జ్వాలాముఖి | Jwalamukhi | Sakshi
Sakshi News home page

జ్వాలాముఖి

Published Tue, Jan 26 2016 10:57 PM | Last Updated on Sun, Sep 3 2017 4:21 PM

జ్వాలాముఖి

జ్వాలాముఖి

తెలుసుకుందాం
 
జ్వాలాముఖి ఆలయం కాంగ్రాకి దక్షిణంగా సుమారు 30 కి.మీ. దూరంలో ఉంది. ఇది 51 శక్తిపీఠాలలో ఒకటి. ఈ ఆలయంలో ఒక రాగి గొట్టం నుంచి నిరంతరం సహజవాయువు వెలువడుతుంది. దీన్ని ఆలయ పురోహితుడు వెలిగిస్తాడు. ఈ జ్వాలే జ్వాలాముఖి అమ్మవారిగా పూజలందుకుంటోంది. ఇక్కడ ఈ జ్వాలే కాక, మహాకాళి, అన్నపూర్ణ, చండి, హింగుళ, వింధ్యవాసిని, మహాలక్ష్మి, సరస్వతి, అంబిక, అంజిదేవి అనేవి ఈ తొమ్మిది జ్వాలాదేవతల పేర్లు.

జ్వాలాముఖి అమ్మవారు ఇక్కడ కొలువుదీరడాన్ని గురించి ఎన్నో గాథలు ఉన్నాయి.  ఒకసారి రాక్షసులు హిమాలయాలను ఆక్రమించి, దేవతలను బాధించసాగారు. దేవతలంతా శ్రీమహావిష్ణువుకి మొరపెట్టుకోగా, విష్ణువు దేవతలందరినీ కలసి రాక్షసుల పీడ వదిలించడానికై ఆ ప్రాంతానికి వచ్చాడు. దేవతలందరూ వారి వారి శక్తులను కొండమీదకి ప్రసరింపజేశారు. అందరి శక్తులు ఏకమై ఒక జ్వాల ఏర్పడింది. అందులో నుండి ఒక బాలిక జన్మించింది. ఆమే జ్వాలాముఖి. ఈ అమ్మవారిని సేవించడం వల్ల సర్వపాపాలూ తొలగి, సకల శుభాలు చేకూరతాయని విశ్వాసం.      - బాచి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement