పుణెకు ధోని, జివా వీడ్కోలు.. వైరల్‌ వీడియో! | Ziva, MS Dhoni walking to Pune dressing room | Sakshi
Sakshi News home page

Published Tue, May 22 2018 12:35 PM | Last Updated on Tue, May 22 2018 1:07 PM

Ziva, MS Dhoni walking to Pune dressing room - Sakshi

పుణె : ఈసారి ఐపీఎల్‌ సీజన్‌లో మహేంద్రసింగ్‌ ధోని చిన్నారి కూతురు జివా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన ముద్దుముద్దు చేష్టలు, ఆటలతో అందరి హృదయాలను ఈ క్యూట్‌ బేబి గెలుచుకుంది. చెన్నై సూపర్‌కింగ్స్‌ మ్యాచుల సందర్భంగా మైదానంలో, మైదానం బయట తండ్రి ధోనీతో కలిసి కనిపించిన జివా.. ఈసారి ఐపీఎల్‌కు కొత్త ఫ్లెవర్‌ అద్దింది.

గతానికి భిన్నంగా ధోనీ కూడా జివా వీడియోలు పెద్దసంఖ్యలో సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియోలు చాలావరకు వైరల్‌ అయ్యాయి. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా పుణెలో చెన్నై.. పంజాబ్‌తో చివరి మ్యాచ్‌ ఆడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ అనంతరం.. మైదానం వీడి డ్రెసింగ్‌ రూమ్‌కు వెళ్లే సమయంలో ధోనీకి జివా కంపెనీ ఇచ్చింది. తండ్రీకూతుళ్లు ఇద్దరూ కలిసి.. మెల్లగా మెట్లు ఎక్కుతూ డ్రెసింగ్‌ రూమ్‌ వైపు కదిలారు. ఈ సీజన్‌లో చివరిసారిగా పుణె అభిమానులకు ధోనీ, జివా చేతులు ఊపి అభివాదాలు తెలిపారు. ఈ వీడియోను ధోనీ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్టు చేశాడు. పుణెలో చెన్నై మ్యాచుల సందర్భంగా విశేషంగా ప్రేమాభిమానులు చూపించిన అభిమానులకు ధోనీ కృతజ్ఞతలు తెలిపాడు. చెన్నై మ్యాచులు అభిమానుల్ని రంజింపచేసి ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. అంతకుముందు మైదానంలో జివాతో ఆడుతున్న వీడియోను ధోనీ పోస్టు చేసిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement