ధోని (ఫైల్ ఫొటో PC: CSK/BCCI)
ఐపీఎల్-2024లో తొలి రెండు మ్యాచ్‌లలో గెలుపొందిన డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఆ తర్వాత రెండు మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్, హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ చేతిలో పరాజయాలు చవిచూసింది.
ఫలితంగా నాలుగు పాయింట్ల వద్ద నిలిచిపోయి పట్టికలో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం నాటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై గెలుపొంది తిరిగి విజయాల బాట పట్టాలని పట్టుదలగా ఉంది.
ఇందుకోసం సీఎస్‌కే ఆటగాళ్లు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులకు కనువిందు చేసే ఓ వీడియోను షేర్ చేసింది చెన్నై ఫ్రాంఛైజీ. ఇందులో మహేంద్ర సింగ్ ధోని సిక్సర్ల వర్షం కురిపించడం చూడవచ్చు.
నెట్ ప్రాక్టీస్‌లో భాగంగా బ్యాటింగ్ చేసిన ధోని ఫుల్ జోష్‌లో కనిపించాడు. ఉత్సాహంగా బంతులు ఎదుర్కొంటూ భారీ షాట్లు బాదాడు. ఈ నేపథ్యంలో సొంత మైదానంలో తలా కేకేఆర్ బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయమని అభిమానులు ఫిక్సయిపోతున్నారు.
కాగా చెన్నైలోని చెపాక్ వేదికగా సీఎస్‌కే- కేకేఆర్ మధ్య రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇక ఇప్పటి వరకు ఇరు జట్లు ఇరవై ఎనిమిదిసార్లు ముఖాముఖి పోటీపడగా.. చెన్నై 18సార్లు గెలుపొందింది. చెపాక్‌లో పదిసార్లు ఎదురుపడగా ఏకంగా ఏడుసార్లు విజయం సాధించింది. ఓవరాల్‌గా కేకేఆర్‌పై చెన్నైదే పైచేయి!
తుదిజట్ల అంచనా
సీఎస్‌కే
రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), అజింక్య రహానె, శివమ్ దూబే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ/ మిచెల్ శాంట్నర్, ఎంఎస్ ధోని, దీపక్ చహర్, తుషార్ దేశ్ పాండే, మహీష్ తీక్షణ [ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్: ముఖేష్ చౌదరి]
కేకేఆర్
సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్, అంగ్‌క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి [ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్: సుయాష్ శర్మ].
చదవండి: ముఖం మాడ్చుకున్న రోహిత్: పాండ్యాను హత్తుకుంటూనే సీరియస్
📍Chennai
— IndianPremierLeague (@IPL) April 8, 2024
Sound 🔛🎙️
𝙅𝙪𝙨𝙩 𝙈𝙎 𝘿𝙝𝙤𝙣𝙞 𝙩𝙝𝙞𝙣𝙜𝙨 😎#TATAIPL | #CSKvKKR pic.twitter.com/7CPnrl9Ysa
Comments
Please login to add a commentAdd a comment