‘ధోని విల్‌ అల్వేజ్‌ బి మై ఫస్ట్‌ లవ్‌’ | Fan Girl Proposes MS Dhoni In Rajasthan Royals Match | Sakshi
Sakshi News home page

‘ఎంఎస్‌ ధోని విల్‌ అల్వేజ్‌ బి మై ఫస్ట్‌ లవ్‌’

Published Sun, Apr 22 2018 11:51 AM | Last Updated on Sun, Apr 22 2018 12:05 PM

Fan Girl Proposes MS Dhoni In Rajasthan Royals Match - Sakshi

పుణె : మహేంద్ర సింగ్‌ ధోనికి ఐపీఎల్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. రెండేళ్ల తర్వాత ఐపీఎల్‌లో ప్రవేశించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ధోని కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు‌. రాజస్థాన్‌ రాయల్స్‌తో ఏప్రిల్ 20న జరిగిన మ్యాచ్‌లో ధోని బ్యాట్‌తో రాణించకపోయిన, సెంటర్‌ ఆఫ్‌ ఆట్రాక్షన్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఓ అభిమాని ప్లకార్డులో ధోనిపై ఉన్న అభిమానాన్ని చాటుకుంది.

‘సారీ ఫ్యూచర్‌ పార్టనర్‌‌.. బట్‌ ఎంఎస్‌ ధోని విల్‌ అల్వేజ్‌ బి మై ఫస్ట్‌ లవ్‌ ! ఐ లవ్‌ యూ మహి..’ అని రాసి ఉన్న ప్లకార్డును యువతి ప్రదర్శించింది. ఈ ఫొటోను ఐసీసీ తన అధికారక ట్విటర్‌లో పెట్టింది. ప్రస్తుతం ఈ పొటో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై చెన్నై జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. 


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement