proposed
-
Israel-Hamas war: కాల్పుల విరమణకు హమాస్ ఓకే!
జెరూసలెం: ఈజిప్టు– ఖతార్ ప్రతిపాదించిన యుద్ధ విరమణ ప్రతిపాదనను తాము ఆమోదించామని హమాస్ సోమవారం ప్రకటించింది. గాజాలో ఏడు నెలలుగా హమాస్– ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమ అగ్రనేత ఇస్మాయిల్ హనియే కాల్పుల విరమణకు తాము అంగీకరిస్తున్నామనే విషయాన్ని ఖతారు ప్రధాని, ఈజిప్టు ఇంటలిజెన్స్ మినిస్టర్లకు తెలియజేశారని హమాస్ ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి యుద్ధ విరమణ, గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి మళ్లడం లాంటివి ఈ శాంతి ప్రతిపాదనలో ఉన్నాయో, లేదోననే విషయంపై స్పష్టత లేదు. లక్ష మంది పాలస్తీనియన్లు రఫా నగరం నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హకుం జారీచేసిన కొద్ది గంటల్లోనే హమాస్ ప్రకటన వెలువడటం గమనార్హం. హమాస్ నుంచి ఈ ప్రకటన వెలువడగానే రఫాలోని శిబిరాల్లో తలదాచుకుంటున్న పాలస్తీనియన్లు ఆనందోత్సాహాన్ని వెలిబుచ్చారు. రఫాపై ఇజ్రాయెల్ దాడి ముప్పు తప్పినట్లేనని వారు భావిస్తున్నారు. అయితే హమాస్ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. -
56 ఏళ్ల వయసులో నటుడి పెళ్లి ప్రపోజల్..
-
పెళ్లికి ఎస్
హీరోయిన్ అమలా పాల్ తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈవెంట్ మేనేజర్ జగత్ దేశాయ్‌ను పెళ్లాడనున్నారు అమలా పాల్. గురువారం (అక్టోబరు 26) ఆమె బర్త్ డే. ఈ సందర్భంగా అమలా పాల్‌కు తాను ప్రపోజ్ చేసిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, ‘‘నా కలల రాణి నాకు ‘ఎస్’ చెప్పింది. వెడ్డింగ్ బెల్స్, హ్యాపీ బర్త్ డే మై లవ్’ అని పేర్కొన్నారు జగత్ దేశాయ్. సో.. జగత్ దేశాయ్, అమలా పాల్ ఒకింటివారు కానున్నారని స్పష్టమవుతోంది. ఇక 2014లో తమిళ దర్శక–నిర్మాత ఏఎల్ విజయ్‌తో అమలా పాల్ వివాహం జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. అయితే ఈ ఇద్దరూ 2017లో విడాకులు తీసుకున్నారు. -
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్: ఏ వాహనానికి ఎంతెంత?
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను (2023–24) వివిధ రకాల వాహనాల థర్డ్–పార్టీ మోటార్ ఇన్సూరెన్స్‌కి సంబంధించి కేంద్రం కొత్త బేస్ ప్రీమియం రేట్లను ప్రతిపాదించింది. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐతో సంప్రదించిన మీదట 1,000 సీసీ సామర్థ్యం లోపు గల ప్రైవేట్ కార్లకు రూ. 2,094, 1000–1,500 సీసీ కార్లకు రూ. 3,416, అంతకు మించిన వాటికి రూ. 7,897 బేస్ ప్రీమియంను సూచించింది. కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ ఈ మేరకు ఒక ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. పరిశ్రమ వర్గాలు 30 రోజుల్లోగా దీనిపై అభిప్రాయాలు చెప్పాలి. నోటిఫికేషన్ ప్రకారం.. 75 సీసీ లోపు సామర్ధ్యమున్న టూ–వీలర్లకు రేటు రూ. 538గాను, అంతకు మించి 350 సీసీ వరకు రూ. 714–2,804 శ్రేణిలోనూ బేస్ ప్రీమియం ఉండనుంది. గూడ్స్ రవాణా చేసే వాణిజ్య వాహనాలకు సంబంధించి (త్రిచక్ర వాహనాలు కాకుండా) 7,500 కేజీలలోపు వైతే రూ. 16,049, అది దాటి 40,000 కేజీలు.. అంతకు పైన వాటికి రూ. 27,186–44,242 శ్రేణిలో బేస్ ప్రీమియం రేటు ఉంటుంది. ఈ–కార్టులు మినహా మోటార్ త్రీ–వీలర్లకు బేస్ ప్రీమియంను రూ. 4,492గా ప్రతిపాదించారు. అటు ప్రైవేట్ ఈ–కార్ల విషయానికొస్తే.. 30 కిలోవాట్ సామర్థ్యం ఉన్న వాటికి రూ. 1,780, అంతకు మించి 65 కేడబ్ల్యూ వరకు రూ. 2,904, దాన్ని దాటితే రూ. 6,712 గాను బేస్ ప్రీమియం ఉండనుంది. -
నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ నామినేట్
న్యూయార్క్ : 2021 సంవత్సరానికి ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నార్వే ఎంపీ టిబ్రింగ్ జడ్డే నామినేట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా పలు వివాదాల పరిష్కారానికి ట్రంప్ చొరవ చూపారని జడ్డే ప్రశంసించారు. ఇజ్రాయల్-యూఏఈ మధ్య ట్రంప్ కుదిర్చిన శాంతి ఒప్పందం చారిత్రాత్మకమైనదని కొనియాడారు. మధ్యప్రాచ్యంలో సైనిక దళాల తగ్గింపుతో పాటు శాంతి సాధనకు ట్రంప్ విశేషంగా కృషిచేశారని అన్నారు. యూఏఈ-ఇజ్రాయల్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ట్రంప్ యంత్రాంగం కీలక పాత్ర పోషించిందని జడ్డే అన్నారు. ఇక ఆగస్ట్ 13న స్వయంగా అధ్యక్షుడు ప్రకటించిన ఈ ఒప్పందం ట్రంప్ విదేశాంగ విధానం సాధించిన కీలక విజయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా సెప్టెంబర్ 15న వైట్‌హౌస్‌లో యూఏఈ-ఇజ్రాయల్ ఒప్పందంపై ఇజ్రాయల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఎమిరేట్స విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జయేద్ అల్ నహ్యాన్ల సమక్షంలో సంతకాలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. నలుగురు అమెరికా అధ్యక్షులు ఇప్పటివరకూ నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. అమెరికా అధ్యక్షులు రూజ్వెల్ట్, వుడ్రూ విల్సన్, జిమ్మీ కార్టర్, బరాక్ ఒబామాలకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 2021 విజేత ఎవరనేది వచ్చే ఏడాది అక్టోబర్ తర్వాత ప్రకటిస్తారు. చదవండి : హారిస్ ప్రెసిడెంట్ అయితే.. అమెరికాకే అవమానం -
‘ధోని విల్ అల్వేజ్ బి మై ఫస్ట్ లవ్’
పుణె : మహేంద్ర సింగ్ ధోనికి ఐపీఎల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. రెండేళ్ల తర్వాత ఐపీఎల్లో ప్రవేశించిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ధోని కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో ఏప్రిల్ 20న జరిగిన మ్యాచ్‌లో ధోని బ్యాట్‌తో రాణించకపోయిన, సెంటర్ ఆఫ్ ఆట్రాక్షన్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఓ అభిమాని ప్లకార్డులో ధోనిపై ఉన్న అభిమానాన్ని చాటుకుంది. ‘సారీ ఫ్యూచర్ పార్టనర్.. బట్ ఎంఎస్ ధోని విల్ అల్వేజ్ బి మై ఫస్ట్ లవ్ ! ఐ లవ్ యూ మహి..’ అని రాసి ఉన్న ప్లకార్డును యువతి ప్రదర్శించింది. ఈ ఫొటోను ఐసీసీ తన అధికారక ట్విటర్లో పెట్టింది. ప్రస్తుతం ఈ పొటో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై చెన్నై జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. -
కొనసాగిన ‘కొత్త’ వినతులు
• మూడో రోజూ హైపవర్ కమిటీతో పలువురు నేతల భేటీ • గద్వాల, సిరిసిల్ల, జనగామ, ఆసిఫాబాద్ జిల్లాల • ప్రతిపాదనలే పరిశీలించాం: కేకే • ముగిసిన కమిటీ గడువు...నేడు సీఎంకు నివేదిక సాక్షి, హైదరాబాద్: ‘‘అనవసర అపోహలు వద్దు. కేవలం గద్వాల, సిరిసిల్ల, జనగామ, ఆసిఫాబాద్ నాలుగు జిల్లాల ప్రతిపాదలను పరిశీలించడం వరకే మేము పరిమితం. మండలాలపై వినతులు తీసుకున్నాం. కొత్త జిల్లాలు కావాలని వస్తున్నారు. వాటిని వినడమే కానీ చేసేదేమీ లేదు. మరికొన్ని కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనా చేయడం లేదు. కమిటీ గడువు గురువారంతో ముగిసింది. నివేదికను ముఖ్యమంత్రికి అందజేస్తాం ’’ అని కొత్త జిల్లాలపై ఏర్పాటైన హైపవర్ కమిటీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు (కేకే) తెలిపారు. మూడో రోజైన గురువారం కూడా కొత్త జిల్లాల కోసం హైపవర్ కమిటీకి వినతులు అందాయి. కేవలం నాలుగు జిల్లాలనే కమిటీ సభ్యులు పరిశీలిస్తున్నారని తెలిసినా ఇబ్రహీంపట్నం, సత్తుపల్లి, సమ్మక్క-సారలమ్మ (ములుగు), పీవీ (హుజూరాబాద్) జిల్లాలు కావాలని విజ్ఞప్తులు అందాయి. ఖమ్మం పరిధిలోని సత్తుపల్లిని ప్రత్యేక జిల్లాగా చేయాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి వినతి పత్రం అందజేయగా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఎల్బీ నగర్ నియోజకవర్గాలను కలిపి ఇబ్రహీంపట్నం చేయాలని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కోరారు. మరోవైపు మంత్రి చందూలాల్ కూడా కమిటీని కలిశారు. గతంలో ములుగు ప్రాంతాన్ని సమ్మక్క -సారలమ్మ జిల్లా చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తుచే శారు. మలుగును జిల్లా చేయాలని కమిటీని కోరారు. దీనిపై సీఎం కేసీఆర్‌ను కలిసి మరోసారి విన్నవించనున్నట్లు చెప్పారు. హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాలను కలిపి 14 మండలాలతో కొత్తగా పీవీ జిల్లా ఏర్పాటు చేయాలని హుజూరాబాద్ నియోజకవర్గ నేతలు హైపవర్ కమిటీని కోరారు. అనంతరం వారు తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా సమావేశమవగా వారికి మద్దతుగా మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ బి.వినోద్ ఈ భేటీకి హాజరయ్యారు. పీవీ జిల్లా ఏర్పాటు విజ్ఞప్తిని సీఎం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ఒకవైపు గద్వాల జిల్లాకు జోగులాంబ పేరు పెడతామని చెబుతూ.. జోగులాంబ ఉన్న ఆలంపూర్‌ను వనపర్తిలో కలపడం ఏమిటని కమిటీని కలిసిన ఎమ్మెల్యే సంపత్ కుమార్ నిరసన తెలిపారు. ఆలంపూర్, ఉండవెల్లిని వనపర్తిలో కలపొద్దని కమిటీకి విన్నవించారు. కాగా, మూడు రోజుల్లో హైపవర్ కమిటీకి ప్రధానంగా దేవరకొండ, మిర్యాలగూడెం, ఉట్నూరు, భద్రాచలం, ఏటూరునాగారం/ములుగు, సమ్మక్క- సారలమ్మ, ఇబ్రహీంపట్నం, సత్తుపల్లి జిల్లాలు కావాలంటూ విజ్ఞప్తులు అందాయి. గడువు ముగియడంతో కమిటీ తన నివేదికను గురువారం రాత్రి లేదా శుక్రవారం సీఎం కేసీఆర్‌కు సమర్పించనుంది. జ్యుడీషియల్ కమిటీ వేయాలి: పొన్నాల జనగామను జిల్లా చేయాలని పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కమిటీని కలసి వినతిపత్రం ఇచ్చారు. జిల్లాల ఏర్పాటులో న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా జ్యుడీషియల్ కమిటీని నియమించాలని కోరారు. ఒకవిధంగా సర్కారు ఏకపక్షంగానే జిల్లాలను విభజిస్తోందని ఆరోపించారు. చివరి నోటిఫికేషన్లో జనగామ కొత్త జిల్లాగా ఉంటుందని ఆశిస్తున్నట్లు మీడియాకు వివరించారు. -
త్వరలో ఎంపీలకు డబుల్ హైక్!