ఎంత తడిపినా ఈ కాలంలో పెదవులపై తేమ తగ్గిపోతూంటుంది. దీంతో పగుళ్ళు కూడా వస్తుంటాయి. మృతకణాలు పేరుకుపోతుంటాయి. పెదవుల చుట్టూ చర్మంపై చిన్న చిన్న కురుపుల్లాంటివి కూడా వస్తుంటాయి. ఈ సమస్య నివారణకు..
ఏం చేయాలంటే!
కొద్దిగా పంచదార పెదవులపై అద్ది, మృదువుగా రుద్దాలి. తర్వాత నీటితో కడిగి, మంచి లిప్ బామ్ రాయాలి. దీంతో పెదవులు తేమను కోల్పోకుండా ఎక్కువసేపు మృదువుగా ఉంటాయి. రాత్రి పడుకునేముందు నెయ్యి లేదా బాదం నూనె లేదా తేనె రాసుకుంటే మంచిది.
వెచ్చని గ్రీన్ టీ బ్యాగ్‌ను ప్రతిరోజూ పెదవులపై 3-4 నిమిషాలు ఉంచితే సహజ సిద్ధమైన తేమ పెదవులకు అందుతుంది. పొడిబారడం, పగుళ్లు రావడం సమస్య తగ్గుతుంది
చలికాలంలో దాహం ఎక్కువ అవ్వదు. అలాగని నీళ్లు తక్కువ తాగితే చర్మం డీ-హైడ్రేట్ అవుతుంది. ఫలితంగా పెదవులు పొడిబారు తాయి. చక్కటి మంత్రం... ఎండాకాలంలాగే చలికాలంలోనూ నీరు బాగా తాగాలి
పెదవులను పదే పదే నాలుకతో తాకడం, తడుపుకోవడం వల్ల పొడిబారుతాయి. ఈ చెడ్డ అలవాటుకు వెంటనే స్వస్తి పలకండి.
పెదవుల పగుళ్లకు విటమిన్ బి - 12 లోపం. ఈ సమస్య ఉంటే సమతుల ఆహారంపై దృష్టిపెట్టడం అవసరం
ఎప్పుడూ వాడినవే కాకుండా చలి కాలంలో అదనపు మాయిశ్చరైజింగ్ ఏజెంట్ ఉన్న లిప్ క్రీమ్ వాడాలి. ఇవి చాప్‌స్టిక్స్ రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి
ఈ కాలాన్ని తట్టుకునేలా లిప్‌బామ్స్‌లో జొజొబా, విటమిన్‘ఇ’ ఆయిల్ ఉన్నవీ లభిస్తున్నాయి
మేకప్ వేసుకునే వారు మాయిశ్చరైజింగ్ సుగుణాలు ఉన్న లిప్‌స్టిక్‌ను ఎంచుకోవడం ఉత్తమం. అలాగే పడుకోబోయే ముందు లిప్‌స్టిక్ తొలగించి, మాయిశ్చరైజింగ్ లిప్ బామ్ తప్పక రాసుకోవాలి
గ్లిజరిన్, పెట్రోకెమికల్ లిప్‌బామ్స్ అస్సలు వాడకూడదు.
పెదవులు తడారిపోతాయి ఎందుకు?
Published Wed, Nov 20 2013 11:58 PM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM
Advertisement