IPL 2021 : MS Dhoni Hits Huge Sixes At CSK Shares Adorable Video Viral - Sakshi
Sakshi News home page

MS Dhoni: జోరు మీదున్న తలైవా.. ఫోర్లు, సిక్సర్ల వర్షం

Published Sat, Sep 18 2021 10:54 AM | Last Updated on Sat, Sep 18 2021 1:57 PM

IPL 2021: MS Dhoni Hitting Fours Sixes CSK Shares Adorable Video Viral - Sakshi

Courtesy: సీఎస్‌కే ట్విటర్‌

MS Dhoni Practice Video.. చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని జోరు మీద ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినా అతని ఆటను చూడాలని అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. దనాధన్‌ ఆటకు మారుపేరుగా ఉన్న ధోని ఐపీఎల్‌ 2021 రెండో అంచె పోటీల్లో మునుపటి జోరు చూపిస్తాడని అంతా భావిస్తున్నారు. ఇక ఐపీఎల్‌ 2021 రెండో అంచె పోటీలు రేపటి నుంచే మొదలవ్వనున్నాయి. తొలి మ్యాచ్‌ ముంబై ఇండియన్స్‌, సీఎస్‌కే మధ్య జరగనుంది.

చదవండి: Dinesh karthik: బౌలర్‌ యార్కర్‌ దెబ్బ..  క్రీజులోనే కూలబడ్డ బ్యాట్స్‌మన్‌

ఈ సందర్భంగా ప్రాక్టీస్‌ సమయంలో ధోని తన బ్యాటింగ్‌ పవర్‌ చూపించాడు. స్పిన్నర్లు, ఫాస్ట్‌ బౌలర్లు అనే తేడా లేకుండా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు.ఇదే మ్యాజిక్‌ను ధోని అసలు మ్యాచ్‌ల్లోనూ చూపించాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. కాగా ఈ సీజన్‌లో తొలి అంచె పోటీల్లో ధోనికి బ్యాటింగ్‌ ఎక్కువగా చేసే అవకాశం రాలేదు. అప్పటికి ఏడు మ్యాచ్‌లు కలిపి 37 పరుగులు మాత్రమే నమోదు చేశాడు. ఇక ఐపీఎల్‌ 14వ సీజన్‌లో సీఎస్‌కే మునుపటి జోరును కనబరుస్తుంది. కరోనా కారణంగా లీగ్‌ వాయిదా పడే సమయానికి సీఎస్‌కే 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.

చదవండి: IPL 2021 2nd Phase Schedule: ఐపీఎల్‌ 2021 రెండో ఫేజ్‌ షెడ్యూల్‌ ఇలా.. 


కర్టసీ: సీఎస్‌కే యూట్యూబ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement