Moisturizing
-
కురులకు పండుగ కళ
జుత్తు అందంగా మృదువుగా నిగనిగలాడుతూ ఉండాలనే ఆశ చాలామందికే ఉంటుంది. పండుగ రోజుల్లో ఇంకాస్త స్పెషల్‌గా కనిపించాలనుకుంటారు. అది సహజమే. అయితే ఆ ఆశ నిజం కావాలంటే హెయిర్‌కేర్ మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా మనలో చాలా మంది షాంపూ చేసుకోవడంలోనే పొరపాటు చేస్తుంటారు. షాంపూ చేసుకోవడానికీ ఓ పద్ధతుంది. చన్నీటితో తలస్నానం చేస్తే జుట్టు కుదుళ్లు మెత్తబడతాయి. కేశాలను గట్టిగా పట్టుకుంటాయి. అందరు మనుషులూ ఒకలా ఉండనట్లే, అందరి చర్మతత్వాలు ఒకలా ఉండనట్లే.. జుట్టు కూడా ఒకలా ఉండదు. జుట్టు తత్త్వాన్ని బట్టి షాంపూ ఎంపిక చేసుకోవాలి. ►పొడిబారి నిర్జీవంగా ఉండే జుట్టుకు ఎగ్షాంపూ వాడితే మంచిది. నార్మల్ హెయిర్ అయితే ఎక్కువ గాఢత లేని షాంపూ వాడాలి. జిడ్డుబారిన జుట్టయితే షాంపూతోపాటు నిమ్మరసం కూడా వాడాలి. ►తలస్నానానికి అరగంట ముందు నిమ్మరసం పట్టించవచ్చు లేదా తలస్నానం పూర్తయిన తర్వాత చివరగా ఒక మగ్గు నీటిలో నిమ్మరసం పిండి జుట్టంతా తడిసేలా తలమీద పోసుకుంటే చాలు. ►టీ డికాక్షన్ను జుట్టు కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే కేశాలు ఆరోగ్యంగా మెరుస్తాయి. కండిషనింగ్ ఎలా చేయాలి? షాంపూ చేయడం పూర్తయిన తర్వాత కేశాలకున్న నీటిని పిండేయాలి. కేశాలను వేళ్లతో దువ్వి చిక్కులు విడదీయాలి. కండిషనర్ చేతిలోకి తీసుకుని జుట్టుకు పట్టించాలి. కండిషనర్ను జుట్టు కుదుళ్లకు, చర్మానికి పట్టించకూడదు. కేశాలకు మాత్రమే పట్టించి ఐదు నిమిషాల తర్వాత మెల్లగా మర్దన చేయాలి. చివరగా డ్రైయర్‌తో ఆరబెడితే జుట్టు పూల రెక్కల్లా మృదువుగా ఉంటుంది. ఏ కండిషనర్ మంచిది? చిట్లిపోయి జీవం కోల్పోయినట్లున్న జుట్టుకు ప్రొటీన్ కండిషనర్ వాడాలి. పొడి జుట్టుకు మాయిశ్చరైజింగ్ లేదా ఇన్టెన్సివ్ కండిషనర్, జిడ్డుగా ఉండే జుట్టుకు నార్మల్ లేదా ఆయిల్ ఫ్రీ కండిషనర్ వాడాలి. సహజసిద్ధమైన కండిషనర్ మార్కెట్లో రెడీమేడ్‌గా దొరికే కండిషనర్ వాడడానికి ఇష్టపడని వాళ్లు హెన్నా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అయితే ఇది సహజసిద్ధమైన కండిషనర్. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అయితే హెన్నా కండిషనర్‌లో ఉపయోగించే వస్తువులను జుట్టు తత్వాన్ని బట్టి మార్చుకోవాలి.గోరింటాకు పొడిలో కోడిగుడ్డు, నిమ్మరసం, కాఫీ లేదా టీ డికాక్షన్, మందార ఆకుల పొడి, ఉసిరిక పొడి (కాస్మొటిక్ ఉత్పత్తులు దొరికే షాపుల్లోను, సూపర్ మార్కెట్లోనూ దొరుకుతాయి) ఇనుపపాత్రలో వేసి పేస్టులా కలుపుకోవాలి. ఆరుగంటల సేపు నానిన తర్వాత తలకు పట్టించాలి. ఒక గంట తర్వాత షాంపూ వాడకుండా తలస్నానం చేయాలి (హెన్నా ప్యాక్‌ని షాంపూ చేసి ఆరిన జుట్టుకు వేయాలి). హెన్నా ట్రీట్మెంట్ చేస్తే జుట్టురాలడం, చుండ్రు తగ్గడమే కాకుండా మెత్తగా పట్టుకుచ్చులా ఉంటుంది. కనీసం నెలకొకసారి హెన్నా ట్రీట్మెంట్ చేస్తే కేశ సౌందర్యం ఇనుమడిస్తుంది. -
అప్పుడప్పుడూ పాపకు ఒళ్లంతా రాష్... తగ్గేదెలా?
