బియ్యం, గోధుమపిండి, కంది, పెసర, మినప్పప్పు లాంటì వాటి విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే, చిన్న చిన్న కీటకాలు చేరుతాయి. వీటిని తింటే కడుపునొప్పి, ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు, కొన్నిసార్లు అలర్జీలు కూడా రావచ్చు. అయితే కొన్ని చిన్న చిట్కాలు పాటించడం ద్వారా వాటికి పురుగులు పట్టకుండా కాపాడుకోవచ్చు.
ఎండు వెల్లుల్లి రెబ్బలు..
పప్పు, బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే, అందులో కొన్ని ఎండు వెల్లుల్లి రెబ్బలు కలపాలి. వెల్లుల్లి నుంచి వెలువడే గాఢమైన వాసన వల్ల పురుగులు పప్పు, బియ్యం గింజల వైపు రాలేవు.
వాము కలపడం..
బియ్యం డబ్బా లేదా బస్తాలో కాస్తంత వాము వేస్తే, అందులో పురుగులు పట్టవు. ఎందుకంటే వాము వాసన కూడా పురుగులకు పడదు.
ఎండు మిరపకాయలు..
బియ్యం లేదా గోధుమలు నిల్వ చేసేటప్పుడు, కాసిని ఎండు మిరపకాయలు ఉంచితే, పురుగు పట్టకుండా చాలాకాలం పాటు తాజాగా ఉంటాయి.
వేపాకులు..
వేపాకులకు ఉండే చేదు గుణం, ఘాటైన వాసన వల్ల పురుగులు దూరంగా ఉంటాయి. అందుకే, బియ్యం నిల్వ చేసే పాత్రలో కొన్ని వేపాకులు వేస్తే పురుగులు పట్టవు.
మిరియాలు..
బియ్యం నిల్వచేసే డబ్బాల్లో కొన్ని మిరియాలు వేస్తే, అందులో పురుగులు పట్టవు. మిరియాల వాసన చాలా ఘాటుగా ఉంటుంది. వీటిని గోధుమల్లో కలిపి, వాటికి కూడా పురుగులు పట్టకుండా జాగ్రత్త పడొచ్చు.
లవంగాలు..
లవంగాల ఘాటు వాసనను పురుగులు, కీటకాలు భరించలేవు. అందుకే, బియ్యం నిల్వ ఉంచే పాత్రలో కాసిని లవంగాలు వేయాలి. లవంగ నూనె కూడా కీటకాలను దూరం చేస్తుంది.
ఇవి చదవండి: ఇవి.. సహజసిద్ధ'మండి'!
Comments
Please login to add a commentAdd a comment