virtues
-
విద్వాన్ సర్వత్ర పూజ్యతే!
ధనం మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి బాహ్యంలో ఉండే భౌతికమైన ధనం. రెండవది మానసిక ధనం. మూడవది పుణ్యరూపమయిన ధనం. ఈ మూడూ సమానమైన ప్రాతినిధ్యాన్ని, సమానమైన ప్రతిపత్తిని పొంది ఉంటాయి. అయితే శాస్త్రాన్ని అన్వయం చేసుకోకపోతే మాత్రం బాహ్యంలో ధనమున్నప్పటికీ అది ప్రమాదహేతువై కూర్చుంటుంది. అందుకే శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో – సరస్వతీదేవి, లక్ష్మీదేవి.. ఇద్దరి అనుగ్రహం అవసరమేనని అంటారు. సరస్వతీకటాక్షం లేని లక్ష్మీదేవికటాక్షం బాహ్యంలో భయ హేతువు. ఐశ్వర్యం ఉంది. చదువు లేదు. ఎక్కడ సంతకం పెట్టాలో తెలియదు, ఎవడేం చేస్తాడో తెలియదు. అంతరంలో–ఎక్కడ దానం చేయాలో తెలియదు, అపాత్రదానం చేసి తనకున్న వైభవాన్ని పాడుచేసుకుంటాడు. అదే సరస్వతీ కటాక్షంతో కూడుకున్న లక్ష్మీకటాక్షంలో అభ్యున్నతి పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరస్వతీ కటాక్షమున్నవారికి లక్ష్మీకటాక్షం లేకపోవడం అన్నమాట ఉండదు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఎంత చదువున్నా తాదాత్మ్యత చెందడు. ప్రసాదబుద్ధితో బతుకుతుంటాడు. ‘ఇవన్నీ నావి కావమ్మా, నీ పాదాలు పట్టుకోవడం చేత వచ్చిన కీర్తి’ అనే భావనతో ఉంటాడు. అది అభ్యున్నతికి హేతువవుతుంది. ఇది బాహ్యంలో శాంతికి, భోగాన్ని అనుభవించడానికి, పుణ్యకర్మ చేయడానికి అత్యంత ప్రధానం. రెండవది మానసిక ధనం. అంటే శాంతి. శాస్త్ర ప్రకారం మనం ఏది చేసినా...‘ఓం శాంతిః శాంతిః శాంతిః’ అంటాం. తాను శాంతంగా ఉండాలి. పదిమందిని శాంతంగా ఉంచగలగాలి. ప్రశాంతంగా ఉండడంకన్నా ఐశ్వర్యం లోకంలో మరొకటి ఉండదు. బాహ్యంలో ఎంత ఐశ్వర్యవంతుడయినా తనకింకా ఏదో లేదనే బాధతో బతికేవాడు దరిద్రుడు. తనకి ఏది లేకపోయినా ‘నాకేం తక్కువయిందని’..అన్నభావనతో బతికేవాడు మహదైశ్వర్యవంతుడు. కొంతమంది పూరింట్లో ఉన్నా ఎంతో తృప్తిగా జీవిస్తుంటారు. పెద్దపెద్ద రాజభవంతుల్లో ఉన్నా ఇంకా ఏదో లేదని ఎప్పుడూ వెంపర్లాడుతుండేవాడు నిత్య దరిద్రుడు. అందుకే మానసికమైన ధనం భౌతికమైన ధనం కన్నా చాలా గొప్పది. ఐశ్వర్యమయినా, ఆనందమయినా మానసికమైన ధనాన్ని ఆవహించి ఉంటాయి. మూడవది పుణ్యధనం. ఇక్కడ ప్రశాంతంగా ఉన్నావు. మంచిదే. ఇక్కడ ధనవంతుడిగా ఉన్నావు. మంచిదే. కానీ జన్మ పరంపర ఇక్కడితో ఆగిపోతుందని నమ్మకం ఏమిటి? జ్ఞానం కలుగుతుందనీ, దానివల్ల పునరావృతి పొందవనీ, మళ్ళీ జన్మ స్వీకరించవనీ నమ్మకమేం లేదుగా! ఇప్పుడు నీవు అనుభవిస్తున్న ఐశ్వర్యం కానీ, ప్రశాంతత కానీ గత జన్మల పుణ్యఫలమేగా! దానిని నీవు అనుభవిస్తున్న కొద్దీ ఖర్చయిపోతుంటుందిగా! మరి వచ్చే జన్మకి పుణ్యం ఎక్కడినుంచి వస్తుంది ? ఇక్కడి ధనాన్ని, ఇక్కడి పుణ్యాన్ని, ఇక్కడి తెలివిని, ఇక్కడి శక్తిని పుణ్యం కింద మార్చుకోవాలిగా! అదెలా మారుతుంది? పాండిత్యం ఉంటే నీకున్న పాండిత్యాన్ని పదిమందికీ పంచి పెట్టడానికి ఉపయోగిస్తే అది అందరికీ చేరుతుంది. తరగని సంపదలా నీ వద్దే ఉంటుంది కూడా! అందుకే విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నారు పెద్దలు. చదవండి: The Exorcism Of The Emily Rose: ఓ అమ్మయి కన్నీటి గాథ.. ఆరు ప్రేతాత్మలు ఆరేళ్లపాటు వేధించి.. అతి క్రూరంగా..!! -
జ్వాలాముఖి
తెలుసుకుందాం జ్వాలాముఖి ఆలయం కాంగ్రాకి దక్షిణంగా సుమారు 30 కి.మీ. దూరంలో ఉంది. ఇది 51 శక్తిపీఠాలలో ఒకటి. ఈ ఆలయంలో ఒక రాగి గొట్టం నుంచి నిరంతరం సహజవాయువు వెలువడుతుంది. దీన్ని ఆలయ పురోహితుడు వెలిగిస్తాడు. ఈ జ్వాలే జ్వాలాముఖి అమ్మవారిగా పూజలందుకుంటోంది. ఇక్కడ ఈ జ్వాలే కాక, మహాకాళి, అన్నపూర్ణ, చండి, హింగుళ, వింధ్యవాసిని, మహాలక్ష్మి, సరస్వతి, అంబిక, అంజిదేవి అనేవి ఈ తొమ్మిది జ్వాలాదేవతల పేర్లు. జ్వాలాముఖి అమ్మవారు ఇక్కడ కొలువుదీరడాన్ని గురించి ఎన్నో గాథలు ఉన్నాయి. ఒకసారి రాక్షసులు హిమాలయాలను ఆక్రమించి, దేవతలను బాధించసాగారు. దేవతలంతా శ్రీమహావిష్ణువుకి మొరపెట్టుకోగా, విష్ణువు దేవతలందరినీ కలసి రాక్షసుల పీడ వదిలించడానికై ఆ ప్రాంతానికి వచ్చాడు. దేవతలందరూ వారి వారి శక్తులను కొండమీదకి ప్రసరింపజేశారు. అందరి శక్తులు ఏకమై ఒక జ్వాల ఏర్పడింది. అందులో నుండి ఒక బాలిక జన్మించింది. ఆమే జ్వాలాముఖి. ఈ అమ్మవారిని సేవించడం వల్ల సర్వపాపాలూ తొలగి, సకల శుభాలు చేకూరతాయని విశ్వాసం. - బాచి -
పెదవులు తడారిపోతాయి ఎందుకు?
ఎంత తడిపినా ఈ కాలంలో పెదవులపై తేమ తగ్గిపోతూంటుంది. దీంతో పగుళ్ళు కూడా వస్తుంటాయి. మృతకణాలు పేరుకుపోతుంటాయి. పెదవుల చుట్టూ చర్మంపై చిన్న చిన్న కురుపుల్లాంటివి కూడా వస్తుంటాయి. ఈ సమస్య నివారణకు.. ఏం చేయాలంటే! కొద్దిగా పంచదార పెదవులపై అద్ది, మృదువుగా రుద్దాలి. తర్వాత నీటితో కడిగి, మంచి లిప్ బామ్ రాయాలి. దీంతో పెదవులు తేమను కోల్పోకుండా ఎక్కువసేపు మృదువుగా ఉంటాయి. రాత్రి పడుకునేముందు నెయ్యి లేదా బాదం నూనె లేదా తేనె రాసుకుంటే మంచిది. వెచ్చని గ్రీన్ టీ బ్యాగ్‌ను ప్రతిరోజూ పెదవులపై 3-4 నిమిషాలు ఉంచితే సహజ సిద్ధమైన తేమ పెదవులకు అందుతుంది. పొడిబారడం, పగుళ్లు రావడం సమస్య తగ్గుతుంది చలికాలంలో దాహం ఎక్కువ అవ్వదు. అలాగని నీళ్లు తక్కువ తాగితే చర్మం డీ-హైడ్రేట్ అవుతుంది. ఫలితంగా పెదవులు పొడిబారు తాయి. చక్కటి మంత్రం... ఎండాకాలంలాగే చలికాలంలోనూ నీరు బాగా తాగాలి పెదవులను పదే పదే నాలుకతో తాకడం, తడుపుకోవడం వల్ల పొడిబారుతాయి. ఈ చెడ్డ అలవాటుకు వెంటనే స్వస్తి పలకండి. పెదవుల పగుళ్లకు విటమిన్ బి - 12 లోపం. ఈ సమస్య ఉంటే సమతుల ఆహారంపై దృష్టిపెట్టడం అవసరం ఎప్పుడూ వాడినవే కాకుండా చలి కాలంలో అదనపు మాయిశ్చరైజింగ్ ఏజెంట్ ఉన్న లిప్ క్రీమ్ వాడాలి. ఇవి చాప్‌స్టిక్స్ రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఈ కాలాన్ని తట్టుకునేలా లిప్బామ్స్లో జొజొబా, విటమిన్‘ఇ’ ఆయిల్ ఉన్నవీ లభిస్తున్నాయి మేకప్ వేసుకునే వారు మాయిశ్చరైజింగ్ సుగుణాలు ఉన్న లిప్‌స్టిక్‌ను ఎంచుకోవడం ఉత్తమం. అలాగే పడుకోబోయే ముందు లిప్‌స్టిక్ తొలగించి, మాయిశ్చరైజింగ్ లిప్ బామ్ తప్పక రాసుకోవాలి గ్లిజరిన్, పెట్రోకెమికల్ లిప్‌బామ్స్ అస్సలు వాడకూడదు.