మేర దిగుమతి చేసుకుంటున్నాం. దీని ధర దేశీయ గ్యాస్ ధర కంటే రెట్టింపు ఉంటోంది. ధరల పెంపుతో ఓఎన్జీసీ, రిలయన్స్ ఆదాయాలు పెరగనున్నాయి. క్లిష్టమైన ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే గ్యాస్ ధరను సైతం మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు 6.78 డాలర్ల నుంచి 7.67 డాలర్లు చేసింది.