ఐపీఎల్‌లో చెన్నై జట్టుకు చాలా క్రేజ్ ఉంది. అందులో ధోనికి అభిమానులు ఎక్కువ. రాజస్థాన్ రాయల్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే చెన్నై బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సురేష్‌రైనా అవుట్ అయినా తర్వాత మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఆ సమయంలో ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని వచ్చి ధోని కాళ్లపై వాలిపోయాడు. అప్పడు ధోని ఆ అభిమాని చేయిపట్టుకుని మాట్లాడుకుంటూ ముందుకు వచ్చాడు. దాంతో అతను ఆనందంతో పరవశించిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీనిపై అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
మైదానంలోకి ఓ అభిమాని ధోని వద్దకు రావడం ఇది మొదటిసారేమి కాదు. గత సంవత్సరం డిసెంబర్‌లో కూడా ఈ విధమైన ఘటన జరిగింది. శ్రీలంక- ఇండియా మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఓ అభిమాని ధోని వద్దకు వచ్చి పాదాలపై పడాడు. ఇటీవల ధోని అవార్డుల ప్రధానోత్స కార్యక్రమానికి హాజరయ్యాడు. ఆ కార్యక్రమంలో అవార్డు తీసుకోవడానికి వేదికపైకి వచ్చిన యువకుడు ధోని పాదాలకు మొక్కాడు. ధోనికి ఉన్న క్రేజు అలాంటిది.. ధోని పేరు వింటే అభిమానుల్లో తెలియని జోష్ వస్తుంది. దేశానికి ప్రపంచకప్, టీ-20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోపిలను అందించిన ఘనత ధోనికి సొంతం.
కావేరి జల వివాదంతో చెన్నైలో జరగాల్సిన మ్యాచ్‌లను పుణేకు మార్చిన విషయం విదితమే. ఈ మ్యాచ్‌లను వీక్షించడానికి అభిమానుల కోసం చెన్నై- పుణెకు ప్రత్యేక రైలు కూడా ఏర్పాటు చేశారు. ఆ ట్రైన్ పేరును ‘విజిల్‌పోడు ఎక్స్‌ప్రెస్’. అని పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment