Training camp
-
రాష్ట్రంలో విప్లవాత్మక విద్యాసంస్కరణలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, రాష్ట్రంలో విప్లవాత్మక విద్యాసంస్కరణలు అమలు చేస్తోందని పాఠశాల విద్య కమిషనర్ ఎస్.సురేశ్‌కుమార్ చెప్పారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో 259 పాఠశాలలు సీబీఎస్ఈకి అనుబంధంగా ఉంటే ఇప్పుడు 1000 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ విద్యావిధానం అమలు చేయడం సీబీఎస్ఈ చరిత్రలోనే మైలురాయిగా పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ నిర్మాణాత్మక బోధన అంశంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్‌కు నాలుగు రోజుల శిక్షణ సదస్సు మంగళవారం విజయవాడలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యాసంస్కరణల్లో భాగంగా సీబీఎస్ఈ పాఠశాలలను బలోపేతం చేయడం, నాణ్యమైన విద్యతో పాటు సరైన మూల్యాంకనం, విద్యార్థుల్లో ప్రమాణాలు మెరుగుపరిచేందుకు సమైక్యంగా కృషి చేయాలని కోరారు. ప్రస్తుతం ఈ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు 2024–25 విద్యాసంవత్సరంలో పదోతరగతి పరీక్షలు సీబీఎస్ఈ విధానంలో రాయనున్నారని చెప్పారు. ఇక్కడ నేర్చుకున్న నైపుణ్యాలు, విద్యావిధానాలను పాఠశాలల్లో అమలు చేసి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్కీమ్స్ అండ్ పాలసీస్ (క్రిస్‌్ప) కార్యదర్శి ఆర్.సుబ్రహ్మణ్యం, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకుడు బి.శ్రీనివాసరావు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి, మోడల్ స్కూల్ కార్యదర్శి ఎం.వి.కృష్ణారెడ్డి, వివిధ ప్రభుత్వ యాజమాన్యాలకు చెందిన పాఠశాలల ప్రిన్సిపల్స్, ఏపీ, తెలంగాణ ఎస్సీఈఆరీ్ట, ప్రథమ్, సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్, రూమ్ టూ రీడ్, అజీమ్ప్రేమ్జీ యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
5 గ్యారంటీలకు ఏటా రూ.60 వేల కోట్లు
బెంగళూరు: ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఐదు గ్యారంటీల అమలుకు ప్రతిఏటా రూ.60,000 కోట్ల నిధులు అవసరమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు. వచ్చే నెల 7న తేదీన ప్రవేశపెట్టనున్న బడ్జెట్ మొత్తం రూ.3,35,000 కోట్లు ఉంటుందన్నారు. నూతన ఎమ్మెల్యేల శిక్షణా శిబిరాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కర్ణాటక తొలి బడ్జెట్ కేవలం రూ.21.3 కోట్లు మాత్రమేనని చెప్పారు. కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచి్చన ఐదు గ్యారంటీలు ఏమిటంటే.. నివాస గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా. ఒక్కో ఇంట్లో ఒక మహిళకు నెలకు రూ.2,000 చొప్పున సాయం. దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబంలోని ప్రతి సభ్యుడికి 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ. 18–25 ఏళ్ల గ్రాడ్యుయేట్ నిరుద్యోగికి ప్రతినెలా రూ.3,000, డిప్లొమా నిరుద్యోగికి రూ.1,500 చొప్పున సాయం. ప్రజా రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం. -
చైన్నె ఆర్మీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఘనంగా పాసింగ్ అవుట్ పరేడ్
సాక్షి, చైన్నె: భారత సైన్యంలో సేవలందించేందుకు యువత సిద్ధమైంది. ఆర్మీలో సేవలందించే యువ అధికారులు చైన్నెలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్న విషయం తెలిసిందే. చైన్నె సెయింట్ థామస్ మౌంట్లోని ఆర్మీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి ఏటా ఓ బృందం శిక్షణ ముగించుకుని సరిహద్దులకు బయలుదేరుతోంది. శనివారం పాసింగ్ అవుట్ పరేడ్ ముగించుకున్న యువ అధికారులు దేశసేవకు అంకితమయ్యారు. పాసింగ్ అవుట్ పరేడ్‌తో.. అకాడమీలో కఠిన శిక్షణ పొందిన ఆఫీసర్స్ స్థాయి అధికారులు తమ ప్రతిభా పాటవాలను చాటుకునే రీతిలో విన్యాసాలు ప్రదర్శించారు. అందరినీ అబ్బుర పరిచే విధంగా ఈ విన్యాసాలు సాగాయి. చివరిలో సర్టిఫికెట్లను అందుకుని దేశ సేవకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది 121 మంది యువ అధికారులు, 36 మంది మహిళా అధికారులు పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్నారు. ఇందులో తొలిసారిగా ఐదుగురు మహిళా కేడెట్లు ఆర్టిలర్ రెజిమెంట్‌లోకి ప్రవేశించారు. అలాగే భూటాన్‌కు చెందిన ఐదుగురు, 24 మంది మహిళ క్యాడెట్లు తమ శిక్షణను పూర్తి చేశారు. వివిధ ఆయుధాలను చాకచక్యంగా ఉపయోగించే నేర్పును ప్రదర్శించారు. ఏడాది పాటు శిక్షణలో ఆరి తేరిన వీరంతా యువ అధికారుల హోదాతో భారత సైన్యంలో చేరారు. అకాడమీలోని పరమేశ్వరన్ డ్రిల్ స్క్వయర్లో శనివారం ఉదయం జరిగిన పరేడ్‌తో దేశ సేవకు తమను అంకితం చేసుకున్నారు. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ఎస్ఎం షఫీయుద్దీన్ అహ్మద్ ఈ పరేడ్‌ను సమీక్షించారు. ఏసీఏ అజయ్ సింగ్ గిల్ స్క్వాడ్ ఆఫ్ హానర్‌తో పాటు ఓటీఏ బంగారు పతకం అందుకున్నారు. అలాగే రజత పతకాన్ని ఎస్‌యూఓ అజయ్‌కుమార్, కాంస్య పతకాన్ని బీయూఓ మెహక్ సైనీ దక్కించకున్నారు. దేశానికి నిస్వార్థ సేవలందిస్తామని , సైనిక విలువలకు కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా యువ అధికారులు ప్రమాణం చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో యువ అధికారులకు నియామక ఉత్తర్వులు అందజేశారు. ‘స్టార్స్’ గుర్తింపుతో ఈ వేడుక సాగింది. స్టార్స్ గుర్తింపు సమయంలో సహచర కేడెట్లతో కలిసి యువ అధికారులు ఆనందాన్ని పంచుకున్నారు. గౌరవ వందనం స్వీకరిస్తూ.. భారత మాత సేవకు యువకిశోరాలు సిద్ధమయ్యారు. శిక్షణను విజయవంతంగా ముగించుకుని విధి నిర్వహణలో భాగంగా సరిహద్దులకు పయానమయ్యారు. దేశభక్తి చాటే విధంగా శనివారం నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో యువ ఆర్మీ అధికారులు అద్భుత ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. -
క్యాస్ట్, క్యాష్ బేస్డ్ కాదు.. మనది కేడర్ బేస్డ్ పార్టీ
సాక్షి, హైదరాబాద్: ‘మనది క్యాస్ట్, క్యాష్ బేస్డ్ కాకుండా కేడర్ బేస్డ్ పార్టీ. పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడమే ముఖ్యం. పోలింగ్ బూత్ స్థాయి నుంచి పార్టీ పటిష్టంగా ఉంటే ఎలాంటి స వాళ్లు అయినా ఎదుర్కోవచ్చు. అడుగడుగునా టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలు ఎండగట్టాలి. పాత, కొత్త నేతల మధ్య సమన్వయం సాధించి ఐకమత్యంతో ఒక్కటిగా ముందుకెళ్లాలి’అని బీజేపీ రాష్ట్ర నాయకుల ప్రశిక్షణ్ శిబిరంలో జాతీయ నేతలు తరుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్, శివప్రకాశ్ దిశానిర్దేశం చేశారు. రెండోరోజు శిక్షణలో భాగంగా సోమవారం ప్రధానంగా సంస్థాగత అంశాలు, పార్టీ చరిత్ర, ఆరెస్సెస్‌తో సంబంధాలు, మోదీ హయాంలో వివిధ రంగాల విజయాలు, విదేశాంగ విధానం, దేశ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ రంగం తదితర అంశాలపై తరగతులు నిర్వహించారు. ఆర్ఎస్ఎస్, అనుకూల భావజాల సంస్థలతో పార్టీకున్న సంబంధాలు, ప్రత్యర్థులు చేసే విమర్శలను తిప్పికొట్టడం, కొత్తగా చేరిన పార్టీ నేతలకు పార్టీ సిద్ధాంతాలు, విధానాలపై అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, నేతలు కలిసికట్టుగా పోరాడితే కలిగే ప్రయోజనాలు, రాష్ట్రంలో అధికారం సాధించాలంటే కార్యక్షేత్రంలో పనివిధానంపై జాతీయనేతలు పలు సూచనలు చేశారు. ప్రభారీ బాధ్యతల నుంచి తప్పించండి రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిస్థాయి పోలింగ్ బూత్ కమిటీలను నియమించే బాధ్యత అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీ(ప్రభారీ)లదేనని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. ప్రతి బూత్‌లో 22 మందితో కమిటీ వేయాలని, లేనియెడల ఆ బాధ్యతల నుంచి తప్పిస్తామన్నారు. అసెంబ్లీ ఇన్చార్జీల బాధ్యతల నుంచి తమను తప్పించాలని పలువురు నేతలు మరోసారి తరుణ్ చుగ్, బండి సంజయ్‌లకు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. ఇన్‌చార్జీలకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోవడంతో ఆ బాధ్యతలపట్ల కొందరు విముఖత వ్యకం చేస్తున్నారు. రాష్ట్ర కార్యవర్గ భేటీ మూడ్రోజుల శిక్షణ తరగతుల్లో భాగంగా తాజా రాజకీయాలు, బీజేపీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం తదితర 14 అంశాలపై నేతలు చర్చిస్తున్నారు. చివరిరోజున ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి పలు అంశాలపై తీర్మానం చేయనున్నారు. రెండోరోజు దేశనిర్మాణంలో బీజేపీ పాత్ర, మోదీ ప్రభుత్వ విధానాలు, ప్రస్తుత, భవిష్యత్ ఫలితాలపై నేతలు చర్చించారు. బలహీనవర్గాల కోసం మోదీ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక, సంక్షేమ కార్యక్రమాలు, వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలపై చర్చ చేపట్టారు. రెండోరోజు శిక్షణ తరగతులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్, నేతలు డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, ఎంపీలు అరవింద్, సోయం బాబూరావు, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు హాజరయ్యారు. ఇదీ చదవండి: ఈసారీ సేమ్ సీన్!.. గవర్నర్ ఉభయ సభల ప్రసంగానికి అవకాశం లేనట్టే! -
ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లో భారత మహిళా బాక్సర్ల శిబిరం
న్యూఢిల్లీ: పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ (ఏఎస్ఐ)లో భారత మహిళా బాక్సర్ల టోక్యో ఒలింపిక్స్ సన్నాహాలు జరగనున్నాయి. వాస్తవానికి ఢిల్లీలో ఈ శిక్షణ శిబిరం జరగాల్సి ఉన్నా అక్కడ శిక్షణ పొందుతున్న బాక్సర్లతో పాటు సహాయక సిబ్బంది గత నెలలో కరోనా బారిన పడ్డారు. దాంతో శిబిరం వేదికను మార్చాల్సి వచ్చింది. ఈ శిబిరంలో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీకోమ్ (51 కేజీలు)తో పాటు లవ్లీనా (69 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (60 కేజీలు) పాల్గొననున్నారు. వీరు ఇప్పటికే టోక్యో బెర్తులను ఖాయం చేసుకున్నారు. టోక్యోకు క్వాలిఫై అయిన మరో బాక్సర్ పూజా రాణి (75 కేజీలు) మాత్రం ఈ శిబిరంలో పాల్గొనడం లేదు. ఏఎస్ఐలో పాల్గొనే బాక్సర్లను మూడు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులోనూ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన బాక్సర్తో పాటు ఆమెకు భాగస్వామ్యులుగా ఇద్దరు బాక్సర్లు ఉంటారు. ఇందుకోసం ప్రపంచ యూత్ చాంపియన్ అరుంధతి చౌదరి (69 కేజీలు), ముంజూ రాణి (48 కేజీలు), సోనియా లాథర్ (57 కేజీలు), శశి చోప్రా (64 కేజీలు), జాస్మిన్ (57 కేజీలు) లాల్బుట్సాహి (64 కేజీలు)లను ఎంపిక చేశారు. గత నెలలో కరోనా బారిన పడి కోలుకుంటున్న మేరీకోమ్ కోచ్ చోటేలాల్ యాదవ్ ఆలస్యంగా శిబిరానికి రానున్నట్లు మేరీకోమ్ స్వయంగా తెలిపింది. ఒలింపిక్స్ కంటే ముందు భారత బాక్సర్లు మే 21 నుంచి జూన్ 1 వరకు దుబాయ్‌లో జరిగే ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారు. వాస్తవానికి ఈ టోర్నీ ఢిల్లీలో జరగాల్సి ఉన్నా కరోనా వల్ల దుబాయ్‌కు తరలించారు. -
ఢిల్లీ క్యాపిటల్స్ ట్రైనింగ్ షెడ్యూల్ ఖరారు
న్యూఢిల్లీ: ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2021 ఎడిషన్ కోసం ఫ్రాంఛైజీలన్నీ సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రాక్టీస్‌ను ప్రారంభించగా.. త్వరలో గత సీజన్ రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కూడా శిబిరాన్ని మొదలుపెట్టనుంది. ఈనెల 23లోపు ఆటగాళ్లనంతా బయోబబుల్‌లోకి హాజరుకావాలని, మార్చి 30 నుంచి శిక్షణ శిబిరం ప్రారంభంమవుతుందని ఫ్రాంచైజీ కార్యనిర్వాహాకాధికారి వినోద్ బిస్త్ వెల్లడించారు. పలువురు ఆటగాళ్లు అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్లో బిజీగా ఉన్న నేపథ్యంలో రిఫ్రెషమెంట్ కోసం వారి కుటుంబసభ్యులతో కొన్ని రోజులు గడిపేందుకు క్యాంప్‌ను ఆలస్యంగా నిర్వహించాలనుకున్నామని ఆయన తెలిపారు. ఆటగాళ్లు బయో బబుల్‌లోకి ప్రవేశించే ముందు ఉత్సాహంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ జట్టులో ఈ ఏడాది కొత్తగా స్టీవ్ స్మిత్, సామ్ బిల్లింగ్స్, ఉమేశ్ యాదవ్ జాయిన్ కానున్నారు. కాగా, ఈ ఎడిషన్ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢీకొట్టనుంది. ఢిల్లీ జట్టు: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రిషబ్ పంత్, సామ్ బిల్లింగ్స్, విష్ణు వినోద్, పృథ్వీ షా, స్టీవ్ స్మిత్, శిఖర్ ధవన్, అజింక్య రహానే, షిమ్రోన్ హెట్మేయర్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, అశ్విన్, స్టోయినిస్, క్రిస్ వోక్స్, టామ్ కర్రన్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, రబాడ, నోర్జే, అమిత్ మిశ్రా, రిపల్ పటేల్, ఆవేశ్ ఖాన్, లుక్మాన్ మేరీవాలా, మనిమరన్ సిద్ధార్ధ్, ప్రవీణ్ దూబే -
వైరల్: ధోని సిక్సర్ల వర్షం..
చెన్నై: ఎంఎస్ ధోని సిక్సర్ల వర్షం కురిపించాడు. అదేంటి ధోని ఎక్కడ మ్యాచ్‌లు ఆడడం లేదు కదా.. మరి ఈ సిక్సర్లేంటి అనుకుంటున్నారా. అసలు విషయంలోకి వెళితే.. ఐపీఎల్ 14వ సీజన్‌కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ అన్ని ఫ్రాంచైజీలకన్నా ముందే సన్నాహకాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ధోని ప్రాక్టీస్ సమయంలో వరుస బంతుల్లో సిక్సర్ల వర్షం కురిపించాడు. దాదాపు గంట సేపు ప్రాక్టీస్ కొనసాగించిన ధోని ప్రాక్టీస్ ఆరంభంలో డిఫెన్స్‌కు ప్రాధాన్యమిచ్చినా.. ఆ తర్వాత సిక్సర్లు బాదుతూ బంతులను స్టాండ్స్‌లోకి పంపించాడు. ధోని ఆడిన షాట్లలో తన ఫేవరెట్ అయిన హెలికాప్టర్ షాట్‌ను ఎక్కువసార్లు ఆడినట్లుగా తెలుస్తోంది. ధోని ఒక్కో షాట్ కొడుతుంటే ఈసారి అతను ఎంత కసిగా ఉన్నాడో అర్థమవుతుంది. దీనికి సంబంధించిన వీడియోను సీఎస్కే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గతేడాది ఐపీఎల్ 13వ సీజన్ యూఏఈ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ సీజన్లో ధోని కెప్టెన్సీలోని సీఎస్కే ఆరంభంలో వరుస పరాజయాలు చవిచూసి ఆఖరిదశలో వరుస విజయాలు నమోదు చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరగపోయింది. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. 8 ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ భారత్‌లో జరగడం సానుకూలాంశం. కాగా ఐపీఎల్ 14వ సీజన్ ఏప్రిల్ 9న ప్రారంభమై.. మే30న ముగియనుంది. చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. చదవండి: తలైవా.. వెల్కమ్ టూ చెన్నై వారిద్దరితోనే ఓపెనింగ్: కోహ్లి View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl) -
థ్యాంక్యూ యువీ భయ్యా.. ఇదంతా నీ వల్లే
ఢిల్లీ: టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ భారత మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కు థ్యాంక్స్ చెప్పుకున్నాడు. ఆసీస్ సిరీస్‌లో రాణించడానికి యువీ ఇచ్చిన ట్రైనింగ్ ఎంతగానో ఉపయోగపడిందని తెలిపాడు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో గిల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'ఐపీఎల్ ప్రారంభానికి ముందు యువీ ఇచ్చిన ట్రైనింగ్ ఎంతగానో ఉపయోగపడింది. క్యాంప్‌లో భాగంగా వందల సంఖ్యలో షార్ట్ పిచ్ బంతులు విసిరి నాతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయించాడు. భుజానికి ఎత్తుగా వచ్చే బంతులను ఎలా సమర్థంగా ఆడాలనేది నేర్పించాడు. అంతేగాక వివిధ యాంగిల్స్‌లో బంతులు విసురుతూ బ్యాటింగ్ స్కిల్స్‌ను మరింత మెరుగయ్యేలా చేశాడు. యూవీ ట్రైనింగ్‌తోనే ఆసీస్ సిరీస్‌లో కమిన్స్, హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ లాంటి పేసర్ల బంతులను సమర్థంగా ఎదుర్కొగలిగాను. ఐపీఎల్‌కు కూడా యూవీ ఇచ్చిన ట్రైనింగ్ ఎంతగానో ఉపయోగపడింది.చదవండి: ఆ ట్రోఫీ గెలవకుంటే కోహ్లి తప్పుకోవాల్సిందే అరంగేట్రం సిరీస్‌ను ఒక మధురానుభూతిగా మలుచుకోవడంతో మనసు ప్రశాంతంగా ఉంది. నా డెబ్యూ సిరీస్‌లోనే మంచి పరుగులు చేయడం ఆనందాన్నిచ్చింది. ఐపీఎల్.. ఆ తర్వాత ఆసీస్ సిరీస్‌తో ఆరు నెలల పాటు ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ ఆరు నెలల్లో ఇంటి ఫుడ్‌ను చాలా మిస్సయ్యాను. ఇంగ్లండ్‌తో టూర్ ప్రారంభానికి ముందు కొన్ని రోజులు విశ్రాంతి దొరకడంతో అమ్మ చేతి వంటను ఆస్వాధించాలనుకుంటున్నా. ఇక నా తర్వాతి గోల్.. ఇంగ్లండ్‌తో సిరీస్.. ఈ సిరీస్‌లో కూడా స్థిరమైన ప్రదర్శన కనబరిచి పరుగులు రాబట్టాలని ఉత్సుకతతో ఉన్నా. జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, జోఫ్రా ఆర్చర్ లాంటి సీమర్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా.. ఈ సందర్భంగా యువీ భయ్యాకి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా'అంటూ తెలిపాడు. కాగా బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో మూడు టెస్టు మ్యాచ్‌లు కలిపి గిల్ 51 యావరేజ్‌తో 259 పరుగులు చేశాడు. టీమిండియా తరపున అత్యధిక పరుగులు సాధించిన రిషబ్ పంత్(274), పుజారా(271), రహానే(268) తర్వాతి స్థానంలో నిలిచాడు. కాగా గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులు చేసిన గిల్ టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే గిల్ సెంచరీ మిస్ చేసుకోవడంపై అతని తండ్రి లఖ్వీందర్ సింగ్ నిరాశకు గురైన సంగతి తెలిసిందే. చదవండి: 'నట్టూ.. నీకు కెప్టెన్ అయినందుకు గర్విస్తున్నా' -
తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తే...
న్యూఢిల్లీ: కరోనాతో వచ్చిన సుదీర్ఘ విరామం తర్వాత అగ్రశ్రేణి ఆటగాళ్ల కోసం పూర్తి స్థాయి శిక్షణను మొదలు పెట్టాలని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) భావిస్తోంది. ఇందు కోసం హైదరాబాద్‌ను వేదికగా నిర్ణయించింది. అన్నీ అనుకూలిస్తే ట్రైనింగ్ క్యాంప్‌ను జులై 1 నుంచి నిర్వహించాలనేది ప్రతిపాదన. అయితే ఇదంతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అనుమతిపైనే ఆధారపడి ఉంది. రాష్ట్రంలో లాక్డౌన్ విషయంలో సడలింపులు ఇచ్చినా... క్రీడా కార్యకలాపాలు ప్రారంభించేందుకు మాత్రం ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించలేదు. పైగా ఇప్పుడు హైదరాబాద్‌లో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో శిబిరం నిర్వహించడం సాధ్యమా అనేది సందేహమే. కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో దాదాపు నెల రోజులుగా బెంగళూరులో పలువురు షట్లర్లు తమ ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు. నగరానికి చెందిన టాప్ ప్లేయర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్ తదితరులు మాత్రం శిక్షణకు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. ‘కోవిడ్–19 కారణంగా శిక్షణ నిలిచిపోయింది. మేం ప్రస్తుత పరిస్థితిని సమీక్షిస్తున్నాం. జులై 1 నుంచి హైదరాబాద్‌లో క్యాంప్ నిర్వహించాలనేది మా ఆలోచన. అయితే ప్రభుత్వ అనుమతి రావడమే అన్నింటికంటే ముఖ్యం. దేశవాళీ టోర్నీలు నిర్వహించే విషయంలో రాష్ట్ర సంఘాలతో చర్చించాం. అందరి సూచనలను పరిగణలోకి తీసుకున్న తర్వాత సెప్టెంబరు వరకు ఎలాంటి టోర్నీలు జరపరాదని నిర్ణయించాం’ అని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కార్యదర్శి అజయ్ సింఘానియా వెల్లడించారు. బీడబ్ల్యూఎఫ్ షెడ్యూల్ ప్రకారం భారత్‌లో ఈ ఏడాది నాలుగు బ్యాడ్మింటన్ టోర్నీలు జరగాల్సి ఉండగా, హైదరాబాద్ ఓపెన్ సూపర్–100, జూనియర్ ఇంటర్నేషనల్ గ్రాండ్‌ప్రి టోర్నీలు ఇప్పటికే రద్దయ్యాయి. -
అన్నదమ్ముల అపూర్వ సేద్యం
ఆరిమిల్లి కృష్ణ, బాపిరాజు సోదరులు 135 ఎకరాల సొంత భూమిలో ఉమ్మడి వ్యవసాయం చేస్తున్న పెద్దరైతులు. కర్నూలు జిల్లా కోసిగి మండలం కోల్‌మాన్‌పేట వారి స్వగ్రామం. పశ్చిమగోదావరి జిల్లా నుంచి 1960లో వీరి తండ్రి వలస వచ్చి కోల్మాన్పేటలో స్థిరనివాసం ఏర్పరచుకొని పాడి పశువుల పోషణతోపాటు పంటలు సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కృష్ణ బీటెక్ చదువుకున్నప్పటికీ తండ్రి చూపిన బాటలో వ్యవసాయాన్నే వృత్తిగా ఎంపిక చేసుకున్నారు. అంతేకాదు, ఎన్నో ఏళ్లుగా చేస్తున్న రసాయనిక వ్యవసాయం అనేక విధాలుగా ఎలా నష్టదాయకమో గ్రహించి కుటుంబంలో అందర్నీ ఒప్పించి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడం విశేషం. 40 దేశవాళీ ఆవులను పోషిస్తూ.. వాటి పేడ, మూత్రంతో జీవామృతం, ఘనజీవామృతం తయారు చేసుకొని భూములను సజీవవంతంగా మార్చుకుంటూ ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని పండిస్తున్నారు. రసాయనిక వ్యవసాయంలో ఎరువులు, పురుగుమందుల ఖర్చులు పెరిగిపోయి క్రమంగా నికరాదాయం తగ్గిపోతూ వస్తున్న తరుణంలో 2012 ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ శిక్షణా శిబిరంలో కృష్ణ పాల్గొన్నారు. రసాయనిక వ్యవసాయంతో ప్రజారోగ్యానికి, భూమికి, పర్యావరణానికి, ఆరోగ్యానికి జరుగుతున్న నష్టాన్ని అర్థం చేసుకున్న కృష్ణ.. పాలేకర్ చెప్పిన విధంగా 2012 ఖరీఫ్ పంట కాలం నుంచే ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. ఏకంగా 90 ఎకరాల్లో వరి సేద్యాన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోకి మార్చేశారు. అయితే, కొత్త కావడం, సందేహాలను నివృత్తి చేసే వారు అందుబాటులో లేకపోవడంతో వరి ధాన్యం దిగుబడి తొలి ఏడాది ఎకరానికి 18 బస్తాలకు పడిపోయింది. మొదటి ఏడాది రూ. లక్షల ఆదాయం తగ్గిపోయింది. అయినా, మొక్కవోని దీక్షతో ప్రకృతి వ్యవసాయంలో మెలకువలను నేర్చుకుంటూ వ్యవసాయాన్ని కొనసాగించారు. అంతేకాదు, అప్పటివరకు నిర్వహిస్తున్న రసాయనిక ఎరువులు, పురుగుమందుల దుకాణం(ఏటా రూ. 30 లక్షలకు పైగా టర్నోవర్) కూడా అదే సంవత్సరం మూసివేసి మరీ ప్రకృతి వ్యవసాయానికి కట్టుబడిన ప్రకృతి వ్యవసాయ కుటుంబం వారిది. దిగుబడి 18 నుంచి 52 బస్తాల వరకు.. ప్రకృతి వ్యవసాయంలో పట్టు సాధిస్తున్న కొద్దీ ఏటేటా దిగుబడులు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం తమ ప్రాంతంలో రసాయనిక వ్యవసాయదారుల కన్నా ఎక్కువగానే ప్రకృతి వ్యవసాయంలో తాము వరి ధాన్యం దిగుబడి తీయగలుగుతున్నామని గర్వంగా చెప్పుకునే స్థితికి కృష్ణ ఎదిగారు. మొదటి ఏడాదే 90 ఎకరాల్లో వరిసాగును ప్రకృతి వ్యవసాయంలో చేపట్టినప్పుడు కొన్ని పొరపాట్ల వల్ల ఎకరానికి 18 బస్తాల వరి ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రస్తుతం ఎకరానికి 35 నుంచి 40 బస్తాల (బస్తా 72 కిలోలు) దిగుబడి సాధిస్తున్నారు. రెండేళ్ల క్రితం చీడపీడల బెడద ఎక్కువగా ఉండటంతో రసాయనిక వ్యవసాయం చేసిన రైతులకు ధాన్యం దిగుబడి బాగా తగ్గిపోయినా తమ పొలంలో చీడపీడలూ లేవు, దిగుబడీ తగ్గలేదని కృష్ణ తెలిపారు. రెండు ఎకరాల్లో ప్రయోగాత్మకంగా పచ్చి పేడ స్లర్రీని బకెట్లతో పొలంలో కూలీలతో తరచూ పోయిస్తూ వచ్చానని, దిగుబడి ఎకరానికి 52 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చిందని కృష్ణ తెలిపారు. అయితే, పేడ స్లర్రీని బక్కెట్లతో పోయించడం శ్రమతోటి, ఖర్చుతోటి కూడిన పని కాబట్టి కొనసాగించడం లేదన్నారు. పత్తిలో అంతర పంటగా తెల్ల జొన్న కృష్ణ సోదరులకు 12 ఎకరాల్లో మామిడి తోట ఉంది. ఈ ఏడాది 56 ఎకరాల్లో వరి (బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, ఎన్‌డిఎల్‌ఆర్–7 రకాలు) సాగు చేశారు. ఆర్ఎన్ఆర్ ఎకరానికి 38 బస్తాల దిగుబడి వచ్చింది. ఆముదం 20 ఎకరాల్లో, 4 ఎకరాల్లో కంది సాగు చేస్తున్నారు. 14 ఎకరాల్లో అండుకొర్రలు, కొర్రలు, ఊదలు, సామలు, వరిగలు సాగు చేశారు. 6 ఎకరాల్లో బీటీ పత్తి వేసి, జొన్నను అంతరపంటగా సాగు చేస్తున్నారు. ఇప్పటికే ఎకరానికి 6 క్వింటాళ్ల పత్తి తీశారు. మరో 6 క్వింటాళ్లు రావచ్చు. పత్తి సాళ్ల మధ్య 48 అంగుళాల దూరం పెట్టారు. పత్తి సాళ్ల మధ్య రెండు వరుసలుగా తెల్ల జొన్నను విత్తారు. ఎకరానికి పది క్వింటాళ్ల జొన్న దిగుబడి వస్తుందని కృష్ణ ఆశిస్తున్నారు. షాంపూ, వేప చెక్క+గోమూత్ర కషాయం సోప్ షాంపూ, వేప చెక్క+గోమూత్రంతో చేసిన కషాయం పిచికారీ చేశాక కత్తెర పురుగు ఉధృతి రసాయనిక వ్యవసాయ పొలాల్లో కన్నా తమ పొలంలో తక్కువగా ఉందని కృష్ణ తెలిపారు. సోప్ షాంపూని రెండు సార్లు పిచికారీ చేశారు. వేపచక్క 3 కిలోలు, 12 లీటర్ల గోమూత్రం కలిపి 3 పొంగులు పొంగిస్తే 8–9 లీటర్ల కషాయం వస్తుంది. కాచిన తెల్లారి 20 లీటర్ల పంపునకు ఒక లీటరు కషాయాన్ని, 1 లీటరు గోమూత్రం, 18 లీటర్ల నీటిని కలిపి పత్తిపై పిచికారీ చేస్తున్నారు. ఈ రబీలో మినుము, పెసర, గోధుమను సాగు చేయనున్నామన్నారు. మిర్చిలో అంతరపంటలుగా జొన్న, సజ్జ గత ఏడాది ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసిన ఎల్‌సిఎ 625 నాటు రకం మిర్చి (వరుసల మధ్య 36 అంగుళాలు, మొక్కల మధ్య 1.5 అంగుళాల దూరం)లో జొన్న, సజ్జ (3–4 మిరప మొక్కలకు ఒక జొన్న, సజ్జ మొక్కలు నాటారు) అంతర పంటలుగా వేసి మిర్చిలో 12 క్వింటాళ్ల దిగుబడులు సాధించానని కృష్ణ తెలిపారు. జొన్న, సజ్జ అంతరపంటగా వేయడం వల్ల ఫిబ్రవరి తర్వాత ఎండ తీవ్రత నుంచి మిర్చి పంటకు నీడ దొరకడంతో ఒక కాపు ఎక్కువగా వచ్చిందన్నారు. ఈ రకం మిరప విత్తనాన్ని తిరిగి వాడుకోవచ్చని, అయితే వేరే పొలంలో పండిన లేదా లాం ఫాం నుంచి విత్తనాలు తెచ్చి వేసుకుంటే మంచిదన్నారు. వేప చెక్క+గోమూత్ర కషాయాన్ని అమావాస్యకు ముందు ఒకసారి, తర్వాత మరోసారి ఈ కషాయాన్ని పిచికారీ చేసి మంచి ఫలితాలు సాధించామని కృష్ణ తెలిపారు. ప్రదర్శనా క్షేత్రం.. శిక్షణా కేంద్రం.. కృష్ణ, బాపిరాజు సోదరులు మక్కువతో ప్రకృతి వ్యవసాయం చేస్తూ వరి, పత్తి, మిర్చి నుంచి చిరుధాన్యాలు, మామిడి తోటల వరకు బహుళ పంటలు సాగు చేస్తూ భళా అనిపించుకుంటుండటంతో వారి వ్యవసాయ క్షేత్రం వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలతో పాటు కర్ణాటకలోని బళ్లారి ప్రాంత రైతులకు సైతం ప్రదర్శన క్షేత్రంగా, రైతు శిక్షణా కేంద్రంగా రూపుదాల్చింది. సీజన్లో కనీసం రెండు సార్లు రైతులకు శిక్షణ ఇస్తున్నామని, నిరంతరం రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు ఫీల్డ్ విజిట్‌కు వస్తూ వుంటారని కృష్ణ గర్వంగా చెప్పారు. గ్రామంలో పెద్ద రైతు రసాయనిక వ్యవసాయానికి స్వస్తి పలికి ప్రకృతి వ్యవసాయం చేపట్టి, మిగతా రైతులకు తోడ్పాటునందిస్తూ ఉంటే ఆ గ్రామంలో చిన్న రైతులు అనుసరించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోల్మాన్పేటలో కూడా అదే జరుగుతోంది. ఇప్పటికి 150 మంది రైతులు ప్రకృతి వ్యవసాయ బాట పట్టారని కృష్ణ తెలిపారు. తాము జీవామృతం, ఘనజీవామృతం, తదితర కషాయాలను రైతులకు నామమాత్రపు ధరలకు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం తోడ్పాటుతో గ్రామంలో మిగతా రైతులను కూడా ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాని కృష్ణ ఆనందంగా చెప్పారు. స్ఫూర్తిదాయకమైన కృషి చేస్తున్న కృష్ణ సోదరులకు ‘సాగుబడి’ జేజేలు! – గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు (అగ్రికల్చర్) వెయ్యి లీటర్ల బ్యారెల్స్‌లో జీవామృతం సరఫరా అలవాటైపోయిన రసాయనిక వ్యవసాయం వదిలేసి ప్రకృతి వ్యవసాయం చేపట్టే రైతుల్లో వారి ఆర్థిక స్తోమతను బట్టి ఎవరి బాధలు వాళ్లకుంటాయి. చిన్న రైతులకు ఉండే సమస్యలు ఒక రకమైతే, పెద్ద రైతులకు ఉండే సమస్యలు ఇంకో రకం. పాలేకర్ శిక్షణా తరగతుల్లో 200 లీటర్ల నీటిలో ఆవు పేడ, మూత్రం, బెల్లం, పప్పుల పిండి కలిపి ఎకరానికి సరిపడా జీవామృతం ఎలా తయారు చేసుకోవాలో చెబుతుంటారు. అయితే, ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన తొలినాళ్లలో ఈ సూచనలను కృష్ణ అలాగే పాటించారు. పొలం విస్తీర్ణం ఎక్కువ కావడంతో కొద్ది పరిమాణాల్లో చిన్న డ్రమ్ముల్లో చేసిన జీవామృతం సరిపోక పంట అనుకున్నంత దిగుబడినివ్వలేదు. దీంతో, ఇలా కాదని తమ పెద్ద వ్యవసాయ క్షేత్రానికి అనుగుణంగా జీవామృతం తయారీ పద్ధతిని కృష్ణ నేర్పుగా మార్చుకున్నారు. వెయ్యి లీటర్ల ఫైబర్ బ్యారెల్స్ తెప్పించి వాటిలో జీవామృతం తయారు చేసి భూములకు అందించడం ప్రారంభించిన తర్వాత సమస్య తీరింది. పంటల దిగుబడీ పెరిగింది. జీవామృతంతో కూడిన వెయ్యిలీటర్ల బ్యారెల్స్ మూడింటిని ఒక ట్రాలీలో తరలించి ఒక విడతకు 10–15 ఎకరాలకు అందిస్తుండడంతో ఇప్పుడు పుష్కలంగా జీవామృతం పంటలకు అందుతోంది. దీంతోపాటు పల్వరైజింగ్ మిషన్‌ను తెచ్చిన తర్వాత.. 135 ఎకరాలకు సరిపడా వివిధ రకాల కషాయాల తయారీ ప్రక్రియ కూడా సులభంగా మారిందని కృష్ణ సంతృప్తిగా చెప్పారు. ప్రకృతి వ్యవసాయమే నా సర్వస్వం ప్రకృతి వ్యవసాయమే నా సర్వస్వం. గతంలో రసాయన ఎరువులతో వ్యవసాయం చేసి నష్టాలను మూట కట్టుకున్నాను. సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో 2012 నుంచి తమ్ముడు బాపిరాజుతో కలసి 135 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తూ అనేక మంది రైతులకు శిక్షణ కూడా ఇస్తున్నాం. మా గ్రామంలో దాదాపు 150 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 40 దేశవాళీ ఆవులను పోషిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం వల్ల నాణ్యమైన ఆహారాన్ని పండిస్తున్నాం. భూమి ఆరోగ్యం అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వం కూడా ఈ పద్ధతిని ప్రోత్సహిస్తుండటం శుభపరిణామం. మా ఊళ్లో రైతులందరినీ ప్రకృతి వ్యవసాయదారులుగా మార్చాలని ప్రయత్నిస్తున్నాను. – ఆరిమిల్లి కృష్ణ (95533 42667), బీటెక్, ప్రకృతి వ్యవసాయదారుడు, కోల్‌మాన్‌పేట, కొసిగి మం, కర్నూలు జిల్లా జీవామృతాన్ని పొలానికి తరలించడానికి వాడుతున్న భారీ ట్యాంకులు -
నేడు వైఎస్సార్సీపీ శిక్షణ శిబిరం
సాక్షి, హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దరిమిలా ఈ నెల 23వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభ, శాసనసభకు పోటీ చేసిన అభ్యర్థులు, ప్రధాన ఎన్నికల ఏజెంట్లకు విజయవాడలో ఈ నెల 16వ తేదీన శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. విజయవాడలోని బందర్ రోడ్డు, డీవీ మానర్ హోటల్ ఎదురుగా ఉన్న ఏ1 కన్వెన్షన్ సెంటర్లో కార్యక్రమం జరుగుతుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ శిక్షణా తరగతులకు ఆయా పార్లమెంటు జిల్లాల పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు హాజరు కావాలని పార్టీ ఆదేశించింది. ఏ1 కన్వెన్షన్ సెంటర్లో ఉదయం 8.30 గంటల నుంచి 10 గంటల వరకు తరగతులకు వచ్చే ప్రతినిధులకు అల్పాహారం, రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది. ఆ తరువాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కౌంటింగ్ ఏజెంట్లు, పోటీ చేసిన అభ్యర్థుల విధులపై పార్టీ పెద్దలు వివరిస్తారు. శిక్షణకు హాజరవుతున్న వారు విధిగా సమయపాలన పాటించాల్సి ఉంటుందని పార్టీ ఇప్పటికే సూచనలు పంపింది. ఈ శిక్షణా తరగతులకు ఆహ్వానితులతో పాటుగా చీఫ్ ఎన్నికల ఏజెంట్లు అంతా విధిగా హాజరు కావాలని, ఎవరికీ మినహాయింపు లేదని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి పార్టీ నేతలకు పంపిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు. -
ప్రకృతి వ్యవసాయంపై 29 నుంచి వారం రోజుల శిక్షణ
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రకృతి వ్యవసాయ ట్రస్టు ఆధ్వర్యంలో బెంగళూరులోని మానస గంగ ఆశ్రమంలో ఈనెల 29 నుంచి వచ్చే నెల 4 వరకు గోఆధారిత ప్రకృతి వ్యవసాయం, 5 లేయర్ మోడల్, టెర్రస్ గార్డెనింగ్పై వారం రోజుల రెసిడెన్సియల్ శిక్షణా శిబిరం జరగనుంది. పత్తిలో గులాబీ పురుగు, మొక్కజొన్న ఆర్మీ లద్దెపురుగులను అరికట్టే పద్ధతులపై కూడా శిక్షణ ఇస్తారు. రిజిస్ట్రేషన్ వివరాలకు.. ఉమామహేశ్వరి – 90004 08907, నాయుడు – 79937 95246, లయ – 88973 32296. -
యుద్ధానికి సిద్ధంకండి
సాక్షి, తిరుపతి : ప్రజా భక్షక పాలనపై యుద్ధానికి సిద్ధం కావాలని బూత్ కమిటీ సభ్యులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేయాలని కోరారు. ప్రజలకు, పార్టీకి బూత్ కమిటీ సభ్యులు వారధిలాంటి వారని పేర్కొన్నారు. తిరుపతి పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం నాలుగు రోజుల జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కో–ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, తమ్మినేని సీతారాం, జెడ్పీ మాజీ చైర్పర్సన్ రెడ్డమ్మ, చిత్తూరు, కుప్పం, తంబళ్లపల్లి, పలమనేరు నియోజకవర్గాల సమన్వయకర్తలు జంగాలపల్లి శ్రీనివాసులు, చంద్రమౌళి, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, రాకేష్‌రెడ్డి పాల్గొన్నారు. ముందుగా జ్వోతి వెలిగించి, మహానేత వైఎస్‌కు నివాళులర్పించారు. అనంతరం చిత్తూరు, కుప్పం, తంబళ్లపల్లి, పలమనేరు బూత్ కమిటీ సభ్యులకు రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించారు. బూత్ కమిటీ కన్వీనర్ల విధులు, బాధ్యతల గురించి వైఎస్సార్సీపీ నేతలు వివరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం జరిగిన పరిణామాలు, పార్టీ సిద్ధాంతాలు, భావజాలాలు, పార్టీ ఆవిర్భావం, ఆవశ్యకత గురించి, పార్టీ లక్ష్యాలు, స్థానిక ప్రభుత్వాలు, పూర్వాపరాలు, వ్యక్తిత్వ వికాసం, పార్టీ ప్రజా పోరాటాల గురించి ఎంపీ విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, భూమన కరుణాకరరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తమ్మినేని సీతారాం వివరించారు. ఎన్నికల నిర్వహణలో బూత్ కమిటీలే కీలకం.. గ్రామస్థాయిలో పార్టీ పటిష్టతకు, ఎన్నికల నిర్వహణలో బూత్ కమిటీలే కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని వైఎస్సార్సీపీ నేతలు వివరించారు. దొంగ ఓట్ల గుర్తింపుపై బూత్ కమిటీలు ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. ఓటింగ్ సమయంలో ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమైందని గుర్తు చేశారు. పార్టీకి, ప్రజలకు బూత్ కమిటీ కన్వీనర్లు వారధుల్లా వ్యవహరించాలని సూచించారు. ప్రజా భక్షక పాలనకు ఎదురొడ్డి నిలబడాలని బూత్ కమిటీ సభ్యులకు పిలుపునిచ్చారు. పార్టీ చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో చిన్నపాటి లోపాలకు తావులేకుండా పనిచేయాలని కోరారు. ఈసారి జిల్లాలో అన్ని స్థానాలను కైవశం చేసుకునేందుకు కష్టపడి పనిచేద్దామని పిలుపునిచ్చారు. కుప్పం సమన్వయకర్త చంద్రమౌళి మాట్లాడుతూ పలు నీతికథలను బోధిస్తూ బూత్ కమిటీ సభ్యులను ఉత్తేజపరిచారు. విశ్వసనీయత వైఎస్ జగన్ నైజం అని పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓటుతో కూల్చేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల్లో బూత్ లెవల్ కన్వీనర్లు కీలకంగా వ్యవహరించాలని తంబళ్లపల్లి నియోజకవర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సూచించారు. ప్రజలు జగన్‌కు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే వారిని బూత్ వరకు తీసుకురావాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని అన్నారు. పలమనేరు నేత ఆకుల గజేంద్ర మాట్లాడుతూ చంద్రబాబు నీతి నిజాయితీలేని రాజకీయాలు చేయడంలో నేర్పరని దుయ్యబట్టారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చల్లా మధుసూదన్‌రెడ్డి, వెంకటే గౌడ్ పాల్గొన్నారు. -
కార్యకర్తలే మూలస్తంభాలు
విజయవాడ సిటీ: వైఎస్సార్ సీపీ కృష్ణాజిల్లా పోలింగ్ బూత్ కన్వీనర్ల శిక్షణ శిబిరాలు విజయవాడలోని ఐవీ ప్యాలెస్‌లో సోమవారం ప్రారంభమయ్యాయి. పార్టీ సీనియర్ నేత, జిల్లా రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు జరిగే శిబిరాల్లో తొలిరోజు పెనమలూరు, గన్నవరం, పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాలకు శిక్షణ నిర్వహించారు. తొలుత ముఖ్య అతిథి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి, పోలింగ్ బూత్ కన్వీనర్లను ఉద్దేశించి మాట్లాడారు. కార్యకర్తలే వైఎస్సార్ సీపీకి మూలస్తంభాలన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టంగా ఉంచే కార్యకర్తల గురించి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పుడూ ఆలోచిస్తుంటారన్నారు. ప్రస్తుతం టీడీపీపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో, చక్కటి ప్రణాళికతో ప్రజల ముందుకు వెళ్లాలని సూచించారు. నూతన ఓటర్ల నమోదు, వారిలో చైతన్యం తీసుకురావడం తదితర అంశాల్లో ముందుచూపుతో వ్యవహరించాలన్నారు. పార్టీలకు అతీతంగా, పేదరికమే ప్రాతిపదికగా వైఎస్ రాజశేఖరరెడ్డి పలు పథకాలు అమలు చేశారని, అలాంటి రాజ్యం మళ్లీ రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని పేర్కొన్నారు. దాదాపు 3,500 మంది పోలింగ్ బూత్ కన్వీనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు పెద్దిరెడ్డి వివరించారు. ఎన్నికల్లో పోలింగ్ బూత్ కన్వీనర్లు, కార్యకర్తలే కీలకమని, కాబట్టి కష్టపడి పనిచేయాలని సూచించారు. వైఎస్సార్ సీపీ విజయంతో పేద కుటుంబాల్లో మార్పు :పార్థసారథి పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయం పేద కుటుంబాల్లో మార్పు తెస్తుందన్నారు. పేదలు, వెనకబడిన వర్గాలకు విద్య, ఆరోగ్యం, ఆర్థిక, సామాజిక, రాజకీయాభివృద్ధి దిశగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పథకాలు రూపకల్పన చేశారని వాటిని వివరించారు. పలు అంశాలపై ప్రసంగాలు ∙గన్నవరం, పెనమలూరు నిజయోజకవర్గాలకు సంబంధించి ‘రాజకీయాలపై సోషల్ మీడియా ప్రభావం’ అనే అంశంపై చల్లా మధుసూదన్‌రెడ్డి, ‘వ్యక్తిత్వ వికాస నాయకత్వ లక్షణాలు’ అనే అంశంపై పరసా రవి, ‘పోలింగ్ బూత్ శిక్షణ తరగతుల విశిష్టత’ గురించి పార్టీ సీనియర్ నేత సామినేని ఉదయభాను, ‘సామాజిక న్యాయం’ అనే అంశంపై పద్మారావు, ‘ప్రస్తుత రాజకీయ పరిస్థితులు’పై మాజీ మంత్రి, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి ప్రసంగించారు. ∙పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాలకు సంబంధించి ‘రాజకీయాలపై సోషల్ మీడియా ప్రభావం’ అనే అంశంపై లావణ్య, ‘స్థానిక సంస్థలు’ అనే అంశంపై కుంభా రవి, ‘ప్రస్తుత రాజకీయ పరిస్థితులు’పై శాసన మండలిలో ప్రతిపక్ష నేత డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రసంగించారు. ఈ శిక్షణా కార్యక్రమాల్లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, పామర్రు నియోజకవర్గ సమన్వయకర్త కైలే అనీల్‌కుమార్, అవనిగడ్డ సమన్వయకర్త సింహాద్రి రమేష్, గన్నవరం సమన్వయకర్త యర్లగడ్డ వెంకట్రావ్, పార్టీ నగర అధ్యక్షుడు, అధికార ప్రతినిధి వెలంపల్లి శ్రీనివాస్, జిల్లా పరిషత్ పార్టీ ఫ్లోర్‌లీడర్ తాతినేని పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన తైక్వాండో వేసవి శిక్షణ శిబిరం
కాకినాడ సిటీ : స్పోర్ట్స్ అ«థారిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆండాళ్లమ్మ కళాశాలలో నిర్వహించిన తైక్వాండో వేసవి శిక్షణా శిబిరం బుధవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. నెల రోజులపాటు కొనసాగిన శిక్షణ శిబిరంలో సుమారు 130 మంది బాలబాలికలు పాల్గొన్నారని తైక్వాండో అసోసియేషన్ జిల్లా సెక్రటరీ బి.అర్జున్‌రావు తెలిపారు. జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చుండ్రు గోవిందరాజులు, తైక్వాండో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎ.మధుసూదనరావు, ఆండాళ్లమ్మ కళాశాల ప్రిన్సిపాల్ ఏవీఎస్ సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్ కె.సుధాకరరావు విద్యార్థులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో తైక్వాండో జాయింట్ సెక్రటరీ కె.అప్పారావు, డి.సత్యనారాయణ, కోచ్‌లు పి.తేజ, ఎన్పీ. రాఘవేంద్రస్వామి, డాక్టర్ అబ్రహమ్ పాల్గొన్నారు. -
సమాజాన్ని అధ్యయనం చేయాలి
విజయవాడ కల్చరల్: బాలబాలికలు సమాజాన్ని అధ్యయనం చేయాలని అఖిల భారత విద్యాభారతి సహ సంయోజక్ రేఖా చుడసమా వివరించారు. విద్యాభారతి సంస్థ ప్రకాశం కృష్ణ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన బాలికలకు çసత్యనారాయణపురంలోని శిశు విద్యామందిర్‌లో శుక్రవారం శిక్షణ శిబిరం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ బాలికలు పాఠశాల విద్యతోపాటు సమాజాన్ని అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు. బాల,కౌమార దశలో ఉన్న బాలబాలికలకు అన్ని అంశాలోనూ శిక్షణ నివ్వాలని కోరారు. విజ్ఞాన విహార్ పాఠశాలల కార్యదర్శి ఎంఆర్కే. మూర్తి, విద్యావేత్తలు ఓంకార నరసింహమూర్తి, జగదీష్, వినయ్‌కుమార్, టీవీఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ కార్యకర్తల శిక్షణ శిబిరం ముగింపు
ముగింపు సభకు హాజరైన మూడు జిల్లాల పార్టీ అధ్యక్షులు నాయకత్వ లక్షణాలు పెంపొందించే శిక్షణ అన్న నాయకులు కందుకూరు: ఏడాదిగా స్థానిక ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీలో జరుగుతున్న మూడు జిల్లాల టీడీపీ కార్యకర్తల శిక్షణ శిబిరం శనివారంతో ముగిసింది. దాదాపు ఏడాది కాలం పాటు 100 బ్యాచ్‌లకు బ్యాచ్‌కి 100 మంది లెక్కల నాయకత్వ లక్షణాలపై శిక్షణ ఇచ్చారు. శనివారం 100వ బ్యాచ్ ముగింపు సందర్భంగా ముగింపు సభను స్థానిక ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల పార్టీ అధ్యక్షులు దామచర్ల జనార్ధన్, జివిఎస్ ఆంజనేయులు, బీద రవిచంద్రయాదవ్ మాట్లాడుతూ రాష్ట్రం కష్టాల్లో ఉన్నా అనేక సంక్షేమ పథకాలను అమలు చే స్తోందన్నారు. పింఛన్లు, రుణామాఫీ, పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం వంటి వివిధ సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. అలాగే రాజధాని నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని చెప్పారు. గతంలో కంటే ప్రస్తుతం సభ్యత్వం దాదాపు 50 లక్షల వరకు ఉందన్నారు. ఈ సందర్భంగా శిక్షణ శిబిరాన్ని నిర్వహించిన శిబిరం డైరెక్టర్ దాసరి రాజామాస్టర్, కన్వీనర్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, జెడ్పీటీసీ సభ్యుడు కంచర్ల శ్రీకాంత్, కంచర్ల రామయ్య, పట్టణ టీడీపీ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు, పమిడి రమేష్, బెజవాడ ప్రసాద్, కాకర్ల మల్లికార్జున, శ్యామ్సన్ తదితరులు పాల్గొన్నారు. -
రైట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ
కామారెడ్డి: పట్టణంలోని రైట్ శిక్షణ కేంద్రం ద్వారా ఔత్సాహికులకు సెల్‌ఫోన్ రిపేరింగ్, ఫ్రంట్ ఆఫీస్, బ్యుటీషియన్, కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు డైరెక్టర్ రాజేంద్రకుమార్ తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి రాష్ట్రప్రభుత్వం ద్వారా ఆమోదం పొందిన సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. శిక్షణ మూడు నెలల పాటు కొనసాగుతుందని, ఆసక్తి గల వారు ఇతర వివరాలకు 85004 42499, 85199 11370 నెంబర్లను సంప్రదించాలన్నారు. న్యాక్ కేంద్రంలో టైలరింగ్.. డిప్యూటీ డీఈవో కార్యాలయ ఆవరణలోగల న్యాక్ కేంద్రంలో ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు న్యాక్ కేంద్రం డైరెక్టర్లు రమేశ్, జీవన్, భక్తమాల తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల తల్లిదండ్రులు లేబర్కార్డులో పేర్లు నమోదు చేసుకుని ఉండాలని, 18నుంచి 35ఏళ్ల లోపు వారు అర్హులన్నారు. టైలరింగ్‌తో పాటు ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, ఫ్లంబింగ్, శానిటేషన్ రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివారలకు 99891 52024, 95813 21409 నెంబర్లను సంప్రదించాలన్నారు. -
కానిస్టేబుల్ పరీక్ష కోసం ఉచిత శిక్షణ
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష కోసం ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తుతో పాటు కులాదాయ, పాస్‌పోర్టు సైజ్ ఫొటో ఈనెల 12వ తేదీ లోగా ఆనంద గజపతి ఆడిటోరియం ఎదురుగా మహారాజా సంస్కృత కళాశాల వద్దనున్న స్టడీ సర్కిల్ కార్యాలయంలో అందించాలన్నారు. అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించి ఉండరాదని స్పష్టం చేశారు. అభ్యర్థికి ఇంటర్ అర్హత ఉండాలన్నారు. శిక్షణ కాలంలో అభ్యర్థులకు సై్టపెండ్ ఇస్తామని, స్టడీ మెటీరియల్ ఉచితంగా అందజేస్తామన్నారు. మరిన్ని వివరాల కోసం ఫోన్ 08922–231795, 8985492802నంబర్లను సంప్రదించాలన్నారు. -
పచ్చదనానికి పది కోట్లు
♦ మున్సిపల్ కార్పొరేషన్లకు సీఎం నజరానా ♦ పెద్దఎత్తున మొక్కలు పెంచాలని కార్పొరేటర్లకు సూచన ♦ మౌలిక వసతులకు పెద్దపీట వేయాలని ఉద్బోధ ♦ ముగిసిన జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల శిక్షణ కార్యక్రమం చేవెళ్ల: మొక్కలు పెంచి పచ్చదనానికి కృషి చేసే మున్సిపల్ కార్పొరేషన్లకు రూ.10 కోట్ల నజరానా అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పచ్చదనానికి పెద్దపీట వేసే డివిజన్‌కు రూ.కోటి అందజేస్తామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని ప్రగతి రిసార్ట్స్‌లో జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల మూడ్రోజుల శిక్షణా శిబిరం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా సీఎం కార్పొరేటర్లను ఉద్దేశించి రెండు గంటలపాటు సుదీర్ఘంగా మాట్లాడారు. పచ్చదనం పెంచేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో గుణాత్మక మార్పు తెచ్చే దిశగా కృషిచేయాలని సూచించారు. పట్టణాలను, నగరాలను అభివృద్ధి పరిచేందుకు ప్రతి ప్రజాప్రతినిధి బంగారు కల కనాలన్నారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లను శాస్త్రీయంగా అభివృద్ధి చేయాలన్నారు. ‘‘పెరుగుతున్న జనాభాతో పట్టణాలు రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నాయి. మౌళిక రంగాల్లో అభివృద్ధి సాధించకుంటే పట్టణాలు చెత్తకుప్పలా మారతాయి. జనాభాకు అనుగుణంగా కూరగాయలు, మాంసం, చేపల మార్కెట్లు, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరా, పారిశుధ్యం, పబ్లిక్ టాయిలెట్స్, రోడ్లు, ట్రాఫిక్ తదితర రంగాలలో గుణాత్మక అభివృద్ధి సాధించాలి’’ అని ఉద్బోధించారు. కార్పొరేషన్లకు గతంలో ప్రకటించిన రూ.100 కోట్లే కాదని, అవసరమైతే మరిన్ని నిధులిస్తామని చెప్పారు. పార్కులు, మొక్కల పెంపకం, శ్మశాన వాటికల నిర్మాణాలు జనాభాకు సరిపోయే విధంగా చేపట్టాలని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో పర్యటించండి ఇతర రాష్ట్రాల్లో అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో పర్యటించి అభివృద్ధిపై అవగాహన పెంచుకోవాలని సీఎం కార్పొరేటర్లకు సూచిం చారు. మహారాష్ట్రలోని మల్కాపూర్ మున్సిపాలిటీ సహా నాగ్‌పూర్, ఢిల్లీలోని అభివృద్ధి చెందిన పట్టణాలను సందర్శించి రావాలన్నారు. హైదరాబాద్‌ను మూలాల నుంచి అభివృద్ధి చేయడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు కడియం, మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, నాయిని, పద్మారావు, పి.మహేందర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని ఎంపీలు కవిత, బాల్క సుమన్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇస్కాన్‌లో ‘భగవద్గీత’పై శిక్షణ శిబిరం
హైదరాబాద్: భారతీయ సంస్కృతి, సంప్రదాయం ఈతరం పిల్లలకు తెలియజెప్పి.. వారిలోని సృజనాత్మతను వెలికి తీసేందుకు ఇస్కాన్ ఆధ్వర్యంలో గీతా వేసవి శిక్షణ శిబిరం’ నిర్వహిస్తున్నట్టు కూకట్పల్లి ఇస్కాన్ సెంటర్ డెరైక్టర్ మహా శృంగదాస తెలిపారు. ఈనెల 16 నుంచి 22వ తేదీ వరకు కూకట్‌పల్లిలోని ఇస్కాన్ సెంటర్లో శిక్షణ ఉంటుందన్నారు. ప్రస్తుత యువత ఎక్కువ సమయం టీవీలు, కంప్యూటర్‌తో గడుపుతున్నారని, ఈ ధోరణి మానసిక, భౌతిక రుగ్మతలకు కారణమవుతుందన్నారు. ఈ శిబిరంలో సంస్కృత శ్లోక పఠనం, వైదిక కథలు, డ్రామాలు, డాన్స్, ఆటలతో పాటు ఎగ్ రహిత కేకులు, బిస్కెట్స్, కుకీన్ లాంటివి తయారీ నేర్పుతామన్నారు. శిబిరంలో పాల్గొనే విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించనున్నట్టు చెప్పారు. వివరాలకు 8008924201, 9866340588 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
నేటి నుంచి టీఆర్ఎస్ శిక్షణాశిబిరం
-
నేటి నుంచి టీఆర్ఎస్ శిక్షణాశిబిరం
హైదరాబాద్/నాగార్జునసాగర్: టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు వివిధ అంశాల్లో అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన శిక్షణ కార్యక్రమం శనివారం మొదలుకానుంది. ఇందుకోసం నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌లో పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేసింది. మూడు రోజుల పాటు కొనసాగే ఈ శిక్షణకు సాగర్‌లోని విజయ్‌విహార్ ముస్తాబైంది. శిక్షణ వేదికను సుందరంగా అలంకరించారు. శిక్షణ తరగతులను ఎమ్మెల్సీ పల్లా రాజ్వేర్రెడ్డి, వేణుగోపాలాచారి పర్యవేక్షిస్తారు. శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇక్కడికి చేరుకున్నారు. మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు విజయవిహార్‌లో, మిగిలిన వారికి జెన్కో అతిథి గృహంలో బస ఏర్పాటు చేశారు. మధ్యాహ్నమే ఇక్కడికి చేరకుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి జెన్కో అతిథి గృహం, విజయవిహార్లోని ఏర్పాట్లను పరిశీలించారు. ఈ ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీగా పోలీసులను మోహరించారు. సోమవారం మధ్యాహ్నానికి జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, మేయర్లు హాజరవుతారు. శనివారం ఉదయం 10 గంటలకు శిక్షణ ప్రారంభమవుతుందని టీఆర్ఎస్ ఒక ప్రకటన లో పేర్కొంది. ప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, ఎన్నికల మాజీ ప్రధానాధికారి జె.ఎం.లింగ్డో, ప్రొఫెసర్ సీహెచ్ హన్మంతరావు, ఆస్కి డెరైక్టర్ జనరల్ రవికాంత్ పాల్గొంటారు. తొలి రోజు ప్రజాస్వామ్యం, గుడ్ గవర్నెన్స్, గ్రీన్ కవర్ అంశాలపై, రెం డో రోజున పరిశ్రమలు, గనులు, ఐటీ అంశాలపై ఆయా రంగాల్లో నిపుణులు శిక్షణ ఇస్తారని పార్టీ వెల్లడించింది. చివరిరోజు రాజ కీయ అంశాలపై శిక్షణ ఉంటుందని తెలిపింది. శిక్షణబాధ్యతను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(అస్కీ)కి అప్పజెప్పిన విషయం తెలిసిందే. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, చట్టసభలు, ఆర్థిక వనరులు, బడ్జెట్, ప్రజాస్వామ్యం, శాంతిభద్రతలు వంటి పది అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ కార్యక్రమానికి మీడియాను దూరంగా ఉంచా రు. టీఆర్ఎస్ జారీ చేసిన గుర్తింపుకార్డులు ఉన్నవారినే లోపలికి అనుమతించారు. -
ఇక ప్రజాప్రతినిధులకు శిక్షణపై దృష్టి
-
ఇక ప్రజాప్రతినిధులకు శిక్షణపై దృష్టి
నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్ శిక్షణ శిబిరం మే 2, 3, 4 తేదీల్లో నిర్వహణ హైదరాబాద్: సభ్యత్వ నమోదు, సంస్థాగత ఎన్నికలు, ప్లీనరీ, ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించిన టీఆర్ఎస్ ఇప్పుడు ప్రజాప్రతినిధులపై దృష్టి పెట్టింది. అధికార పార్టీ సభ్యులుగా వారికి అన్ని రంగాలపై అవగాహన కల్పించాలని భావిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై పూర్తిస్థాయిలో వారిని సుశిక్షితులను చేసేందుకు పార్టీ అగ్ర నాయకత్వం ఇప్పటికే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరపున విజయం సాధించిన ఎంపీలు, ఎమ్మెల్యేల్లో కొత్తవారి సంఖ్యే ఎక్కువ. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ వీరందరికీ శిక్షణ ఇవ్వాలని భావించారు. అయితే, ఆరేడు నెలలుగా వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన శిక్షణ శిబిరాన్ని మే 2, 3, 4 తేదీల్లో, నాగార్జున సాగర్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు సాగర్‌లో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి రెండు రోజులు (మే 2, 3 తేదీల్లో) మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తారు. దీనికోసం అస్కి (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా /ఎఎస్సీఐ)కి బాధ్యతలు అప్పజెప్పినట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రధానంగా పది అంశాలపై వీరికి శిక్షణ ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. అదేవిధంగా చట్టసభల్లో ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి వంటి అంశాలపైనా అవగాహన కల్పించనున్నారని సమాచారం. పార్టీ ప్రజా ప్రతినిధులను ఉత్తమ పార్లమెంటేరియన్లుగా తీర్చిదిద్దేందుకు ప్రాధాన్యం ఇస్తామని, ఆ దిశలోనే వీరికి అందించే శిక్షణ కార్యక్రమం ఉంటుందని పార్టీ నేత ఒకరు తెలిపారు. మూడో రోజు మాత్రం జిల్లా పరిషత్ చైర్మన్లు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), డీసీఎమ్మెస్ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లను, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జిలను ఆహ్వానిస్తున్నారు. ఈ రోజు రాజకీయ శిక్షణ ఉంటుందని తెలిసింది. ఇప్పటికే సాగర్‌లో బస ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం. శిక్షణ ప్రారంభ కార్యక్రమానికి మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్లు లింగ్డో, టి.ఎన్.శేషన్లలో ఒకరిని ఆహ్వానించే అవకాశం ఉందని, అదేవిధంగా రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఆర్థిక వేత్త హన్మంతరావు ప్రసంగం కూడా ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే, అధికారికంగా ఎలాంటి నిర్ణయం జరగలేదని పార్టీవర్గాలు చెబుతున్నాయి. మూడు రోజులపాటు సాగర్‌లోనే బస చేయనున్న సీఎం కేసీఆర్ శిక్షణను పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే అందరికీ ఆహ్వానాలు వెళ్లాయి. -
చిన్న రైతులు, మహిళా రైతులకు సుభాష్ పాలేకర్ శిక్షణా శిబిరం
పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై 5 రోజుల శిక్షణ శిబిరం కర్నూలు నగరం (ఎస్ఎస్ఎన్ గార్డెన్స్, మాస మజీదు, సుంకేసుల రోడ్డు)లో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1 వరకు జరగనుంది. 3 ఎకరాలకన్నా తక్కువ పొలం ఉన్న 20-45 ఏళ్ల మధ్య వయస్కులైన చిన్న రైతులు, మహిళా రైతులకు సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇస్తారు. తొలిసారి పాలేకర్ శిక్షణకు వచ్చే రైతులకు, ఐదు రోజులూ కచ్చితంగా శిక్షణ పొందగోరే వారికిప్రాధాన్యం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ప్రవేశ రుసుము: రూ. 500. పేర్లు నమోదు చేసుకోవడానికి సంప్రదించాల్సిన నంబరు: బి. వెంకటేశ్వర్లు - 94408 16090. ఇతర వివరాలకు 040- 27654337, 27635867 (ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు) నంబర్లలో సంప్రదించవచ్చు. -
అందరూ నావాళ్లే
-
వైఎస్ఆర్సీపీ శిక్షణ శిబిరం