![MS Dhoni Smash Huge Sixes Send Warning Opponents IPL 2021 2nd Phase - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/22/Dhoni.gif.webp?itok=DnnY7qYO)
దుబాయ్: ఐపీఎల్ 14వ సీజన్ రెండో అంచె పోటీలకు సిద్ధమవుతున్న ఎంఎస్ ధోని ప్రాక్టీస్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు. యూఏఈ వేదికగా జరగునున్న రెండో దశ పోటీలకు అందరికంటే ముందు సీఎస్‌కే చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ధోని ప్రాక్టీస్ సమయంలో కసిగా కనిపించాడు. బంతి పడడమే ఆలస్యం.. భారీ సిక్సర్లు సంధించాడు.దీనికి సంబంధించిన వీడియోనూ ఒక అభిమాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ధోనీ ఆవాజ్... అంటూ క్యాప్షన్ జత చేశాడు.
ఇక ఈ సీజన్ మొదటి ఫేజ్‌లో ధోనికి బ్యాటింగ్ చేసే అవకాశం ఎక్కువగా రాలేదు. అందుకే రెండో అంచె పోటీల్లో అవకాశమొస్తే తన బ్యాటింగ్ పవర్ చూపించడానికి సిద్ధమవుతున్నాడు. కాగా ఐపీఎల్ 2020లో నిరాశజనక ప్రదర్శన కనబరిచిన సీఎస్‌కే జట్టు ఈసారి మాత్రం దుమ్మురేపింది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. రెండు పరాజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. సెప్టెంబర్ 19న ముంబై ఇండియన్స్, సీఎస్‌కే మధ్య జరగనున్న మ్యాచ్‌తో రెండో అంచె పోటీలకు తెరలేవనుందిఘౌ
చదవండి: ఐర్లాండ్ ఆటగాడి సిక్సర్ల వర్షం.. సదరన్ బ్రేవ్‌దే టైటిల్
Mohammed Siraj: సిరాజ్ సెలబ్రేషన్స్ వైరల్; హైదరాబాద్‌లో భారీ కటౌట్
Comments
Please login to add a commentAdd a comment