వూ పాపకు తొమ్మిదేళ్లు. కొన్ని నెలల కిందట ఒకరోజు బాగా ఆడుకున్న తర్వాత శరీరవుంతా ఎర్రగా రాష్‌లాగా వచ్చింది. ఏదైనా పురుగు కుట్టిందేమోనని అనుమానించి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఇంజెక్షన్ చేశారు. అయితే అప్పటి నుంచి ఎండలోకి వెళ్లినా, ఇంట్లోనే పరుగెత్తే ఆటలు ఆడినా, వేణ్ణీళ్ల స్నానం చేసినా ఈవిధంగా శరీరవుంతా ఎర్రగా రాష్ వస్తోంది. ఐదు, పది నిమిషాల్లో అదే తగ్గిపోతోంది. డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే శరీరంలో ఏదైనా పడని పదార్థాలు ఉంటే అలాగే వస్తుందని వుందులు ఇచ్చారు. వుందులు వాడినంతకాలం రాలేదు. వుందులు వూనేశాక వుళ్లీ అదే విధంగా వస్తోంది. ఇలా రావడం ఏమైనా హానికరవూ? దయచేసి వూ పాప సవుస్యకు శాశ్వత పరిష్కారం చూపగలరు.
– సుధారాణి, నెల్లూరు
మీ పాపకు ఉన్న కండిషన్‌ను ఆర్టికేరియా అంటారు. అందులోనూ మీ పాపకు ఉన్న కండిషన్ కోలినర్జిక్ ఆర్టికేరియా అనిపిస్తోంది. ఇది ఒక రకమైన అలర్జిక్ రుగ్మత. కాని విచిత్రం ఏమిటంటే... ఇది ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా చేయడం వల్ల కలిగే ప్రేరణ (స్టివు్యులస్) వల్ల ఎక్కువగా వస్తుంది. ఫిజికల్ యాక్టివిటీ వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి చెవుటలు పట్టడం వల్ల ఈ సవుస్య ఉత్పన్నవువ#తుంది. సాధారణంగా దురదలు, చర్మం వేడెక్కడం, ఎర్రబడటం, వుచ్చలు, బొబ్బలు రావడం వంటి లక్షణాలు ఇందులో కనిపిస్తాయి. ఈ లక్షణాలు శరీరవుంతటా వస్తాయి. అయితే అరచేతుల్లో, అరికాళ్లలో రావడం వూత్రం అరుదు. కొద్దివుంది పిల్లల్లో దీంతో పాటు శ్వాసకోశ సవుస్యలు తలెత్తడం కూడా చూస్తుంటాం. ఇది అలర్జిక్ టెండెన్సీస్ ఉన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇది సాధారణంగా పదేళ్ల పిల్లల నుంచి 30 ఏళ్ల వ్యక్తుల వరకు చూస్తుంటాం. ఇది ఒకసారి వస్తే కొన్నేళ్ల పాటు తరచూ కనిపిస్తుంటుంది.
కారణాలు...: వుుందు చెప్పినట్లుగా ఇది ఫిజికల్ యాక్టివిటీతో కలిగే స్టివు్యులస్ వల్ల వస్తుంది. శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి చెవుటలు పట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుంది. వేడివేడి ఆహార పదార్థాలు, వుసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం, ఉద్వేగాలతో కూడిన ఒత్తిడి (ఎమోషనల్ స్ట్రెస్) వల్ల ఇది రావచ్చు. కొందరిలో వేణ్ణీళ్ల స్నానం వల్ల ఆర్టికేరియా అటాక్ రావడం సాధారణమే.
నిర్ధారణ...: ఈ పరిస్థితిని ఫిజికల్ యాక్టివిటీ చేయించడం ద్వారా, కొన్ని ప్రత్యేకమైన పరీక్షల ద్వారా నిర్ధారణ చేస్తారు. కొందరిలో ఇది సుదీర్ఘకాలం పాటు తరచూ కనిపిస్తూ ఉన్నా... వురికొందరిలో దానంతట అదే అకస్మాత్తుగా తగ్గిపోవచ్చు కూడా.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ∙ఆర్టికేరియాకు దారితీసే పరిస్థితులు అంటే... చెవుటపట్టే పరిస్థితులను నివారించడం (మరీ తీవ్రమైన ఎక్సర్‌సైజ్ వంటి ఫిజికల్ యాక్టివిటీ తగ్గించుకోవడం), వురీ ఎక్కువ ఉష్ణోగ్రతకు, వురీ ఎక్కువ తేవు (హ్యూమిడిటీ) వంటి వాతావరణ పరిస్థితులకు ఎక్స్‌పోజ్ కాకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ∙ఆహారపరంగా... వేడివేడి పదార్థాలు, వుసాలాలు, శీతల పానీయాల వంటివాటికి దూరంగా ఉండటం వుంచిది.
చికిత్స: ఈ కండిషన్ యాంటీహిస్టమైన్స్ అంటే ఉదాహరణకు సిట్రజైన్, లోరాటిడెన్ వంటి వుందులవల్ల చాలా వుటుకు తగ్గుతుంది. వాటితోపాటు ఇవు్యునోథెరపీ వల్ల కూడా కొంత ఉపయోగం ఉంటుంది. మీ పాపకు ఉన్న కండిషన్‌కు కేవలం ఒక సిట్టింగ్‌లో శాశ్వత పరిష్కారం లభించడం కష్టం. అయితే ఈ ఆర్టికేరియా వల్ల పాపకు మేజర్ సవుస్యలు ఏవీ రావ#. మీరు పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటూ మీ చర్మవ్యాధి నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోండి.
మా బాబు సమస్య ఏమిటి?
మా బాబుకి పదేళ్లు. ఒక సమస్య విషయమై డాక్టర్‌ను కలిస్తే ఆయన పరిశీలించి మావాడి బీజాలు లోపలికి ఉన్నాయి, ఆపరేషన్ చేయిస్తే తగ్గుతుందన్నారు. మాకేమో అయోమయంగా ఉంది. దయచేసి మా బాబు సమస్యకి పరిష్కారం తెలియజేయండి. – సందీప్, కరీంనగర్
మీరు వర్ణించిన దాన్ని బట్టి చూస్తే మీ బాబు సమస్య ‘రిట్రాక్టయిల్ టెస్టిస్’లాగా కనబడుతుంది. కొందరిలో టెస్టిస్ సంచిలోకి రాకుండా గజ్జల్లో లేదా పొత్తికడుపులో ఉండిపోవచ్చు. దీనిని క్రిప్టార్కిడిజం అంటారు. మీ బాబు టెస్టిస్ కిందికి రాని అన్‌డిసెన్‌డెంట్ టెస్టిస్‌తో బాధపడుతున్నాడా లేక సాధారణంగా కదిలే రిట్రాక్ట్రియల్ టెస్టిస్ ఉందా అన్నది నిర్ధారణ కావాలంటే తప్పనిసరిగా పరీక్షలు చేయించవలసి ఉంటుంది. ఒక వేళ ఇది అన్‌డిసెన్‌డెంట్ టెస్టిస్ అని తేలితే తప్పక ఆపరేషన్ చేయించాల్సి ఉంటుంది.
పాప బుగ్గలు పొడిబారుతున్నాయి
మా పాప వయసు ఐదేళ్లు. తను ఉదయం ఏడుగంటలకే స్కూల్ బస్‌లో వెళ్తుంటుంది. ఆ టైమ్‌లో చలిగాలి తగలగానే బుగ్గలు ఎర్రగా పొడిగా మారుతున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని మందులు ఇచ్చారుగాని పెద్దగా మెరుగుదల లేదు. పాప సమస్య పూర్తిగా నయం కావడానికి ఎలాంటి జాగ్రత్తలు, చికిత్స తీసుకోవాలి?
– సుప్రసన్న, హైదరాబాద్
మీ పాపకు ఉన్న కండిషన్‌ను ఎక్సిమా లేదా అలర్జిక్ డర్మటైటిస్ అని చెప్పవచ్చు. ఇందులో చర్మం ఎర్రబారడం, పొట్టులా రాలడం, విపరీతమైన దురదలు, కొంతమంది పిల్లల్లో చర్మంపై ఇన్ఫెక్షన్స్ రావడం చూస్తుంటాం. ఇది ముఖ్యంగా వాతావరణంలో తీవ్రత (అంటే మరీ ఎక్కువ వేడిమి లేదా మరీ ఎక్కువ చలి) ఉన్న సమయంలో రావడాన్ని గమనిస్తుంటాం. ఇలాంటి పిల్లలకు మాయిశ్చరైజింగ్ సోప్స్ వాడటం, మాయిశ్చరైజింగ్ లోషన్స్ శరీరంపై రాయడం, మైల్డ్ స్టెరాయిడ్స్ ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చర్మంపై ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దానికి కూడా చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ అలర్జీ అన్నది ఒక రోజులో లేదా కొద్ది రోజుల్లో లేదా ఒకసారి తీసుకునే చికిత్సతో నయమవుతుందని అనుకోవడం సరికాదు. కాబట్టి మీరు మీ పాపను మరీ తీవ్రమైన వాతావరణానికి ఎక్స్‌పోజ్ కావడాన్ని నివారించడం వంటి జాగ్రత్తలు, పైన పేర్కొన్న చికిత్స తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
డా. రమేశ్‌బాబు దాసరి
సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్,
విజయనగర్ కాలనీ, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment