ముంబై: యూఏఈ వేదికగా జరిగిన గతేడాది సీజన్‌లో సీఎస్‌కే జట్టు నిరాశజనకమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. 8 ఓటములతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. అయితే గతేడాది సీజన్ ప్రదర్శన మరిపించేలా పూర్తి స్థాయిలో సన్నద్దమవుతుంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
సీఎస్‌కే టీమ్ రెండుగా విడిపోయి ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్ ఆడాయి. ఈ నేపథ్యంలో సీఎస్‌కే రెండో ఇన్నింగ్స్‌ను హైలెట్ చేస్తూ ట్విటర్‌లో షేర్ చేసింది. ధోని సహా రైనా, పుజారా, డ్వేన్ బ్రావో, జడేజా, సామ్ కర్జన్ సహా ఇతర ఆటగాళ్లు ఈ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ఇక ధోని, రైనాలు కలిసి బ్యాటింగ్ చేయగా.. ధోని తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు. స్వ్కేర్‌కట్, హెలికాప్టర్ షాట్లతో అలరించిన ధోని ఆ తర్వాత కీపింగ్‌లోనూ తన మ్యాజిక్‌ను చూపించాడు. రైనా కూడా తన ట్రేడ్ మార్క్ సిక్సర్లతో అలరించాడు. ఇక చివరిగా దీపక్ చహర్ వేసిన ఓవర్‌లో రాబిన్ ఊతప్పను ధోని స్టంప్ అవుట్ చేయడం ద్వారా వారి ప్రాక్టీస్‌ను ముగించారు. కాగా సీఎస్‌కే తన తొలి మ్యాచ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఏప్రిల్ 10న ముంబై వేదికగా ఆడనుంది.
( చదవండి: పృథ్వీషా ఆ అలవాటును మార్చుకోవాలి: పాంటింగ్ )
#SuperMatch highlights! Catch all the hits, swings and spells from when the lions took on themselves! #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/DTCd11M13N
— Chennai Super Kings (@ChennaiIPL) April 7, 2021
Comments
Please login to add a commentAdd a comment