వూ పాపకు తొమ్మిదేళ్లు. కొన్ని నెలల కిందట ఒకరోజు బాగా ఆడుకున్న తర్వాత శరీరవుంతా ఎర్రగా రాష్లాగా వచ్చింది. ఏదైనా పురుగు కుట్టిందేమోనని అనుమానించి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఇంజెక్షన్ చేశారు. అయితే అప్పటి నుంచి ఎండలోకి వెళ్లినా, ఇంట్లోనే పరుగెత్తే ఆటలు ఆడినా, వేణ్ణీళ్ల స్నానం చేసినా ఈవిధంగా శరీరవుంతా ఎర్రగా రాష్ వస్తోంది. ఐదు, పది నిమిషాల్లో అదే తగ్గిపోతోంది. డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే శరీరంలో ఏదైనా పడని పదార్థాలు ఉంటే అలాగే వస్తుందని వుందులు ఇచ్చారు. వుందులు వాడినంతకాలం రాలేదు. వుందులు వూనేశాక వుళ్లీ అదే విధంగా వస్తోంది. ఇలా రావడం ఏమైనా హానికరవూ? దయచేసి వూ పాప సవుస్యకు శాశ్వత పరిష్కారం చూపగలరు. – సుధారాణి, నెల్లూరు మీ పాపకు ఉన్న కండిషన్‌ను ఆర్టికేరియా అంటారు. అందులోనూ మీ పాపకు ఉన్న కండిషన్ కోలినర్జిక్ ఆర్టికేరియా అనిపిస్తోంది. ఇది ఒక రకమైన అలర్జిక్ రుగ్మత. కాని విచిత్రం ఏమిటంటే... ఇది ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా చేయడం వల్ల కలిగే ప్రేరణ (స్టివు్యులస్) వల్ల ఎక్కువగా వస్తుంది. ఫిజికల్ యాక్టివిటీ వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి చెవుటలు పట్టడం వల్ల ఈ సవుస్య ఉత్పన్నవువ#తుంది. సాధారణంగా దురదలు, చర్మం వేడెక్కడం, ఎర్రబడటం, వుచ్చలు, బొబ్బలు రావడం వంటి లక్షణాలు ఇందులో కనిపిస్తాయి. ఈ లక్షణాలు శరీరవుంతటా వస్తాయి. అయితే అరచేతుల్లో, అరికాళ్లలో రావడం వూత్రం అరుదు. కొద్దివుంది పిల్లల్లో దీంతో పాటు శ్వాసకోశ సవుస్యలు తలెత్తడం కూడా చూస్తుంటాం. ఇది అలర్జిక్ టెండెన్సీస్ ఉన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇది సాధారణంగా పదేళ్ల పిల్లల నుంచి 30 ఏళ్ల వ్యక్తుల వరకు చూస్తుంటాం. ఇది ఒకసారి వస్తే కొన్నేళ్ల పాటు తరచూ కనిపిస్తుంటుంది. కారణాలు...: వుుందు చెప్పినట్లుగా ఇది ఫిజికల్ యాక్టివిటీతో కలిగే స్టివు్యులస్ వల్ల వస్తుంది. శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి చెవుటలు పట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుంది. వేడివేడి ఆహార పదార్థాలు, వుసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం, ఉద్వేగాలతో కూడిన ఒత్తిడి (ఎమోషనల్ స్ట్రెస్) వల్ల ఇది రావచ్చు. కొందరిలో వేణ్ణీళ్ల స్నానం వల్ల ఆర్టికేరియా అటాక్ రావడం సాధారణమే. నిర్ధారణ...: ఈ పరిస్థితిని ఫిజికల్ యాక్టివిటీ చేయించడం ద్వారా, కొన్ని ప్రత్యేకమైన పరీక్షల ద్వారా నిర్ధారణ చేస్తారు. కొందరిలో ఇది సుదీర్ఘకాలం పాటు తరచూ కనిపిస్తూ ఉన్నా... వురికొందరిలో దానంతట అదే అకస్మాత్తుగా తగ్గిపోవచ్చు కూడా. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ∙ఆర్టికేరియాకు దారితీసే పరిస్థితులు అంటే... చెవుటపట్టే పరిస్థితులను నివారించడం (మరీ తీవ్రమైన ఎక్సర్సైజ్ వంటి ఫిజికల్ యాక్టివిటీ తగ్గించుకోవడం), వురీ ఎక్కువ ఉష్ణోగ్రతకు, వురీ ఎక్కువ తేవు (హ్యూమిడిటీ) వంటి వాతావరణ పరిస్థితులకు ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ∙ఆహారపరంగా... వేడివేడి పదార్థాలు, వుసాలాలు, శీతల పానీయాల వంటివాటికి దూరంగా ఉండటం వుంచిది. చికిత్స: ఈ కండిషన్ యాంటీహిస్టమైన్స్ అంటే ఉదాహరణకు సిట్రజైన్, లోరాటిడెన్ వంటి వుందులవల్ల చాలా వుటుకు తగ్గుతుంది. వాటితోపాటు ఇవు్యునోథెరపీ వల్ల కూడా కొంత ఉపయోగం ఉంటుంది. మీ పాపకు ఉన్న కండిషన్‌కు కేవలం ఒక సిట్టింగ్‌లో శాశ్వత పరిష్కారం లభించడం కష్టం. అయితే ఈ ఆర్టికేరియా వల్ల పాపకు మేజర్ సవుస్యలు ఏవీ రావ#. మీరు పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటూ మీ చర్మవ్యాధి నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోండి. మా బాబు సమస్య ఏమిటి? మా బాబుకి పదేళ్లు. ఒక సమస్య విషయమై డాక్టర్‌ను కలిస్తే ఆయన పరిశీలించి మావాడి బీజాలు లోపలికి ఉన్నాయి, ఆపరేషన్ చేయిస్తే తగ్గుతుందన్నారు. మాకేమో అయోమయంగా ఉంది. దయచేసి మా బాబు సమస్యకి పరిష్కారం తెలియజేయండి. – సందీప్, కరీంనగర్ మీరు వర్ణించిన దాన్ని బట్టి చూస్తే మీ బాబు సమస్య ‘రిట్రాక్టయిల్ టెస్టిస్’లాగా కనబడుతుంది. కొందరిలో టెస్టిస్ సంచిలోకి రాకుండా గజ్జల్లో లేదా పొత్తికడుపులో ఉండిపోవచ్చు. దీనిని క్రిప్టార్కిడిజం అంటారు. మీ బాబు టెస్టిస్ కిందికి రాని అన్డిసెన్డెంట్ టెస్టిస్తో బాధపడుతున్నాడా లేక సాధారణంగా కదిలే రిట్రాక్ట్రియల్ టెస్టిస్ ఉందా అన్నది నిర్ధారణ కావాలంటే తప్పనిసరిగా పరీక్షలు చేయించవలసి ఉంటుంది. ఒక వేళ ఇది అన్డిసెన్డెంట్ టెస్టిస్ అని తేలితే తప్పక ఆపరేషన్ చేయించాల్సి ఉంటుంది. పాప బుగ్గలు పొడిబారుతున్నాయి మా పాప వయసు ఐదేళ్లు. తను ఉదయం ఏడుగంటలకే స్కూల్ బస్‌లో వెళ్తుంటుంది. ఆ టైమ్‌లో చలిగాలి తగలగానే బుగ్గలు ఎర్రగా పొడిగా మారుతున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని మందులు ఇచ్చారుగాని పెద్దగా మెరుగుదల లేదు. పాప సమస్య పూర్తిగా నయం కావడానికి ఎలాంటి జాగ్రత్తలు, చికిత్స తీసుకోవాలి? – సుప్రసన్న, హైదరాబాద్ మీ పాపకు ఉన్న కండిషన్‌ను ఎక్సిమా లేదా అలర్జిక్ డర్మటైటిస్ అని చెప్పవచ్చు. ఇందులో చర్మం ఎర్రబారడం, పొట్టులా రాలడం, విపరీతమైన దురదలు, కొంతమంది పిల్లల్లో చర్మంపై ఇన్ఫెక్షన్స్ రావడం చూస్తుంటాం. ఇది ముఖ్యంగా వాతావరణంలో తీవ్రత (అంటే మరీ ఎక్కువ వేడిమి లేదా మరీ ఎక్కువ చలి) ఉన్న సమయంలో రావడాన్ని గమనిస్తుంటాం. ఇలాంటి పిల్లలకు మాయిశ్చరైజింగ్ సోప్స్ వాడటం, మాయిశ్చరైజింగ్ లోషన్స్ శరీరంపై రాయడం, మైల్డ్ స్టెరాయిడ్స్ ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చర్మంపై ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దానికి కూడా చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ అలర్జీ అన్నది ఒక రోజులో లేదా కొద్ది రోజుల్లో లేదా ఒకసారి తీసుకునే చికిత్సతో నయమవుతుందని అనుకోవడం సరికాదు. కాబట్టి మీరు మీ పాపను మరీ తీవ్రమైన వాతావరణానికి ఎక్స్పోజ్ కావడాన్ని నివారించడం వంటి జాగ్రత్తలు, పైన పేర్కొన్న చికిత్స తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
ముఖ కాంతికి...
