Getting
-
Intips: ఈ పదార్థాలకు పురుగు పట్టకుండా.. ఇలా చేయండి!
బియ్యం, గోధుమపిండి, కంది, పెసర, మినప్పప్పు లాంటì వాటి విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే, చిన్న చిన్న కీటకాలు చేరుతాయి. వీటిని తింటే కడుపునొప్పి, ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు, కొన్నిసార్లు అలర్జీలు కూడా రావచ్చు. అయితే కొన్ని చిన్న చిట్కాలు పాటించడం ద్వారా వాటికి పురుగులు పట్టకుండా కాపాడుకోవచ్చు.ఎండు వెల్లుల్లి రెబ్బలు..పప్పు, బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే, అందులో కొన్ని ఎండు వెల్లుల్లి రెబ్బలు కలపాలి. వెల్లుల్లి నుంచి వెలువడే గాఢమైన వాసన వల్ల పురుగులు పప్పు, బియ్యం గింజల వైపు రాలేవు.వాము కలపడం..బియ్యం డబ్బా లేదా బస్తాలో కాస్తంత వాము వేస్తే, అందులో పురుగులు పట్టవు. ఎందుకంటే వాము వాసన కూడా పురుగులకు పడదు.ఎండు మిరపకాయలు..బియ్యం లేదా గోధుమలు నిల్వ చేసేటప్పుడు, కాసిని ఎండు మిరపకాయలు ఉంచితే, పురుగు పట్టకుండా చాలాకాలం పాటు తాజాగా ఉంటాయి.వేపాకులు..వేపాకులకు ఉండే చేదు గుణం, ఘాటైన వాసన వల్ల పురుగులు దూరంగా ఉంటాయి. అందుకే, బియ్యం నిల్వ చేసే పాత్రలో కొన్ని వేపాకులు వేస్తే పురుగులు పట్టవు.మిరియాలు..బియ్యం నిల్వచేసే డబ్బాల్లో కొన్ని మిరియాలు వేస్తే, అందులో పురుగులు పట్టవు. మిరియాల వాసన చాలా ఘాటుగా ఉంటుంది. వీటిని గోధుమల్లో కలిపి, వాటికి కూడా పురుగులు పట్టకుండా జాగ్రత్త పడొచ్చు.లవంగాలు..లవంగాల ఘాటు వాసనను పురుగులు, కీటకాలు భరించలేవు. అందుకే, బియ్యం నిల్వ ఉంచే పాత్రలో కాసిని లవంగాలు వేయాలి. లవంగ నూనె కూడా కీటకాలను దూరం చేస్తుంది.ఇవి చదవండి: ఇవి.. సహజసిద్ధ'మండి'! -
నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం..? (ఫోటోలు)
-
చెవి రింగులతో ర్యాష్ వస్తోందా?
కొందరికి చెవి రింగులు లేదా దుద్దులు సరిపడక చెవి తమ్మెలకు ర్యాష్ రావచ్చు. కృత్రిమ ఆభరణాలలోని నికెల్ కారణంగా కొందరిలో ఈ ర్యాషెస్ వస్తాయి. ఫలితంగా దురద, ఎర్రబారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ దశలో నిర్లక్ష్యం చేస్తే గాయం మరింత రేగి, రక్తస్రావమయ్యే అవకాశాలు ఎక్కువ. ఈ సమస్యను ‘అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ టు నికెల్’ అంటారు. ఈ కింది సూచనలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. నికెల్‌తో అలర్జీ ఉన్నవారు ఆ లోహంతో తయారైన రింగులు, దిద్దుల వంటి కృత్రిమ ఆభరణాలు ధరించడం సరికాదు.ఫ్యూసిడిక్ యాసిడ్ లాంటి తక్కువ మోతాదు కార్టికోస్టెరాయిడ్ ఉన్న యాంటీబయాటిక్ కాంబినేషన్‌తో లభించే క్రీములను గాయం ఉన్న చోట రోజుకు రెండు సార్లు చొప్పున కనీసం 10 రోజులు రాస్తే త్వరగా తగ్గుతుంది. అప్పటికీ తగ్గక పోతే డాక్టర్‌ను సంప్రదించాలి. -
పెళ్లికి ఎస్
హీరోయిన్ అమలా పాల్ తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈవెంట్ మేనేజర్ జగత్ దేశాయ్‌ను పెళ్లాడనున్నారు అమలా పాల్. గురువారం (అక్టోబరు 26) ఆమె బర్త్ డే. ఈ సందర్భంగా అమలా పాల్‌కు తాను ప్రపోజ్ చేసిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, ‘‘నా కలల రాణి నాకు ‘ఎస్’ చెప్పింది. వెడ్డింగ్ బెల్స్, హ్యాపీ బర్త్ డే మై లవ్’ అని పేర్కొన్నారు జగత్ దేశాయ్. సో.. జగత్ దేశాయ్, అమలా పాల్ ఒకింటివారు కానున్నారని స్పష్టమవుతోంది. ఇక 2014లో తమిళ దర్శక–నిర్మాత ఏఎల్ విజయ్‌తో అమలా పాల్ వివాహం జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. అయితే ఈ ఇద్దరూ 2017లో విడాకులు తీసుకున్నారు. -
69 ఏళ్లలో దళితులకు ఒరిగిందేమీ లేదు
వర్గీకరణ విషయంలో ఏఎమ్మార్పీఎస్ది న్యాయమైన పోరాటం –వెనుకబడిన కులాలు ఏకం కావాలి –హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకాంత్, ప్రజా యుద్ధనౌక గద్దర్ ఆలేరు: స్వాతంత్య్రం సిద్ధించి 69 సంవత్సరాలు గడిచినా దళితులకు ఒరిగిందేమీ లేదని హైకోర్టు రిటైర్ట్ జడ్జి జస్టిస్ చంద్రకాంత్ అన్నారు. రాజ్యాంగ పరంగా ఎస్సీ వర్గీకరణ సాధించుకోవాలని పిలుపునిచ్చారు. మండలంలోని కొలనుపాకలో ఆదివారం ఎమ్మార్పీఎస్(టీఎస్) ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కోరుతూ మాదిగ చైతన్య పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ వర్గీకరణ విషయంలో ఎమ్మార్పీఎస్ న్యాయమైన పోరాటం చేస్తుందన్నారు. వర్గీకరణ విషయంలో పాలకులు నాటకం ఆడుతున్నారని, పార్లమెంట్లో బిల్లును పెట్టేవరకు ఉద్యమించాలన్నారు. ప్రజయుద్ధనౌక గద్దర్ మాట్లాడుతూ వెనకబడిన కులాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో 85శాతం కులాలు వెనుకబాటుకు గురవుతున్నాయని, 15 శాతం కులాలు మాత్రమే ఆధిపత్యాన్ని చెలయిస్తున్నాయని పేర్కొన్నారు. కులవృత్తులు నానాటికీ కుంటుపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్(టీఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు సుంకపాక యాదయ్య, యాతాకుల భాస్కర్, జాతీయ గౌరవ అధ్యక్షుడు సండ్రపల్లి వెంకటయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి మేడి పాపయ్య, వైద్యులు ఆదాం, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. -
సల్మాన్ పెళ్లి పై అర్బాజ్ ఖాన్ ఏమన్నారంటే..
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రియురాలు లులియాతో పెళ్లికి సై అన్నాడనే టాక్ హల్ చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై సల్మాన్ సోదరుడు,నటుడు అర్బాజ్ ఖాన్ మీడియా ప్రశ్నించినపుడు సమాధానం దాట వేశాడు. అటు అన్న పెళ్లి వార్తను ఖండించకుండా, ధృవీకరించకుండా చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఇటీవల గుప్పుమన్న సల్మాన్ పెళ్లి వార్తలపై ప్రశ్నించినపుడు అర్బాజ్ ఖాన్ తెలివిగా తప్పించుకున్నాడు. అంతేకాదు.. వెల్.. లిజన్...ఇది సందర్భంకాదు.. అయినా దీనికి సమాధానం చెబుతానని మీరు భావించారా అంటూ అక్కడనుంచి జారుకున్నారు. బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఉన్న సల్మాన్ ఖాన్ త్వరలోనే పెళ్లిచేసుకోనున్నాడనే వార్తలు ఇప్పటివి కావు. కానీ ఇటీవల ప్రీతిజింటా వివాహ విందులో సల్మాన్, లులియా సందడి చేయడం విశేషంగా మారింది. దీంతో స్మాలన్ 51వ పుట్టినరోజైన డిసెంబర్ 27నే పెళ్లి చేసుకోవడం ఖాయం మనే గుసగుసలు మరింత జోరుగా వినిపిస్తున్నాయి. కాగా బాలీవుడ్ బాడీగార్డ్ సల్మాన్ కి, రొమానియన్ విశ్వవిద్యాలయంనుంచి న్యాయ శాస్త్రంలో పట్టాపొందిన రొమేనియన్ మోడల్ లులియా వంతూర్ తో 2013లో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రణయంగా మారడం, ఎన్నో కార్యక్రమాల్లో సల్మాన్, లులియాలు కలిసి హల్ చల్ చేయడం, ఇటీవల ముంబైలో లియా సైతం సల్మాన్ తల్లి చేతిని పట్టుకుని నడిపిస్తున్న ఫోటోలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. -
పెళ్ళిపీటలు ఎక్కనున్న దివ్యాంకా త్రిపాఠీ
ఏహై మొహబ్బత్ ఫేమ్ దివ్యాంకా త్రిపాఠీ త్వరలో పెళ్ళి పీటలు ఎక్కనున్నట్లు తాజా వార్తలనుబట్టి తెలుస్తోంది. అయితే దివ్యాంకా ట్విట్టర్లో పోస్ట్ చేసిన వ్యాసం కూడ అదే విషయాన్ని నిర్థారిస్తోంది. ఆమెకు చాలాకాలం పాటు బాయ్ ఫ్రెండ్ గా ఉన్న నటుడు, ప్రియుడు శరద్ మల్హోత్రా తో విడిపోయిన తర్వాత కొంతకాలంపాటు తన సహ నటుడు వివేక్ దహియా తో దివ్యాంకా డేటింగ్ కొనసాగించింది. ఇప్పుడు అతడినే జూలై నెలలో వివాహం చేసుకునేందుకు ముందుగా హష్- హష్ వేడుకగా జరిపే నిశ్చితార్థ కార్యక్రమాన్ని కూడ నిర్వహించుకున్నట్లు తెలుస్తోంది. ఇరు కుటుబ సభ్యుల అంగీకారంతో నిశ్చయమైన తమ వివాహానికి జూలై నెలలో తేదీని ఖరారు చేస్తారని దివ్యాంకా స్వయంగా పోస్టు చేసిన వ్యాసాన్ని బట్టి తెలుస్తోంది. వివేక్, దివ్యాంకాలు అమితమైన ప్రేమలో మునిగి తేలుతున్నట్లు కూడ ఆమె పంచుకున్న ఆనందాన్నిబట్టి అర్థమౌతోంది. అయితే శరద్ మల్హోత్రాతో విడిపోయిన విషయం ప్రచార సాధనాల ఉచ్చులో పడలేదని చెప్తోంది. విడిపోవడం భవిష్యత్తులో తనకు మరింత ఆనందాన్ని కలిగించాలని కూడ దివ్యాంకా కోరుకుంటోంది. ఛండీగఢ్, లేదా భోపాల్ లలో వివాహ కార్యక్రమం జరగనున్నట్లు దివ్యాంకా పోస్టును బట్టి తెలుస్తోంది. వివేక్ స్వస్థలం చండీగఢ్ లో గాని, దివ్యాంక స్వస్థలం భోపాల్ లో గాని వివాహం జరిగిన అనంతరం ముంబైలో భారీ రిసెప్షన్ వేడుకను నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. -
సిరియా సమస్యలు, పౌరజీవనం పైనే దృష్టి..
అంతర్యుద్ధంతో రగిలిపోయిన సిరియాలోని విశేషాలను ఎప్పటికప్పుడు ప్రపంచానికి అందించిన ప్రవాస మీడియా సంస్థలు ఇప్పుడు మెల్లగా టర్కీ చేరుకుంటున్నాయి. యుద్ధ వాతావరణం, స్థానిక ప్రజల జీవన స్థితిగతులపై ప్రత్యక్ష ప్రసారాలు చూపించిన పాత్రికేయులు ఇకపై స్థానిక సమస్యలపైనే దృష్టి సారించేందుకు సిద్ధమౌతున్నారు. దీంతో ఇప్పటిదాకా సిరియా నుంచి పుష్కలంగా బయటకు వచ్చే అన్నిరకాల వార్తలు ఇక తగ్గే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ వార్తలపై ఇకమీద తాము ఆసక్తి చూపేది లేదని, సగటు పౌరజీవనం, ఆహార లోపం, స్థానిక సమస్యల వంటివాటిపైనే దృష్టి సారిస్తామని ఆయా వార్తా సంస్థలు చెబుతున్నాయి. ఇప్పటిదాకా 'ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ది లావంత్' (ISIL) కవరేజ్ లో ఎక్కువశాతం వలసలు, అంతర్జాతీయ, ప్రాంతీయ విశేషాలతోపాటు, సిరియా యుద్ధం, ఇతర దేశాలపై దాని ప్రభావం వంటి అనేక విషయాలను మీడియా సంస్థలు ప్రధానంగా వెలువరించేవి. అయితే ఇకపై సిరియన్ అంతర్యుద్ధం సృష్టించిన ఘోర సంక్షోభంపై దృష్టి సారించనున్నాయి. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న దేశ పరిస్థితిని, స్థానిక సమస్యలను ప్రతిబింబించేందుకు పాత్రికేయులు సన్నద్ధమౌతున్నారు. సిరియా ప్రజల తిరుగుబాటుతో ఏం జరిగిందో... కష్టాల్లో కూరుకుపోయిన ప్రజలకు ప్రత్యక్షంగా చూపించాలనుకుంటున్నారు. సిరియాలో ఉదయం ప్రసారాల్లో ప్రజలకు పనికొచ్చే తాజా సమాచారాన్ని అందించనున్నారు. అందులో భాగంగా యుద్ధ వాతావరణం నుంచి బయటపడుతూ ఇక్కట్లు పడుతున్న జనానికి ధరలు, అందుబాటులో దొరికే పదార్థాలు, వస్తువుల గుచించి ఎప్పటికప్పుడు తెలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే రాత్రిళ్లు.. సాధారణ విషయాలతో పాటు దాడుల్లో మరణించిన పిల్లలు, ప్రజల వివరాలను కూడా చెబుతున్నారు. కొన్నాళ్లుగా సిరియా అంతర్యుద్ధాన్ని ప్రత్యక్షంగా చిత్రిస్తూ... ఐఎస్ఐఎల్లో కఠిన జీవితాన్ని ఎదుర్కొన్న కొన్ని సిరియన్ మీడియా సంస్థలు ఇప్పుడు దక్షిణ టర్కీలోని గేసియెంట్స్, సాన్ లోర్ఫా పట్టణాల్లో తమ కార్యాలయాలను ఏర్పాటుచేసుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఇప్పటిదాకా సిరియా నుంచి ప్రపంచానికి వార్తలను తెలియజేసిన పాత్రికేయులు... ఇకపై ప్రపంచంలోని విషయాలను సిరియన్లుకు అందించేందుకు కృషి చేస్తున్నారు. -
'రిపబ్లిక్ డే'కు పరేడ్ గ్రౌండ్లో ఎర్పాట్లు
-
బాహుబలి2 రెడీ అవుతున్న జక్కన్న
-
తొలి జీతం నుంచే పొదుపు మొదలవ్వాలి
ఇటీవలే మా అమ్మాయిది ఇంజినీరింగ్ పూర్త యింది. క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం సంపాదించింది. తనకి ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రాముఖ్యాన్ని తెలియజేయడం ఎలా? - జె. సునీత, హైదరాబాద్ మధ్యతరగతి నుండి వచ్చి మంచి జాబ్ సంపాదించుకున్న వారిలో ఎక్కువశాతం మంది... సంపాదన మొదలవ్వగానే చేసే పని ఏమిటంటే - అప్పటివరకు ఆపుకున్న సరదాలను, కోరికలను తీర్చుకోడానికి సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేయడం. కాబట్టి తొలి సంపాదన నుంచే పొదుపు ద్వారా (ఎర్లీ సేవింగ్స్) వచ్చే లాభాలను, అలా చేయకుంటే కలిగే నష్టాలను కింది ఉదాహరణతో తనకి తెలియజేయండి. ఉదాహరణ: 20 ఏళ్ల వయసులో సేవ్ చేయడం మొదలుపెట్టి 35 సంవత్సరాలపాటు ఏడాదికి 10 వేలు చొప్పున 55 ఏళ్లొచ్చే వరకు సేవ్ చేసినట్లయితే, మనం సేవ్ చేసిన రు. 3,50,000లు 10 శాతం వడ్డీతో కలిపి 33.38 లక్షలకు చేరుతుంది. అంటే దాదాపు 10 రెట్లు పెరుగుతుంది. అదే 25వ యేట సేవింగ్స్ మొదలు పెడితే మీరు సేవ్ చేసే 3 లక్షలు 6.6 రెట్లు, 30లో మొదలు పెడితే మీరు సేవ్ చేసే రెండున్నర లక్షలు 4.6 రెట్లు మాత్రమే పెరుగుతుంది. ఇక 40లో మొదలు పెడితే కేవలం 2.4 రెట్లు మాత్రమే పెరిగి మీ లక్షా 50 వేలు కేవలం 3.65 లక్షలు అవుతుంది. అంటే ఎంత ఎర్లీగా మొదలు పెడితే అన్ని రెట్లు ఎక్కువగా పెరుగుతుందన్నమాట. కేవలం పది శాతం వడ్డీ సంపాదించేటప్పుడే ఇలా ఉంటే, హెచ్చురేట్లు ఉన్నప్పుడు లేదా అధిక ఆదాయం వచ్చే ఇతర మార్గాలలో ఇంకెంత లాభం కోల్పోతామో తెలియజెప్పండి. - వి.వి.కె.ప్రసాద్ ‘వివేకం’ ఫైనాన్షియల్ సర్వీసెస్