చిన్న పిల్లాడిలా ధోని ఆటలు.. వైరల్‌ | MS D​honI Plays With Ziva Viral Video On Social media | Sakshi
Sakshi News home page

చిన్న పిల్లాడిలా మారిన ధోని.. వైరల్‌

May 21 2018 12:10 PM | Updated on May 21 2018 12:23 PM

MS D​honI Plays With Ziva Viral Video On Social media - Sakshi

కూతురు జీవాతో ధోని

పుణే : టీమిండియా మాజీ కెప్టెన్‌, ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి ఎంఎస్‌ ధోని మైదానంలో చిన్న పిల్లాడిలా మారిపోయారు. గతంలో పలుమార్లు కూతురు జీవాతో కలిసి సందడి చేసిన ధోని.. ఆదివారం కింగ్స్‌ఎలెవన్‌ పంజాబ్‌పై గెలుపొందిన అనంతరం మోకాళ్లపై కూర్చుని చిన్నారి జీవాతో సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను చెన్నై జట్టు ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ధోని టోపీతో జీవా ఆడుకోవడం చూడవచ్చు. మ్యాచ్‌ ఓడినా, నెగ్గినా మహీ చాలా కూల్‌గా ఉంటాడని.. అదే అతడి ప్రత్యేకత అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

కాగా, ప్లే ఆఫ్‌ బెర్త్‌ను ఇదివరకే కన్ఫామ్‌ చేసుకున్న చెన్నై జట్టు లీగ్‌లో భాగంగా నిన్న జరిగిన చివరి మ్యాచ్‌లో పంజాబ్‌పై 5 వికెట్ల తేడాతో నెగ్గింది. తద్వారా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. 18 పాయింట్లే ఉన్నప్పటికీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మెరుగైన రన్‌రేట్‌తో అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement