VIDEO: MS Dhoni Practice For IPL 2021 and Hits Sixes Posted on CSK Instagram - Sakshi
Sakshi News home page

వైరల్‌: ధోని సిక్సర్ల వర్షం..

Published Fri, Mar 12 2021 10:35 AM | Last Updated on Fri, Apr 2 2021 8:45 PM

MS Dhoni Smashing Sixes During Training Camp Became Viral IPL 2021 - Sakshi

చెన్నై: ఎంఎస్‌ ధోని సిక్సర్ల వర్షం కురిపించాడు. అదేంటి ధోని ఎక్కడ మ్యాచ్‌లు ఆడడం లేదు కదా.. మరి ఈ సిక్సర్లేంటి అనుకుంటున్నారా. అసలు విషయంలోకి వెళితే.. ఐపీఎల్‌ 14వ సీజన్‌కు సంబంధించి చెన్నై సూపర్‌ కింగ్స్‌ అన్ని ఫ్రాంచైజీలకన్నా ముందే సన్నాహకాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ధోని ప్రాక్టీస్‌ సమయంలో వరుస బంతుల్లో సిక్సర్ల వర్షం కురిపించాడు.

దాదాపు గంట సేపు ప్రాక్టీస్‌ కొనసాగించిన ధోని ప్రాక్టీస్‌ ఆరంభంలో డిఫెన్స్‌కు ప్రాధాన్యమిచ్చినా.. ఆ తర్వాత సిక్సర్లు బాదుతూ బంతులను స్టాండ్స్‌లోకి పంపించాడు. ధోని ఆడిన షాట్లలో తన ఫేవరెట్‌ అయిన హెలికాప్టర్‌ షాట్‌ను ఎక్కువసార్లు ఆడినట్లుగా తెలుస్తోంది. ధోని ఒక్కో షాట్‌ కొడుతుంటే ఈసారి అతను ఎంత కసిగా ఉన్నాడో అర్థమవుతుంది. దీనికి సంబంధించిన వీడియోను సీఎస్‌కే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా గతేడాది ఐపీఎల్‌ 13వ సీజన్‌ యూఏఈ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ సీజన్‌లో ధోని కెప్టెన్సీలోని సీఎస్‌కే ఆరంభంలో వరుస పరాజయాలు చవిచూసి ఆఖరిదశలో వరుస విజయాలు నమోదు చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరగపోయింది. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. 8 ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ భారత్‌లో జరగడం సానుకూలాంశం. కాగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఏప్రిల్‌ 9న ప్రారంభమై.. మే30న ముగియనుంది. చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్‌, ఢిల్లీలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. 
చదవండి:
తలైవా.. వెల్‌కమ్‌ టూ చెన్నై
వారిద్దరితోనే ఓపెనింగ్‌: కోహ్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement