క్రికెటర్ ఎంఎస్ ధోని
ముంబై: ఇక్కడి వాంఖెడే మైదానం వేదికగా ఆదివారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ ట్రోఫీ కోసం తుది సమరంలో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఓ వైపు అంచనాలు లేకుండా బరిలోకి దిగి, బలమైన జట్లకు సైతం షాకిస్తూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ చేరింది. కాగా.. ఐపీఎల్‌లో విజయవంతమైన కెప్టెన్ అయిన ఎంఎస్ ధోని సారథ్యంలో చెన్నై జట్టు పునరాగమనంలోనూ తొలి ప్రయత్నంలోనే మరోసారి ఫైనల్ చేరింది. తుది సమరం ఫైనల్ నేపథ్యంలో ఎంఎస్ ధోని మీడియాతో షేర్ చేసుకున్న విషయాలను ఇండియన్ ప్రీమియర్ లీగ్ అధికారిక ట్వీటర్‌లో పోస్ట్ చేసింది.
ధోని ఏమన్నాడంటే..
‘ఆరంభంలో కాస్త టెన్షన్ ఉన్న మాట వాస్తవం. అయితే టోర్నీలో మ్యాచ్‌లు ఆడుతున్న కొద్దీ మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. దాంతోపాటు చెన్నై ఆటగాళ్లు ప్రొఫెషనల్‌గా, ఎమోషనల్‌గా మారారు. అయితే రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై జట్టు ఐపీఎల్ ఆడుతోంది. కానీ చెన్నైలో మ్యాచ్‌లు జరగకపోవడం మమ్మల్ని చాలా నిరాశకు గురిచేసింది. చెన్నై ఫ్యాన్స్ తమ సొంత మైదానంలో మా ఆటను చూడాలనుకున్నారు. అయితే ఒక్క గేమ్ ఆడినందుకైనా సంతోషంగా ఉన్నాం. ప్రొఫెషన్ పట్ల అంకిత భావంతో ఉన్నవారు ఎక్కడైనా రాణిస్తారన్న నమ్మకం మాకుంది. టీమ్ ఏ ఒక్కరిపైనా ఆధారపడకుండా సమష్టిగా ఆడితే తమదే విజయమని’ ధోని ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్ వారు పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆడిన 9 సీజన్లు చెన్నైకి కెప్టెన్‌గా చేసిన ధోని తమ జట్టును 7 పర్యాయాలు ఫైనల్‌కు చేర్చిన విషయం తెలిసిందే. రెండుసార్లు చెన్నైని విజేతగా నిలిపాడు ధోని.
Comments
Please login to add a commentAdd a comment