బ్యూటిప్స్ ఉడికించిన ఓట్స్, తేనె బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ప్యాక్ వేసుకోవాలి. ఇది పొడి చర్మం గలవారికి మేలైన ప్యాక్. మాయిశ్చరైజింగ్‌గానే కాకుండా చర్మానికి మంచి క్లెన్సింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. కప్పు పెరుగులో టేబుల్ స్పూన్ ఆరెంజ్ జ్యూస్, టేబుల్ స్పూన్ నిమ్మరసం క లపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాలు వదిలేయాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే చర్మకాంతి పెరుగుతుంది. గుమ్మడికాయ, బొప్పాయి గుజ్జు సమపాళ్లలో తీసుకోవాలి. అందులో గుడ్డు సొనను కలపాలి. వేళ్లతో ఈ మిశ్రమాన్ని అద్దుకుంటూ ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇది మలినాలను శుభ్రపరచడమే కాకుండా, చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. సున్నితమైన చర్మ తత్త్వం గలవారు ప్యాచ్‌టెస్ట్ చేసుకోవడం మంచిది. రెండు బాదం పప్పులు నానిన తర్వాత కొద్దిగా నీళ్లు కలిపి వాటిని పేస్ట్ చేయాలి. అందులో పది చుక్కల నిమ్మరసం, అర టీ స్పూన్ పంచదార కలిపి ముఖానికి రాసి పది నిమిషాలు మసాజ్ చేయాలి. తర్వాత పెసరపిండిలో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. -
పెదవులు తడారిపోతాయి ఎందుకు?
ఎంత తడిపినా ఈ కాలంలో పెదవులపై తేమ తగ్గిపోతూంటుంది. దీంతో పగుళ్ళు కూడా వస్తుంటాయి. మృతకణాలు పేరుకుపోతుంటాయి. పెదవుల చుట్టూ చర్మంపై చిన్న చిన్న కురుపుల్లాంటివి కూడా వస్తుంటాయి. ఈ సమస్య నివారణకు.. ఏం చేయాలంటే! కొద్దిగా పంచదార పెదవులపై అద్ది, మృదువుగా రుద్దాలి. తర్వాత నీటితో కడిగి, మంచి లిప్ బామ్ రాయాలి. దీంతో పెదవులు తేమను కోల్పోకుండా ఎక్కువసేపు మృదువుగా ఉంటాయి. రాత్రి పడుకునేముందు నెయ్యి లేదా బాదం నూనె లేదా తేనె రాసుకుంటే మంచిది. వెచ్చని గ్రీన్ టీ బ్యాగ్‌ను ప్రతిరోజూ పెదవులపై 3-4 నిమిషాలు ఉంచితే సహజ సిద్ధమైన తేమ పెదవులకు అందుతుంది. పొడిబారడం, పగుళ్లు రావడం సమస్య తగ్గుతుంది చలికాలంలో దాహం ఎక్కువ అవ్వదు. అలాగని నీళ్లు తక్కువ తాగితే చర్మం డీ-హైడ్రేట్ అవుతుంది. ఫలితంగా పెదవులు పొడిబారు తాయి. చక్కటి మంత్రం... ఎండాకాలంలాగే చలికాలంలోనూ నీరు బాగా తాగాలి పెదవులను పదే పదే నాలుకతో తాకడం, తడుపుకోవడం వల్ల పొడిబారుతాయి. ఈ చెడ్డ అలవాటుకు వెంటనే స్వస్తి పలకండి. పెదవుల పగుళ్లకు విటమిన్ బి - 12 లోపం. ఈ సమస్య ఉంటే సమతుల ఆహారంపై దృష్టిపెట్టడం అవసరం ఎప్పుడూ వాడినవే కాకుండా చలి కాలంలో అదనపు మాయిశ్చరైజింగ్ ఏజెంట్ ఉన్న లిప్ క్రీమ్ వాడాలి. ఇవి చాప్‌స్టిక్స్ రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఈ కాలాన్ని తట్టుకునేలా లిప్బామ్స్లో జొజొబా, విటమిన్‘ఇ’ ఆయిల్ ఉన్నవీ లభిస్తున్నాయి మేకప్ వేసుకునే వారు మాయిశ్చరైజింగ్ సుగుణాలు ఉన్న లిప్‌స్టిక్‌ను ఎంచుకోవడం ఉత్తమం. అలాగే పడుకోబోయే ముందు లిప్‌స్టిక్ తొలగించి, మాయిశ్చరైజింగ్ లిప్ బామ్ తప్పక రాసుకోవాలి గ్లిజరిన్, పెట్రోకెమికల్ లిప్‌బామ్స్ అస్సలు వాడకూడదు.