నేను డెలివరీ అయ్యి రెండు వారాలు అవుతోంది. 102 ఫీవర్‌తో హాస్పిటల్‌లో మళ్లీ అడ్మిట్ అయ్యాను. గర్భసంచిలో ఇన్‌ఫెక్షన్ ఉందని చెప్పారు. ఇది రాకుండా నేను ఎలా జాగ్రత్తపడాల్సిందో తెలీలేదు. నా హెల్త్ కండిషన్ నాకేం అర్థంకావడం లేదండీ..! – వి. మయూరి, కరీంనగర్
ప్రసవం అయిన ఆరువారాల్లోపు వచ్చే గర్భసంచి ఇన్‌ఫెక్షన్‌ని ఎండోమెట్రైటిస్ అంటారు. సిజేరియన్ తర్వాత దీని రిస్క్ ఎక్కువగా ఉంటుంది. జ్వరం, పొట్టలో నొప్పి, అధిక రక్తస్రావం ఉంటాయి. వెంటనే యాంటీబయాటిక్స్ ఇస్తే త్వరగా తగ్గిపోతుంది. డెలివరీ ప్రాసెస్‌లో గర్భసంచిలోకి సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా వెళ్లి ఈ ఇన్‌ఫెక్షన్‌కి కారణమవుతాయి. చాలామందిలో రెండు నుంచి పదిరోజుల మధ్య జ్వరం కనిపిస్తుంది.
వందలో ఒకరికి ఈ పోస్ట్‌పార్టమ్ ఎండోమెట్రైటిస్ వస్తుంది. వెజైనల్ డెలివరీలో, సిజేరియన్ అయిన వారిలో వందలో ఇరవై మందికి ఇది వస్తుంది. ఉమ్మనీరు ముందుగా పోయిన వారిలో, ప్లెసెంటా ్చఛీజ్ఛిట్ఛn్టగా ఉన్నవారిలో, ప్రెగ్నెన్సీ కంటే ముందు ఏదైనా వెజైనల్ ఇన్‌ఫెక్షన్ ఉన్నవారిలో, ఒబేసిటీ, డయాబెటిస్, రక్తహీనత ఉన్నా, నొప్పులతో ప్రసవం మరీ ఆలస్యం అయినా పోస్ట్‌పార్టమ్ ఎండోమెట్రైటిస్ రిస్క్ పెరుగుతుంది.
ఈ కండిషన్‌లో ప్రసవం తర్వాత బ్లీడింగ్ తగ్గుముఖం పట్టాల్సింది పోయి హఠాత్తుగా హెవీగా అవుతుంది క్లాట్స్‌తో. వెజైనా నుంచి దుర్వాసన వస్తుంది. మూత్రంలో మంట ఉంటుంది. ఈ లక్షణాలు మీకున్నట్లయితే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. ఇన్‌ఫెక్షన్‌ని తగ్గించడానికి వెంటనే యాంటిబయాటిక్స్ ఇస్తారు. యూరిన్ ఏరియా, వెజైనా ఏరియా నుంచి స్వాబ్ తీస్తారు. వెజైనాలో పెట్టుకునే యాంటీబయాటిక్స్‌ని సూచిస్తారు.
డాక్టర్ దగ్గరకి ఆలస్యంగా వెళ్లినా, సరైన చికిత్స అందకపోయినా ఇన్‌ఫెక్షన్ యూటరస్ నుంచి పెల్విస్‌కి వ్యాపిస్తుంది. దాన్ని సెప్సిస్ అంటాము. ఇది శరీరమంతా స్ప్రెడ్ కాకుండా వెంటనే ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. సిజేరియన్ కుట్లకి కూడా ఇన్‌ఫెక్షన్ వ్యాపిస్తుంది. ఇది ఇంత ప్రమాదం కాబట్టి సిజేరియన్‌కి ముందు యాంటీబయాటిక్స్ ఒక డోస్ ఇస్తారు. వెజైనాని యాంటీసెప్టిక్ లోషన్‌తో క్లీన్ చేస్తారు. ఈ యాంటీబయాటిక్స్ మీకు యూటరస్, యూరినరీ ట్రాక్ట్, వూండ్ ఇన్‌ఫెక్షన్స్ రాకుండా కాపాడుతాయి.
– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
ఇవి చదవండి: మౌత్ అల్సర్‌తో.. పుట్టబోయే బిడ్డకేమైనా ప్రమాదమా?
Comments
Please login to add a commentAdd a comment