
అమలాపాల్,జగత్ దేశాయ్
హీరోయిన్ అమలా పాల్ తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈవెంట్ మేనేజర్ జగత్ దేశాయ్‌ను పెళ్లాడనున్నారు అమలా పాల్. గురువారం (అక్టోబరు 26) ఆమె బర్త్ డే. ఈ సందర్భంగా అమలా పాల్‌కు తాను ప్రపోజ్ చేసిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, ‘‘నా కలల రాణి నాకు ‘ఎస్’ చెప్పింది.
వెడ్డింగ్ బెల్స్, హ్యాపీ బర్త్ డే మై లవ్’ అని పేర్కొన్నారు జగత్ దేశాయ్. సో.. జగత్ దేశాయ్, అమలా పాల్ ఒకింటివారు కానున్నారని స్పష్టమవుతోంది. ఇక 2014లో తమిళ దర్శక–నిర్మాత ఏఎల్ విజయ్‌తో అమలా పాల్ వివాహం జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. అయితే ఈ ఇద్దరూ 2017లో విడాకులు తీసుకున్నారు.